చిత్రం - చెప్పినా ఎవ్వరూ నమ్మరు
నటీనటులు - ఆర్యన్ కృష్ణ, సుప్యార్ధే సింగ్, విక్రమ్ విక్కి, విజయేందర్, రాకేష్ తదితరులు
సినిమాటోగ్రఫీ - బురన్ షేక్, అఖిల్ వల్లూరి
సంగీతం - జగదీశ్ వేముల
ఎడిటర్ - అనకల లోకేష్
లిరిక్స్ - భాస్కరభట్ల
బ్యానర్ - శ్రీ మోనిక స్రవంతి ఆర్ట్ ప్రొడక్షన్స్
నిర్మాత - ఎం. మురళి శ్రీనివాసులు
డైరెక్టర్ - ఆర్యన్ కృష్ణ
ఆర్యన్ కృష్ణ, సుప్యార్ధే సింగ్ హీరో, హీరోయిన్లుగా శ్రీ మోనిక స్రవంతి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై ఆర్యన్ కృష్ణ దర్శకత్వంలో ఎం.మురళి శ్రీనివాసులు నిర్మించిన చిత్రం 'చెప్పినా ఎవరూ నమ్మరు'. విక్రమ్ విక్కి , విజయేందర్, రాకేష్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా జనవరి 29న థియేటర్స్ కి వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది... ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉందా తెలుసుకుందాం.
కథ
జీవితంలో ఏదైనా సాధించాలనే టార్గెట్ తో ఉన్న ముగ్గురు కుర్రాళ్లు గోవా వెళతారు. అక్కడ వీరు ఓ మర్డర్ కేసులో ఇరుక్కుంటారు. ఓ జర్నలిస్ట్ ద్వారా ఈ విషయం తెలుసుకుంటారు. గోవాలో వీరికి పరిచయం అయిన జోసఫ్ వల్ల ఈ కుర్రాళ్లు ఇరుక్కున్నారా... డ్రగ్స్ బాటిల్ పగిలిపోవడంతో, ఆ పవర్ వల్ల వీరు మత్తులోకి వెళ్లిపోయిన తర్వాత అసలు ఏం జరిగింది... మర్డర్ కేసు నుంచి ఈ కుర్రాళ్లు ఎలా బయటపడ్డారు తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటుల పెర్ ఫామెన్స్
ఆర్యన్ కృష్ణ, సుప్యార్థే సింగ్, విక్రమ్ విక్కి, విజయేందర్, రాకేష్... వీళ్లందరూ నూతన నటులే. అయినా సరే చాలా ఎక్స్ పీరియన్స్ ఉన్న యాక్టర్స్ లా చాలా బాగా నటించారు.
సాంకేతిక వర్గం
ఆర్యన్ కృష్ణ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించారు. ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పకుండా, రెండింటిని చక్కగా నిర్వర్తించారు ఆర్యన్ కృష్ణ. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా, కథకు సరిపడా ఖర్చుపెట్టారు నిర్మాత ఎం.మురళి శ్రీనివాసులు. జగదీశ్ వేముల అందించిన పాటలు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సీన్స్ ఎలివేట్ చేసే విధంగా ఉండటం ఈ సినిమాకి చాలా ప్లస్. భాస్కర్ భట్ల లిరిక్స్ ఈ సినిమాకి మరో హైలైట్. అందమైన లొకేషన్స్ లో చిత్రీకరించిన కొన్ని సీన్స్ ఆడియన్స్ కి బాగా నచ్చుతాయి. బురన్ షేక్, అఖిల్ వల్లూరి సినిమాటోగ్రఫీ సూపర్బ్. అనవసరమైన సీన్స్ లేకుండా, లెంగ్త్ విషయంలో చాలా కేర్ తీసుకున్నారు ఎడిటర్ అనకల లోకేష్. దాంతో సినిమా చాలా స్పీడ్ గా ఉండటంతో పాటు ఎక్కడా బోర్ కొట్టదు.
విశ్లేషణ
డైరెక్టర్ ఆర్యన్ కృష్ణ తీసుకున్న స్టోరీ లైన్ బాగుంది. ఇప్పటి కుర్రకారు ఆలోచనలు ఎలా ఉన్నాయి... సమస్యలు ఎదురైతే, వాటిని ఎలా ఎదుర్కొంటున్నారు వంటి అంశాలను చాలా చక్కగా తెరపై ఆవిష్కరించారు డైరెక్టర్. ఇంటర్వెల్ ట్విస్ట్ సినిమా సెకండాఫ్ పై ఆసక్తిని రేకెత్తిస్తుంది. సెకండాఫ్ లోని కొన్ని థ్రిల్లింగ్ సీన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. గోవాలో చిత్రీకరించిన అన్ని సన్నివేశాలు సినిమాను యూత్ కి కనెక్ట్ అయ్యేలా చేస్తాయి. కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు మంచి మెసేజ్ కూడా ఈ సినిమాలో ఉంది. ఈ మెసేజ్ అన్ని వర్గాల ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది.
ఫైనల్ గా చెప్పాలంటే... రెండు గంటల పాటు చక్కగా 'చెప్పినా ఎవ్వరూ నమ్మరు' సినిమాని ఎంజాయ్ చెయ్యొచ్చు. ముఖ్యంగా యూత్ ఈ సినిమాకి బాగా కనెక్ట్ అవుతారు. సో... డోంట్ మిస్ ది మూవీ ఇన్ థియేటర్స్.
ఫిల్మీబజ్ రేటింగ్ - 3/5