View

రుద్రమదేవి మూవీ రివ్య్వూ

Friday,October09th,2015, 05:58 AM

చిత్రం - రుద్రమదేవి
బ్యానర్ - గుణా టీమ్ వర్క్స్
సమర్పణ - శ్రీమతి రాగిణిగుణశేఖర్
నటీనటులు - అనుష్క, అల్లు అర్జున్, రానా, కృష్ణంరాజు, సుమన్, ప్రకాష్ రాజ్, నిత్యామీనన్, కేథరీన్, ప్రభ, జయప్రకాష్ రెడ్డి, ఆదిత్యమీనన్, ప్రసాదాదిత్య, అజయ్, విజయ్ కుమార్, వేణుమాధవ్, ఉత్తేజ్, వెన్నెలకిషోర్, కృష్ణభగవాన్, ఆహుతి ప్రసాద్, చలపతిరావు, శివాజీరాజా, సమ్మెట గాంధీ, అదితి చెంగప్ప, సన, రక్ష తదితరులు
సంగీతం - మేస్ట్రో ఇళయరాజా
ఆర్ట్ - పద్మశ్రీ తోట తరణి
ఫోటోగ్రఫీ - అజయ్ విన్సెంట్
కాస్ట్యూమ్స్ డిజైనర్ - నీతా లుల్లా (జుధా అక్బర్)
ఎడిటింగ్ - శ్రీకర్ ప్రసాద్
మాటలు - పరుచూరి బ్రదర్స్
ఫైట్స్ - పీటర్ హెయిన్స్, విజయ్
వి.ఎఫ్‌.ఎక్స్‌, సూపర్‌వైజర్‌ - కమల్‌ కణ్ణన్‌(ప్రసాద్‌ à°‡.ఎఫ్‌.ఎక్స్‌.)
ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ - కె.రామ్‌గోపాల్‌
సమర్పణ - శ్రీమతి రాగిణీ గుణ
à°•à°¥, స్క్రీన్‌ప్లే, నిర్మాత, దర్శకత్వం - గుణశేఖర్‌.

 

వీర వనిత రుద్రమదేవి జీవితం ఆధారంగా ఇప్పటివరకూ సినిమా రాలేదు. ఒకవేళ ఆమె కథతో సినిమా చేయాలనుకున్నా సాహసమే. ఎందుకంటే, రుద్రమదేవి చరిత్ర గురించి పూర్తిగా తెలియాలి. అలాగే, అప్పట్లో ఆమె చుట్టూ ఉన్న వ్యక్తుల గురించి తెలియాలి. సో.. చాలా పరిశోధించి తీయాల్సిన చిత్రం ఇది. జీవిత చరిత్రలతో సినిమాలు తీసినప్పుడు పొరపాట్లు దొర్లకుండా చేసుకోవాలి. సో.. రుద్రమదేవి జీవిత చరిత్రకు తెరరూపం ఇవ్వాలని గుణశేఖర్ అనుకోవడం పెద్ద సాహసమే. అనుష్క టైటిల్ రోల్ చేసిన ఈ చిత్రానికి గుణశేఖర్ సొంత డబ్బు పెట్టాడు. ఓ ఫీమేల్ ఓరియంటెడ్ మూవీకి 60, 70 కోట్లు పెట్టడం అంటే మామూలు విషయం కాదు. మరి.. ఈ 'రుద్రమదేవి' ఎలా ఉంది? గుణశేఖర్ సేఫ్ అవుతాడా? తెలుసుకుందాం...

 

à°•à°¥
కాకతీయ సామ్రాజ్యానికి రాజు గణపతిదేవుడు (కృష్ణంరాజు). అతని భార్య సోమాంబ (ప్రభ). వీరికి మగ సంతానం పుట్టే యోగం లేదని ఓ బ్రాహ్మణుడి ద్వారా దాయాదులైన హరిహరదేవుడు (సుమన్), మురారి దేవుడు (ఆదిత్యమీనన్) తెలుసుకుంటారు. దాంతో గణపతిదేవుడు తర్వాత కాకతీయ సామ్రాజ్య పరిపాలన తమ చేతుల్లోకి వస్తుందని వీరు ఆశపడతారు. నిండు గర్భణిగా ఉన్నసోమాంబ ఆడపిల్లకే జన్మనిస్తుందని నమ్ముతారు. అనుకున్నట్టుగా సొమాంబ కూడా ఆడపిల్లకే జన్మనిస్తుంది. అయితే తమకు ఆడపిల్ల పుట్టిందనే విషయం బయటికి తెలిస్తే, దాయాదులు, సామంతరాజులు తమ కాకతీయ రాజ్యంపై దాడులు చేసి ఆక్రమించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారని భయపడతాడు గణపతిదేవుడు. తన మంత్రి శివదేవయ్య (ప్రకాష్ రాజ్)తో చర్చించి తమకు మగబిడ్డ పుట్టాడని ప్రకటించి తమ ఆడపిల్ల రుద్రాంబకు 'రుద్రదేవుడు' అని నామకరణం చేస్తారు గణపతిదేవుడు, సోమాంబ. అప్పట్నుంచి రుద్రాంబ మగపిల్లాడులానే పెరుగుతుంది. మగపిల్లాడిలానే వస్ర్తదారణ చేసుకుంటుంది. యుద్ధ విద్యలు, గుర్రపు స్వారీలు నేర్చుకుంటుంది. మగపిల్లలకు తీసిపోని విధంగా రుద్రాంబ పెరుగుతుంది. తను ఆడపిల్లను అనే విషయం కూడా మర్చిపోతుంది. రుద్రాంబ 25వ పడిలోకి అడుగుపెడుతుంది. రుద్రాంబ అయిన రుద్రమదేవుడిని చూసి ఆడపిల్లలు మనసు పారేసుకుంటారు. రుద్రాంబకు చాళుక్య వీరభద్రుడు చిన్ననాటి స్నేహితుడు. తను కూడా రుద్రాంబను మగపిల్లవాడు అనే అనుకుంటాడు. రుద్రాంబ కూడా ఈ విషయాన్ని చాళుక్య దగ్గర చెప్పదు. పెళ్లీడుకొచ్చిన తనయుడు రుద్రదేవుడికి పెళ్లి చేయాల్సిందిగా గణపతిదేవుడిని కోరతారు సామంతరాజులు. దాంతో ముమ్మిడమ్మ (నిత్యామీనన్) తో రుద్రాంబ వివాహం జరుగుతుంది.


మరోవైపు అంతఃపురం నుంచి రహస్య మార్గం ద్వారా తన నిజ స్వరూపంతో రుద్రాంబ బయటికి వస్తుంటుంది. ఆ సమయంలో ఆమెను చూసిన చాళుక్య వీరభద్రుడు ఆమెపై మనసు పారేసుకుంటాడు. ఆమె కూడా అతనని ప్రేమిస్తుంది. తర్వాత చాళుక్యుడికి తన మిత్రుడు రుద్రమదేవుడే రుద్రాంబ అన్న విషయం తెలుస్తుంది. కానీ ప్రజలు శేయస్సు కోరి రుద్రాంబ మగవాడిలానే ఉండాలని నిర్ణయించుకుంటుంది.


బందిపోటు అయిన గోనా గన్నారెడ్డి (అల్లు అర్జున్), మహదేవనాయకుడు (విక్రమ్ జీత్) వల్ల రుద్రాంబకు చాలా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. చాలా సాహోసపేతంగా వీరిని ఎదుర్కొంటుంది రుద్రాంబ. తన కాకతీయ సామ్రాజ్యంపై ఎవరూ దండెత్తకుండా అహర్నిశలు కాపాడుకుంటుంది. మరి చివరిగా రుద్రమదేవుడు రుద్రమాంబ అని కాకతీయ సామ్రాజ్య ప్రజలకు తెలుస్తుందా? చాళుక్యుడి ప్రేమను రుద్రమ అంగీకరిస్తుందా? రుద్రాంబను యువరాణిగా కాకతీయ ప్రజలు అంగీకరిస్తారా అనేదే ఈ చిత్ర కథ.

 

నటీనటుల పెర్ ఫామెన్స్
రుద్రదేవుడిగా, రుద్రాంబగా రెండు షేడ్స్ ఉన్న పాత్రలను చేసింది అనుష్క. ఈ రెండు పాత్రల్లోనూ అద్భుతంగా నటించింది. యుద్ధ సన్నివేశాల్లో వీరనారిగా ఆమె పలికించిన హావాభావాలు అలరించే విధంగా ఉన్నాయి. రుద్రాంబగా అనుష్క లోని రొమాంటిక్ యాంగిల్ కూడా బయటపడింది. ఈ సీన్స్ కూడా అద్భుతంగా పండించింది అనుష్క. రెండు పాత్రల్లో అద్భుతంగా నటించి, భేష్ అనిపించుకుంది. చాళుక్య వీరభద్రుడు పాత్రలో రానా ఒదిగిపోయిన వైనం సూపర్. మంచి ఫిజిక్ తో, నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తాడు. ఇక ఈ చిత్రంలో చెప్పుకోవాల్సిన పాత్ర గోనగన్నారెడ్డి. ఈ పాత్రలో అల్లు అర్జున్ ఒదిగిపోయిన వైనాన్ని అభినందించాల్సిందే. ఈ సినిమాకి ఈ క్యారెక్టర్ హైలెట్. ఈ క్యారెక్టర్ హైలెట్ అవ్వడానికి కారణం అల్లు అర్జున్. తెలంగాణా యాసతో అల్లు అర్జున్ పలికిన డైలాగులు తెలంగాణా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి. ఎంటర్ టైనింగ్ గా ఈ డైలాగులు ఉండటం కూడా చాలా ప్లస్. గణపతిదేవుడిగా కృష్ణంరాజు, ఆయన భార్య సోమాంబగా ప్రభ చక్కటి నటనను ప్రదర్శించారు. ప్రకాష్ రాజ్, సుమన్, ఆదిత్యమీనన్... ఇలా ఎవరికి వారు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసారు.

 

సాంకేతిక వర్గం
ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించారు. ఆయన పాటలంటేనే ప్రత్యేకమైన శైలి ఉంటుంది. ఆ శైలి ఈ చిత్రంలోని పాటల్లోనూ కనిపించింది. ముఖ్యంగా మూడు పాటలు విజువల్ గానూ బాగుండటంతో ఆడియో పరంగా ఈ సినిమాకి ప్లస్ పాయింట్సే పడతాయి. ఇక ఇళయరాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేసే విధానం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సీన్ కి స్కోప్ ఉండాలే కానీ, తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఆడియన్స్ ని సీన్ లో లీనమయ్యేలా చేయడం ఇళయరాజాకి వెన్నతో పెట్టిన విద్య. ఈ సినిమాలో అలాంటి సీన్లు చాలానే ఉన్నాయి. ఓవరాల్ గా రీ-రికార్డింగ్ చాలా బాగుంది. కాకతీయ సామ్రాజ్యాన్ని, అప్పటి పరిస్థితులను ఆడియన్స్ కి కళ్లకు కట్టేలా చూపించాలంటే సెట్స్ వేయాల్సిందే. తోట తరణి తన అద్భుతమైన రూపకల్పనతో చక్కటి సెట్స్ ని వేసారు. అప్పటి కాలానికి ప్రేక్షకులను తీసుకెళ్లగలిగారు. సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. ప్రతి విజువల్ ని చక్కగా తన కెమెరాలో బంధించారు అజయ్ విన్సెంట్. వీరందరినీ కథలో ఇన్ వాల్వ్ అయ్యేలా చేసి, వారి దగ్గర్నుంచి అవుట్ ఫుట్ రాబట్టుకున్న విషయంలో గుణశేఖర్ ని అభినందించాల్సిందే. కాస్ట్యూమ్స్ బాగున్నాయి. పరుచూరి బ్రదర్స్ అందించిన డైలాగులు బాగున్నాయి. ముఖ్యంగా తెలంగాణా యాసలో గోనగన్నారెడ్డి పాత్రకు రాసిన డైలాగులు సూపర్. రుద్రమదేవి చరిత్రను తెరపై చూపించాలనే ఆలోచన గుణశేఖర్ కి రావడం, దానిని ఆచరణలో పెట్టి సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం నిజంగా సాహోసపేతమైన నిర్ణయమే. ఏదో కథ అనుకుని అలా తీసేయకుండా, చరిత్రను వక్రీకరించకుండా, పరిశోధనలు జరిపి పర్ ఫెక్ట్ గా స్ర్కిఫ్ట్ తయారు చేసుకుని సినిమాగా తెరకెక్కించిన వైనం కళ్లకు అద్దినట్టు కనిపిస్తుంది. రుద్రమదేవి జీవితంలో జరిగిన ముఖ్య సంఘటలను తీసుకుని బోర్ కొట్టించకుండా 2 గంటల 38 నిముషాల్లో ఏమీ మిస్ అవ్వకుండా సినిమాని తెరకెక్కించారు గుణశేఖర్. స్ర్కిఫ్ట్ విషయంలో కాంప్రమైజ్ అవ్వలేదు కాబట్టే, సినిమా నడిచే విధానంలో తడబాటు కనిపించలేదు.

 


ఫిల్మీబజ్ విశ్లేషణ
చరిత్ర చెప్పాలంటే ఎక్కడ మొదలుపెట్టి, ఎక్కడ పూర్తి చేయాలనే విషయంలో క్లారటీ ఉండాలి. ఆ పరంగా డైరెక్టర్ గుణశేఖర్ కి ఈ కథపై పూర్తిగా అవగాహన ఉంది. రుద్రమదేవి పుట్టుక నుంచి కథ మొదలుపెట్టి, ఆమె పెరిగి పెద్దదైన వైనాన్ని, ఆమె వైవాహిక జీవితం, శత్రువులతో ఆమె పోరాడే వైనం, ప్రజల కోసం తన జీవితాన్ని ఆర్పించడానికి సిద్ధపడిన వైనం చాలా చక్కగా ఆవిష్కరించారు. ఫస్టాప్ లో అనుష్క రుద్రమదేవుడిగానే పెరగడం, అబ్బాయిలానే అనిపించడం, తన నిజ స్వరూపంలో చాళుక్యవీరభద్రుడి కంటపడటం, అతనిని ప్రేమించడం ఆడియన్స్ కి చాలా ఇంట్రస్టింగ్ గా అనిపిస్తుంది. ఆమె మగవాడు అని తెలిస్తే కాకతీయ ప్రజలు ఎలా ఫీలవుతారనే ఓ సస్పెన్స్ ని బాగా మెయింటెన్ చేసాడు. సెకండాఫ్ లో రుద్రమదేవుడు ఆడపిల్ల అని తెలియడం, ఆమెకు పట్టాభిషేకం చేయడానికి ప్రజలు నిరసన తెలపడం బాగానే ఉన్నాయి. కానీ ఎంటర్ టైన్ మెంట్ ఇవ్వాలనే తపనతో జోడించిన కామెడీ సీన్స్ ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తాయి. చరిత్రను చెప్పేటప్పుడు కామెడీ సీన్స్ లేకపోయినా ఫర్వాలేదుగానీ, తర్వాత ఏమి జరుగుతుందనే థ్రిల్ ని మెయింటెన్ చేయడం చాలా అవసరం. ప్రేక్షకులు కథలో లీనమై ఆ కాలంలోకి వెళ్లిపోయి సినిమా చూడగలగాలి. కానీ ఈ కామెడీ వల్ల ఆడియన్స్ డిస్టర్ట్ అవుతారు. ఇక యుద్ధ సన్నివేశాలను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. కానీ లెంగ్త్ ఎక్కువేతై మాత్రం భరించలేరు. ఈ సినిమా విషయంలో చాలా స్పష్టమైన లోపం ఇది. పైగా యుద్ధ సన్నివేశాల్లో చేసిన గ్రాఫిక్స్ అంత థ్రిల్ అనిపించవు. ఇవన్ని ఈ సినిమాకి మైనస్ పాయింట్స్. ఏదేమైనా ఏంతో కష్టపడి, భారీ బడ్జెట్ తో గుణశేఖర్ చాలా నమ్మకంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. చరిత్రను తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉన్న ఆడియన్స్ ఈ సినిమాని తప్పకుండా చూస్తారు. కమర్షియల్ సినిమాలకు అలవాటుపడిన ఆడియన్స్ కి ఎంతవరకూ ఈ సినిమా కనెక్ట్ అవుతుందో వేచి చూడాల్సిందే.

 


ఫైనల్ గా చెప్పాలంటే... హిస్టారికల్ మూవీస్ ని తెరకెక్కించడానికి అంత తొందరగా ఎవ్వరూ ముందుకురారు. వందల్లో ఒకరిద్దరే ఇలాంటి ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి ఈ సినిమాలను ఆదరించి, ముందు ముందు ఇలాంటి సినిమాలు తెరకెక్కించాలనే ఆలోచన ఉన్నవారిని ప్రోత్సహించడమనేది ప్రేక్షకుల బాధ్యత. అందుకే కుటుంబంతో కలిసి ఈ సినిమాని చూడండి... ఎంజాయ్ చేయండి.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !