View

Temper movie review

Friday,February13th,2015, 07:45 AM

చిత్రం - టెంపర్
బ్యానర్ - పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్
నటీనటులు - ఎన్టీఆర్, కాజల్, రమాప్రభ, ప్రకాష్ రాజ్, తనికెళ్ల భరణి, సుబ్బరాజు, పోసాని కృష్ణమురళి, మధురిమ, సోనియా అగర్వాల్, పవిత్ర లోకేష్, రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి, అలీ, సప్తగిరి, కోవై సరళ తదితరులు
సంగీతం - అనూప్ రూబెన్స్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ - మణిశర్మ
సినిమాటోగ్రపీ - శ్యామ్.కె.నాయుడు
ఎడిటింగ్ - యస్.ఆర్.శేఖర్
కథ - వక్కంతం వంశీ
సమర్పణ - శివబాబు బండ్ల
నిర్మాత - బండ్ల గణేష్
డైలాగ్స్, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - పూరి జగన్నాధ్
విడుదల తేదీ - 13.02.2015

దాదాపు పదేళ్ల క్రితం ఎన్టీఆర్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన 'ఆంధ్రావాలా' ఆశించిన ఫలితం ఇవ్వలేదు. అప్పట్నుంచీ ఎన్టీఆర్ కి ఒక్క హిట్ బాకీపడిపోయానంటూ పూరి జగన్నాథ్ పలు సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చాడు. మంచి కథ కుదిరితే మళ్లీ ఎన్టీఆర్ తో సినిమా చేయాలనీ, ఈసారి హిట్ సినిమా తీయాలనీ అనుకున్నాడు పూరి. మామూలుగా తన చిత్రాలకు తానే కథ రాసుకునే పూరీ ఈసారి వక్కంతం వంశీ ఇచ్చిన కథను ఎంపిక చేసుకుని ఎన్టీఆర్ తో 'టెంపర్ 'తీశాడు. మరి.. ఒకసారి ఫ్లాప్ చవిచూసిన ఎన్టీఆర్, పూరి కాంబినేషన్ ఈసారి వర్కవుట్ అవుతుందా? వక్కంతం వంశీ కథ వీరికి హిట్ ఇస్తుందా?.. ఆ విషయాలే తెలుసుకుందాం...

కథ
దయ (ఎన్టీఆర్) ఓ అనాథ. పోలీసులు దండుకుంటున్న మామూళ్లు చూసి, పోలీస్ అయితే జీవితం సుఖంగా ఉంటుందని ఫిక్స్ అయిపోతాడు. ఆ లక్ష్యం నెరవేర్చుకోవడానికి పదో తరగతి వరకు పట్టుదలగా చదువుతాడు. ఆ తర్వాత లంచాలు ఇచ్చి మరీ డిగ్రీలు సంపాదిస్తాడు. ఫిజికల్ టెస్ట్ లో పాస్ అయ్యి సూపర్ డెంట్ ఆఫ్ పోలీస్ అవుతాడు. అక్కడి నుంచి దయ లేకుండా, నీతి నిజాయితీలను పక్కన పెట్టి లంచాలు తీసుకుంటాడు. పోలీసాఫీసర్ అయినందుకు కనీసం ఓ మంచి పని కూడా చేయడు. తోటి యస్.ఐ లకు సైతం దయ అంటే గౌరవం ఉండదు. అలాంటి దయను తన అవినీతి దందాలకు చేదోడువాదోడుగా ఉంటాడని హయ్యర్ అఫీషియల్స్ తో మాట్లాడి, దయకి వైజాగ్ లో పోస్టింగ్ వేయిస్తాడు వాల్తేరు వాసు (ప్రకాష్ రాజ్).
వైజాగ్ వచ్చిన దయ టోటల్ గా వాల్తేరు వాసుకు సపోర్ట్ గా ఉంటూ లంచాలు తీసుకుంటాడు. అక్కడ శాన్వి (కాజల్ అగర్వాల్)తో ప్రేమలో పడతాడు దయ. ఓ సిట్యువేషన్ లో వాల్తేర్ వాసు మనుషులు ఓ అమ్మాయిని (మధురిమ)ను కిడ్నాప్ చేయడానికి బదులు దయ గర్ల్ ఫ్రెండ్ శాన్విని కిడ్నాప్ చేస్తారు. తన గర్ల్ ఫ్రెండ్ కోరిక మేరకు వాసు కిడ్నాప్ చేయాలనుకున్న అమ్మాయి (మధురిమ)ని కాపాడే బాధ్యత దయ మీద పడుతుంది. దాంతో వాసుతో దయ విభేదించాల్సి వస్తుంది. వాసు తమ్ముళ్లు ఓ అమ్మాయిని 40రోజుల పాటు రేప్ చేసి చంపేస్తారు.ఆ సాక్ష్యం దయకు ఇచ్చి తన చెల్లెలును చంపిన వారిని ఉరి తీయించమని చెబుతుంది మధురిమ. అప్పటివరకూ వాసు దగ్గర లంచాలు తీసుకున్న దయ మరి... వాసు తమ్ముళ్లను ఊరి తీయిస్తాడా? అనేదే క్లయమ్యాక్స్.

నటీనటులు
ఎన్టీఆర్ మంచి నటుడు. ఆ విషయాన్ని కొత్తగా చెప్పక్కర్లేదు. ఈ చిత్రంతో మరోసారి ఆ విషయం నిరూపితమైంది. దయా పాత్రను అద్భుతంగా పోషించాడు. డాన్సులు బాగా చేశాడు. ఫైట్స్ ఇరగదీశాడు. చివరికి కోర్టు సీన్లో ఎమోషన్ సన్నివేశాల్లో హార్ట్ ని టచ్ చేశాడు. ఫిజిక్ కూడా బాగుందని తను చొక్కా విప్పిన సీన్ చూసినవాళ్లు అనకుండా ఉండలేరు. ఇక, కథానాయికగా కాజల్ అగర్వాల్ అందంగా ఉంది. శాన్వీ పాత్రకు ఎంత చేయాలతో అంతా చేసింది. ఈ ఇద్దరి తర్వాత ప్రముఖంగా చెప్పుకోవాల్సింది పోసాని కృష్ణమురళీ గురించి. సిన్సియర్ పోలీస్ నారాయణమూర్తిగా పోసాని బాగా నటించాడు. ప్రకాష్ రాజ్, సుబ్బరాజు, వెన్నెల కిశోర్, తనికెళ్ల భరణి, మధురిమ, సోనియా అగర్వాల్ తదితరులు పాత్రల మేరకు నటించారు.

సాంకేతిక వర్గం
వక్కంతం వంశీ అందించిన కథ గొప్పగా లేదు. ఈ కథలో బలం క్లయిమాక్స్ లో వచ్చే చిన్న ట్విస్ట్. బహుశా అది నచ్చి ఈ కథను అంగీకరించి ఉంటారేమో. అంతే తప్ప చెప్పుకోదగ్గ కథ కాదు. ముందు అవినీతి చేసి, తర్వాత నీతిగా మారే పోలీసాఫీసర్ కథలు చాలానే వచ్చాయి. ఒక్క ట్విస్ట్ మినహా కథలో కొత్తదనం ఏదీ లేదు. పూరి టేకింగ్ అంటారా? ఎలాంటి కథని అయినా బాగా తీయగల నేర్పు ఉంది. కాకపోతే కథ విషయంలో జాగ్రత్త తీసుకోకపోతే ఎంత బాగా తీసినా ఏం లాభం? సినిమాలో మిగతా సాంకేతిక వర్గం విషయానికొస్తే.. పూరి రాసిన సంభాషణలు బాగున్నాయి. అనూప్ రూబెన్స్ ఇచ్చిన పాటలు ఓ మోస్తరుగా ఉన్నాయి. 'హే భగవాన్..' పాట కొంచెం బాగుంది. కెమెరా పనితనం మెచ్చుకోదగ్గ విధంగా ఉంది. ఇతర శాఖలు మ..మ.. అనిపించుకున్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఫిల్మీబజ్ విశ్లేషణ
ఏ సినిమాకైనా కథే ఆయువుపట్టు. అదే సోసోగా ఉంటే సినిమా పట్టు తప్పుతుంది. 'టెంపర్' విషయంలో అదే జరిగింది. 'టెంపర్' అని టైటిల్ పెట్టినందుకో ఏమో.. మామూలు సన్నివేశాల్లో కూడా హీరో క్యారెక్టర్ పెద్దగా అరిచి, డైలాగ్స్ చెబుతుంటుంది. అది అతికినట్లుగా లేదు. అలాగే, హీరోయిన్ ని చూడగానే హీరో లవ్ లో పడిపోతాడు. తనకోసం మంచివాడిగా మారిపోతాడు. ఆ రేంజ్ లో మారిపోయేంత కెమిస్ర్టీ ఇద్దరి మధ్య ఉండదు. సో.. లవ్ ట్రాక్ పండదు. ఫస్టాఫ్ లో కథే లేదు. హీరో చేసే మోసాలతో సినిమా ఫ్రథమార్ధం సా..గు..తుంది. సరే.. ఫస్టాఫ్ ఇలా సా..గింది కదా ద్వితీయార్ధం అయినా కొంచెం బాగుంటుందేమో అనే అంచనాతో ప్రేక్షకుడు ఉంటాడు. సెకండాఫ్ కూడా కాసేపు సాగి, అసలు ట్విస్ట్ క్లయిమాక్స్ కి పది, పదిహేను నిమిషాల ముందు వస్తుంది. అక్కణ్ణుంచి కథ ఆసక్తికరంగా ఉంటుంది. కానీ, ఆ పది నిమిషాల ఆసక్తి కోసం మిగతా రెండు గంటలు అసహసంగా కుర్చీలో కదులుతూ కూర్చోవాలా? అని ఆలోచించనంత తెలివితక్కువ వాళ్లు కాదు ప్రేక్షకులు. ఈ పది, పదిహేను నిమిషాల ట్విస్ట్ కి ముందు వచ్చే కథ ఇంకా బాగుండి ఉంటే బాగుంటుంది కదా అని అనుకోకుండా ఉండరు.

ఫైనల్ గా చెప్పాలంటే.. ఇది పక్కా మాస్ మసాలా మూవీ. బ్రహ్మాండంగా ఉందని చెబితే సినిమా నచ్చినవాళ్లకి ఆనందంగా ఉంటుంది. అసలేం బాగాలేదు అంటే.. నచ్చనివాళ్లకి పరమానందంగా ఉంటుంది. ఈ సినిమా చూసినవాళ్లల్లో రెండో జాబితానే ఎక్కువ. అందుకే, కొంతమందిని హర్ట్ చేసేకన్నా చాలామందిని ఆనందపరచడం సబబు కాబట్టి, టెంపర్.. చాలా టార్చర్ అండీ బాబూ... ఒకవేళ సినిమా కమర్షియల్ గా హిట్ అయితే.. అది మాస్ ప్రేక్షకుల పుణ్యమే.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !