View

గౌతమ్ నంద మూవీ రివ్య్వూ

Friday,July28th,2017, 06:06 AM

చిత్రం - గౌతమ్ నంద
బ్యానర్ - శ్రీ బాలాజీ సినీ మీడియా
నటీనటులు - గోపీచంద్, హన్సిక, క్యాథరీన్ థెరిస్సా, సచిన్ కేడ్కర్, ముఖేష్ రుషి, నికితన్ ధీర్, తనికెళ్ల భరణి, సీత, అజయ్, అన్నపూర్ణ, బిత్తరి సత్తి, వెన్నెల కిషోర్ తదితరులు
సినిమాటోగ్రఫీ - యస్.సౌందర్ రాజన్
సంగీతం - యస్.యస్.తమన్
నిర్మాతలు - జె.భగవాన్, జె.పుల్లారావు
కథ, స్ర్కీన్ ప్లే, మాటలు, దర్శకత్వం - సంపత్ నంది


మ్యాచో హీరో గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావు సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'గౌతమ్ నంద'. స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఈ రోజు (28.7.2017) ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యింది. ఈ సినిమాలో గోపీచంద్ సరసన క్యాథరీన్, హన్సిక జంటగా నటించారు. స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాలతో విడుదలయ్యింది. మరి ఆ అంచనాలను చేరుకునే విధంగా ఈ సినిమా ఉందా తెలుసుకుందాం.


à°•à°¥
ఫోర్బ్స్ లిస్ట్ లో స్థానం సంపాదించుకున్న తెలుగు బిలియనీర్ ఘట్టమనేని విష్ణు ప్రసాద్ (సచిన్ఏ కేడ్కర్) తనయుడు ఘట్టమనేని గౌతమ్ (గోపీచంద్). గోల్డన్ స్పూన్ తో పుట్టిన గౌతమ్ కి ఆకలి, కన్నీళ్లు, బాధ.. ఇలా ఏ ఎమోషన్ తెలీదు. వీటితో పాటు ప్రేమ అనే ఎమోషన్ కూడా తెలీకుండానే డబ్బుల్లో పెరుగుతాడు గౌతమ్. లైఫ్ ని ఎంజాయ్ చేయడం, తల్లిదండ్రులతో ఫోన్ లో మాట్లాడటం, ఆయమ్మ, సర్వెంట్ ల సపర్యల్లో జీవితాన్ని గడిపేస్తుంటాడు. ఫ్రెండ్స్ తో పార్టీలు, విదేశాలను చుట్టిరావడం ఇదే గౌతమ్ కి తెలిసిన ప్రపంచం, ఇలా లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న గౌతమ్ ఓ పార్టీలో సర్వర్ (తనికెళ్ల భరణి) వల్ల కలిగిన చిన్న ఇన్ కన్వీన్స్ కి వయసులో పెద్దవాడు అని కూడా చూడకుండా చెంప పగలకొడతాడు. కానీ చెంపదెబ్బ తిన్న సర్వర్ 'అసలు నువ్వెవరో నీకు తెలుసా.. నేను సర్వర్ ని... మరి నీ కేరాఫ్ ఏంటీ.. విష్ణు ప్రసాద్ కొడుకు కాకపోతే నువ్వేంటీ' అని అడిగిన ప్రశ్నగౌతమ్ మనసులో బలంగా నాటుకుపోతుంది. అదే ఆలోచనతో గమ్యం తెలీకుండా ప్రయాణిస్తున్న గౌతమ్ చనిపోదామనుకుంటాడు. అదే సమయంలో అచ్చు గౌతమ్ లా ఉండే మిడిల్ క్లాస్ కుర్రాడు నంద కిషోర్ (గౌతమ్ నంద) కూడా ట్రక్కు కిందపడి సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తాడు. స్పీడ్ గా కారును డ్రైవ్ చేస్తున్న గౌతమ్ కారు కింద పడతాడు నందకిషోర్. అచ్చు ఒకేలా ఉన్న గౌతమ్, నందకిషోర్ ఒకరి ప్రాబ్లమ్ మరొకరు చెప్పుకుని స్థానాలు మార్చుకుంటారు, నందు బిలీయనీర్ విష్ణుప్రసాద్ కొడుకు స్థానంలోకి, నంద స్థానంలోకి గౌతమ్ వెళతారు. నందు కుటుంబం పడుతున్న కష్టాలు తెలుసుకున్న గౌతమ్ ఉద్యోగంలో చేరి ఆ కుటుంబాన్ని కాపాడాలనుకుంటాడు. డబ్బులు లేకపోయినా, ఆ కుటుంబ సభ్యులు చూపించే ప్రేమ, ఆదరణ చూసిన తర్వాత వారితో సెంటిమెంటల్ అటాచ్ మెంట్ పెంచుకుంటాడు గౌతమ్. మరోవైపు డబ్బు ఉంటే జీవితం ఎలా ఉంటుందో నందకిషోర్ స్వయంగా చవిచూస్తుంటాడు. దీని వల్ల నందకిషోర్ మైండ్ లో ఎలాంటి ఆలోచనలు చోటు చేసుకుంటాయి... పర్మినెంట్ గా గౌతమ్ స్థానంలో ఉండటానికి నందకిషోర్ ఎలాంటి కుట్రలు పన్నుతాడు... నందకిషోర్ కుట్ర నుంచి బయటపడి, బిలీయనీర్ విష్ణుప్రసాద్ కొడుకుగా గౌతమ్ తన ఇంట్లోకి అడుగుపెడతాడా తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.


నటీనటుల పెర్ ఫామెన్స్
మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్స్ లో ఒదిగిపోయే హీరోగా తనకంటూ ఓ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు గోపీచంద్. ఈ సినిమాలో బిలీయనీర్ కొడుకు గౌతమ్ గా, మిడిల్ క్లాస్ కుటుంబానికి చెందిన నందకిషోర్ గా ఆ పాత్రలకు పూర్తి న్యాయం చేసాడు గోపీచంద్. ఈ రెండు పాత్రల కోసం బాడీ లాంగ్వేజ్ లో చేసిన మార్పులు సూపర్బ్. బిలీయనీర్ గౌతమ్ గా స్టైలిష్ లుక్, మిడిల్ క్లాస్ నందకిషోర్ గా మాస్ లుక్ తో అలరించాడు గోపీచంద్. నంద పాత్రలోని నెగటివ్ షేడ్ ని కూడా అద్భుతంగా ఆవిష్కరించాడు గోపీచంద్. రెండు పాత్రల మధ్య వేరియేషన్ చూపించాడు. హన్సిక పాత్ర బావుంది. క్యాథరీన్ గ్లామర్ షో అదరహో. చంద్రమోహన్, ముఖేష్ రుషి, సచిన్ కేడ్కర్ ఎవరి పాత్రల పరిధిమేరకు వారు నటించారు. కథను మలుపు తిప్పే సర్వర్ పాత్రకు తనికెళ్ల భరణి పూర్తి న్యాయం చేసాడు.


సాంకేతిక వర్గం
ఈ సినిమాకి సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ ఓ హైలైట్. నిర్మాత పెట్టిన ఖర్చుకు, కెమెరామ్యాన్ పూర్తి న్యాయం చేసాడు. రిచ్ బంగ్లా, స్లమ్ బోరబండ... రెండింటిని తన కెమెరాలో బంధించిన విజువల్స్ సూపర్బ్. తమన్ అందించిన పాటలు బాగున్నాయి. విజువల్ గా కూడా సాంగ్స్ పిక్చరైజేషన్ సూపర్. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సీన్స్ ని ఎలివేట్ చేసే విధంగా ఉంది. ఎడిటింగ్ బాగుంది. ఇక నిర్మాణపు విలువలు గురించి చెప్పుకోవాలంటే.. ఈ సినిమాకి ప్రధాన హైలైట్ అని చెప్పాలి. రిచ్ బంగ్లాలు, కార్లు, చాపర్స్, పబ్స్ తో సినిమా విజువల్ వండర్. దీనికి కాంట్రాస్ట్ గా బోరబండ స్లమ్ ని కూడా బాగా చూపించారు. కథను సంపత్ నంది సమకూర్చుకున్నాడు, రొటీన్ స్టోరీ అయినప్పటికీ, ట్రెండీ స్ర్కీన్ ప్లే, సీన్స్ తో, స్టైలిష్ టేకింగ్ తో సినిమాని తీర్చిదిద్దాడు. డైలాగ్స్ బాగున్నాయి. ముఖ్యంగా 'డబ్బే మూలం...' డైలాగ్ కి ధియేటర్స్ లో క్లాప్స్ పడుతున్నాయి.


ఫిల్మీబజ్ విశ్లేషణ
మనిషి జీవితంలో డబ్బు ఎంతటి ప్రాముఖ్యం వహిస్తుందో, దానివల్ల ఓ మనిషి మైండ్ సెట్ ఎలా మారుతుందో చూపించిన వైనం సూపర్బ్. అలాగే డబ్బులో మునిగి తేలుతూ... అనురాగం, అపాయ్యత, ప్రేమ, ద్వేషించడం... ఇలా ఏ కోణం తెలీక తికమకపడే యువకుడి పాత్రను ఆవిష్కరించిన విధానం కూడా బాగుంది. ఫస్టాప్ అంతా క్లాస్ గా, రిచ్ విజువల్స్ తో ఉంటుంది. సెకండాఫ్ లో అసలైన జీవితాన్ని చూసినట్టుగా ప్రేమ, పేదరికం, సెంటిమెంట్, యాక్షన్ అన్ని రకాల మసాలాలను దట్టించి తనదైన మార్క్ ని చూపించాడు డైరెక్టర్ సంనత్ నంది. ఓ బిలీయనీర్ వారసుడు జీవితం గురించి తెలుసుకుంటే... సమాజానికి ఎంత మేలు జరుగుతుందో అనే మేసేజ్ ని చెప్పడం బాగుంది. అలాగే డబ్బు ఎక్కువై, సుఖాలకు అలవాటు పడే వ్యక్తి మైండ్ సెట్ ఎలా మారుతుంది, అన్ని ఎమోషన్స్ ని ఎలా మర్చిపోతాడు అని చెప్పేన వైసం బాగుంది,. రొటీన్ స్టోరీ అవ్వడం మైనస్ అయితే, స్ర్కీన్ ప్లే పరంగా ఇంకొంచెం కాన్ సెన్ ట్రేట్ చేసి ఉంటే ఖచ్చితంగా అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునే సినిమా అయ్యుండేది. ఏదేమైనా బి, సి సెంటర్స్ ఆడియన్స్ కి ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. కాసుల వర్షం కురిపిస్తుంది.


ఫిల్మీబజ్ రేటింగ్ - 3.25/5



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !