View

జత కలిసే మూవీ రివ్య్వూ

Friday,December25th,2015, 12:10 PM

చిత్రం - జత కలిసే
బ్యానర్స్ - వారాహి చలన చిత్రం, ఓక్ ఎంటర్ టైన్ మెంట్స్, యుక్త క్రియేషన్స్
నటీనటులు - అశ్విన్, తేజస్విని, స్నిగ్ధ, ఫృథ్వీ, షకలక శంకర్, ధనరాజ్, సప్తగిరి, విద్యులేఖరామన్, రాంప్రసాద్, సూర్య, ప్రియ తదితరులు
ఎడిటింగ్ - కార్తీక్ శ్రీనివాస్
కెమెరా - జగదీష్ చీకటి
సంగీతం - విక్కి, సాయికార్తీక్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ - వైది
నిర్మాత - నరేష్ రావూరి
రచన, దర్శకత్వం - రాకేష్ శశి


'రాజుగారి' గది చిత్రంలో సక్సెస్ అందుకున్న హీరో అశ్విన్ చేసిన రెండో ప్రయత్నం 'జత కలిసే'. ఓంకార్ తమ్ముడిగా పరిచయం అయిన అశ్విన్ తొలి సినిమాతోనే తనకంటూ గుర్తింపు తెచ్చుకునే దిశగా దృష్టి సారించాడు. రెండో సినిమా 'జత కలిసే' కూడా ఓ డిఫరెంట్ స్టోరీ లైన్ తో రూపొందిందని, ఈ సినిమాతో తన తొలి సినిమా సక్సెస్ పరంపరను కొనసాగిస్తుందనే నమ్మకంతో ఉన్నాడు అశ్విన్. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, మాటీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన 'రేపటి దర్శకులు' అనే కార్యక్రమంలో టాప్ టెన్ లో ఒకడిగా నిలిచిన రాకేష్ శశి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అశ్విన్ సరసన తేజస్వి కథానాయికగా నటించింది. ఈ సినిమాకి అండగా వారాహి చిత్రం అధినేత సాయి కొర్రపాటి నిలవడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి ఆ అంచనాలను అందుకునే విధంగా ఈ సినిమా ఉందా తెలుసుకుందాం.


à°•à°¥
'జత కలిసే' రోడ్ జర్నీ నేపధ్యంలో సాగే సినిమా. రిషి (అశ్విన్) సాఫ్ట్ వేర్ కంపెనీ సి.ఈ.ఓ. తన ఫ్రెండ్ మ్యారేజ్ క్యాన్సిల్ అవ్వడంతో అమెరికా వెళ్లిపోవాలనుకుంటాడు. వైజాగ్ నుంచి హైదరబాద్ వరకూ ఓ క్యాబ్ లో జర్నీ చేస్తాడు రిషి. అదే క్యాబ్ లో పింకి (తేజస్వి) కూడా హైదరాబాద్ ట్రావెల్ చేస్తుంది. క్యాబ్ ని బంగారం (స్నిగ్ధ) డ్రైవ్ చేస్తుంది. ఈ జర్నీలో తన ఫ్రెండ్ గురించిన షాకింగ్ విషయాన్ని తెలుసుకుంటాడు రిషి. ఆ షాకింగ్ న్యూస్ ఏంటీ... పింకీ తో కలిసి రిషి చేసిన ఈ జర్నీ ఎలాంటి మలుపులు తీసుకుంది. వారిద్దరికి ఎదురైన అనుభవాలేంటో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.


నటీనటుల పెర్ ఫామెన్స్
రిషి పాత్రను చాలా బాగా పోషించాడు అశ్విన్. ఓ సాప్ట్ వేర్ కంపెనీ సి.ఈ.ఓ గా బాడీ లంగ్వేజ్ స్టైల్ గా ఉంది. తన తొలి చిత్రం 'రాజుగారి గది' కంటే ఈ చిత్రంలో నటన పరంగా అశ్విన్ ఇంకా ఇంఫ్రూవ్ అయిన విషయం స్ఫష్టంగా తెలుస్తుంది. డ్యాన్స్, ఎక్స్ ప్రెషన్స్ పరంగా కూడా అశ్విన్ కి ప్లస్ మార్కులు పడతాయి. ఓవరాల్ గా అశ్విన్ కి రెండో సినిమా మంచి మలుపే అవుతుంది. తేజస్వి ఎప్పటిలానే క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకుంటుంది. పింకీ పాత్రలో ఒదిగిపోయింది, స్నిగ్ధ, ఫృధ్వీ, మధునందన్, వైవా హర్ష, సప్తగిరి, షకలక శంకర్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసారు. మిగతా నటీనటులు తమ పాత్రల పరిధిమేరకు నటించారు.


సాంకేతిక వర్గం
ఈ స్టోరీ లైన్ రొటీన్ స్టోరీ లైన్ లానే అనిపిస్తుంది. కాకపోతే స్ర్కీన్ ప్లే పరంగా మాత్రం డైరెక్టర్ రాకేష్ శశి తీసుకున్న కేర్ సినిమా పట్ల ఆసక్తిని కలిగిస్తుంది. టేకింగ్ కూడా బాగుంది. తొలి సినిమా అయినప్పటికీ రాకేష్ శశి కి స్ర్కీన్ ప్లే పై ఉన్న పట్టును తెలియజేస్తుంది. విక్కి, సాయికార్తీక్ అందించిన పాటలు బాగున్నాయి. వైది బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. ప్రేక్షకులు సినిమాలో ఇన్ వాల్వ్ అయ్యేలా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేయగలిగారు. ఎడిటింగ్ బాగుంది. సినిమా ఎక్కడా ల్యాగ్ అనిపించలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. కథకు సరిపడా బడ్జెట్ సమకూర్చారు నిర్మాత.


ఫిల్మీబజ్ విశ్లేషణ
ఫస్టాప్ ని ఎంటర్ టైన్ మెంట్ వేలో తీసుకెళ్లడం బాగుంది. చాలా రిలాక్స్ గా ఫస్టాప్ చూసిన ఫీల్ కలుగుతుంది. సెకండాఫ్ లో కొంచెం ఎంటర్ టైన్ మెంట్ మిస్ అవ్వడం ప్రేక్షకులను నిరాశ పరుస్తుంది. కానీ సెకండాఫ్ సెంటిమెంట్స్ సీన్స్ ప్రేక్షకులను కట్టి పడేస్తాయి. ముఖ్యంగా ప్రీ క్లయిమ్యాక్స్, క్లయిమ్యాక్స్ చాలా ఆసక్తికరంగా మలచడం సినిమాకి చాలా ప్లస్. షార్ట్ ఫిలిం చేసిన అనుభవం డైరెక్టర్ కి బాగా పనికొచ్చిందని చెప్పాలి. ఎందుకంటే సినిమా లెంగ్త్ ఎక్కువ కాకుండా అవసరంమేరకు సన్నివేశాలతో అలరించాడు. చిన్నపాటి ట్విస్ట్ లు ఉంటే సినిమా ఇంకా ఆసక్తిగా అనిపించి ఉండేది. ఏదేమైనా ఈ సినిమాకి ఏం ఆశించి ప్రేక్షకులు వస్తారో అది మిస్ అవ్వరు. మంచి చిత్రాలను సపోర్ట్ చేస్తున్న సాయి కొర్రపాటి ఈ చిత్రానికి సపోర్ట్ చేసి మరోసారి తన అభిరుచిని తెలిజేసారు. రొటీన్ చిత్రాలకు భిన్నంగా ఉన్న ఈ సినిమా మంచి టాక్ తో పాటు వసూళ్ల పరంగా కూడా సంతృప్తి పరిచే అవకాశముంది.


ఫైనల్ గా చెప్పాలంటే... జతగా ఈ జర్నీని ఎంచక్కా ఎంజాయ్ చెయ్యొచ్చు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !