చిత్రం - ఎందుకో ఏమో
నటీనటులు - నందు, నోయల్, పోసాని, సూర్య, సుడిగాలి సుధీర్, నవీన్, రాకెట్ రాఘవ తదితరులు
సంగీతం - ప్రవీణ్
కెమెరా - జి.యస్.రాజ్ (మురళి)
ఎడిటింగ్ - మధు
నిర్మాత - మాలతి వద్దినేని
కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - కోటి వద్దినేని
నందు, నోయల్, పునర్నవి హీరోహీరోయిన్లుగా మహేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై కోటి వద్దినేని దర్శకత్వంలో మాలి వద్దినేని నిర్మిస్తోన్న చిత్రం 'ఎందుకో ఏమో'. లవ్ స్టోరీకి ఛాలెంజింగ్ ఎలిమెంట్స్ ని మిక్స్ చేసి డిఫరెంట్ వేలో తెరకెక్కించిన ఈ చిత్రం థియేటర్స్ కి వచ్చింది. మరి ఈ సినిమా ఆడియన్స్ ని మెప్పించే విధంగా ఉందా తెలుసుకుందాం.
కథ
లైఫ్ లో చక్కగా సెటిల్ అవ్వాలనే టార్గెట్ తో ముందుకెళుతున్న సాఫ్ట్ వేర్ కుర్రాడు కార్తీక్ (నందు). ఈ కుర్రాడికి హారిక (పునర్నవి) పరిచయమవుతుంది. ఇద్దరు ప్రేమలో పడతారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. కానీ సీన్ రివర్స్ అవుతుంది.
అమ్మాయిలతో లైఫ్ ని ఫుల్ గా ఎంజాయ్ చేయాలనుకునే మనస్తత్వం కలవాడు ప్రిన్స్ (నోయల్). అమ్మాయిలను లోబర్చుకుని, వాడుకుని వదిలేస్తుంటాడు.కట్ చేస్తే...
ప్రిన్స్, కార్తీక్ స్నేహితులు. హారికను చూసిన ప్రిన్స్ ఆమెపై మోజు పడతాడు. హారికను ఎలాగైనా తన వశం చేసుకోవాలని ప్లాన్ చేస్తాడు ప్రిన్స్. ఇందుకోసం కార్తీక్ తో ఓ ఛాలెంజ్ చేస్తాడు. ఆ ఛాలెంజ్ విని ఫ్రెండ్స్ సైతం షాక్ అవుతారు.
అసలు కార్తీక్ తో ప్రిన్స్ చేసిన ఛాలెంజ్ ఏంటీ.. ఫైనల్ గా కార్తీక్, హారిక ప్రేమ గెలిచిందా.. లేక ప్రిన్స్ ప్లాన్ తో హారిక అతని వలలో చిక్కుకుందా... హారికను ఎందుకు ప్రిన్స్ దక్కించుకోవాలనుకున్నాడు... తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటుల పెర్ ఫామెన్స్...
నందు ఇలాంటి పాత్రలు చేసాడు. కాకపోతే ఈ సినిమాలో డిఫరెంట్ ఛాలెంజ్ ని ఎదుర్కొనే కుర్రాడిగా చేసిన పాత్ర చాలా బాగుంది. నటనకు స్కోప్ ఉన్న పాత్ర. ఈ పాత్రలో నందు బాగా నటించాడు. నెగటివ్ షేడ్ రోల్ ని చేసిన నోయల్ ఈ సినిమాకి చాలా ప్లస్. కార్తీక్, ప్రిన్స్ పాత్రలు పోటాపోటీగా సాగుతాయి. ఎమోషనల్ సీన్స్, క్లయిమ్యాక్స్ సీన్ లో క్కటి పెర్ ఫామెన్స్ కనబర్చింది పునర్నవి. సుడిగాలి సుధీర్ కామెడీ చాలా బాగుంది. ముఖ్యంగా సుధీర్, పోసాని కాంబినేషన్ కామెడీ సీన్స్ చాలా బాగున్నాయి. మిగతా నటీనటులందరూ తమ పాత్రల పరిధిమేరకు నటించారు.
టెక్నికల్ గా...
దర్శకుడు కోటి ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఫస్ట్ సినిమా అయినప్పటికీ సెటిల్డ్ గా సినిమాని తెరకెక్కించారు. ఎక్కడా తడబాటు కనిపించలేదు. ఛాలెంజింగ్ స్టోరీ లైన్ కి చక్కటి సన్నివేశాలను సమకూర్చుకుని సినిమాని ఆసక్తిగా నడిపించారు. ప్రవీణ్ సమకూర్చిన పాటలు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. శేఖర్ చంద్ర బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి హైలైట్. క్వాలిటీ పరంగా నిర్మాతలు కాంప్రమైజ్ అవ్వలేదు. విజువల్ గా కూడా సినిమా సూపర్.
ఫిల్మీబజ్ విశ్లేషణ...
లవ్ స్టోరీ అయినప్పటికీ, అండర్ కరెంట్ గా సమాజంలో జరుగుతున్న కొన్ని యాంటీ ఎలిమెంట్స్ ని సినిమాలో చూపించి సినిమాకి ఓ వ్యాల్యూని తెచ్చిపెట్టారు డైరెక్టర్. ప్రతి సీన్ ని పక్కాగా ప్లాన్ చేసుకుని, బోర్ కొట్టకుండా సినిమాని నడిపించారు. సెకండాఫ్ లోని ట్విస్ట్ లు ఆడియన్స్ ని థ్రిల్ కు గురి చేస్తాయి. మరికొన్ని లవ్ సీన్స్ ఉంటే యూత్ ఇంకా బాగా ఎంజాయ్ చేసేవారు. కామెడీ పార్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి, అన్ని వర్గాల ఆడియన్స్ సినిమాని ఎంజాయ్ చేస్తారు. సో.. డోంట్ మిస్ ఇట్... టైమ్ పాస్ అయిపోతుంది.
ఫిల్మీబజ్ రేటింగ్ - 3/5