View

బ్రూస్ లీ మూవీ రివ్య్వూ

Friday,October16th,2015, 08:30 AM

చిత్రం - బ్రూస్ లీ
బ్యానర్ - డి.వి.వి ఎంటర్ టైన్ మెంట్స్
నటీనటులు - చిరంజీవి (గెస్ట్ అఫియరెన్స్), రాంచరణ్, రకుల్ ప్రీత్ సింగ్, కృతి కర్భందా, ముఖేష్ రుషి, సంపత్ రాజ్, నదియా, రావు రమేష్, బ్రహ్మానందం, అరుణ్ విజయ్, నాగబాబు, పోసాని కృష్ణమురళి, ఫృధ్వీ, సప్తగిరి తదితరులు
సంగీతం - యస్. యస్.తమన్
సినిమాటోగ్రఫీ - మనోజ్ పరమహంస
ఎడిటింగ్ - యం.ఆర్.వర్మ
రచన - శ్రీను వైట్ల, కోన వెంకట్, గోపీ మోహన్
నిర్మాత - డి.వి.వి.దానయ్య
మూలకథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - శ్రీను వైట్ల
విడుదల తేదీ - 16th అక్టోబర్, 2015


'బ్రూస్ లీ' అనే టైటిల్ తో ఓ సినిమా చేయడం అనేది పెద్ద సాహసం. ఎందుకంటే, అంచనాలు భారీ ఎత్తున ఉంటాయి. హీరో స్టంట్ మేన్ కాబట్టి అతని పాత్రకు ఈ పేరు పెట్టి, దాన్నే సినిమా టైటిల్ గా పెట్టారు. బ్రదర్, సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో సాగే చిత్రం అని ముందే చెప్పారు కాబట్టి, అటు సెంటిమెంట్, ఇటు యాక్షన్, కామెడీ అన్నీ ఉండి, ఓ సంపూర్ణ చిత్రం చూస్తామనే ఆలోచన ప్రేక్షకులకు కలగడం ఖాయం. ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ చిరంజీవి చేసిన అతిథి పాత్ర. మూడే నిముషాలు కనిపించే ఈ పాత్ర వసూళ్లు రాబట్టడానికి ఉపయోగపడుతుంది. ఈ యాడెడ్ అడ్వాంటేజ్ తో విడుదలైన 'బ్రూస్ లీ' ఏ రేంజ్ విజయం సాధిస్తుంది? ఎంతో ఇష్టపడి, నమ్మి రాంచరణ్ చేసిన ఈ చిత్రం అతని కెరీర్ కి ఏ రేంజ్ హెల్ప్ అవుతుంది? తదితర విషయాలు తెలుసుకుందాం...


à°•à°¥
రామచంద్రరావు (రావు రమేష్)ది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. కలెక్టర్ అవ్వాలనే తన కోరిక ఆర్ధిక ఇబ్బందుల వల్ల తీరదు. దాంతో తన కొడుకు కార్తీక్ (రాంచరణ్)ని కలెక్టర్ చేయాలనుకుంటాడు. కూతురు అమ్ములు (కృతి కర్భందా) కూడా బాగా చదువుతుంది. కానీ తనకున్న ఆర్ధిక ఇబ్బందుల వల్ల కొడుకును మాత్రమే చదివించాలనుకుంటాడు. అయితే అక్క మీద ప్రేమతో బాగా చదువుకునే కార్తీక్ మంచి మార్కులు తెచ్చుకోకుండా అక్కని మంచి స్కూల్లో చేర్పించేలా చేస్తాడు. ఆ రకంగా చిన్నప్పట్నుంచి తన అక్క కోసం ఏం చేయడానికైనా వెనుకాడడు కార్తీక్.


చదువుకోని కార్తీక్ స్టంట్ మ్యాన్ అవుతాడు. ఓ సందర్భంలో పోలీస్ డ్రెస్సులో ఉన్న కార్తీక్ ని చూసిన రియా (రకుల్ ప్రీత్ సింగ్) అతని ప్రేమలో పడిపోతుంది. కార్తీక్ కూడా రియాని ప్రేమిస్తాడు. రియా వల్ల రెండు సిట్యువేషన్ లో కార్తీక్ పోలీస్ లానే నటించాల్సి వస్తుంది. ఆ రెండు సిట్యువేషన్స్ లోనూ విలన్ దీపక్ రాజు (అరుణ్ విజయ్) సామ్రాజ్యాన్ని కూలగొడతాడు కార్తీక్. దాంతో దీపక్ రాజు పగతో రగలిపోతుంటాడు. కార్తీక్ పని పట్టడానికి మ్యాప్ వేస్తాడు.


రామచంద్రరావు ఓనర్ వసుంధరా కంపెనీస్ యం.డి జయరాజ్ (సంపత్ రాజ్) అతని భార్య వసుంధర (నదియా) తమ కొడుకు రాహుల్ కి రామచంద్రరావు కూతురితో పెళ్లి నిశ్చయిస్తారు. తన అక్క పెద్దింటి కోడలు అవుతుందని సంతోషపడతాడు కార్తీక్. కానీ జయరాజ్ కి మరో కుటుంబం ఉందని, అతని కొడుకే దీపక్ రాజు అన్న విషయం కార్తీక్ కి తెలుస్తుంది. జయరాజ్ అవినీతిపరుడని, తను ఎదగడానికి వసుంధరను, ఆమె మొదటి భర్త కొడుకు అయిన రాహుల్ ని అడ్డం పెట్టుకుంటున్నాడన్న విషయం తెలుసుకున్న కార్తీక్ అతని నిజస్వరూపం వసుంధరకు తెలిసేలా చేస్తాడు. ఆ రకంగా తన అక్క పెళ్లి చేసుకుని వెళ్లిన ఇంటిని కూడా జయరాజ్ నుంచి కాపాడతాడు కార్తీ్క్. ఇది క్లుప్తంగా ఈ చిత్ర కథ.


నటీనటుల పర్ఫార్మెన్స్
స్టంట్ మేన్ క్యారెక్టర్ ను రాంచరణ్ చాలా బాగా చేశాడు. క్యారెక్టర్ కి తగ్గట్టు ఫిట్ గా కనిపించాడు. ఫైట్స్, డ్యాన్స్ తో పాటు ఎమోషనల్ సీన్స్ లో చరణ్ యాక్టింగ్ బాగుంది. తన నటనలో పరిణతి కనిపించింది. రకుల్ ప్రీత్ సింగ్ చాలా అందంగా ఉంది. చాలా బాగా యాక్ట్ చేసింది కూడా. ఇందులో చేసిన రియా పాత్ర రకుల్ కెరీర్ కి మరో మంచి మలుపు అవుతుంది. అక్క పాత్రకు కృతి కర్భందా న్యాయం చేసింది. కన్నడంలో కథానాయికగా మంచి ఫామ్ లో ఉన్న కృతి అక్క పాత్ర అంగీకరించడం గొప్ప విషయమే. విలన్ పాత్ర చేసిన అరుణ్ విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. చాలా స్టయిలిష్ గా ఉన్నాడు. ఈ మధ్యకాలంలో నార్త్ విలన్స్ ఎక్కువైన నేపథ్యంలో సౌత్ లో ఉన్న ఈ స్టయిలిష్ విలన్ ని ఎంకరేజ్ చేయొచ్చు. చివర్లో చిరంజీవి ఇలా వచ్చి అలా మాయమైనట్లు అనిపిస్తుంది. ఇంకాసేపు కనిపిస్తే బాగుండేది. ఏ పాత్రను అయినా అవలీలగా చేసే బ్రహ్మానందం... సుజుకి పాత్రను కూడా సునాయాసంగా చేశాడు. ఇతర పాత్రల్లో ముఖేష్ రుషి, నాగబాబు, సంపత్, రావు రమేశ్, తనికెళ్ల భరణి, షయాజీ షిండే, నదియా, జయప్రకాశ్ రెడ్డి, సప్తగిరి తదితరులు ఒదిగిపోయారు.


సాంకేతిక వర్గం
బ్రదర్, సిస్టర్ సెంటిమెంట్ ను ప్రధానాంశంగా చేసుకుని కథ అల్లుకుని ఈ సినిమా చేశారు. శ్రీను వైట్ల అనుకున్న ఈ ఒరిజినల్ పాయింట్ చుట్టూ కథ అల్లడం అంటే కష్టమే. ఈ పాయింట్ కి పాటలు, ఫైట్లు, సెంటిమెంట్ జోడించి మొత్తానికి ఓ కథ తయారు చేశారు. దాంతో కథ చెప్పుకోదగ్గ విధంగా లేదు. డైలాగ్స్ బాగున్నాయి. తమన్ అందించిన పాటలు 'మెగా మీటర్..', 'లే చలో..', 'బ్రూస్ లీ..' బాగున్నాయి. మనోజ్ పరమహంస కెమెరా వర్క్ బాగుంది. ఫైట్స్, డ్యాన్సులు బాగున్నాయి. అక్కడక్కడా కొన్ని అనవసర సన్నివేశాలు ఉన్నట్లనిపిస్తుంది. అందుకని ఎడిటింగ్ విషయంలో ఇంకా కేర్ తీసుకుని ఉంటే బాగుండేదనిపిస్తుంది.


ఫిల్మీబజ్ విశ్లేషణ
ఒక సినిమా కోసం ఎంత కష్టపడాలో రాంచరణ్ అంతా కష్టపడ్డాడు. శక్తివంచన లేకుండా ఫైట్లు, డ్యాన్సులు చేశాడు. సెంటిమెంట్ సీన్స్ కూడా బాగా చేశాడు. కానీ, కథ బలంగా లేకపోవడంతో చరణ్ పడిన కష్టం వృథా అనే చెప్పాలి. నటుడిగా తనకు ప్లస్సే కానీ, సక్సెస్ పరంగా మాత్రం గ్యారంటీ హిట్ అనలేం. ఫస్టాఫ్ ఫర్వాలేదనిపించింది కానీ, సెకండాఫ్ అలా కూడా లేదు. ఇంటర్వెల్ తర్వాతి ఎపిసోడ్ లోనే కథ స్పష్టంగా తెలిసిపోవడంతో తర్వాత ఏం జరుగుతుందో అర్థమైపోతుంది. దాంతో ప్రేక్షకులకు ఆసక్తి పోతుంది. పైగా, ఆ తర్వాత అర్థం పర్థం లేని కామెడీ ట్రాక్స్ జొప్పించి విసుగు తెప్పించారు. చిన్న చిన్న పాత్రలకు కూడా పెద్ద పెద్ద ఆర్టిస్టులను తీసుకోవడం, వాళ్లకు తగిన స్ర్కీన్ స్పేస్ లేకపోవడంతో అసలు ఆ పాత్రలు వాళ్లే ఎందుకు చేయాలి? అనే ఫీలింగ్ ప్రేక్షకులకు కలగక మానదు. ఉదాహరణకు ముఖేష్ రుషి, నాగబాబు, వెన్నెల కిషోర్, పోసాని, పృథ్వీ పాత్రలు. గెస్ట్ అపియరెన్స్ లా అనిపించే ఆ పాత్రలకు కూడా పెద్ద పెద్ద ఆర్టిస్టులను తీసుకోవడం బడ్జెట్ పెంచినట్లే. ఇక, చిరంజీవి ఎంట్రీ గురించి చెప్పాలంటే.. అభిమానులు ఆశించినంత లేదు. చిరు చేసిన ఫైట్ కూడా ఎఫెక్టివ్ గా లేదు. కాలరెగరేయడం, కన్ను కొట్టడం.. వంటివి కాకుండా చిరు పవర్ ఫుల్ గా ఫైట్ చేసినట్లు చూపించి ఉంటే బాగుండేది. చిరు ఫైట్స్ బాగా చేస్తారు. కానీ ఏదో మెస్మరైజ్ చేసినట్టుగా ఫైట్ ని డిజైన్ చేయడం నిరాశ కలిగిస్తుంది. అయితే చిరంజీవి, చరణ్ హార్స్ రైడింగ్ సీన్ ని మాత్రం ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు.


ఫైనల్ గా చెప్పాలంటే...
దారి తప్పిన కథ తడబడుతూ.. సాగుతూ.. ఎలాగోలా ఎక్కడో చోట ముగుస్తుంది. 'బ్రూస్ లీ' కూడా అంతే. సినిమాకి కొబ్బరికాయ కొట్టిన నాడే విడుదల తేదీ ప్రకటించడంతో హరీబరీగా తీశారా? అదే ఈ సినిమాకి మైనస్ అయ్యిందా? ఇంకాస్త టైమ్ తీసుకుని స్ర్కిఫ్ట్ పరంగా వర్కవుట్ చేసి, అనవసరమైన సన్నివేశాలు తగ్గించి ఉంటే.. సూపర్ డూపర్ అని కాకపోయినా హిట్ అనిపించుకునే ఆస్కారం ఉండేదేమో? వంటి ప్రశ్నలకు సమాధానాలు లభించాలనుకోవడం అనవసరం. అంత అయిపోయాక... జవాబులు తెలుసుకుని ఏం లాభం?



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !