View

జై లవ కుశ మూవీ రివ్య్వూ

Thursday,September21st,2017, 05:42 AM

చిత్రం - జై లవ కుశ
బ్యానర్ - ఎన్టీఆర్ ఆర్ట్స్
నటీనటులు - ఎన్టీఆర్, రాశిఖన్నా, నివేదా థామస్, నందితారాజ్, తమన్నా (స్పెషల్ అఫియరెన్స్), సాయికుమార్, రోనిత్ రాయ్, అభిమన్యుసింగ్, పోసాని కృష్ణమురళి, హరీష్ ఉత్తమన్ తదితరులు
సినిమాటోగ్రఫీ - ఛోటా.కె.నాయుడు
ఎడిటింగ్ - కోటగిరి.వెంకటేశ్వరరావు
సంగీతం - దేవిశ్రీ ప్రసాద్
నిర్మాత - నందమూరి కళ్యాణ్ రామ్
రచన - కె.యస్.రవీంద్ర, కోన వెంకట్, కె.చక్రవర్తి
స్టోరీ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - కె.రవీంద్ర


టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతాగ్యారేజ్ అంటూ వరుస సక్సెస్ ఫుల్ చిత్రాలతో ముందుకు దూసుకెళుతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా చిత్రం 'జై లవ కుశ'. ఈ సినిమాకో ప్రత్యేకత ఉంది. అన్నదమ్ముల అనుబంధం నేపధ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకి నిర్మాత ఎన్టీఆర్ అన్నయ్య నందమూరి కళ్యాణ్ రామ్. అన్నదమ్ములు ఏం చేసారురా అని 'జై లవ కుశ' చూసిన ప్రతి ఒక్కరూ అనుకోవాలనే టార్గెట్ తో సినిమా చేసాం అని ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ చెప్పారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసాడు. అందులో జై క్యారెక్టర్ నెగటివ్ షేడ్. మూడు పాత్రలకు సంబంధించిన లుక్స్, టీజర్స్ తో పాటు థియేట్రికల్ ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసాయి. మరి ఆ అంచనాలను అందుకునే విధంగా ఈ సినిమా ఉందా తెలుసుకుందాం.


à°•à°¥
జై, లవ, కుశ ముగ్గురు (ఎన్టీఆర్) అన్నదమ్ములు. జై పెద్దవాడు. జై కి నత్తి ఉంటుంది. చిన్నప్పట్నుంచి జై అంటే లవ, కుశకి చిన్నచూపు. డ్రామా ఆర్టిస్ట్ లుగా లవ, కుశను మేనమామ తీర్చిదిద్దుతాడు. ఇద్దరికీ మంచి పేరు వస్తుంది. కానీ జై ని మాత్రం మేనమామ చిన్నచూపు చూస్తాడు. ఇది జై లో పగని పెంచుతుంది. తమ్ముళ్లు అంటే ఎంతో ప్రేమగా ఉండే జై వారి మీద ద్వేషాన్ని పెంచుకుంటాడు. ఒక డ్రామా జరుగుతున్నప్పుడు జై సిలిండర్ ని పేలేలా చేయడం, దాంతో చిన్నప్పుడే అన్నదమ్ములు ముగ్గురు విడిపోవడం జరుగుతుంది. కట్ చేస్తే 20 సంవత్సరాల తర్వాత...


లవను ఓ వ్యక్తి చేరదీయడంతో మంచి వ్యక్తిగా ఎదుగుతాడు. బ్యాంక్ మేనేజర్ గా స్థిరపడతాడు. కానీ అతని మంచితనమే అతనికి చేటు చేస్తుంది. డాక్యుమెంట్స్ కూడా చూడకుండా సమాజానికి మంచి చేస్తున్నానన్న వ్యక్తికి కోటి రూపాయలు లోన్ ఇచ్చేస్తాడు. ఆ లోన్ సరైన వ్యక్తికి ఇవ్వలేదని, అతని దగ్గర్నుంచి డబ్బులు రాబట్టడం కష్టమని తెలుసుకుని లవ మీద పోలీసు కంఫ్లైంట్ ఇస్తారు బ్యాంక్ నిర్వాహకులు. వారం రోజుల్లో కోటి రూపాయలు కట్టకపోతే అతని ఉద్యోగం ఊడటంతో పాటు జైలు పాలవ్వాల్సిన సిట్యువేషన్ లో ఉంటాడు లవ. సరిగ్గా ఈ సందర్భంలో ఓ యాక్పిడెంట్ లో కుశను కలుస్తాడు లవ. చనిపోయాడనుకున్న లవ బ్రతికుండటం, బ్యాంక్ ఉద్యోగి అవ్వడం కుశని సంబరపడిపోయేలా చేస్తోంది. ఏదో ఒకటి మాయ చేసి, డబ్బులు దోచేసి అమెరికాలో స్థిరపడాలనుకునే కుశ భారీగా డబ్బు కోట్టేస్తాడు. కానీ డీమానిటైజేషన్ కారణంగా ఆ డబ్బు చెల్లవని తెలుసుకుని నిరాశపడిపోతున్న సమయంలో కలిసిన లవని వాడుకోవాలని డిసైడ్ అవుతాడు కుశ. లవ ని ఒప్పించి బ్యాంక్ లో అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తానని చెప్పి లవ ప్లేస్ లో బ్యాంక్ లో అడుగుపెడతాడు కుశ. ఈ గ్యాప్ లో ప్రేమించిన అమ్మాయి ప్రియ (రాశిఖన్నా) ని తన ప్రేమలో పడేలా చేసుకోమని లవ కి చెబుతాడు కుశ, కట్ చేస్తే..


లోన్ ఇచ్చిన వ్యక్తిని బెదిరించి, చాకచక్యంగా 5 కోట్లు దక్కేలా చేసుకుంటాడు కుశ. చెల్లని డబ్బుని బ్యాంక్ లాకర్ లో పెట్టేసి, డబ్బు మార్చడానికి ప్రయత్నాలు చేస్తాడు. సి.బి.ఐ రైడ్ జరగడంతో కుశ ఇరుక్కుంటాడు. ఇదంతా లవ చేసాడని అందరూ అనుకుంటారు. కుశ తనని మోసం చేసాడని లవ అనుకుంటాడు. సరిగ్గా ఆ సమయంలో తన మనుషులతో లవ, కుశని తన దగ్గరకు రప్పించుకుంటాడు జై. తమ అన్నయ్య జై బ్రతికే ఉన్నాడని, తను ప్రేమించిన ప్రియని జై ఎత్తుకు వచ్చాడని తెలుసుకున్న లవ షాక్ అవుతాడు. తను కొట్టేసిన డబ్బుని జై తీసుకొచ్చేసాడని తెలుసుకుని కుశ షాక్ అవుతాడు. తమ మీద అన్నయ్య పగతో రగిలిపోతున్నాడని తెలుసుకుని మరింతగా షాక్ అవుతారు. చిన్నప్పుడు తనకు గుర్తింపు రాకుండా చేసి, తనను ఎగతాళి చేసిన తమ్ముళ్లపై పగ తీర్చుకునే ప్రాసెస్ లో జై ఉంటాడు.
తమ్ముళ్ల మీద జై ఎలా పగ తీర్చుకున్నాడు... తమ అన్నయ్య ఇంత పగ పెంచుకోవడానికి కారణం తామేనని తెలుసుకున్న లవ, కుశ ఏం చేసారు... ఫైనల్ గా అన్నదమ్ములు కలుసుకున్నారా అనేది ఈ చిత్రం సెకండాఫ్.


నటీనటుల పెర్ ఫామెన్స్
ఎన్టీఆర్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక్క క్యారెక్టర్ చేస్తేనే, తన నటనతో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసేస్తాడు. ఇందులో ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా త్రిపాత్రాభినయం చేసాడు. అతి మంచితనం, సాఫ్ట్ పర్సన్ గా లవ క్యారెక్టర్ లో ఒదిగిపోయాడు. బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ చాలా బాగుంది. మనుషులను బురిడీ కొట్టించి, అమెరికాలో స్థిరపడాలనే టార్గెట్ తో ఉండే సగటు మనిషి పాత్ర కుశది. ఈ పాత్ర కోసం కొంచెం రఫ్ లుక్, బాడీ లాంగ్వేజ్ లో చిన్నపాటి కరుకుదనం, వ్యంగంతో కూడుకున్న డైలాగ్ డెలివరీతో అదరగొట్టేసాడు ఎన్టీఆర్. ఇక మూడోది నెగటివ్ షేడ్ తో కూడుకున్న జై పాత్ర. నత్తి, రఫ్ లుక్, టోటల్ గా బాడీ లాంగ్వేజ్ లో ఛేంజ్, అద్భుతమైన నటనతో రెచ్చిపోయాడు. హీరోయిన్లు రాశిఖన్నా, నివేదా థామస్ పాత్రల నిడివి తక్కువ. నటనకు పెద్ద స్కోప్ లేదు. అయినా సరే పాత్రల పరిధిమేరకు నటించారు. సాయికుమార్, పోసాని కృష్ణమురళి, అభిమన్యు సింగ్, రోనిత్ రాయ్ అందరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసారు. తమన్నా ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. తమన్నాని హీరోయిన్ గా అభిమానించేవారికి ఈ ఐటమ్ పాట చేయడం అవసరమా అనిపిస్తుంది. ఐటమ్ పాటలను ఇష్టపడేవారికి పండగలా అనిపిస్తుంది.


సాంకేతిక వర్గం
అన్నదమ్ములు కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ కలిసి చేసిన సినిమాకి డైరెక్టర్ బాబి ఎంచుకున్న స్టోరీ లైన్ బాగుంది. బ్రదర్స్ సెంటిమెంట్ ని ప్రధానాంశంగా తీసుకోవడం, మూడు పాత్రలు ఎన్టీఆర్ తో చేయించడం, ఫస్ట్ టైమ్ ఎన్టీఆర్ ని నెగటివ్ షేడ్ లో చూపించడంతోనే బాబి ఫుల్ సక్సెస్ అయ్యాడు. ఇంకొంచెం బలమైన సన్నివేశాలు రాసుకుని ఉంటే బ్లాక్ బస్టర్ హిట్ సినిమా అయ్యుండేది. కోన వెంకట్, చక్రవర్తి, బాబి ముగ్గురూ చక్కటి కో-ఆర్టినేషన్ తో స్ర్కిఫ్ట్ ని తయారు చేసారు. ఛోటా.కె .నాయుడు ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించారు. ముగ్గురు ఎన్టీఆర్ ల కోసం మూడు రకాల కలర్స్, లైటింగ్ స్కీమ్ చాలా బాగుంది. సీనియర్ ఎడిటిర్ కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ సినిమాకి ప్లస్. చిన్న కన్ ఫ్యూజ్ లేకుండా మూడు పాత్రలను కట్ చేయడంతో ఎక్కడా బోర్ కొట్టకుండా సినిమా ఫాస్ట్ గా పూర్తయిన ఫీలింగ్ కలుగుతుంది. పాటలకంటే, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మీద దృష్టి పెట్టాడు సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్. జై క్యారెక్టర్ ని తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో బాగా ఎలివేట్ చేసాడు. లొకేషన్స్ బాగున్నాయి. బాగా లాభాలను చవిచూసేలా సినిమా నిర్మాణాన్ని పూర్తి చేసారు. అనుకున్న టైంలో షూటింగ్ పూర్తి చేయడం, కోట్లు ఖర్చు పెట్టేసి సెట్లు కాకుండా, అవసరమైన మేరకు సెట్స్... అవసరమైన మేరకు ఆర్టిస్ట్ లు అంతా పక్కా ప్లాన్ తో సినిమా నిర్మాణం జరిగింది. బిజినెస్ బాగా జరిగింది. దాంతో కళ్యాణ్ రామ్ బాగా లాభాలను చవిచూసాడనే వార్తలు ఉన్నాయి.


ఫిల్మీబజ్ విశ్లేషణ
జై లవ కుశ కి ప్రధాన బలం ఎన్టీఆర్. ఫ్యాన్స్ కి పండగలాగా ఉంటుంది. స్టోరీ బాగుంది. కానీ మూడు పాత్రలకు మరింతగా బలమైన సన్నివేశాలు పడి ఉంటే ఇంకా బాగుండేది అనే ఫీలింగ్ కలుగుతుంది. మూడు పాత్రలకు ఇంకా ఎలివేషన్ ఇస్తే, మేకింగ్ కి టైమ్ పడుతుంది. బడ్జెట్ పెరుగుతుంది. అలా చేయకపోవడం వల్ల సినిమా చుట్టేసారనే ఫీలింగ్ కలుగుతుంది. ఇలాంటి లోటుపాట్లు గురించి ఆలోచించకపోతే, ఎన్టీఆర్ మూడు పాత్రల్లో విజృంభించిన తీరుకు ఫ్యాన్సే కాదు.. సినీ ప్రియులు ఫిదా అయిపోతారు. ఫ్రీ క్లయిమ్యాక్స్ అన్నదమ్ముల మధ్య సాగే సీన్స్ ఆడియన్స్ ని ఎమోషన్ కి గురి చేస్తాయి. వావ్... ఎన్టీఆర్ మాత్రమే ఇలా నటించగలడు అనడం అతిశయోక్తి కాదు. మాస్, ఫ్యామిలీ, యూత్ అందరినీ కట్టేపడేసే అంశాలతో మంచి వసూళ్లు రాబట్టగల కాన్సెఫ్ట్ తో ఈ సినిమా తెరకెక్కింది. అన్న కళ్యాణ్ రామ్, తమ్ముడు ఎన్టీఆర్ మంచి సినిమా చేసారు అనిపించుకుంటారు. డైలాగ్స్ బాగున్నాయి.


ఫైనల్ గా చెప్పాలంటే... ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో జై లవ కుశ. ఫ్యాన్స్ కి పండగే. నిర్మాతకు లాభాలు.. బయ్యర్స్ సేఫ్. టోటల్ గా సేఫ్ ఫిలిమ్.

 

 

ఫిల్మీబజ్ డాట్ కామ్ రేటింగ్ - 3.25/5



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !