చిత్రం - సిఎస్ఐ సనాతన్
నటీనటులు - ఆది సాయి కుమార్, మిషా నారంగ్, నందిని రాయ్, తారక్ పొన్నప్ప, వాసంతి, సంజయ్ రెడ్డి, మధుసూధన్ రావు, అలీ రెజా, ఖయ్యూమ్, శివ కార్తీక్, వికాస్, రవి ప్రకాష్, భూపాల్ రాజు తదితరులు
దర్శకుడు - శివశంకర్ దేవ్
నిర్మాతలు - అజయ్ శ్రీనివాస్
సంగీత దర్శకులు - అనీష్ సోలమన్
సినిమాటోగ్రఫీ - గంగన్మోని శేఖర్
ఎడిటర్ - అమర్ రెడ్డి
ఆది సాయికుమార్ హీరోగా నటించిన థ్రిల్లర్ 'సిఎస్ఐ సనాతన్'. ఈ సినిమా ట్రైలర్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. ఈ రోజు (10.3.2023) థియేటర్స్ కి వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది... ఆడియన్స్ ని మెప్పిస్తుందా అనే విషయాన్ని రివ్య్వూ ద్వారా తెలుసుకుందాం.
కథ
విక్రమ్ చక్రవర్తి(తారక్ పొన్నప్ప) పాపులర్ ఫైనాన్స్ కంపెనీ సీఈఓ. అతను అనుమానాస్పదంగా హత్యకు గురవుతాడు. ఈ ప్రముఖ వ్యక్తిని చంపింది ఎవరు? అనే ఇన్వెస్టిగేషన్ పోలీస్ డిపార్ట్ మెంట్ చేస్తుంది. ఈ కేసు సనాతన్(ఆది సాయి కుమార్) క్రైమ్ సీన్ ఇవెస్టిగేషన్(సిఎస్ఐ) లో వర్క్ చేస్తున్న స్పెషలిస్ట్ అయిన తన దగ్గరకి వెళ్తుంది. మరి ఈ మర్డర్ మిస్టరీని సనాతన్ సాల్వ్ చేశాడా లేదా? ఈ ఇన్వెస్టిగేషన్ లో హీరోయిన్ పాత్ర ఏంటి? తదితర అంశాలతో ఈ సినిమా సాగుతుంది.
నటీనటుల పెర్ ఫామెన్స్
ఆది సాయికుమార్ ఇప్పటివరకూ తన ప్రతి చిత్రంలోనూ చక్కగా నటించి పేరు తెచ్చుకోవడానికి తనవంతు కృషి చేస్తూనే ఉన్నాడు. ఈ సినిమాలో కూడా సిఎస్ఐ సనాతన్ పాత్రలో చక్కగా నటించాడు. సీరియస్ రోల్ కావడంతో తన పాత్రలో లీనమై పాలీడ్ పెర్ఫామెన్స్ తో వావ్ అనిపించేలా నటించాడు. బిగ్ బాస్ ఫేమ్ ఆలీ రెజా కి ఈ చిత్రంలో మంచి పాత్ర దక్కింది. ఈ సినిమా అలీ రెజాకి మంచి గుర్తింపు తెచ్చిపెడుతుంది. నందిని రాయ్, రవి ప్రకాష్ తమ పాత్రలకి న్యాయం చేశారు. మిగతా నటీనటులందరూ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.
సాంకేతిక వర్గం
డైరెక్టర్ శివశంకర్ దేవ్ చక్కటి స్టోరీ లైన్ ని తీసుకున్నారు. అయితే స్క్రీన్ ప్లే విషయంలో ఇంకొంచెం కేర్ తీసుకుని ఉంటే, సినిమాని ఇంకా ఆసక్తిగా ఆవిష్కరించే అవకాశం ఉండేది. సంగీతం, సినిమాటోగ్రఫీ బాగున్నాయి. డైలాగ్స్ ఫర్వాలేదు. ఎడిటింగ్ బాగుంది. నిర్మాణపు విలువలు బాగున్నాయి.
ఫిల్మీబజ్ విశ్లేషణ
ఈ సినిమాలో కొన్ని ఇన్వెస్టిగేషన్ సీన్స్ అయితే ఆసక్తిగా అనిపిస్తాయి. కొన్ని ట్విస్ట్ లు ఇంప్రెస్ చేస్తాయి. అయితే ఇలాంటి థ్రిల్లర్ సినిమాలకు ఎంగేజింగ్ స్ర్కీన్ ప్లే చాలా ముఖ్యం. ఈ విషయంలో కేర్ తీసుకుని ఉంటే, ఈ సినిమా ఇంకా బాగుండేది. ఆది సాయి కుమార్ తన ప్రామిసింగ్ నటనతో ఆడియన్స్ ని కట్టిపడేస్తాడు. ఓవరాల్ గాచెప్పాలంటే... థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చుతుంది. ఈ వీకెండ్ ఈ సినిమాతో ఎంగేజ్ అవ్వచ్చు.
ఫిల్మీబజ్ రేటింగ్ - 3/5