View

ఐస్ క్రీం మూవీ రివ్వ్యూ

Saturday,July12th,2014, 03:18 AM

చిత్రం - ఐస్ క్రీం

నటీనటులు - నవదీప్, తేజస్వి

కెమెరా - అంజి

సంగీతం - ప్రద్యోతన్,

ఎడిటింగ్ - ప్రతాప్ కుమార్ సంగ,

ఆర్ట్ - రఘు కులకర్ణి

నిర్మాత - తుమ్మలపల్లి రామసత్యనారాయణ

దర్శకత్వం - రామ్ గోపాల్ వర్మ.

రామ్ గోపాల్ వర్మ... గ్రేట్ టెక్నీషియన్. తెలుగు పరిశ్రమ గర్వించదగ్గ దర్శకుడు. శివ, క్షణ క్షణం, గాయం.. ఇలా మంచి మంచి సినిమాలు తీశాడు. ఆ తర్వాతే దెయ్యాలు, భూతాలు అంటూ రాము ట్రాక్ తప్పాడు. మొదట్లో బాగానే అనిపించినా, ఆ తర్వాత తర్వాత ప్రేక్షకులకు విసుగు పుట్టడం మొదలైంది. తాజాగా 'ఐస్ క్రీమ్' తీశాడు. ఇది కూడా.. హారర్ మూవీయే. మరి.. రాము ఈ హారర్ మూవీ ప్రేక్షకులకు నచ్చుతుందా? లేక విసుగు తెప్పిస్తుందా? ఫ్లోకేమ్ అనే కొత్త టెక్నాలజీతో రాము తీసిన ఈ సినిమా ఎలాంటి ఈఅనుభూతికి గురి చేస్తుంది.. ఆ విషయాలు తెలసుకుందాం..

à°•à°¥

రేణు (తేజస్వి) మెడికల్ స్టూడెంట్. ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. ఇంట్లో రకరకాల శబ్దాలు వినిపిస్తున్నట్లుగా భావిస్తుంది. తన బాయ్ ఫ్రెండ్ విశాల్ (నవదీప్)కి ఫోన్ చేసి, భయంగా ఉందని చెబుతుంది. ఏదేదో ఊహించుకుని, అనవపరంగా భయపడుతున్నావని అంటాడు. సరే అని నిద్రపోతుంది. కానీ, ఎవరో తనను పిలుస్తున్నట్లుగా ఫీలవుతుంది. మర్నాడు విశాల్ ఇంటికి రాగానే, ఎవరో వెంటాడుతున్నట్లు అనిపిస్తోందని అంటుంది. విశాల్ తేలికగా తీసుకుంటాడు. కాసేపు రేణూతో కబుర్లు చెప్పి, వెళ్లిపోతాడు. ఆ రోజు రాత్రి కూడా రేణు నిద్రపోవడానికి ప్రయత్నించినప్పుడు ఏవో పీడకలలు వస్తాయి. ఉలిక్కిపడి నిద్ర లేస్తుంది. విపరీతంగా భయపడుతుంది. ఎవరో ఇంట్లో ఉన్నట్లుగా భావిస్తుంది. రేణూకి ఎందుకు ఇలాంటి అనుభూతులు ఎదురవుతున్నాయి? నిజంగానే ఇంట్లో ఎవరైనా ఉన్నారా? అది రేణూ భ్రమా? లేక ఏదైనా దెయ్యం తనని వెంటాడుతుందా? తదితర ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

నటీనటుల పర్ఫార్మెన్స్

సినిమా మొత్తంలో తేజస్వి నవ్విన సందర్భాలు తక్కువ.. భయపడిన సన్నివేశాలు ఎక్కువ. భయపడినట్లుగా బాగానే నటించింది. చిట్టి పొట్టి నిక్కర్లు, టీ షర్టుల్లో గ్లామరస్ గా కనిపించింది. ఇక, నవదీప్ పాత్రకు పెద్దగా స్కోప్ లేదు. ఉన్నంతలో తను బాగానే చేశాడు. సినిమాలో చెప్పుకునేట్లు ఇతర పాత్రలేవీ లేవు. ఓ పనిమనిషి, ఓ బాలుడి పాత్రలు ఉన్నాయి. అవి ఇలా వచ్చి అలా వెళ్లిపోతాయి.

సాంకేతిక వర్గం

à°ˆ చిత్రం ద్వారా రామ్ గోపాల్ వర్మ ఫ్లో కేమ్, ఫ్లో సౌండ్ టెక్నాలజీని పరిచయం చేశాడు. సౌండ్ డిజైనర్ శేషు à°Žà°‚ ఆర్ పనితనం బాగుంది. నూతన సౌండ్ టెక్నాలజీతో ప్రేక్షకులను భయపెట్టడానికి బాగానే ప్రయత్నించాడు. ఛాయాగ్రాహకుడు అంజి ఫ్లోకేమ్ కెమెరా పనితనం బాగుంది. రఘు కులకర్ణి వేసిన ఇంటి సెట్ కనువిందుగా ఉంది. సంభాషణలకు పెద్దగా స్కోప్ లేని à°•à°¥ ఇది. ఉన్నంతలో కె.కె. బినోజీ సింపుల్ డైలాగులు రాశాడు. ఎడిటింగ్ ఓకే. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ భయపెట్టే విధంగా ఉంది.  à°¡à±ˆà°°à±†à°•à±à°Ÿà°°à± à°—à°¾ రామ్ గోపాల్  à°µà°°à±à°®à°•à± ఏమాత్రం మార్కులు తెచ్చిపెట్టే చిత్రం కాదిది.

ఫిల్మీబజ్ విశ్లేషణ

బెంగళూరులో జరిగిన ఒక వాస్తవ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించాడు రామ్ గోపాల్ వర్మ. ఈ వాస్తవ సంఘటన అంత వాస్తవంగా అనిపించదు. ప్రేక్షకులను భయపెట్టాలని రాము చేసిన ప్రయత్నం వృథా అయ్యింది. భయం కాదు కదా.. కొన్ని సన్నివేశాలు జోక్ గా ఉన్నాయి. సినిమా మొత్తం మీద హీరోయిన్ పాత్ర రాత్రి నిద్రపోతూ భయపడటం, ఉదయం నిద్ర లేచి స్నానం చేయడం, అడపా దడపా వచ్చే బాయ్ ఫ్రెండ్ తో సరసాలాడటం, బుద్ధి పుడితే పుస్తకాలు ముందేసుకుని చదవడం... ఇదే తంతు. ఓ రెండు గంటల పాటు ఇదే సన్నివేశాలతో సినిమా అంటే ఏ ప్రేక్షకుడికి మాత్రం విసుగు పెట్టదు. పైగా సీటింగ్ కెపాసిటీ తక్కువ ఉన్న థియేటర్లలో అయితే సౌండ్ టెక్నాలజీ చాలా ఘోరంగా వినపడుతుంది. రాము ఇంతకుముందు ఇలాంటి మూవీస్ తీశాడు. ఉదాహరణకు 'రాత్', 'దెయ్యం' తదితర చిత్రాలు. ఆ చిత్రాలు భయపెట్టినంతగా ఈ చిత్రం భయపెట్టలేదు. సరికదా.. నవ్వు తెప్పిస్తుంది. అసలు ఈ సినిమాకి 'ఐస్ క్రీమ్' అని టైటిల్ పెట్టడానికి బలమైన కారణమేమీ ఉండదు. హీరోయిన్ అడపా దడపా ఐస్ క్రీమ్ తింటుంది. అంతే.

ముందు రామ్ గోపాల్ వర్మ తనకు పట్టిన దెయ్యాన్ని వదిలించుకోవాలి. అప్పుడే మంచి సినిమాలు తీయగలడు. శివ, క్షణ క్షణం, గాయం, గోవిందా గోవిందా.. వంటి అద్భుత చిత్రాలు తీసిన రామూయేనా ఈ సినిమా తీసింది అనిపించక మానదు. పిచ్చికి పరాకాష్ట అంటారు... ప్రస్తుతం రాము ఆ స్థితిలోనే ఉన్నాడు. ఆ పిచ్చి వదిలితే మళ్లీ పాత రాము అవుతాడు. అప్పుడు మళ్లీ తన నుంచి జనాలు చూసే సినిమాలు వస్తాయి. అది జరుగుతుందా? జరగాలనే కోరుకుందాం. ఎందుకంటే, తెలుగు పరిశ్రమ గర్వించదగ్గ రాము నుంచి ఇలాంటి పిచ్చి సినిమాలు ఎవరూ ఎదురు చూడరు. కొత్త కొత్త టెక్నాలజీలు కనిపెట్టి, నిర్మాణ వ్యయం తగ్గిస్తున్న రాము కథలపై దృష్టి పెట్టి, కలక్షన్లు పెంచే సినిమాలు తీస్తే బెటర్.

ఫైనల్ గా చెప్పాలంటే...

టిక్కెట్ కొనుక్కుని సినిమాకెళ్లే ప్రేక్షకుడు కడుపుమంటతో థియేటర్ నుంచి బయటికి రావడం ఖాయం.

Ramgopal Varma Ice Cream Movie Review



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !