View

ఆటోనగర్ సూర్య రివ్వ్యూ

Friday,June27th,2014, 11:48 AM

చిత్రం - ఆటోనగర్ సూర్య

నటీనటులు: నాగచైతన్య, సమంత, సాయికుమార్, అజయ్, ఆశిష్ విద్యార్థి, బ్రహ్మానందం, తదితరులు

సంగీతం: అనూప్ రూబెన్స్

కెమెరా: శ్రీకాంత్ నారోజ్

ఎడిటింగ్: గౌతంరాజు

బ్యానర్ - ఆర్.ఆర్.మూవీ మేకర్స్, మ్యాక్స్ ఇండియా ప్రొడక్షన్స్

నిర్మాత: కె. అచ్చిరెడ్డి

దర్శకత్వం: దేవా కట్టా

విడుదల తేదీ - 27.06.2014

ఎప్పుడెప్పుడా అని గత మూడేళ్లుగా ఎదురుచూస్తున్న 'ఆటోనగర్ సూర్య' ఎట్టకేలకు విడుదలైంది. వెన్నెల, ప్రస్థానం వంటి చిత్రాల ద్వారా ప్రతిభ గల దర్శకునిగా పేరు తెచ్చుకున్న దేవా కట్టా కి ఇది మూడో సినిమా. నాగచైతన్యతో మంచి మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్ తీయాలన్నది దేవా ఆలోచన. నాగచైతన్య కూడా ఫుల్ మాస్ క్యారెక్టర్ చేయాలనే ఆకాంక్షతో ఈ సినిమా అంగీకరించాడు. 2011 విజయదశమి నాడు ఈ చిత్రం ఆరంభమైంది. సినిమా పూర్తయినా విడుదలకు నోచుకోలేదు. ఎన్నో ఇబ్బందులు దాటుకుని ఈ సినిమా తెరకొచ్చింది. ఈ సినిమా ఎప్పుడు విడుదలైనా 'హిట్ గ్యారంటీ' అని నాగచైతన్య పలు సందర్భాల్లో చెప్పాడు. దేవా కట్టా అయితే... లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వస్తాం అని చెప్పుకుంటూ వచ్చారు. మరి.. చైతూ, దేవా నమ్మకాన్ని ఈ చిత్రం నిజం చేసే విధంగా ఉందా? దేవా కట్టా మరోసారి భేష్ అనిపించుకుంటాడా?.. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం.

à°•à°¥

తన తల్లిదండ్రులను రౌడీలు చంపేసిన తర్వాత సూర్య (నాగచైతన్య) ఆటోనగర్ ఏరియాలో అనాధగా పెరుగుతుంటాడు. తన పదిహేనేళ్ల వయసులో ఓ రౌడీని చంపేసి జైలుకెళతాడు సూర్య. జైల్లోనే గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తాడు. జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆటోనగర్ లో సొంత గ్యారేజ్ పెట్టుకుని స్థిరపడాలనుకుంటాడు. కానీ సూర్య కలకు అడ్డం పడుతుంటాడు లోకల్ దాదా ఇంద్ర(జయప్రకాష్ రెడ్డి). మరి లోకల్ దాదాతో ఢీ కొట్టి సూర్య తన కలను నెరవేర్చుకున్నాడా అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ఆర్టిస్ట్ పెర్ ఫామెన్స్

నాగచైతన్య ఇప్పటిదాకా రొమాంటిక్ పాత్రలు చేసాడు. కాబట్టి ఈ సినిమాలోని సూర్య పాత్ర నాగచైతన్యకు ఛాలెంజింగ్ రోల్ అనే చెప్పాలి. క్యూట్ ఫేస్ తో లవర్ బోయ్ లా ఉండే నాగచైతన్య లో మాస్ అపీల్ తక్కువ. ఈ సినిమాలోని సూర్య పాత్రకు మాస్ షేడ్ బాగా ఉంది. అయినా సరే నాగచైతన్య ఈ పాత్రలో ఒదిగిపోవడానికి తన శాయశక్తులా ప్రయత్నించాడు. సినిమాని తన భుజాలపై వేసుకుని నడిపించడానికి కృషి చేసాడు. కానీ ఇలాంటి పాత్రలు చేయాలంటే నాగచైతన్యకు ఇంకా మెచ్చూర్టీ రావాలి. ఈ చిత్రంలో సమంతది చాలా చిన్న రోల్. అయినా సరే తను ఉన్న సీన్స్ ప్రేక్షకులను అలరించే విధంగా ఉన్నాయి. నాగచైతన్య, సమంత మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. సాయికుమార్ ఈ చిత్రంలో మంచి పాత్ర చేసాడు. కానీ 'ప్రస్థానం'లో చేసినంత స్పెషల్ రోల్ అయితే కాదు. టివి యాంకర్ మధు విలన్ గా నటించాడు. అతని పాత్ర బాగుంది. జయప్రకాష్ రెడ్డి, అజయ్, హీరో ఫ్రెండ్స్ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. బ్రహ్మానందంను డైరెక్టర్ కరెక్ట్ గా వాడుకోలేకపోయాడు. అతని పాత్ర అంత ఇంప్రెసివ్ గా లేదు.

టెక్నికల్ గా...

దేవా కట్టా పాత కధనే ఎన్నుకున్నాడు. ఇలాంటి కథలు చాలానే వచ్చాయి. కానీ స్ర్కీన్ ప్లే వెరైటీగా ఉండి ఉంటే సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యుండేది. దేవా కట్టా పాత కధను కొత్తగా ప్రజెంట్ చేయలేకపోయాడు. డైలాగుల పరంగా మాత్రం దేవా అద్భుతం చేసాడు. మంచి డైలాగులు, ఆలోచింపజేసే డైలాగులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. కొన్ని సీన్స్ ని మాత్రం చాలా చక్కగా హ్యాండిల్ చేసాడు. అనూప్ అందించిన పాటలు యావరేజ్ గానే ఉన్నాయి. రెండు, మూడు పాటలు విజువల్ గా బాగున్నాయి. కొన్ని సీన్స్ కి మాత్రం రీ-రికార్డింగ్ అద్భుతంగా చేసాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. సీన్స్ కి తగ్గట్టు మూడ్ మెయింటెన్ అయ్యేలా విజువల్స్ ఉన్నాయి. ఎడిటింగ్ యావరేజ్ గా ఉంది. కొన్సి సీన్స్ చాలా ల్యాగ్ గా ఉన్నాయి. లెంగ్తీ సీన్స్ చాలా ఉన్నాయి. వాటిని ఎడిట్ చేస్తే, సినిమా ఇంకా ఫాస్ట్ గా ఉండేది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.

ఫిల్మీబజ్ విశ్లేషణ

సినిమా ఆరంభంలోనే  à°¦à±‡à°µà°¾ కట్టా à°“ ఎమోషనల్ డ్రామా చూపించబోతున్నాడని ప్రేక్షకులకు అర్ధమైపోతుంది. కరెఫ్ట్ డ్ సిస్టమ్ ని ప్రధానాంశంగా తీసుకుని à°“ పవర్ ఫుల్ సినిమా చేయడానికి దేవా కట్టా కృషి చేసాడు. కానీ దేవా ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. ఫస్టాప్ లోని కొన్ని సీన్స్ వల్ల సెకండాఫ్ పై హోప్స్ పెరుగుతుంది. కానీ సెకండాఫ్ ప్రేక్షకులను పూర్తిగా నిరాశపరుస్తుంది. సెకండాఫ్ లో నాగచైతన్య, సమంత లవ్ ట్రాక్ లేకపోవడం à°ˆ సినిమాకి చాలా మైనస్. సెకండాఫ్ లో ప్రేక్షకులు రిలాక్స్ అయ్యేలా సీన్స్ లేవు. కనీసం బ్రహ్మానందంపై కూడా సరైన కామెడీ ట్రాక్ ని వర్కవుట్ చేయలేకపోయారు. సెకండాఫ్ లో మితిమీరిన యాక్షన్ సీన్స్  à°ªà±à°°à±‡à°•à±à°·à°•à±à°²à°•à± బోర్ కొట్టిస్తుంది.

బాక్సీపీస్ వద్ద మ్యాజిక్ క్రియేట్ చేయడానికి ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ చాలా తక్కువ. 'ప్రస్థానం'లాంటి హిట్ సినిమా చేసిన దేవా కట్టా నుంచి ఇలాంటి ప్రాజెక్ట్ ని ప్రేక్షకులు ఎక్స్ ఫెక్ట్ చేయరు.

ఫైనల్ గా చెప్పాలంటే...

లేట్ గా వచ్చిన ఆటోనగర్ సూర్య లేటెస్ట్ గా రాలేకపోయాడు.

 

Autonagar Surya Review



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !