View

హైపర్ మూవీ రివ్య్వూ

Friday,September30th,2016, 08:44 AM

చిత్రం - హైపర్
బ్యానర్ - 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్
నటీనటులు - రామ్, రాశిఖన్నా, సత్యరాజ్, రావురమేష్, తులసి, పోసాని కృష్ణమురళి, హేమ, మురళీశర్మ, ప్రియ, ప్రభాస్ శ్రీను తదితరులు
సినిమాటోగ్రఫీ - సమీర్ రెడ్డి
సంగీతం - జిబ్రాన్
ఎడిటింగ్ - గౌతంరాజు
మాటలు - అబ్బూరి రవి
సమర్పణ - వెంకట్ బోయినపల్లి
నిర్మాతలు - రామ్ అచంట, గోపీచంద్ అచంట, అనీల్ సుంకర
కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - సంతోష్ శ్రీనివాస్


ఈ యేడాది ఆరంభంలోనే 'నేను శైలజ' చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న హీరో రామ్ 'హైపర్' చిత్రంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాడని ఈ చిత్రం ట్రైలర్స్, పోస్టర్స్ చూసిన ప్రతి ఒక్కరూ ఓ అంచనాకి వచ్చేసారు. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై ఈ చిత్రం రూపొందింది. రాశిఖన్నా హీరోయిన్. మరి అందరి అంచనాలకు తగ్గట్టు ఈ సినిమా ఉందా... రామ్ ఖాతాలో మరో హిట్ పడినట్టేనా తెలుసుకుందాం.


కథ
సూర్య (రామ్) కి చిన్నప్పట్నుంచి తన తండ్రి నారాయణ మూర్తి (సత్యరాజ్) అంటే పిచ్చ ప్రేమ. ఎంత ప్రేమ అంటే తన తల్లికి ఏమైనా అయితే తన తండ్రి బాధపడతాడు కాబట్టి తల్లికి ఏమీ అవ్వకూడదని భావించేటంతటి ప్రేమను తండ్రిపైన పెంచుకుంటాడు. నారాయణమూర్తి సిన్సియర్ గవర్నమెంట్ ఎంప్లాయి. తన 30 యేళ్ల సర్వీస్ లో ఎవరికీ తలవంచకుండా, లంచం అనే మాటకు తావివ్వకుండా నిజాయితీగా ఉద్యోగం చేస్తాడు నారాయణమూర్తి. మరో 15 రోజుల్లో రిటైర్ మెంట్ అయిపోయే తరుణంలో నారాయణమూర్తికి మినిస్టర్ రాజప్ప వల్ల ఇబ్బందులు కలుగుతాయి. రాజప్ప కట్టిస్తున్న ఓ అపార్ట్ మెంట్ కి అనుమితులివ్వడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయనే కారణంతో నారాయణమూర్తి ఆ ఫైల్ మీద సంతకం చేయడు. దాంతో రాజప్ప రకరకాలుగా నారాయణమూర్తిని ఇబ్బందులకు గురి చేసి, సంతకం పెట్టించుకోవడానికి ట్రై చేస్తాడు. తండ్రి మీద పిచ్చ ప్రేమ ఉన్న సూర్య తన తండ్రికి మినిష్టర్ వల్ల ఇబ్బంది ఎదురయ్యిందని తెలియడంతో ఎలా రియాక్ట్ అయ్యాడు అనేదే ఈ చిత్ర కథ.


నటీనటుల పెర్ ఫామెన్స్
సూర్య పాత్రకు రామ్ పూర్తి న్యాయం చేసాడు. ఎనర్జిటిక్ గా నటించే రామ్ డ్యాన్స్, ఫైట్స్ కూడా ఇరగదీసాడు. 'సుప్రీమ్' చిత్రంలో బెల్లం శ్రీదేవి పాత్రతో యూత్ కి బాగా దగ్గరైన రాశిఖన్నా, ఈ చిత్రంలో భానుమతి పాత్ర చేసింది. తండ్రి, ఆఫీస్ బాస్ అంటే భయపడే భానుమతిగా బాగా నటించింది. నారాయణమూర్తి పాత్రకు సత్యరాజ్ పూర్తి న్యాయం చేసారు. ఈ పాత్రలో ఆయనను తప్ప వేరే ఎవ్వరినీ ఊహించుకోలేము. రావు రమేష్, మురళీ శర్మ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసారు. మిగతా నటీనటులందరూ తమ పాత్రల్లో ఒదిగిపోయారు.


సాంకేతిక వర్గం
మంచి సోషల్ మెసేజ్ తో కమర్షియల్ ఎలిమెంట్స్ మిక్స్ చేసి ఈ కథను మలిచారు డైరెక్టర్ శ్రీనివాస్. ఆయన ఇచ్చిన మెసేజ్ అందరినీ ఆలోచింపజేస్తుంది. ఆ పరంగా సంతోష్ శ్రీనివాస్ ని అభినందించాల్సిందే. సినిమాటోగ్రఫీ బాగుంది. జిబ్రాన్ పాటలు ఒకే. రీ-రికార్డింగ్ పరంగా ఇంకా బెటర్ మెంట్ చేస్తే సీన్స్ బాగా ఎలివేట్ అయ్యేవి. డైలాగ్స్ బాగున్నాయి. షార్ప్ ఎడిటింగ్ తో సీన్స్ ఎక్కడా ల్యాగ్ అనిపించవు. నిర్మాణపు విలువలు సూపర్బ్.


ఫిల్మీబజ్ విశ్లేషణ
గవర్నమెంట్ ఎంప్లాయి అనగానే లంచాలు తీసుకుని, 30 యేళ్ల సర్వీస్ లో పెద్దగా కష్టపడకుండానే జీతం తీసుకుంటూ బ్రతికేస్తారు అనే ఫీలింగ్ ఉంటుంది. కానీ ఆ ఉద్యోగి పెట్టే ఒక సంతకం ఎంత విలువైనది, ఆ ఉద్యోగి ఎలా ఉంటే భవిష్యత్తు తరాలు బాగుంటాయనే విషయాన్ని చాలా చక్కగా చూపించడంతో సినిమా పబ్లిక్ కి బాగా కనెక్ట్ అవుతుంది. గవర్నమెంట్ ఉద్యోగుల మీద చులకన భావన పోతుంది. లంచాలు తీసుకోకుండా తమ వృత్తి ధర్మం పాటించడం వల్ల ఎంతమంది జీవితాలకు మంచి జరుగుతుందనే విషయాన్ని డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ చాలా చక్కగా ఎలివేట్ చేసారు. తను ఎంతగానో ప్రేమించే తండ్రికి దూరమయ్యేలా చేసిన మినిష్టర్ రాజప్పను హీరో ముప్పతిప్పలు పెట్టే సీన్స్ బాగుంటాయి. తెలివిగా మీడియాను వాడుకోవడం, మినిష్టర్ ని ఇరికించడంలాంటి సీన్స్ ని ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఓ మెసేజ్ ని కమర్షియల్ వేలో చెబితే అన్ని వర్గాల ఆడియన్స్ కి సినిమా రీచ్ అవుతుందనే విషయం ఈ సినిమా నిరూపిస్తుంది. ఎంటర్ టైన్ మెంట్ తో పాటు మంచి మెసేజ్ ఉంది కాబట్టి ఫ్యామిలీ స్ తో కలిసి ఈ సినిమాని ఎంజాయ్ చెయ్యొచ్చు.


ఫైనల్ గా చెప్పాలంటే... మంచి సోషల్ మెసేజ్ ఉన్న పక్కా పైసా వసూల్ సినిమా ఈ 'హైపర్'.

 

ఫిల్మీబజ్ రేటింగ్ - 3.25/5Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !