View

బాబు బంగారం మూవీ రివ్య్వూ

Friday,August12th,2016, 09:35 AM

చిత్రం - బాబు బంగారం
బ్యానర్ - సితార ఎంటర్ టైన్ మెంట్స్
నటీనటులు - వెంకటేష్, నయనతార, షావుకారు జానకి, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, పృథ్వీ, జయప్రకాష్, రఘుబాబు, బ్రహ్మాజీ, సంపత్, మురళి శర్మ, వెన్నెల కిషోర్, మున్నా వేణు, గిరిధర్, అనంత్, రాజా రవీంద్ర, రజిత, ప్రియ తదితరులు
సంగీతం - జిబ్రాన్
డైలాగ్స్ - డార్లింగ్ స్వామి
ఎడిటింగ్ - ఉద్దవ్.ఎస్.బి
సమర్పణ - ఎస్.రాధాకృష్ణ (చినబాబు)
నిర్మాతలు - సూర్యదేవర నాగవంశి, పి.డి.వి.ప్రసాద్
కథ, స్ర్కీన్ ప్లేచ దర్శకత్వం - మారుతి


విక్టరీ వెంకటేష్, నయనతార కాంబినేషన్ లో సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో నిర్మాత ఎస్.రాధాకృష్ణ (చినబాబు) సమర్పణలో, మారుతి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశి, పి.డి.వి.ప్రసాద్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'బాబు బంగారం'. ఈ రోజు (12.8.2016) ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా విడుదలయ్యింది. ఈ సినిమా టైటిల్, ట్రైలర్స్, ఆడియోకి ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపధ్యంలో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమా ఆ అంచనాలను అందుకునే విధంగా ఉందా తెలుసుకుందాం.


కథ
ఎ.ఎస్.పి కృష్ణ (వెంకటేష్) బంగారంలాంటి వ్యక్తి. తన తాతలా జాలి గుండె కలిగినవాడు. దొంగలను కూడా జాలితో చూసే మెంటాల్టీకలవాడు. కష్టాల్లో ఉన్న వ్యక్తలను చూస్తే కరిగిపోతాడు. ఈ మెంటాల్టీ వల్లే సమస్యలతో ఉన్న శైలజ (నయనతార) తారసపడిన వెంటనే ఆమె పట్ల ఆకర్షితుడవుతాడు. ఆమె మంచితనం కృష్ణను ప్రేమలో పడేలా చేస్తుంది. శైలజ కుటుంబానికి రౌడీ మల్లేష్ (సంపత్ రాజ్), ఎమ్మెల్యే పుచ్చప్ప (పోసాని కృష్ణమురళి) నుంచి బెదిరింపులు వస్తున్నాయని, శైలజ నాన్న శాస్త్రి ఎక్కడున్నాడో తెలుసుకుని అతని దగ్గర ఉన్న ఆధారాలు తీసుకోవడం కోసం ఈ ఇద్దరూ శైలజను బెదిరిస్తున్నారని కృష్ణ తెలుసుకుంటాడు. ఎన్ని బెదిరింపులు వచ్చినా తన తండ్రి ఎక్కడ ఉన్నాడనే విషయం శైలజ వీరికి చెప్పదు. ఈ నేపధ్యంలో శైలజ బామ్మకు హార్ట్ ఎటాక్ రావడంతో హాస్పటల్లో ఉన్న తల్లిని చూడటానికి వస్తాడు శైలజ తండ్రి. అక్కడ శాస్త్రిని పోలీసులు అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ ఆపరేషన్ అంతా కృష్ణ ఆధ్వర్యంలోనే జరగిందని, తన తండ్రిని పట్టుకోవడానికే కృష్ణ తనకు. తన కుటుంబానికి దగ్గరయ్యాడని తెలుసుకున్న శైలజ షాక్ అవుతుంది.


అసలు శైలజ తండ్రి దగ్గర ఉన్న ఆధారాలు ఏంటీ.. రౌడీ, ఎమ్మెల్యే శైలజ తండ్రిని ఎందుకు ఛేజ్ చే్స్తున్నారు.. కృష్ణ కనిపెట్టిన నిజాలేంటీ.. శైలజ తండ్రిని పట్టుకోవడానికి పోలీసులు ఎందుకు వెతుకుతున్నారు... శైలజ తండ్రి నేరస్థుడా.. కృష్ణ ఫైనల్ గా ఈ కేసును ఎలా చేధించాడు.. కృష్ణ తన కుటుంబానికి సహాయం చేస్తున్నాడని శైలజ నమ్ముతుందా తదితర విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.


నటీనటుల పెర్ ఫామెన్స్
'ఘర్షణ' లో డిసిపి రామచంద్రగా సీరియస్ లుక్, బాడీ లాంగ్వేజ్ తో పోలీస్ అంటే ఇలానే ఉండాలని అనిపించేలా ప్రేక్షకులను అలరించాడు వెంకటేష్. ఈ సినిమాలో ఎ.సి.పి కృష్ణగా ఆడియన్స్ ని ఫుల్లుగా నవ్వించాడు వెంకీ. తనదైన స్టైల్లో కామెడీ చేసాడు. చాలా గ్యాప్ తర్వాత వెంకీ ఓ కామెడీ ఎంటర్ టైనర్ ని చేసాడు. జోష్ గా, ఎనర్జిటిక్ గా ఎ.సి.పి కృష్ణ పాత్రలో ఒదిగిపోయాడు వెంకీ.


శైలజ పాత్రలో నయనతార బాగుంది. ముఖ్యంగా ఆమె లుక్ చాలా బాగుంది. వెంకీ, నయనతార కలిసి ఆల్ రెడీ 'లక్ష్మీ', 'తులసి' అంటూ రెండు హిట్ చిత్రాలు చేసారు. మూడోసారి 'బాబు బంగారం' కోసం కలిసారు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుంది.


ఈ చిత్రానికి మెయిన్ హైలైట్ 30 ఇయర్స్ పృథ్వీ. బత్తాయి బాబ్జీ పాత్రతో నవ్వులు పూయించాడు. వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, సంపత్ రాజ్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసారు.


సీనియర్ నటి షావుకారు జానకి హీరోయిన్ నానమ్మగా నటించారు. ఆమెను చానాళ్ల తర్వాత తెరపై చూడటం బాగుంది.


మిగతా నటీనటులందరూ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.


సాంకేతిక వర్గం
సింఫుల్ స్టోరీ లైన్ ని తీసుకుని ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా సినిమాని తీర్చిదిద్దారు మారుతి. సేఫ్ ప్రాజెక్ట్ చేయడానికి, ఆడియన్స్ ని నిరూత్సాహపరచకుండా నవ్వించడానికి మారుతి చాలానే ఎఫర్ట్ పెట్టారు. అందులో ఆయన సఫలమయ్యారు కూడా. జిబ్రాన్ అందించిన పాటలు బాగున్నాయి. ఆ పాటలు చిత్రీకరించిన విధానం కూడా బాగుంది. ముఖ్యంగా జిబ్రాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి చాలా ప్లస్. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణపు విలువలు బాగున్నాయి.


ఫిల్మీబజ్ విశ్లేషణ
ఆ వర్గం, ఈ వర్గం అని తేడా లేకుండా వెంకటేష్ కామెడీని ఎంజాయ్ చేసే ప్రేక్షకులకు కొదవే లేదు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కి చాలా దగ్గరైన హీరో వెంకటేష్. ఆ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని డైరెక్టర్ మారుతి కూడా 'బాబు బంగారం'తో ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసాడు. 'బొబ్బలిరాజా' సినిమాని గుర్తు చేసిన విధానం సూపర్. సినిమాని చూసే ఆడియన్స్ కి ఈ ఎపిసోడ్ కొత్త ఎనర్జీని ఇస్తుంది. జోష్ ఫుల్లుగా హీరో క్యారెక్టర్ ని తీర్చిదిద్ది చాలా గ్యాప్ తర్వాత వెంకీ కామెడీని ఆడియన్స్ ఎంజాయ్ చేసేలా చేయడం అభినందించదగ్గ విషయం. వెంకీ ఫిజిక్ అందరినీ ఆకట్టుకుంటుంది. తను వేసిన డ్యాన్స్ స్టెప్పులు, ఫైట్స్ లో కూడా కామెడీని మిక్స్ చేయడం ఈ సినిమాకి ప్లస్. కాకపోతే సెకండాఫ్ విషయంలో కొంత జాగ్రత్త పాటించి ఉంటే బాగుండేది. సెకండాఫ్ ఆరంభమైన కాసేపటికి బోర్ కొట్టేస్తుంది అని ఆడియన్స్ అనుకునేలోపు వెంకీ తనదైన స్టైల్లో కామెడీ చేసి నవ్వించాడు. ఇక క్లయిమ్యాక్స్ లో అయితే ఫుల్లుగా నవ్వించాడు వెంకీ. ఇది చాలా ప్లస్, సినిమా పూర్తయిన తర్వాత చిరునవ్వుతో ఆడియన్స్ బయటికి వస్తారు. కాసేపు సరదాగా నవ్వుకున్నాం అనుకుంటారు. అయితే లాజిక్ లు వెతకడం, హీరో ఏదో చేసేస్తాడని, కథ ఇంత రొటీన్ గా కాకుండా ఇంకా ఏదో ఉంటే బాగుండేదని ఆలోచిస్తే మాత్రం ఈ సినిమాకి కొంచెం మైనస్. ఏదేమైనా వెంకీ క్యారెక్టరైజేషన్, ఆ క్యారెక్టర్ ని వెంకీ హ్యాండిల్ చేసిన విధానం సూపర్. వెంకీ ట్రేడ్ మార్క్ కామెడీ కోసం ఎదురుచూసి సినిమాకి వెళ్లే ప్రేక్షకులను ఈ సినిమా అసలు నిరాశపరచదు. వెంకీ అబిమానులకు క్లయిమ్యాక్స్ ఓ పండులా ఉంటుంది.


ఓవర్ రాల్ గా చెప్పాలంటే...  'బాబు బంగారం' సినిమా చూసే ప్రతి ప్రేక్షకుడి పెదవులపైన చిరునవ్వు తెప్పిస్తాడు. కాబట్టి ఈ వీకెండ్ ని బాబు బంగారం కోసం కేటాయించవచ్చు. కుటుంబమంతా కలిసి ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ని ఎంజాయ్ చెయ్యొచ్చు. 

 

ఫిల్మీబజ్ రేటింగ్ - 3.25/5Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. రీ ఎంట్రీకి ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయత్తమవుతున్నాడు. 'శ్రీమంతుడు' చిత్రం త ..

Read More !

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ్యాప్ తీసుకోకుండానే 151వ సినిమా చేయడా ..

Read More !

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కైనా సంతోషంగానే ఉంటుంది. కానీ ఆ అవకాశం ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా విడుదలై భారీ వసూళ్లను సాధించిన విష ..

Read More !

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధరమ్ తేజ్, బోయపాటి శ్రీను సినిమాలు చేస్ ..

Read More !

Gossips

మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ గతంలో శిరీష్ భరద్వాజను ప్రేమించి, ..

రాంచరణ్ కి నోటి దురుసు ఎక్కువ అని తెలుగు సినిమా పరిశ్రమలో ఓ టాక్ ఉంది. ఆ వార ..

'రక్తచరిత్ర' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన రాధికా ఆప్టే తనలో మంచి నట ..

బాలీవుడ్ లో భారీ సినిమాలను నిర్మిస్తూ, పంపిణీ చేస్తున్న ఈరోస్ ఇంటర్నేషనల ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో 10రోజుల్లో 'జనతా గ్యారేజ్' షూటింగ్ తో బిజీ అవ్వబోతున ..

మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ సినిమా అంటే భారీ అంచనాలు ఉం ..

సీన్ ఉంది కదా అని ఓవర్ గా బిల్డప్ ఇస్తే సీన్ సితార్ అవుతుంది. విలన్ గా దూసుక ..

'బాహుబలి ది కంక్లూజన్' చిత్రం విడుదలైన వెంటనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో రాజమౌ ..

ప్రిన్స్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందితే బాగుంటుందని ..

మెగాబ్రదర్స్ మధ్య విభేదాలు ఉన్నాయా లేవా అనే విషయం గురించి కొంతకాలం క్రిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ సినిమా అంటే ..

యంగ్ రెబల్ స్టార్ ఫ్రభాస్ తో 'మిర్చి' లాంటి హిట్ చిత్రం చేసిన తర్వాత కొరటాల ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ లో వచ్చే యేడాది ఓ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ సినిమా అంటే ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్, హీరోయిన్ రెజీనా ఘాటుగా ప్రేమించుకుంటున్నార ..

ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ జాబితాలో కొరటాల శివ పేర ..

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ..

రాజకీయనేత పరిటాల రవి చనిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది. కానీ ఆయన్ను అభిమ ..

'బాహుబలి 2' పూర్తయిన వెంటనే రాజమౌళి మరో భారీ బడ్జెట్ చిత్రం 'గరుడ' ను ఆరంభించ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ సినిమా అంటే ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Is Prabhas decision right to do Baahubali- what his fans says? 

Prabhas, Rana Baahubali movie trailor

Charmme Kaur starrer Jyothi Lakshmi Song Making video 

Raviteja Starrer Power (Song 4) 10Sec Promo

Nitin Nash Movie Opening Held at Annapurna Studio.

Read More !