View

Tommy Movie Review

Friday,March13th,2015, 08:10 AM

చిత్రం - టామి
బ్యానర్ - బాబు పిక్చర్స్
నటీనటులు - డా. రాజేంద్రప్రసాద్, సీత, సురేష్, సూర్య, ఎల్.బి.శ్రీరాం, దీపక్, ముంతాజ్, ఆలపాటి లక్ష్మీ తదితరులు
సంగీతం - చక్రి
రచన - రాజేంద్రకుమార్
పాటలు - అనంత శ్రీరామ్
సినిమాటోగ్రఫీ - మోహన్
నిర్మాతలు - హరిబాబు చేగొండి, బోనం చినబాబు
సమర్పణ - చేగొండి హరిరామజోగయ్య
స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - రాజా వన్నెంరెడ్డి

కథలో ప్రత్యేకత ఉండి, తన పాత్ర వైవిధ్యభరితంగా ఉంటేనే రాజేంద్రప్రసాద్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. అలా ఇటీవల ఆయన చేసిన చిత్రాలు 'ఆ నలుగురు', 'మీ శ్రేయోభిలాషి', 'ఓనమాలు'. ప్రస్తుతం ఆయన నటించిన చిత్రం 'టామి'. ఇందులో కుక్క కూడా ప్రధాన పాత్ర పోషించింది. రాజేంద్రప్రసాద్, కుక్క మధ్య సాగే కథతో ఈ సినిమా ఆసక్తికరంగా ఉంటుందని ఈ చిత్ర నిర్మాత హరిరామజోగయ్య చెబుతూ వస్తున్నారు. ఈ చిత్రానికి రాజా వన్నెంరెడ్డి దర్శకత్వం వహించారు. కుటుంబ సభ్యులందరూ కలిసి చూసే విధంగా సినిమాలు చేసే రాజా వన్నెంరెడ్డి, రాజేంద్రప్రసాద్ కలయిలో రూపొందిన 'టామి' ఎలా ఉందనే విషయాన్ని తెలుసుకుందాం.

కథ
కాలేజ్ లెక్చరర్ అయిన రాజేంద్రప్రసాద్ కి రైల్వే స్టేషన్ లో ఓ చిన్న కుక్క తారసపడుతుంది. ఆ కుక్క రాజేంద్రప్రసాద్ ని వెంబడించడంతో అది ఎవరి కుక్క అని వాకబు చేస్తాడు. అది ఎవరిదీ కాదని తెలియడంతో తనతో పాటు ఇంటికి తీసుకెళతాడు రాజేంద్రప్రసాద్. కానీ రాజేంద్రప్రసాద్ భార్య సీతకు కుక్కలంటే అసలు ఇష్టముండదు. దాంతో తన భార్యకు తెలీకుండా కుక్కని దాచి పెంచుతుంటాడు. దానికి 'టామి' అని పేరు పెడతాడు. ఓ రోజు భార్యకు ఈ విషయం తెలిసిపోతుంది. తన భర్తకు, ఆ కుక్కకు మధ్య ఏర్పడిన అనుబంధాన్ని చూసి, రాజేంద్రప్రసాద్ భార్య కూడా కుక్కను ఇంట్లో పెంచడానికి అంగీకరిస్తుంది. ఆ కుక్క రాజేంద్రప్రసాద్ పనులన్నీ చేస్తుంటుంది. రోజూ రాజేంద్రప్రసాద్ తో కలిసి రైల్వే స్టేషన్ కి వెళ్లి సెండాఫ్ ఇచ్చి వస్తుంటుంది. మళ్లీ రాజేంద్రప్రసాద్ ని రిసీవ్ చేసుకుంటుంది. ఎప్పుడూ రాజేంద్రప్రసాద్ తో బంతి ఆట ఆడని ఆ కుక్క... ఆ రోజు బంతి ఆట ఆడి రాజేంద్రప్రసాద్ ని కాలేజ్ కి వెళ్లనివ్వకుండా చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. కానీ దానితో బంతి ఆట ఆడి, తర్వాత రాజేంద్రప్రసాద్ కాలేజ్ కి వెళ్లిపోతాడు. అలా వెళ్లిన ప్రసాద్ మళ్లీ తిరిగిరాడు. తిరిగిరాని మాస్టర్ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది కుక్క. అనుకోకుండా మాస్టర్ కుటుంబానికి కూడా టామి దూరమవుతుంది. తన మాస్టర్ చనిపోయాడనే విషయం ఆ కుక్కకు తెలీక రైల్వే స్టేషన్ లో ఎదురుచూస్తుంటుంది. అలా ఎదురుచూస్తున్న టామి కథ ఎలా ముగుస్తుందనే ఆసక్తికరమైన క్లయిమ్యాక్స్ తో ఈ చిత్రం రూపొందింది.

నటీనటుల పెర్ ఫామెన్స్
నటకిరీటి డా. రాజేంద్రప్రసాద్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మంచి కథ, తన పాత్రకు నటించగల స్కోప్ ఉండాలేగానీ రాజేంద్రప్రసాద్ విజృంభించేస్తారు. ఈ సినిమాలో కాలేజ్ లెక్చరర్ గా, కుక్కను ప్రేమించే వ్యక్తిగా అద్భుతంగా నటించారు రాజేంద్రప్రసాద్. ఇక మిగతా పాత్రధారులు సీత, ఎల్.బి.శ్రీరాం, సురేష్, సూర్య తమ పాత్రల పరిధిమేరకు నటించారు. రాజేంద్రప్రసాద్ కూతురు, అల్లుడిగా నటించిన దీపక్, ముంతాజ్ ఫర్వాలేదనిపించుకున్నారు.

సాంకేతిక వర్గం
చక్రి ఈ చిత్రానికి సంగీతం అందించారు. పాటలు సందర్భోచితంగా సాగుతాయి. రీ-రికార్డింగ్ బాగుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఇది సున్నితమైన కథ. ఈ కథ అటు చిన్న పిల్లలను, పెద్ద వాళ్లను ఇంప్రెస్ చేసే విధంగా తెరకెక్కించాలి. అది కూడా కుక్క, రాజేంద్రప్రసాద్ మధ్య వచ్చే సెంటిమెంట్ సీన్స్ ని సరిగ్గా ఎలివేట్ చేయగలగాలి. అలాగే వినోదం మిస్ అవ్వకూడదు. ఆ విషయంలో డైరెక్టర్ రాజా వన్నెంరెడ్డి పూర్తి న్యాయం చేసారు. కథకు సరిపడా బడ్జెట్ సమకూర్చారు నిర్మాత.

ఫిల్మీబజ్ విశ్లేషణ
ఈ సినిమాకి టైటిల్ చాలా ప్లస్. టైటిల్ ని బట్టి సినిమా జానర్, కథ ఎలా ఉంటుంది? అని ఊహించలేరు. దాంతో ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకులు థియేటర్ కి వెళతారు. ఇది సినిమాకి ప్లస్ అయ్యే అవకాశముంది. రాజేంద్రప్రసాద్ ఈ సినిమాలో నటించడం ఓ బలం. టామి, రాజేంద్రప్రసాద్ పాత్ర మధ్య వచ్చే సెంటిమెంట్స్ సీన్స్ చిన్నపిల్లలకు, పెద్దవాళ్లకు కూడా కనెక్ట్ అవుతాయి.ముఖ్యంగా రాజేంద్రప్రసాద్ చనిపోయాడనే విషయం తెలీక, తన రాక కోసం టామి రైల్వే స్టేషన్ లో వెయిట్ చేయడంలాంటి సీన్స్ కంటతడి పెట్టించే విధంగా ఉన్నాయి. ఈ మధ్య యాక్షన్, సస్పెన్స్ థ్రిల్లర్స్, లవ్ సబ్జెక్ట్ తో వస్తున్న సినిమాలను పిల్లలకు చూపించడానికి తల్లిదండ్రులు ఇష్టపడటంలేదు. వాటి ప్రభావం తమ పిల్లలపైన పడుతుందనే భయం ఉంటోంది. కానీ ఈ సినిమాని పిల్లలకు చక్కగా చూపించొచ్చు. వారు చాలా ఎంజాయ్ చేస్తారు. పెద్దలకు నచ్చే చిత్రం ఇది. అయితే ఇలాంటి సినిమాలకు పబ్లిసిటీ చాలా అవసరం. సినిమాని తెరపైకి తీసుకు వచ్చిన నిర్మాతలు.. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాలంటే ప్రమోషనల్ యాక్టివిటీస్ పెంచాలి. సినిమా బాగుంది కాబట్టి, ప్రమోట్ చేస్తే, నిలబడుతుంది. అలాగే సినిమా రిలీజ్ టైం కూడా కరెక్ట్ గా ఉండాలి. ఇప్పుడు పిల్లలకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇది ఈ సినిమాకి కొంత మైనస్ అయ్యే అవకాశం ఉంది. సమ్మర్ హాలీడేస్ ఇచ్చిన తర్వాత ఈ సినిమాని విడుదల చేసి, మంచి పబ్లిసిటీ ఇస్తే, వసూళ్లు బాగా దక్కే అవకాశం ఉండేది. ఇలాంటి సినిమాలు మౌత్ టాక్ తోనే నిలబడాలి. బడ్జెట్ తక్కువ కాబట్టి కరెక్ట్ టైమ్ లో విడుదలై ఉంటే సేఫ్ ప్రాజెక్ట్ అయ్యుండేది. మరి ఇప్పుడు ఎగ్జామ్స్ టైమ్ కాబట్టి, ఈ సినిమా ఏ మేరకు బాక్సాఫీస్ వద్ద నిలబడగలుగుతుందనేది వేచి చూడాల్సిందే. పిల్లలు బుల్లితెరకు అతుక్కుపోవాల్సి వస్తోంది. టామ్ అండ్ జెర్రీ, స్పైడర్ మ్యాన్ లాంటి టివి షోస్ కు పరిమితమైపోతున్నారు. ఇలాంటి సినిమాలు రావడం వల్ల ఓ రెండున్నర గంటలపాటు తమ పిల్లలను బయటికి తీసుకెళ్లి తల్లిదండ్రులు కూడా ఎంజాయ్ చెయ్యొచ్చు.

ఫైనల్ గా చెప్పాలంటే.. 'టామి' మంచి సినిమా. వీలు చేసుకుని ఒక్కసారి కుటుంబంతో సహా చూడొచ్చు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !