View

Ramleela movie review

Friday,February27th,2015, 03:39 AM

చిత్రం - రామ్ లీల
బ్యానర్ - రామదూత క్రియేషన్స్
సమర్పణ - కోనేరు సత్యనారాయణ
సారధ్యం - లంకాల బుచ్చిరెడ్డి
నటీనటులు - హవీష్‌, అభిజీత్‌, నందిత, అక్ష, మదాలస శర్మ, అలీ, సప్తగిరి, భానుచందర్‌, నాగినీడు, కృష్ణుడు, శివన్నారాయణ, అనితాచౌదరి, వైవా హర్ష, జయవాణి, గుండు సుదర్శన్‌, ఇంద్ర తదితరులు
సంగీతం - చిన్నా
మాటలు - విస్సు
ఎడిటింగ్ - కార్తీక్ శ్రీనివాస్
కెమెరా - యస్.గోపాల రెడ్డి
సహ నిర్మాత - ముత్యాల రమేష్
నిర్మాత - దాసరి కిరణ్ కుమార్
కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - శ్రీపురం కిరణ్

'నువ్విలా' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమై, తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హవీష్. ఆ తర్వాత చేసిన 'జీనియస్'తో నటుడిగా ఇంకా ఎదిగాడు. ఇక, హవీస్ చేసిన మూడో సినిమా 'రామ్ లీల'. ఈ చిత్రంలో హవీష్ బాగా నటించాడనీ, నటుడిగా తను ఇంకా డెవలప్ అయిన వైనం స్పష్టంగా కనిపిస్తుందని చిత్రనిర్మాత దాసరి కిరణ్ కుమార్ ఈ చిత్రనిర్మాణంలో ఉన్నప్పుడు చెప్పేవారు. అలాగే, చిత్రసమర్పకులు కోనేరు సత్యనారాయణ కూడా హవీష్ బాగా నటించాడనీ, ఈ సినిమా హిట్ కావడం ఖాయం అని చెప్పుకుంటూ వచ్చారు. ఈ చిత్రం ద్వారా శ్రీపురం కిరణ్ దర్శకునిగా పరిచయం అయ్యారు. ఇక.. ఈ 'రామ్ లీల' ఎలా ఉంది? హవీష్ ఎలా నటించాడు? దర్శకడు ఎలా తెరకెక్కించాడు?.. అదే చూద్దాం.

క్రిష్ (అభిజిత్) యూఎస్ లో మంచి ఉద్యోగం చేస్తుంటాడు. ఇంటికి మంచి కోడల్ని తెచ్చుకోవాలని అతని తల్లిదండ్రులు (శివన్నారాయణ, అనితా చౌదరి) అనుకుంటారు. పెళ్లి గురించి మాట్లాడటానికి ఇద్దరూ క్రిష్ కి ఫోన్ చేస్తారు. కరెక్ట్ గా అప్పుడే టీవీ లో వస్తున్న ప్రోగ్రామ్ లో సశ్య (నందిత)ను చూస్తాడు క్రిష్. తననే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవుతాడు. ఇండియా వెళ్లిపోయి, తల్లిదండ్రులతో చెప్పి, ఆ అమ్మాయి ఎవరో కనుక్కుని నేరుగా పెళ్లి సంబంధం మాట్లాడటానికి వెళతారు. సశ్య తండ్రి పోలీసాఫీసర్ (నాగినీడు). క్రిష్, అతని కుటుంబం నచ్చడంతో కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాడు. పెళ్లి చేసుకుని యూఎస్ ఎందుకు? ఏ మలేసియానో, సింగపూరోలోనో ఉంటే బాగుంటుందని భర్తతో అంటుంది సశ్య. తన కోరిక మేరకు జాబ్ ని మలేసియా ట్రాన్స్ ఫర్ చేయించుకుంటాడు. భార్యతో సహా మలేసియా వెళతాడు. వారం రోజులు ఆఫీసుకి సెలవు పెట్టి, భార్యతో రోడ్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటాడు. కట్ చేస్తే.. సశ్య ఓ ఉత్తరం రాసి పెట్టి, తన ప్రియుడి దగ్గరకు వెళుతున్నానని చెప్పి, జంప్ అయిపోతుంది. ఒంటరిగా రోడ్ జర్నీ మొదలుపెట్టిన క్రిష్ కి రామ్ (హవీష్) పరిచయమవుతాడు. లైఫ్ ని ఎంజాయ్ చేయాలనుకునే దృక్పథం రామ్ ది. రామ్ గుణాలు క్రిష్ కి నచ్చకపోయినా.. అతన్ని వెంటాడుతుంటాడు రామ్. చివరికి ఇద్దరి మధ్య స్నేహం కుదురుతుంది. ఒకానొక దశలో రామ్, సశ్యల మధ్య ఉన్న రిలేషప్ షిప్ గురించి క్రిష్ కి తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? సశ్య ప్రియుడు రామేనా? అసలు క్రిష్ ని వెంటాడి మరీ రామ్ ఎందుకు స్నేహం పెంచుకున్నాడు? అనే అంశాలతో చిత్రం సాగుతుంది.

నటీనటుల పర్ఫార్మెన్స్
రామ్ పాత్రను హవీష్ బాగా చేశాడు. ముఖ్యంగా తన వాయిస్ ప్లస్ పాయింట్. డాన్సులు కూడా బాగా చేశాడు. రామ్ పాత్ర ఎంత ఆకతాయితనంగా ఉంటుందో.. అంత బాధ్యతాయుతమైన పాత్ర కూడా. ఈ రెండు కోణాలను హవీష్ చక్కగా ఆవిష్కరించాడు. క్రిష్ పాత్రను అభిజిత్ బాగా చేశాడు. తన పాత్రలో కూడా ఆనందం, బాధ రెండు కోణాలున్నాయి. వాటిని చక్కగా ఆవిష్కరించాడు. నందిత సోసోగా ఉంది. తన పాత్ర కూడా మామూలుగా ఉంది. నాగినీడు, భానుచందర్, అనితా చౌదరి, సప్తగిరి, అలీ.. తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు.

సాంకేతిక వర్గం
దర్శకుడు శ్రీపురం కిరణ్ రాసుకున్న కథ కొత్తగా ఉంది. స్ర్కీన్ ప్లే పరంగా కొంచెం జాగ్రత్త పడి ఉంటే సినిమా ఇంకా బాగుండి ఉండేది. సప్తగిరి, అలీల కామెడీ ట్రాక్ పెద్దగా పండలేదు. ఆ సన్నివేశాలకు బదులు వేరే బలమైన సన్నివేశాలు అల్లుకుని ఉంటే బాగుండేది. ఈ చిత్రానికి ప్రధాన బలం ఎస్. గోపాల్ రెడ్డి కెమెరా. సినిమా మొత్తం చాలా అందంగా, కనువిందుగా ఉంది. కెమెరా బ్యూటీ వల్ల ప్రేక్షకుడు ఓ మంచి ఫీల్ తో సినిమా చూస్తాడు. ఇక, చిన్నా ఇచ్చిన పాటలు మరో బలం. అన్ని పాటలూ చాలా బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. విస్సు రాసిన సంభాషణలు కొన్ని చోట్ల అతికినట్లుగా అనిపించలేదు. డైలాగ్స్ ట్రెండీగా లేకపోవడం ఓ మైనస్. నిర్మాణ విలువలు బ్రహ్మాండం. సినిమా చాలా రిచ్ గా ఉంది.

ఫిల్మీబజ్ విశ్లేషణ
ఇది కచ్చితంగా కథాబలం ఉన్న చిత్రమే. కానీ, సన్నివేశాల అల్లికలో బలం లేదు. హవీష్ వాయిస్ బాగుంది, చక్కగా డాన్స్ చేయగలిగాడు. నటన కనబర్చడానికి స్కోప్ ఉన్నంతవరకూ భేష్ అనిపించుకున్నాడు. మాస్ కథ పడితే.. డెఫినెట్ గా మంచి మాస్ హీరోగా నిలబడగలుగుతాడు. శ్రీపురం కిరణ్ దర్శకుడిగా అక్కడక్కడా మెరిశాడు. ట్రీట్ మెంట్ విషయంలో కేర్ తీసుకుని ఉంటే, దర్శకునిగా తొలి చిత్రంతోనే ఇంకా మార్కులు కొట్టి ఉండేవాడు. కథను నడిపిన తీరు అంత సంతృప్తికరంగా అనిపించదు. ఓవరాల్ గా చెప్పాలంటే.. 'రామ్ లీల' లైటర్ వీన్ గా సాగుతుంది. క్లయిమాక్స్ లో టచింగ్ గా ఉంటుంది. ఎలాంటి గందరగోళాలూ ఉండవు. సాఫీగా సాగిపోయే సినిమా కాబట్టి, ప్రేక్షకుడు రిలీఫ్ గా చూసే సినిమా.

ఫైనల్ గా చెప్పాలంటే ఈ 'రామ్ లీల'లు టైమ్ పాస్ కి పనికొస్తాయ్.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !