View

Avunu 2 Movie Review

Friday,April03rd,2015, 03:45 AM

బ్యానర్ - ఫ్లయింగ్ ఫ్రాగ్స్, సురేష్ ప్రొడక్షన్స్
నటీనటులు - హర్షవర్ధన్ రాణె, పూర్ణ, సంజన, నిఖిత, చలపతిరావు. ప్రభాస్ శ్రీను
డైలాగ్స్ - సత్యానంద్
సంగీతం - శేఖర్ చంద్ర
ఎడిటింగ్ - మార్తాండ్.కె.వెంకటేష్
సినిమాటోగ్రఫీ - యన్.సుధాకర్
సమర్పణ - డా. డి.రామానాయుడు
నిర్మాతలు - డి.సురేష్ బాబు, రవిబాబు
కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - రవిబాబు

సింపుల్ కథకి గ్రిప్పింగ్ స్ర్కీన్ ప్లే తయారు చేసుకుని సినిమాలు తీయడం రవిబాబు స్టయిల్. అసలు ఇంత చిన్న కథతో సినిమాని నడిపించడం కత్తి మీద సాము అన్న చందంగా ఆయన చిత్రాలు ఉంటాయి. అందుకో ఉదాహరణ 'అవును'. తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్ గా రూపొందించిన 'అవును 2' మరో ఉదాహరణ. 'అవును' మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. మరి.. ఈ 'అవును 2' ఎలా ఉందో చూద్దాం...

కథ
'అవును' చిత్రం ఎక్కడ ముగిసిందో అక్కణ్ణుంచి 'అవును 2' ఆరంభం అవుతుంది. హర్ష (హర్షవర్ధన్) హాస్పటల్లో ట్రీట్ మెంట్ తీసుకుంటుంటాడు. హాస్పటల్లో ఉన్న హర్ష భార్య మోహిని (పూర్ణ)ని రాజు ఆత్మ (రవిబాబు) భయపెడుతుంది. హాస్పటల్ నుంచి డిశ్చార్జ్ అయిన హర్ష తన భార్య మోహినితో సహా కాశి వెళ్లి చనిపోయిన తన తల్లిదండ్రుల ఆత్మ శాంతి కోసం 11రోజుల కార్యక్రమాలను జరిపిస్తాడు. అక్కడ మోహినిని చూసిన ఓ సన్యాసి, ఆమెను ఓ ఆత్మ వెంటాడుతోందని, ఆమె కన్నెతనం కోరుకుంటోందని, కాబట్టి ఆ ఆత్మ నుంచి తనని కాపాడుకోవడానికి ఓ రూపు యేడాది పాటు మంగళసూత్రంతో కలిపి వేసుకోవాలని చెబుతాడు. అతను చెప్పినట్టే మోహిని ఆ రూపు తీసుకుని తన మెడలో వేసుకుంటుంది.

తన ప్రెండ్ మోహన్ సహాయంతో హర్ష, మోహిని కొత్త ఫ్లాట్ లోకి షిఫ్ట్ అవుతారు. చాలా సౌకర్యంగా ఉన్న ఆ ఫ్లాట్ లో తమ జీవితం సుఖంగా ఉంటుందని ఈ దంపతులు భావిస్తారు. కానీ రాజు ఆత్మ మోహినిని వెంటాడుతుంటుంది. మోహిని మెడలో చైన్ లో ఉన్న రూపు రాజు ఆత్మను ఆమె దగ్గరకు రానివ్వకుండా కాపాడుతుంది. పలు సందర్భాల్లో మోహిని చైన్ తీసి పక్కన పెట్టడం, రాజు ఆత్మ ఆమెపై దాడి చేయడానికి ట్రై చేయడం జరుగుతుంటుంది. మళ్లీ చైన్ వేసుకోగానే ఆత్మ దూరమవుతుంది. ఒకానొక సందర్భంలో మోహినిని చైన్ తీసి పక్కకు పెట్టేలా చేస్తుంది రాజు ఆత్మ. ఆ తర్వాత జరిగిన పర్యవసానాలు ఏంటీ? రాజు ఆత్మ తనపై చేస్తున్న దాడి నుంచి మోహిని ఎలా బయటపడింది. మోహినిని ఆమె భర్త హర్ష ఎలా కాపాడగలిగాడు? అనేదే ఈ చిత్రం క్లయిమ్యాక్స్.

నటీనటుల పర్ఫార్మెన్స్
హర్ష పాత్రకు హర్షవర్ధన్ రాణె న్యాయం చేశాడు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కుర్రాడి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలో అచ్చంగా అలానే మౌల్డ్ అయ్యాడు. ఆత్మ తనను హింస పెట్టే సన్నివేశాల్లో హర్ష చాలా బాగా నటించాడు. ముఖ కవళికలు బాగా కనబర్చాడు. టోటల్ గా హర్ష నటనలో పరిణతి కనిపించింది. ఇక, పూర్ణ కూడా హర్షకు దీటుగా నటించింది. అసలు సిసలైన గృహిణిలా ఒదిగిపోయింది. ఆత్మ తనను వెంటాడే సన్నివేశాల్లో పూర్ణ కళ్లల్లో కనిపించే భయం ప్రేక్షకులను కూడా భయపెడుతుంది. అంతలా ఆ పాత్రలో ఒదిగిపోయింది. ఈ రెండు పాత్రల తర్వాత సినిమాలో ఉన్న ఇతర పాత్రలు నిఖిత, ఆమె భర్త పాత్ర, హర్ష స్నేహితుడి పాత్రధారి, సంజన.. ఇలా అందరూ వారు చేసిన పాత్రల్లో ఒదిగిపోయారు.

సాంకేతిక వర్గం
ఇది హారర్ సస్సెన్స్ మూవీ. పగ బట్టిన ఆత్మ వల్ల ఓ అమ్మాయి, ఆమె భర్త పడే నరక వేదన చుట్టూ కథ తిరుగుతుంది. ఈ పాయింట్ చుట్టూ సన్నివేశాలు అల్లి, చాలా గ్రిప్పింగ్ గా చూపించాడు రవిబాబు. టెక్నికల్ గా సినిమా చాలా బాగుంది. ఇలాంటి చిత్రాలకు బ్యాగ్రౌండ్ స్కోర్ ఆయువుపట్టు లాంటిది. ఆ విషయంలో శేఖర్ చంద్ర అద్భుతమైన పనితనం కనబర్చాడు. రీ-రికార్డింగ్ బాగుండటంతో సీట్లోంచి కదలడానికి భయపడతారు ప్రేక్షకులు. ఆ కారణంగా సినిమా ఆరంభం నుంచి చివరి వరకు చూసేస్తారు. 90 శాతం సినిమా మొత్తం దాదాపు ఒకే ఇంట్లో జరుగుతుంది. అయినా బోర్ అనిపించదు. ఎన్. సుధాకర్ రెడ్డి ఫొటోగ్రఫీ బాగుంది. టెక్నికల్ గా సినిమాకి ఎక్కడా వంకపెట్టడానికి లేదు.

ఫిల్మీబజ్ విశ్లేషణ
ఈ సినిమా నిడివి తక్కువ. అదో పెద్ద ప్లస్ పాయింట్. ఫస్టాఫ్ కొంచెం సాగదీసినట్లుగా అనిపిస్తున్న సమయంలో ఇంటర్వెల్ వచ్చేస్తుంది. సెకండాఫ్ చాలా స్పీడ్ గా సాగుతుంది. తదుపరి ఏం జరుగుతుందనే? ఆసక్తి సినిమా ఆరంభం నుంచి ఉంటుంది. క్లయిమ్యాక్స్ వరకూ ఆ ఆసక్తి అలా మెయిన్ టైన్ అవుతూ ఉంటుంది. పాటలతో అక్కడక్కడ బ్రేక్ లు లేకపోవడం కూడా ఈ సినిమాకి ఓ ప్లస్.  తక్కువ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని పూర్తి చేశారు. దాంతో తీసినవాళ్లు, కొనుక్కున్నవాళ్లు సేఫ్. ఎవర్నీ నష్టపరచని ఏ సినిమా అయినా హిట్ సినిమా కిందే లెక్క. ఆ మేరకు 'అవును 2' హిట్ సినిమానే. పూర్ణను తన వశం చేసుకోవడమే ఆత్మ లక్ష్యం. అయినప్పటికీ శృంగారం పాళ్లు హద్దు మించకుండా నీట్ గా తీశాడు రవిబాబు. ఇదే పాయింట్ కి మంచి మసాలా దట్టించి, రొమాన్స్ ఎక్కువగా చూపించొచ్చు. కానీ, డైలాగ్స్ గానీ, సీన్స్ గానీ ఫ్యామిలీ ఆడియన్స్ ఇబ్బందిపడేలా ఉండవు. అదో ప్లస్ పాయింట్.

ఫైనల్ గా చెప్పాలంటే.. ఎక్కువ శాతం భయపెడతూ, అక్కడక్కడా రిలీఫ్ కోసం కొన్ని సన్నివేశాలతో సాగే చిత్రం ఇది. తక్కువ నిడివితో సాగే ఈ చిత్రాన్ని ఓసారి ఎంజాయ్ చేయొచ్చు. హారర్ సినిమాలను ఇష్టపడే వాళ్లకి తప్పకుండా ఈ సినిమా నచ్చుతుంది. అవును.. ఇది నిజం...

ఈ చిత్రానికి మూడో భాగం కూడా తీయాలనే ఆలోచన రవిబాబుకి ఉన్నట్లుంది. అదే కనుక నిజమైతే.. రెండు భాగాలను గ్రిప్పింగ్ గా నడిపించిన రవిబాబు మూడో భాగాన్ని ఎలా తీసుకొస్తాడో చూడాలి.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !