View

జెంటిల్ మన్ మూవీ రివ్య్వూ

Friday,June17th,2016, 09:52 AM

చిత్రం - జెంటిల్ మన్
బ్యానర్ - శ్రీదేవి మూవీస్
నటీనటులు - నాని, సురభి, నివేదా థామస్, అవసరాల శ్రీనివాస్, తనికెళ్ల భరణి, వెన్నెల కిశోర్, ఆనంద్, రోహిణి, రాజశ్రీ నాయర్, శ్రీముఖి, రమాప్రభ, ప్రగతి, సత్యం రాజేష్ తదితరులు
కథ - డేవిడ్ నాథన్
సంగీతం - మణిశర్మ
కెమెరా - పి.జి.విందా
ఎడిటింగ్ - మార్తాండ్.కె.వెంకటేష్
నిర్మాత - శివలెంక కృష్ణప్రసాద్
అడిషనల్ స్టోరీ, మాటలు, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - మోహన్ కృష్ణ ఇంద్రగంటి


భలే భలే మగాడివోయ్, కృష్ణగాడి వీరప్రేమగాధ అంటూ వరుసగా సక్సెస్ ఫుల్ చిత్రాలు చేసిన హీరో నాని ప్రస్తుతం చేసిన చిత్రం 'జెంటిల్ మన్'. మోహ‌à°¨‌కృష్ణ ఇంద్ర‌à°—à°‚à°Ÿà°¿ à°¦‌ర్శ‌à°•‌త్వంలో తెర‌కెక్కిన చిత్ర‌మిది. 'అష్టా చమ్మా' తర్వాత అంటే దాదాపు ఎనిమిదేళ్ల à°¤‌ర్వాత నాని, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో రూపొందిన చిత్ర‌మిది. 'ఆదిత్య 369', 'వంశానికొక్కడు' వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించిన శ్రీదేవి మూవీస్ సంస్థ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ à°ˆ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో సురభి, నివేదా థామస్ కథానాయికలుగా à°¨‌టించారు. à°ˆ రోజు (17.6.2016) à°ˆ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. à°ˆ సినిమాతో నాని హ్యాట్రిక్ హిట్ కొట్టడం ఖాయమనే అంచనాలు ఉన్నాయి. మరి à°ˆ సినిమా à°† అంచనాలను చేరుకునే విధంగా ఉందా తెలుసుకుందాం.


à°•à°¥
ఫ్లైట్ లోఈ సినిమా స్టోరీ ఆరంభమవుతుంది. లండన్, అమెరికా నుంచి ఇండియా వస్తున్న క్యాథరీన్ (నివేదా థామస్), ఐశ్వర్య (సురభి) కు ఫ్లైట్ లో పరిచయం అవుతుంది. టైమ్ పాస్ కోసం తమ ప్రేమ కథలను ఒకరికొకరు పంచుకోవాలనుకుంటారు. ముందుగా క్యాథరీన్ తన ప్రేమ కథను చెప్పడం మొదలుపెడుతుంది.


క్యాథరీన్ వి ఎఫ్ ఎక్స్ ఆర్టిస్ట్. ఆమెను ఒక పెళ్లిలో చూస్తాడు గౌతమ్ (నాని). తొలి చూపులోనే క్యాథరీన్ ని ప్రేమించడం మొదలుపెట్టిన గౌతమ్ రకరకాలుగా ఆమెను ఇంప్రెస్ చేసి ప్రేమలోకి దింపుతాడు. క్యాథరీన్ మేనమామ డేవిడ్ మాత్రం క్యాథీరన్ ని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ఉంటాడు. ఆఫీస్ పని మీద క్యాథరీన్ యు.యస్ వెళ్లాల్సి వస్తుంది. ఆమెకు సెండాఫ్ ఇచ్చి యు.యస్ పంపిస్తాడు క్యాథరీన్.


క్యాథరీన్ లవ్ స్టోరీ బాగుందని చెప్పిన ఐశ్వర్య తన ప్రేమ కథ చెప్పడం మొదలుపెడుతుంది. జై (నాని) ఒక సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్. జై గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి ఓనర్. సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ అవార్డ్ అందుకుంటున్న సమయంలో జై ని చూసిన ఐశ్వర్య (సురభి) తండ్రి అతని పట్ల చాలా ఇంప్రెస్ అవుతాడు. తన కూతురు పెళ్లి జైతో జరిపించాలని డిసైడ్ అవుతాడు. జై, ఐశ్వర్య ఒకరినొకరు కలుసుకుని రెండు రోజుల పాటు ఎవ్వరూ లేకుండా, ఎలాంటి ఐడెంటిఫికేషన్ లేకుండా దూరంగా వెళ్లి బ్రతకాలని డిసైడ్ అవుతారు. ఆ రెండు రోజుల్లో ఒకరినొకరు అర్ధం చేసుకుని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవుతారు. పెద్దలు కూడా వారికి పెళ్లి ఫిక్స్ చేస్తారు.


ఇలా ఇద్దరూ తమ ప్రేమ కథలను చెప్పుకోవడం పూర్తయ్యేసరికి హైదరాబాద్ చేరుకుంటారు. ఎయిర్ పోర్ట్ లో ఐశ్వర్యను రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన జై ని చూసి క్యాథరీన్ షాక్ అవుతుంది. ఎందుకంటే జై అచ్చు గౌతమ్ లాగా ఉంటాడు. షాక్ అయిన క్యాథరీన్ గౌతమ్ ఇంటికి వెళుతుంది. అక్కడ క్యాథరీన్ కి మరో షాక్. గౌతమ్ యాక్సిడెంట్ లో చనిపోయాడని గౌతమ్ తల్లి చెబుతుంది. కట్ చేస్తే...


గౌతమ్ ది యాక్సిడెంట్ కాదని, ఎవరో చంపేసారని ఓ రిపోర్టర్ చెప్పడం, జై మీద అనుమానంగా ఉందని, అందుకు తగ్గ ఆధారాలు ఉన్నాయిని ఆ రిపోర్ట్ చెప్పడంతో క్యాథరీన్ మరింత షాక్ అవుతుంది. గౌతమ్ డెత్ మిస్టరీని తెలుసుకోవడానికి ఐశ్వర్య సహాయంతో జై ఇండస్ట్రీస్ లో జాబ్ తెచ్చుకుంటుంది. కొన్ని ఆధారాల ద్వారా జై దుర్మార్గుడని, గౌతమ్ ని చంపింది జై అని నిర్ధారణకు వస్తుంది.


అసలు జై విలనా, హీరోనా.. జై, గౌతమ్ ఇద్దరూ ఒకరేనా, గౌతమ్ నిజంగానే చనిపోయాడా.. అతనిని ఎవరు హత్య చేసారు.. జై ని హంతకుడిగా క్యాథరీన్ నిరూపిస్తుందా.. క్యాథరీన్ బోయ్ ఫ్రెండ్ గౌతమ్ కూడా జై లా ఉంటాడని ఐశ్వర్యకు తెలుస్తుందా.. ఇలాంటి ట్విస్ట్ లతో సెకండాఫ్ సాగుతుంది.


నటీనటుల పెర్ ఫామెన్స్
జై, గౌతమ్ పాత్రలను నాని బాగా చేసాడు. న్యాచురల్ పెర్ ఫామెన్స్ తో వావ్ అనిపిస్తాడు నాని. ముఖ్యంగా క్లయిమ్యాక్స్ ఎమోషన్ సీన్ లో నాని నటన అందరినీ ఆకట్టుకుంటుంది. యాక్టింగ్ కి స్కోప్ ఉన్న పాత్ర నివేదా థామస్ ది. ప్రేమికురాలిగా, ప్రేమికుడిని పోగొట్టుకున్న అమ్మాయిలా, తన ప్రేమికుడు చావుకు కారణం తెలుసుకోవాలని తపనపడే అమ్మాయిగా నివేదా అద్భుతంగా నటించింది, సురభి గ్లామరస్ గా బాగుంది. ఐశ్వర్య పాత్రకు పూర్తి న్యాయం చేసింది. అవసరాల శ్రీనివాస్, తనికెళ్ల భరణి మిగతా నటీనటులందరూ తమ పాత్రల పరిధిమేరకు నటించారు. వెన్నెల కిషోర్, సత్యం రాజేష్ కొంతమేర నవ్వించారు.


సాంకేతిక వర్గం
సింఫుల్ స్టోరీ ని తీసుకుని చక్కటి స్ర్కీన్ ప్లేతో ఈ చిత్రాన్ని మలిచారు డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ. అక్కడక్కడ పంచ్ డైలాగులు పేలాయి. ట్విస్ట్ లతో సాగే సెకండాఫ్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. మణిశర్మ ఈ చిత్రానికి పాటలందించడంతో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. పాటలు యావరేజ్ గా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్. ఈ సినిమాకి ప్లస్ పాయింట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్. ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ బాగున్నాయి. రిచ్ విజువల్స్ తో సినిమా కలర్ ఫుల్ గా ఉంది. నిర్మాణపు విలువలు బాగున్నాయి.


ఫిల్మీబజ్ విశ్లేషణ
ఫస్టాప్ అంతా ఎంటర్ టైన్ మెంట్ వేలో సాగుతుంది. నివేదా థామస్, నాని లవ్ స్టోరీ ఇంట్రస్టింగ్ గా ఎంటర్ టైన్ మెంట్ వేలో బాగుంది. సురభి, నాని లవ్ స్టోరీ ఓ ట్రిప్ కి వెళ్లినట్టుగా ఉంటుంది. ఈ లవ్ స్టోరీ కొంచెం సాగదీసినట్టుగా ఉంటుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోయింది. సెకండాఫ్ ట్విస్ట్ లతో క్లయిమ్యాక్స్ కి చేరుకుంటుంది. చిక్కుముడులన్నీ క్లయిమ్యాక్ప్ లో ఒక్కసారిగా విప్పడంతో సినిమా పూర్తయిపోతుంది. ట్విస్ట్ లు తెలిసిపోయిన తర్వాత ఓ.. ఇంతేనా అనేంత మాములుగా ఉండటం ఆడియన్స్ ని కొంచెం నిరాశపరుస్తుంది. అలాగే క్లయిమ్యాక్స్ లో జరిగిన కథని గౌతమ్ పాత్ర క్యాథరీన్ కి చెప్పడాన్ని విజువల్ చేసి ఉంటే ఇంట్రస్టింగ్ గా ఉండేది. మొత్తం స్టోరీని క్యాథరీన్ కి ఒక్క ముక్కలో క్లయిమ్యాక్స్ లో చెప్పడంతో అప్పటిదాకా ఆసక్తి రేకెత్తించిన ట్విస్ట్ లు చప్పగా అనిపిస్తాయి. క్లయిమ్యాక్స్ వీక్ అనిపిస్తుంది. ఏదేమైనా రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నమైన సినిమా. డిఫరెంట్ సినిమాలను కోరుకునేవారికి బాగా నచ్చుతుంది. ముఖ్యంగా మల్టీప్లెక్స్ ఆడియన్స్ కి ఈ సినిమా బాగా కనెక్ట్ అయ్యే అవకాశముంది. హీరోయిన్లు ఇద్దరూ గ్లామర్ గా ఉన్నారు. నాని నటన ఓ హైలైట్. ఓవర్ సీస్ ఆడియన్స్ ని కూడా ఈ సినిమా ఇంప్రెస్ చేసే అవకాశముంది.


ఫైనల్ గా చెప్పాలంటే ఈ జెంటిల్ మన్ ని ఒకసారి చూసి ఎంజాయ్ చెయ్యొచ్చు. ఇక కమర్షియల్ గా ఈ సినిమా ఎంతవరకూ వర్కవుట్ అవుతుందో వేచి చూడాల్సిందే.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !