View

గాలి సంపత్ మూవీ రివ్య్వూ

Thursday,March11th,2021, 06:10 AM

చిత్రం - గాలి సంపత్
నటీనటులు - నటకిరీటి రాజేంద్రప్రసాద్, శ్రీవిష్ణు, లవ్ లీ సింగ్, తనికెళ్ల భరణి, సత్య, రఘుబాబు, శ్రీకాంత్ అయ్యంగార్, మిర్చి కిరణ్, సురేంద్ర రెడ్డి, గగన్, మిమ్స్ మధు, అనీష్ కురువిల్లా, రజిత, కరాటే కళ్యాణి, సాయి శ్రీనివాస్, రూపల‌క్ష్మి తదితరులు
కథ - ఎస్ క్రిష్ణ
రచ‌నా స‌హ‌కారం - ఆదినారాయ‌ణ‌
సినిమాటోగ్ర‌ఫి - సాయి శ్రీ రామ్‌
సంగీతం - అచ్చురాజ‌మ‌ణి
ఎడిట‌ర్‌ - త‌మ్మిరాజు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌ - నాగ‌మోహ‌న్ బాబు. ఎమ్‌
మాట‌లు - మిర్చికిర‌ణ్‌
నిర్మాణం - ఇమేజ్ స్పార్క్ ఎంటర్ టైన్మెంట్, షైన్ స్క్రీన్స్
నిర్మాత‌ - ఎస్. క్రిష్ణ‌
స్క్రీన్ ప్లే, సమ‌ర్ప‌ణ‌, దర్శకత్వ పర్యవేక్షణ - అనిల్ రావిపూడి
ద‌ర్శ‌క‌త్వం - అనీష్


నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్ టైటిల్ రోల్ పోషించగా, ఆయన కొడుకుగా శ్రీవిష్ణు నటించిన చిత్రం 'గాలి సంపత్'. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సమర్పకుడిగా వ్యవహరించడంతో పాటు స్ర్కీన్ ప్లే, దర్శకత్వ పర్యవేక్షణ వహించడంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. అనీష్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం టీజర్స్, పోస్టర్స్, ట్రైలర్స్ కి మంచి స్పందన రావడంతో సినిమాకి హైప్ నెలకొంది. ఈ రోజు (11.3.2021) ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదలయ్యింది. మరి అందరి అంచనాలకు తగ్గట్టు ఈ సినిమా ఎలా ఉందో రివ్య్వూ ద్వారా తెలుసుకుందాం.


కథ
శ్రీవిష్ణుకు తన తండ్రి గాలి సంపత్ (రాజేంద్రప్రసాద్) తో కొన్ని విభేదాలు ఉంటాయి. ఆయన రెస్పాన్స్ బులిటీగా లేకపోవడం వల్ల తన జీవితం ఇబ్బందులపాలవుతోందనే ఆలోచనలో ఉంటాడు శ్రీవిష్ణు. తను ప్రేమించిన సర్పంచ్ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి లైన్ క్లియర్ చేసుకుంటాడు విష్ణు. కానీ తండ్రి గాలి సంపత్ వల్ల తన ప్రేమ వ్యవహారం చెడిపోతుంది. పెళ్లి వరకూ వెళ్లదు. ఓ ట్రక్ కొనుక్కుని జీవితంలో స్థిరపడటానికి చేసుకున్న ప్లాన్ కూడా తండ్రి వల్ల బెడిసికొడుతుంది. దాంతో తండ్రి మీద ఫైర్ అవుతాడు. కొడుకు మీద విపరీతమైన ప్రేమ ఉన్న గాలి సంపత్ హర్ట్ అవుతాడు. ఆ ఆవేదనలో ఉన్న గాలి సంపత్ తన ఇంటి ముందు తవ్వి ఉన్న పెద్ద గుంతలో పడిపోతాడు. ఆ గుంతలో నుంచి ఎలా బయటికి రావాలో తెలీదు. ఎందుకంటే ఓ సందర్భంలో జరిగిన ప్రకృతి విలయతాండవం వల్ల గాలి సంపత్ తన భార్యను పోగొట్టుకోవడంతో పాటు గొంతును సైతం పోగొట్టుకుంటాడు. దాంతో అరవలేడు. తన తండ్రి కనపడకపోవడం, తన తండ్రికి తన మీద ఎంత ప్రేమ ఉందన్న సంగతి తెలుసుకోవడంతో శ్రీవిష్ణు తండ్రి కోసం మదనపడిపోతుంటాడు. తండ్రిని వెతికిపట్టుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తుంటాడు. గుంతలో పడిన గాలి సంపత్ బయటికి వస్తాడా లేడా... తండ్రి గుంతలోనే పడిపోయాడన్న విషయం కొడుకు తెలుస్తుందా అనేదే తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.


నటీనటుల పెర్ ఫామెన్స్
నటకిరిటీ రాజేంద్రప్రసాద్ గొంతు పోగొట్టుకున్నవాడిగా, కొడుకు మీద వీపరీతమైన ప్రేమ పెంచుకున్నవాడిగా, కళల మీద తనకున్న ఆసక్తిని కనబర్చేవాడిగా పలు రకాల షేడ్స్ ఉన్న గాలి సంపత్ పాత్రను అలవోకగా పోషించారు. మరోసారి తన నట విశ్వరూపాన్ని చాటుకున్నారు. తండ్రి మీద ప్రేమ ఉన్న కొడుకుగా, తండ్రి వల్ల తన జీవితం ఇబ్బందులపాలవుతుందన్న కారణంగా కోపం. అసహనం ప్రదర్శించే కొడుకుగా శ్రీవిష్ణు నటన సూపర్బ్. హీరోయిన్ లవ్ లీ సింగ్ బాగుంది. తనికెళ్లభరణి, సత్య, ఇఘుబాబు, శ్రీకాంత్ అయ్యంగార్, అనీష్ కురువిల్లా, మిర్చి కిరణ్ తదితరులు తమ పాత్రల పరిధిమేరకు నటించారు.


సాంకేతిక వర్గం
అచ్చు రాజమణి అందించిన పాటలు బాగున్నాయి. ముఖ్యంగా 'ఫిఫిఫీ...' ఈ సినిమా జానర్ కి యాఫ్ట్ గా ఉంది. సెకండాఫ్ లోని కొన్ని సీన్స్ కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగా కుదిరింది. దాంతో ఆడియన్స్ సీన్స్ లో ఇన్ వాల్వ్ అవుతారు. సాయి శ్రీరామ్ ఫోటోగ్రఫీ బాగుంది. షార్ప్ కటింగ్ తో ఎక్కడా బోర్ కొట్టకుండా సినిమా చాలా ఫాస్ట్ గా పూర్తయిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. కథకు సరిపడా ఖర్చు పెట్టారు నిర్మాత. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. డైరెక్టర్ అనీష్, స్టోరీ రైటర్ యస్.కృష్ణతో ఈ చిత్రం స్టోరీ లైన్ ని రెడీ చేసారు. చక్కటి స్టోరీ లైన్ కి డైరెక్టర్ అనిల్ రావిపూడి అందించిన స్ర్కీన్ ప్లే, మాటలు సూపర్బ్. ఈ సినిమాకి స్ర్కీన్ ప్లే హైలైట్. కొన్ని డైలాగ్స్ మనసును హత్తుకుంటాయి.


విశ్లేషణ
నటకిరీటి రాజేంద్రప్రసాద్ నటన ఆడియన్స్ ని సినిమాలో లీనమయ్యేలా చేస్తుంది. కొన్ని సీన్స్ రాజేంద్రప్రసాద్ పై సింపితీని క్రియేట్ చేస్తాయి. సత్య, అనీష్ కురివిల్లా సీన్స్ నవ్వులు తెప్పిస్తాయి. ప్రకృతి వైపరీత్యాల వల్ల కొన్ని ఇబ్బందులు జనాలు ఎదుర్కొన్నా, అదే ప్రకృతి వల్ల మనుషులకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయనే మేసేజ్ బాగుంది. తండ్రి, కొడుకుల మధ్య వచ్చే సీన్స్ బాగున్నాయి. రాజేంద్రప్రసాద్ నటన, కొన్ని ఏమోషనల్ సీన్స్ ఆడియన్స్ ని మెప్పిస్తాయి. సో... డోంట్ మిస్ ది మూవీ.


ఫిల్మీబజ్ రేటింగ్ 3.25/5Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Read More !