View

సినిమా చూపిస్త మావ మూవీ రివ్య్వూ

Thursday,August13th,2015, 08:21 PM

చిత్రం - సినిమా చూపిస్త మావ
సమర్పణ - అంజిరెడ్డి ప్రొడక్షన్స్, ఆర్.డి.జి.ప్రొడక్షన్ ప్రై.లి
బ్యానర్స్ - ఆర్యత్ సినీ ఎంటర్ టైన్ మెంట్, లక్కీ మీడియా
నటీనటులు - రాజ్ తరుణ్, అవికాగోర్, రావు రమేష్, తోటపల్లి మధు, జయలక్ష్మీ, కృష్ణ భగవాన్, పోసాని కృష్ణమురళి, సత్య, మెల్కోటి తదితరులు
స్ర్కిఫ్ట్ కో-ఆర్డినేటర్ - సాయికృష్ణ
సంగీతం - శేఖర్ చంద్ర
మాటలు - ప్రసన్న జె.కుమార్
ఎడిటింగ్ - కార్తీక్ శ్రీనివాస్
సినిమాటోగ్రఫీ - సాయి శ్రీరామ్-దాశరధి శివేంద్ర
నిర్మాతలు - బోగాది అంజిరెడ్డి, బెక్కెం వేణుగోపాల్ (గోపి), రూపేష్ డి.గోహిల్, జి.సునీత
కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - త్రినాధరావు నక్కిన

 

'ఉయ్యాల జంపాల'... రాజ్ తరుణ్, అవికా గోర్ లకు హీరో హీరోయిన్లుగా ఇది మొదటి చిత్రం. 'చిన్నారి పెళ్లి కూతురు' సీరియల్ ద్వారా అవికా అప్పటికే ఫేమస్. ఆ పాపులార్టీ తన సినిమా ఎంట్రీపై బోల్డన్ని అంచనాలు పెంచింది. మంచి నటన కనబర్చడం ద్వారా ఆ అంచనాలను చేరుకుంది అవికా. ఇక, రాజ్ తరుణ్ కూడా బోయ్ నెక్ట్స్ డోర్ అనిపించుకున్నాడు. రాజ్, అవికాల జంట బాగుందనే అభినందనలు లభించాయి. ఈ జంట మళ్లీ జతకట్టిన చిత్రం 'సినిమా చూపిస్త మావ'. త్రినాధ రావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎలా ఉంటుంది? రాజ్ తరుణ్, అవికా జాయింట్ గా మరో విజయాన్ని చూస్తారా? తదితర విషయాలు తెలుసుకుందాం...

 

à°•à°¥
కత్తి (రాజ్ తరుణ్) ది మధ్య తరగతి కుటుంబం. తండ్రి పెట్రోల్ ని బ్లాక్ లో అమ్ముతుంటాడు. ఇంటర్ ఫెయిల్ అయ్యి పనీ పాటా లేకుండా తన ఫ్రెండ్స్ తో తిరుగుతుంటాడు కత్తి. ఈ కుటుంబానికి పూర్తి వ్యతిరేకమైన కుటుంబం పరిణితి (అవికాగోర్)ది. అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలి. పరిణితి తండ్రి సోమనాధ్ చటర్జీ క్వాలిటీ అండ్ విజిలిన్స్ డిపార్ట్ మెంట్ లో డిప్యూటీ సెక్రటరీగా వర్క్ చేస్తుంటాడు. అతనికి జీవితాన్ని చాలా క్వాలిటీగా జీవించాలని, ఏం చేసినా ఏం తిన్నా, ఏం తాగినా క్వాలిటీ మెయింటెన్ చేయాలనే మనస్తత్వం కలవాడు. అతనికి ఉన్నఈ మనస్తత్వం వల్ల కూతురు పరిణితి జీవితంలో చాలా కోల్పోతున్నామని బాధపడుతుంటుంది. అయితే తండ్రి మీద గౌరవం, తన తండ్రి కుటుంబానికి ఇచ్చే థైర్యం పరిణితిని గొప్ప సంస్కారవంతురాలిని చేస్తుంది. బాగా చదువుకుంటుంది.


ఇంటర్ లో 996 మార్కులతో పాస్ అయిన కూతురు అంటే సోమనాధ్ చటర్జీకి చాలా గర్వంగా ఉంటుంది. ఒకానొక సందర్భంలో ఆమె ఫోటో చూపించి అల్లరిచిల్లరిగా తిరుగుతున్న కత్తికి క్వాలిటీగా జీవితాన్ని జీవించాలని క్లాస్ పీకుతాడు సోమనాథ్. ఫోటోను చూసినప్పుడే ఆమెతో ప్రేమలో పడిపోతాడు కత్తి. దాంతో ఆమె చేరిన కాలేజ్ లోనే ఇంటర్ ఫెయిల్ అయ్యానన్న విషయం దాచి కాలేజ్ లో జాయిన్ అవుతాడు. పరిణితికి దగ్గరవుతాడు. తను కోల్పోయిన ఆనందాన్ని పరిణితికి ఇస్తాడు కత్తి. దాంతో అతనిని ప్రేమిస్తుంది.


పరిణితికి తన మేనల్లుడిని ఇచ్చి పెళ్లి చేయడానికి ఎంగేజ్ మెంట్ చేస్తున్న సమయంలో కత్తి తనను పరిణితి ప్రేమిస్తున్న విషయాన్ని సొమనాధ్ కి తెలియజేస్తాడు. తనకు ఏ మాత్రం నచ్చని వ్యక్తిని కూతురు ప్రేమించడం పట్ల ఆగ్రహం చెందిన సొమనాధ్ ఎలాగైనా కూతురు జీవితంలోంచి కత్తిని తరిమేయాలని ప్లాన్ చేస్తాడు. అందుకోసం కత్తితో బెట్ కడతాడు. ఆ బెట్ ప్రకారం ఓ నెల రోజులు పాటు సొమనాధ్ కుటుంబాన్ని కత్తి పోషించాల్సి ఉంటుంది. ఈ బెట్ లో ఓడిపోతే పరిణితిని వదిలేయాలని కత్తికి చెబుతాడు సోమనాధ్. మరి తన ప్రేమను గెలిపించుకోవడానికి కత్తి ఎలాంటి ప్రయత్నాలు చేస్తాడు. తన స్థాయికి ఏ మాత్రం తగడని భావిస్తున్న సోమనాధ్ ఫైనల్ గా కత్తిని అల్లుడుగా అంగీకరిస్తాడా అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

 

నటీనటుల పర్ఫార్మెన్స్
అల్లరి చిల్లరి కుర్రాడి పాత్రను రాజ్ తరుణ్ చాలా బాగా చేశాడు. చదువు అబ్బని ఓ ఇరవయ్యేళ్ల కుర్రాడు, గాలిగా ఫ్రెండ్స్ తో తిరిగే కుర్రాడిలో ఉండే సహజమైన నిర్లక్ష్య ధోరణి, తెగువ, చిలిపితనం.. అన్నింటినీ రాజ్ తరుణ్ చక్కగా ఆవిష్కరించాడు. డ్యాన్సులు బాగా చేశాడు. డైలాగ్స్ కూడా బాగా చెప్పగలిగాడు. అయితే, ఇంకా వాయిస్ లో మెచ్యుర్టీ రాని వైనం స్పష్టంగా వినిపిస్తోంది. అది ఏజ్ కి సంబంధించినది కాబట్టి, పెద్దగా పట్టించుకోనక్కర్లేదు. ఇక, అవికా గోర్ బెంగాలీ అమ్మాయిగా బాగుంది. మొదటి కొన్ని సీన్స్ లో చిన్న చిన్న హావభావాలు పలికించి, ఆ తర్వాతి సీన్స్ లో మాస్ ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకి రావు రమేష్ ప్రధాన బలం. ఏం చేసినా క్వాలిటీగా ఉండాలని కోరుకునే మంచి వ్యక్తిగా రావు రమేష్ బాడీ లాంగ్వేజ్ బాగుంది. ఈ మధ్యకాలంలో ఆయన చేసిన పాత్రలన్నిటితో పోల్చితే ఈ పాత్ర వినూత్నంగా ఉంది. కొత్తగా నటించడానికి రావు రమేష్ కి స్కోప్ దొరికింది. తోటపల్లి మధు, పోసాని కృష్ణమురళి, సత్య పాత్రలు బాగున్నాయి. కొన్ని సన్నివేశాల్లోనే కనిపించినా, కృష్ణభగవాన్ పాత్ర బాగుంది.

 

సాంకేతిక వర్గం
మామ, అల్లుళ్ల కాంబినేషన్లో చాలా సినిమాలు వచ్చాయి. ఎన్ని సినిమాలు వచ్చినా వెరైటీ కథాంశంతో, బలమైన స్ర్కీన్ ప్లేతో తీస్తే ఈ కాంబినేషన్ కి తిరుగు ఉండదు. ఆ విషయంలో దర్శకుడు త్రినాధరావు నక్కిన సక్సెస్ అయ్యారు. చక్కని స్ర్కీన్ ప్లేతో సినిమాని ఆసక్తికరంగా నడిపించారు. ఫస్టాఫ్ బాగుంది. సెకండాఫ్ ఇంకా బాగుంది. శేఖర్ చంద్ర పాటలు కథానుసారం సాగుతాయి. బోర్ అనిపించవు. ఈ చిత్రానికి ఓ హైలైట్ కెమెరా వర్క్. చిన్న సినిమా అయినా కెమెరా రిచ్ గా ఉంది. ప్రసన్నకుమార్ రాసిన డైలాగ్స్ ఓ హైలైట్. ఎడిటింగ్ బాగుంది.

 

ఫిల్మీబజ్ విశ్లేషణ
ఇది మంచి యూత్ ఫుల్ మూవీ. ఆవారాగా తిరిగే కుర్రాడికి తన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తే, ఆమె జీవితం ఏమవుతుందో? అని కంగారు పడే తండ్రి కథ కూడా ఉండటంవల్ల ఇది ఫ్యామిలీ మూవీ కూడా. ఈ సినిమాకి ప్రధాన బలం కామెడీ ట్రాక్స్. రామాయణం, మహాభారతం మిక్స్ చేసిన తీసిన కామెడీ ట్రాక్, వరల్డ్ నంబర్ వన్ వెధవలంటూ కొన్ని పాత్రలు హీరోని ఆటపట్టించే ట్రాక్, అదే వెధవలను హీరో ఆడుకునే ట్రాక్ కడుపుబ్బా నవ్వించాయి. రామాయణం, మహాభారతం ట్రాక్, మందు కొట్టే ట్రాక్స్ కొన్ని చిత్రాల్లోని సన్నివేశాలకు పేరడీలా ఉన్నప్పటికీ ఇవి వేరే శైలిలో సాగుతాయి కాబట్టి, నవ్విస్తాయి. సినిమా మొత్తం చాలా నీట్ గా ఉంది. డైలాగ్స్ లో కూడా అభ్యంతరకర పదాలు వినిపించవు. అందుకని హోల్ ఫ్యామిలీ ఎంజాయ్ చేయదగ్గ సినిమా ఇది. రాజ్ తరుణ్, అవికా గోర్ లాంటి చిన్న వయసున్న తారలతో, సింఫుల్ బడ్జెట్ తో ఎలాంటి సినిమా తీస్తే వర్కవుట్ అవుతుందో దర్శకుడు అలాంటి సినిమానే తీశాడు. ఇది సేఫ్ ప్రాజెక్ట్. ప్రేక్షకులను రెండున్నర గంటలు ఎంటర్ టైన్ చేసే మూవీ.


ఫైనల్ గా చెప్పాలంటే.. మంచి సినిమా చూపించారు. ఆలస్యమెందుకు? చూసేస్తే కాసేపు అన్నీ మర్చిపోయి హాయిగా ఎంజాయ్ చేయొచ్చు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !