View

బందిపోటు సినిమా review

Friday,February20th,2015, 10:13 AM

చిత్రం - బందిపోటు
బ్యానర్ - ఇ.వి.వి సినిమా
నటీనటులు - అల్లరి నరేష్, ఈష, శ్రద్ధాదాస్, చంద్రమోహన్, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి, రావు రమేష్, శుభలేఖ సుధాకర్, అవసరాల శ్రీనివాస్, సంపూర్నేష్ బాబు, ఖయ్యూం తదితరులు
ఆర్ట్ - ఎం.కిరణ్ కుమార్
సంగీతం - కళ్యాణి కోడూరి
సినిమాటోగ్రఫీ - పి.జి.విందా
ఎడిటింగ్ - శ్రవణ్ కటికనేని
నిర్మాత - ఆర్యన్ రాజేష్
కథ, మాటలు, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - ఇంద్రగంటి మోహన కృష్ణ
విడుదల తేదీ - 20.2.2015

'మినిమమ్ గ్యారంటీ హీరో అనే ఇమేజ్ కొంతమందికే ఉంటుంది. అలాంటి అరుదైన ఇమేజ్ ని సొంతం చేసుకున్న ఘనత 'అల్లరి' నరేశ్ ది. అందుకే, నిర్మాతలు నరేశ్ తో సినిమాలు తీయడానికి ఇష్టపడతారు. నరేశ్ చేసే ప్రతి సినిమా దాదాపు గ్యారంటీ హిట్. నిర్మాతలు కూడా సేఫ్. అటు ప్రేక్షకులకు నవ్వులు, ఇటు నిర్మాతలకు, పంపిణీదారులకు, ఎగ్జిబిటర్లకు లాభాలు తెచ్చే చిత్రాలు చేస్తున్న అల్లరి నరేష్ నుంచి వచ్చిన తాజా చిత్రం 'బందిపోటు'. క్లాస్ దర్శకుడనిపించుకున్న ఇంద్రగంటి మోహనకృష్ణ, మాస్ అనిపించుకున్న నరేశ్ కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రం క్లాస్, మాస్ ప్రేక్షకులకు తగ్గట్టుగా ఉంటుందనే అంచనాలు నెలకొన్నాయి. కొంత విరామం తర్వాత ఈవీవీ సినిమా పతాకంపై ఆర్యన్ రాజేష్ నిర్మించిన చిత్రం ఇది. మరి.. ఈ 'బందిపోటు' ప్రేక్షకుల హృదయాలను ఏ రేంజ్ లో కొల్లగొడతాడో చూద్దాం...

à°•à°¥
సొసైటీలో పెద్ద మనుషులుగా చెలామణి అవుతూ డబ్బును దోచేసే వారిని టార్గెట్ చేసుకుని వారి నుంచి డబ్బు దోచేస్తుంటాడు విశ్వ (అల్లరి నరేష్). విశ్వ మోసం చేసిన రెండు, మూడు సంఘటనలను వీడియో రికార్డ్ చేసి, ఆ వీడియోతో విశ్వను కలుస్తుంది జాహ్నవి (ఈషా). ఆ వీడియో చూపించి, తన కోసం కూడా ఓ ముగ్గురు వ్యక్తులను నమ్మించి, మోసం చేయాలని విశ్వతో డీల్ కుదుర్చుకుంటుంది జాహ్నవి. ఆ ముగ్గురిని ఎందుకు మోసం చేయాలో కూడా జాహ్నవి విశ్వకు చెబుతుంది. ఆమె చెప్పిన కథ విని కన్విన్స్ అయ్యి సొసైటీలో పెద్ద మనుషులుగా చెలామణి అవుతున్న మకందరావు (తనికెళ్ల భరణి), శేష గిరి (రావు రమేష్), భలే బాబు (పోసాని కృష్ణమురళి) లను నమ్మించి మోసం చేయడానికి రంగంలోకి దిగుతాడు విశ్వ.
అసలు జాహ్నవి ఎందుకు సొసైటీలో పెద్ద మనుషులుగా చెలామణి అవుతున్న వారిని నమ్మించి మోసం చేయాలనుకుంటుంది. జాహ్నవి చెప్పిన కథకు విశ్వ ఎందుకు కన్విన్స్ అవుతాడు? ఆ ముగ్గురిని నమ్మించి మోసం చేసి, జాహ్నవి టార్గెట్ ని నెరవేర్చుతాడా? ఆ ముగ్గురు పెద్ద మనుషులు తమను మోసం చేస్తున్న విశ్వను కనిపెడతారా అనేదే ఈ చిత్ర కథ.

నటీనటులు
'అల్లరి' నరేశ్ ఏ పాత్రని అయినా సునాయాసంగా చేసేస్తాడు. ఇందులో విశ్వ పాత్రను బాగా చేశాడు. దొరల ముసుగులో ఉండే దొంగలను ఆటాడుకునే కారెక్టర్ లో నరేశ్ ఒదిగిపోయాడు. పైగా గత చిత్రాలతో పోల్చితే ఈ చిత్రంలో ఇంకా ఫ్రెష్ గా ఉన్నాడు. పూర్తి స్థాయి కామెడీతో సాగే ఈ చిత్రంలో ఉన్న రెండు, మూడు సెంటిమెంట్ సన్నివేశాలను బాగానే చేశాడు. పదహారణాల తెలుగమ్మాయి ఈషా తన పాత్రలో ఒదిగిపోయింది. తన పాత్ర ఓకే అనే విధంగా ఉంది. ఐటమ్ సాంగ్ లో శ్రద్ధాదాస్ చాలా బాగుంది. నీతీ, నిజాయతీ గల రాజకీయ నాయకుడి పాత్రలో చంద్రమోహన్ ఒదిగిపోయారు. వేదిక మీద ప్రసంగిస్తున్నప్పుడు పవర్ ఫుల్ డైలాగ్స్ ని చంద్రమోహన్ అద్భుతంగా చెప్పారు. ఆ వయసులో అలా సంభాషణలు పలకడం నిజంగా గొప్ప విషయమే. సంపూర్ణేష్ బాబు, అవసరాల శ్రీనివాస్, తనికెళ్ల భరణి, రావు రమేష్, పోసాని, శుభలేఖ సుధాకర్, సప్తగిరి తదితరులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక వర్గం
ఇది చాలా లైటర్ వీన్ స్టోరీ. ఒకవేళ మాస్ హీరోలతో తీస్తే సుమో చేజింగులు, బాంబు దాడులు.. ఇలా భారీగా తీసేవారు. కానీ. కామెడీ జానర్లో సాగుతున్న నరేశ్ తో కాబట్టి, తనకు తగ్గట్టుగా ఈ చిత్రాన్ని ఇంద్రగంటి మోహనకృష్ణ తీశారు. అది కన్విన్సింగ్ గా ఉంది. సంభాషణలు బాగున్నాయి. కల్యాణ్ కోడూరి ఇచ్చిన పాటలు సందర్భోచితంగా ఉన్నాయి. 'అలజడి..' పాట బాగుంది. ఐటమ్ సాంగ్ కూడా జోరుగా ఉంది. విజువల్ గా సినిమా చాలా బాగుంది. దీనికి కారణం పి.జి.విందా సినిమాటోగ్రఫీ.

ఫిల్మీబజ్ విశ్లేషణ
నటకిరీటి డా. రాజేంద్రప్రసాద్ తర్వాత తెలుగు తెరకు దొరికిన ఏకైక కామెడీ హీరో 'అల్లరి' నరేశ్. ఏడాదికి మూడు, నాలుగు కామెడీ చిత్రాలు చేస్తూ, ప్రేక్షకులకు రిలీఫ్ ని ఇస్తున్నాడు. ఈ మధ్య కాలంలో నరేశ్ చేసిన చిత్రాల్లో ఇతర చిత్రాల పేరడీలు ఎక్కువయ్యాయి. అవి కామెడీ పండించినా.. కొంచెం రొటీన్ అనిపించింది. ఈ చిత్రంలో అవి లేకపోవడం ఓ రిలీఫ్. ఫస్టాఫ్ చాలా వేగంగా సాగుతుంది. సెకండాఫ్ లో పోసాని ఎపిసోడ్ కొంచెం లెంగ్తీగా ఉన్నట్లనిపిస్తుంది. అయితే, ఆ ఎపిసోడ్ మొత్తం ఆసక్తిగానే సాగుతుంది కాబట్టి, పెద్దగా మైనస్ కాదు. ముగ్గురు బడా దొంగలను తెలివిగా బురిడీ కొట్టించే కథ ఇది. ఆ బురిడీ కొట్టించే విధానంలో ప్రేక్షకుడి బుర్రకు పనిచెప్పే తికమక ట్విస్టులు ఉండవు. రిలాక్డ్స్ గా చూడొచ్చు. కొంత విరామం తర్వాత ఈవీవీ సినిమా పతాకంపై ఈదర రాజేష్ నిర్మించిన చిత్రం ఇది. సినిమా ఆరంభం నుంచి చివరి వరకు ఎక్కడా ఇబ్బందిపడే సన్నివేశాలు ఉండవు. ద్వంద్వార్థాలు లేవు. చక్కని ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ని అందించారు. కాసేపు హాయిగా నవ్వుకోవచ్చు. తలపట్టేసినట్లుగా అనిపించే భారీ యాక్షన్ మూవీ కాదు. కన్నీళ్లు పెట్టుకుని, మనసు భారంగా చేసుకునే సెంటిమెంట్ సినిమా కాదు. కథకు ఎంత కావాలో అంతే ఖర్చు పెట్టి తీసిన ఈ సినిమా అందరినీ 'సేఫ్' చేస్తుందని ఉహించవచ్చు.
ఫైనల్ గా చెప్పాలంటే లైటర్ వీన్ గా సాగే కామెడీ ఎంటర్ టైనర్. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో.. వాచ్ ఇట్.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !