చిత్రం - ఏప్రిల్ 28 ఏం జరిగింది
బ్యానర్ - వీజీ ఎంటర్ టైన్మెంట్స్
నటీనటులు - డా.రంజిత్, షెర్రీ అగర్వాల్, తనికెళ్ల భరణి, అజయ్, చమ్మక్ చంద్ర తదితరులు
సంగీతం - సందీప్ కుమార్
దర్శకత్వం - వీరాస్వామి
విడుదల తేదీ - ఫిబ్రవరి 27, 2021
ఏప్రిల్ 28 ఏం జరిగింది - ఈ టైటిల్ అనౌన్స్ చేయగానే సినిమాపై ఆసక్తిని రేకెత్తించింది. ప్రచార చిత్రాలు, ట్రైలర్ విడుదల చేసిన అనంతరం సినిమాపై అంచనాలు పెరిగాయి. యంగ్ హీరో నిఖిల్, బిగ్ బాస్ ఫేం సోహైల్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ - 'సినిమా ఖచ్చితంగా ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది' అని చెప్పారు. మరి ఈ యువ హీరోలు చెప్పినట్టు సినిమా ఆడియన్స్ ని ఆకట్టుకునే విధంగా ఉందా తెలుసుకుందాం.
కథ
హీరో విహారి (రంజిత్) సినిమాలకు కథలు రాస్తుంటాడు. తను కథలు ఇచ్చే నిర్మాత (తనికెళ్ల భరణి) కి క్రేజీ డైరెక్టర్ (రాజీవ్ కనకాల) సినిమా చేసి పెడతానని చెప్పడంతో సదురు నిర్మాత కోసం విహారి కథ రెడీ చేయడానికి సన్నాహాలు మొదలుపెడతాడు. ఈ ప్రయత్నంలో భాగంగా తన భార్య (షెర్రీ అగర్వాల్), పిల్లలతో కలిసి టూర్ కి బయలుదేరతాడు. దారిలో కారు రిపేర్ అవుతుంది. పోలీసాఫీసర్ (అజయ్) సహాయంతో ఓ గెస్ట్ హౌస్ లో విహారి కుటుంబం స్టే చేస్తుంది. అక్కడ విహారికి ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి... తను రాసిన కథతో దర్శక, నిర్మాతలను మెప్పిస్తాడా అనేదే ఈ సినిమా కథ.
నటీనటుల పెర్ ఫామెన్స్
రైటర్ విహారి పాత్రలో పూర్తిగా లీనమై, చాలా సహజమైన నటనను కనబర్చి వావ్ అనిపించాడు హీరో రంజిత్. ముందు ముందు మంచి కథలను సెలెక్ట్ చేసుకుని, సినిమాలు చేస్తే... నటుడిగా మంచి పేరు తెచ్చుకుంటాడు. సీనియర్ నటుడు తనికెళ్ల భరణి నిర్మాతగా చక్కటి అభినయాన్ని కనబర్చారు. చమ్మక్ చంద్ర నటించిన సీన్లు వినోదాన్ని పంచుతాయి. పోలీసాఫీసర్ పాత్రలో అజయ్ ఒదిగిపోయాడు. హీరోయిన్ పాత్రలో షెర్రీ అగర్వాల్ చాలా బాగుంది. మిగతా నటీనటులందరూ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
సాంకేతిక వర్గం
ఈ సినిమాకి డైరెక్టర్ వీరాస్వామి, హరిప్రసాద్ జక్కా అందించిన స్ర్కీన్ ప్లే హైలైట్. చిన్న స్టోరీని తీసుకుని, ఆ కథను చెప్పడానికి అల్లిన సన్నివేశాలు ఆసక్తికరంగా చూపించడంలో డైరెక్టర్ వీరాస్వామి సక్సెస్ అయ్యారు. సందీప్ కుమార్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. ఫోటోగ్రఫీ బాగుంది. కథకు సరిపడా ఖర్చు పెట్టారు నిర్మాత.
విశ్లేషణ
ఈ సినిమాకి ఇంటర్వెల్ ట్విస్ట్, క్లయిమ్యాక్స్ సీన్ హైలైట్. గంట యాభై నిముషాల నిడివితో ఉన్న ఈ సినిమా ఊహకందని మలుపులతో ఆడియన్స్ లో ఆసక్తిని కలిగిస్తుంది. దాంతో ఆడియన్స్ సినిమాలో లీనమై పోతారు. ఎక్కడా బోర్ కొట్టదు. అశ్లీల సన్నివేశాలు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేకుండా సినిమా చాలా నీట్ గా ఉంటుంది. సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ ని ఇష్టపడే ఆడియన్స్ కి ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది. ఇక రెగ్యులర్ సినిమాలు చూసి విసిగిపోయిన ప్రేక్షకులకు ఈ సినిమా చాలా రిలీఫ్ ని ఇస్తుంది. అన్ని వర్గాల ఆడియన్స్ కి ఈ సినిమా కనెక్ట్ అవుతుంది.
ఫైనల్ గా చెప్పాలంటే... ఈ వీకెండ్ ని ఈ సినిమాతో ఎంచక్కా ఎంజాయ్ చెయ్యొచ్చు. సో... థియేటర్స్ కి వెళ్లండి... సినిమాని ఎంజాయ్ చేయండి.
ఫిల్మీబజ్ రేటింగ్ - 3.25/5