చిత్రం - బాలమిత్ర
నటీనటులు - రంగ, శశికళ, కియారెడ్డి, అనూష, దయానంద రెడ్డి, మీసాల లక్ష్మణ్ తదితరులు
సంగీతం - జయవర్ధన్
సినిమాటోగ్రఫీ - రజని
ఎడిటింగ్ - రవితేజ
నిర్మాతలు - శైలేష్ తివారి, బొద్దుల లక్ష్మణ్
దర్శకత్వం - శైలేష్ తివారి
విడుదల తేదీ - ఫిబ్రవరి 26, 2021
బాలమిత్ర - ఈ టైటిల్ చిన్నప్పటి చందమామ కథలను గుర్తుకు తెస్తుంది. కానీ ఈ సినిమా ప్రోమోలు, ట్రైలర్ ఇది సస్పెన్స్ థ్రిల్లర్ అని తెలియజేసింది. టైటిల్ క్లాస్ గా ఉన్నప్పటికీ, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుందని దర్శక, నిర్మాతలు పలు సందర్భాల్లో చెప్పారు. మరి వారు చెప్పినట్టు ఈ సినిమా అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ఉందా... రివ్య్వూ ద్వారా తెలుసుకుందాం.
కథ
మెడికల్ స్టూడెంట్ అర్జున్ (రంగా) తన క్లాస్ మేట్ దీక్ష (కియా) ని ప్రేమిస్తాడు. అర్జున్ ప్రేమలోని నిజాయితీని గ్రహించిన దీక్ష కూడా అర్జున్ ని ప్రేమిస్తుంది. ఓ సందర్భంలో దీక్ష కిడ్నాప్ కి గురవుతుంది. ఆమెను కిడ్నాప్ చేసిన వాళ్లు అర్జున్ ని బెదిరిస్తారు. వారు చెప్పిన ముగ్గురిని చంపితే దీక్షను వదిలేస్తామని చెబుతారు. గత్యంతరం లేని అర్జున్ ఇద్దరిని చంపేస్తాడు. ఆ తర్వాత బాల విలేజ్ కి వెళతాడు అర్జున్. బాల ఫ్రెండ్ ని అని చెబుతాడు. బాల సోదరి వైశాలి ఎంతో ప్రేమగా అర్జున్ ని చూసుకుంటుంది. అసలు బాల ఎవరు... దీక్షను ఎవరు కిడ్నాప్ చేసారు... హత్యకు గురైన వారు ఎవరు... బాల, అర్జున్ కి ఈ హత్యలతో సంబంధం ఏంటీ అనేదే 'బాలమిత్ర' కథ.
నటీనటుల పెర్ ఫామెన్స్
హీరో అర్జున్ పాత్రను చాలా చక్కగా తీర్చిదిద్దారు. ప్రేమికుడిగా తనదైన శైలిలో నటించి మెప్పించాడు హీరో. ఓ వైపు తనకు తెలీకుండా చేస్తున్న హత్యలు... ఆ హత్యలకు కారణం తెలుసుకోవడానికి అన్వేషణ... ఈ షేడ్స్ తో హీరో పాత్ర ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. ఈ పాత్రలో పూర్తిగా లీనమై నటించాడు హీరో. హీరో తర్వాత ఆడియన్స్ ని బాగా ఆకట్టుకునే పాత్ర వైశాలి ది. విలేజ్ గర్ల్ గా, పగబట్టిన యువతిగా వైశాలి పాత్ర కూడా ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటుంది. వైశాలి పాత్ర చేసిన అమ్మాయి తనదైన శైలిలో ఈ పాత్ర పోషించింది. కియారెడ్డి గ్లామర్ గా, బాల త్రిపుర సుందరి పాత్ర సోసైటీ గురించి ఆలోచించే అమ్మాయిగా చాల బాగుంది. మిగతా నటీనటులందరూ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
సాంకేతిక వర్గం
ఈ సినిమాకి సెకండాఫ్ బలం. ట్విస్ట్ లతో సెకండాఫ్ ఆడియన్స్ ని కుర్చీకి అతుక్కునిపోయేలా చేస్తుంది. ఆసక్తికరమైన స్ర్కీన్ ప్లే తో డైరెక్టర్ చాలా చక్కగా ఈ సినిమాని తెరకెక్కించారు. ఇక ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా ప్లస్. ప్రతి సన్నివేశాన్ని ఎలివేట్ చేసే విధంగా రీ-రికార్డింగ్ చేసారు మ్యూజిక్ డైరెక్టర్. విజువల్స్ బాగున్నాయి. కథకు సరిపడా ఖర్చు పెట్టారు నిర్మాత.
ఫిల్మీబజ్ విశ్లేషణ
ఫస్టాప్ కంటే ఈ సినిమా సెకండాఫ్ ఆసక్తిగా ఉంటుంది. సెకండాఫ్ లో ప్రేక్షకులు ఊహించని ట్విస్ట్ లతో, ఆసక్తికరమైన క్లయిమ్యాక్స్ తో సినిమాని తీర్చిదిద్దిన విధానం సూపర్బ్. ఫస్టాప్ ఆడియన్స్ కి కొంచెం మింగుడు పడదు. కానీ సెకండాఫ్ స్టార్ట్ అయిన తర్వాత వచ్చే ట్విస్ట్ లు సినిమాపై ఆసక్తిని కలిగిస్తుంది. బాల ఇంట్లో హీరో ఉండటం, హత్యలకు కారణమైన కుటుంబంతో హీరో స్టే చేయడం పెద్ద ట్విస్ట్. మంచి మెసేజ్ ఉంది. ఓ మనిషికి మంచి ఆశయం కాదు.. దానిని అమలుపరిచే ఆలోచన విధానం ఉండాలని చాలా చక్కగా తెరపై చూపించారు డైరెక్టర్.
ఫైనల్ గా చెప్పాలంటే... సస్పెన్స్ థ్రిల్లర్స్ ను ఎంజాయ్ చేసే ప్రతి ప్రేక్షకుడికి ఈ సినిమా కనెక్ట్ అవుతుంది... సో... డోంట్ మిస్ ది మూవీ.
ఫిల్మీబజ్ రేటింగ్ - 3/5