View

భలే భలే మగాడివోయ్ మూవీ రివ్య్వూ

Friday,September04th,2015, 08:31 AM

చిత్రం - భలే భలే మగాడివోయ్
సమర్పణ - అల్లు అరవింద్
బ్యానర్స్ - యు.వి.క్రియేషన్స్, గీతా ఆర్ట్స్2
నటీనటులు - నాని, లావణ్య త్రిపాఠి, మురళి శర్మ, నరేష్, సితార, అజయ్, స్వప్నమాధురి, శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిషోర్, ప్రవీణ్, షకలక శంకర్, బద్రమ్ తదితరులు
ఫోటోగ్రఫీ - నిజార్ షఫి
ఎడిటింగ్ - ఉద్దవ్
సంగీతం - గోపి సుందర్
నిర్మాత - బన్ని వాసు
రచన, దర్శకత్వం - మారుతి

 

నాని చేసే సినిమాలు, ఆ సినిమాల్లో అతని పాత్రలు డిఫరెంట్ గా ఉంటాయి. మారుతి చేసే సినిమాలు యూత్ ఫుల్ గా ఉంటాయి.. ఒక్కోసారి యువతను ఎట్రాక్ట్ చేసే సన్నివేశాలు కొంచెం మోతాదుకి మించి ఉంటాయి. కానీ, నాని చిత్రాలు ఆల్ మోస్ట్ డీసెంట్ గా ఉంటాయి. సో.. ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే ఎలా ఉంటుందో? అనే ఊహాగానాలు నెలకొనడం ఖాయం. భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మించే అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు, వంశీ ఓ మంచి ఎంటర్ టైనర్ మూవీ ఇవ్వాలనే ఆకాంక్షతో ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమా ఆరంభం నుంచి చివరి వరకూ నాన్ స్టాప్ గా నవ్విస్తుందని నాని చెప్పారు. మరి.. ఈ చిత్రం నవ్విస్తుందా? డీసెంట్ ఎంటర్ టైనర్ అనే విధంగా ఉందా?... తెలుసుకుందాం.

 

à°•à°¥
మురళిశర్మ (లావణ్య త్రిపాఠి తండ్రి) తన కూతురు నందన (లావణ్య త్రిపాఠి) కోసం వరుడిని వెతుకుతుంటాడు. ఆ ప్రాసెస్ లో లక్కీ (నాని)ని కలుస్తాడు. అతనిని కలిసిన తొలి పరిచయంలోనే బాగా మతిమరుపు ఉన్న కుర్రాడు అని, ఇలాంటి వాళ్లని మళ్లీ కలవకుండా ఉంటేనే బెటర్ అని ఫిక్స్ అయిపోతాడు.


లక్కీ ఓ సందర్భంలో నందనను చూసి, తొలిచూపులోనే ఆమెను ప్రేమించేస్తాడు. తనకు మతిమరుపు ఉందన్న సంగతి దాచేసి, ఎలాగోలా మ్యానేజ్ చేసే సమయంలో అతను చాలా మంచి వ్యక్తి అని, బాద్యత కలవాడని, హెల్పింగ్ నేచర్ ఉన్నవాడిగా నందన ముందు ప్రొజెక్ట్ అవుతాడు. దాంతో నందన కూడా లక్కీని ప్రేమించడం మొదలుపెడుతుంది. అతనిని వదులుకుంటే జీవితంలో చాలా కోల్పోయిన దానిని అవుతాననేంతగా లక్కీని ప్రేమించేస్తుంది.


తన ప్రేమ విషయం తండ్రికి చెప్పి, తండ్రి కూడా అంగీకరించడంతో లక్కీని తన తండ్రిని కలవాల్సిందిగా కోరుతుంది. కానీ, ఒకప్పుడు తనను రిజెక్ట్ చేసిన వ్యక్తే నందన తండ్రి అని లక్కీకి తెలియదు. నందన తండ్రిని కలుసుకోవడానికి వెళ్లినప్పుడు ఆ విషయం అతనికి తెలుస్తుంది. దూరం నుంచే నందన తండ్రిని చూసి, సైడ్ అయిపోతాడు లక్కీ. మరోవైపు నందన తండ్రి స్నేహితుడు కొడుకు అజయ్ (అజయ్) నందన అంటే ఇష్టపడతాడు. ఆమెను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఇందుకు తన పోలీస్ బుర్రను ఉపయోగిస్తుంటాడు.


మరి ఫైనల్ గా మతిమరుపు ఉన్న వ్యక్తిని తన కూతురికిచ్చి పెళ్లి చేయడానికి నందన తండ్రి అంగీకరిస్తాడా? లక్కీకి మతిమరుపు అని తెలుసుకున్న నందన ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది... పోలీస్ అయిన అజయ్ మతిమరుపును దాచిన మోసగాడుగా నందన దగ్గర లక్కీని చూపించగలుగుతాడా అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

 

నటీనటుల పర్ఫార్మెన్స్
లక్కీ పాత్రను నాని బాగా చేశాడు. తనకు మతిమరుపు ఉన్న విషయాన్ని కవర్ చేసుకునే సన్నివేశాల్లో తన నటన హైలైట్ గా ఉంటుంది. తన పాత్రచేసే పనులు, ఇచ్చే ఎక్స్ ప్రెషన్స్ నవ్విస్తాయి. మంచి కామెడీ టైమింగ్ తో చేశాడు. లావణ్య త్రిపాఠి చాలా క్యూట్ గా ఉంది. చక్కగా నటించింది కూడా. హావభావాలు పలికించిన తీరు బాగుంది. లావణ్య తండ్రి పాత్రలో మురళీ శర్మ చాలా హుందాగా ఉన్నాడు. పోలీసాఫీసర్ పాత్రలో అజయ్ ఒదిగిపోయాడు. అలాగే సీనియర్ నరేశ్, సితార, వెన్నెల కిషోర్, శ్రీనివాస రెడ్డి, స్వప్న మాధురి తదితరులు తమ పాత్రల్లో ఒదిగిపోయారు.

 

సాంకేతిక వర్గం
సింపుల్ పాయింట్ కి బలమైన సన్నివేశాలు అల్లుకుని మారుతి ఈ సినిమ తీశాడు. వెతికినా కూడా బూతు కనిపించకపోవడంతో అతని గత చిత్రాల మార్కుతో కాకుండా నీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అనిపించుకుంది. ఈ చిత్రంతో మారుతి నీట్ డైరెక్టర్ అనిపించుకున్నాడు. నవ్వించడమే ప్రధాన లక్ష్యంగా తీశాడు. అందులో సక్సెస్ అయ్యాడు. డైలాగ్స్ బాగున్నాయి. గోపీ సుందర్ ఇచ్చిన పాటలు ఓకే అనిపించుకున్నాయి. నిజార్ షఫి కెమెరా ఓ కనువిందు. సినిమా మొత్తం కలర్ ఫుల్ గా ఉంది. కథకు సరిపడా బడ్జెట్ ని నిర్మాతలు సమకూర్చారు.

 

ఫిల్మీబజ్ విశ్లేషణ
ఈ సినిమా దాదాపు నాని భుజల మీదే నడుస్తుంది. ఆ బాధ్యతను బాగానే మోసాడు. దర్శకుడిగా మారుతి భేష్ అనిపించుకున్నాడు. కామెడీ ఎంటర్ టైనర్స్ కి ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. సో.. చిత్రబృందం సేఫ్ మూవీ చేశారు. ఓ రెండు గంటల పాటు నవ్వుకుంటూ చూడదగ్గ సినిమా.
ఫైనల్ గా చెప్పాలంటే... భలే భలే టైమ్ పాస్ కి పనికొచ్చే సినిమా.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !