View

కబాలి మూవీ రివ్య్వూ

Friday,July22nd,2016, 10:12 AM

చిత్రం - కబాలి
బ్యానర్ - షణ్ముక ఫిలింస్
నటీనటులు - రజనీకాంత్, రాధికా ఆప్టే, ధన్సిక, కిశోర్, జాన్ విజయ్ తదితరులు
కెమెరా - మురళి
సంగీతం - సంతోష్ నారాయణ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - దేవి-శ్రీదేవి
నిర్మాతలు - కె.పి.చౌదరి, కె.ప్రవీణ్
సమర్పణ - కలైపులి థాను
దర్శకత్వం - పా.రంజిత్


సినిమా రంగంలో సాటిలేని స్టార్ ర‌జ‌నీకాంత్. ఆయ‌న సినిమా చేస్తున్నారంటే త‌మిళ‌నాటే కాదు ఇటు సౌత్ అంత‌టా, అటు నార్త్ లోనూ, ఒక్క మాట‌లో చెప్పాలంటే ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌లు దేశాల్లో ఆయ‌న అభిమానులు, సినిమా ప్రేమికులు ఆ చిత్రం కోసం ఎదురుచూస్తుంటారు. అలా అందరూ ఎదురుచూస్తున్న రజనీకాంత్ 'కబాలి' చిత్రం ఈ రోజు (22.7.2016) ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యింది. నోట్లో కాస్ట్ లీ సిగార్ పైప్‌తో, సాల్ట్ పెప్ప‌ర్ లుక్‌తో రాజ‌సంగా కుర్చీలో కూర్చున్న ఆయ‌న ఫ‌స్ట్ లుక్ కు భారీ స్పందన లభించింది. ఈ లుక్ విడుదలైనప్పట్నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా నాలుగు వేల థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రం భారీ అంచనాలను అందుకునే విధంగా ఉందా తెలుసుకుందాం.


కథ
కబాలి అలియాస్ కబాలీశ్వరన్ (రజనీకాంత్) మలేషియాలో పెద్ద గ్యాంగ్ స్టర్. ప్రీప్లాన్డ్ గా కబాలిపైన దాడి జరుగుతుంది. ఆ దాడిలో గర్భవతి అయిన కబాలి భార్య గాయాల పాలవుతుంది. కబాలి పోలీసులకు చిక్కుతాడు. రకరకాల కేసులు బనాయించి కబాలిని 25యేళ్ల పాటు జైలు పాలయ్యేలా చేస్తారు. ఇది కబాలి ప్ల్యాష్ బ్యాక్. 25యేళ్ల తర్వాత జైలు నుంచి కబాలి బయటికి రావడంతో సినిమా ఆరంభమవుతుంది. కబాలి అనుచరుడు అమీర్ జైలు నుంచి కబాలీని రిసీవ్ చేసుకుంటాడు. తన భార్య ఆ దాడిలో చనిపోయిందని అమీర్ ద్వారా తెలుసుకుంటాడు. మలేషియాలో అంతా మారిపోయిందని 25 యేళ్ల క్రితం తను దేనికోసమైతే పోరాడాడో ఆ సమస్య ఇంకా అధికమయ్యిందని తెలుసుకుంటాడు కబాలి. మలేషియాలో ఉంటున్న తమిళ విద్యార్ధులు డ్రగ్స్ అమ్మడం, వాటికి బానిసవ్వడం, చదువులు లేకుంగా గ్యాంగ్ స్టర్ లుగా మారుతున్న వైనాన్ని కబాలికి చెబుతాడు అమీర్. దాంతో మళ్లీ తన గ్యాంగ్ స్టర్ జీవితాన్ని మొదలుపెడతాడు. మలేషియాని తన గుప్పెట్లో పెట్టుకుని అరాచకాలు సృష్టిస్తున్న 43 గ్యాంగ్ ని నాశనం చేయడం కోసం పోరాటం మొదలుపెడతాడు. అందులో భాగంగా కబాలికి రకరకాల సవాళ్లు ఎదురవుతాయి. అలాగే తన భార్య కుందనవల్లి (రాధిక ఆప్టే) బ్రతికే ఉందని తెలుసుకుంటాడు. కబాలిని చంపడానికి ప్రత్యర్ధులు పన్నిన కుట్ర నుంచి కూతురు యోగి (ధన్సిక) కబాలిని కాపాడుతుంది. అలా తన కూతురుని కలుసుకున్న యోగి తన భార్య ఇండియాలో ఉందని తెలుసుకుంటాడు. మరి మలేషియాలో ఉన్న కబాలి తన భార్య కుందనవల్లిని కలుసుకుంటాడా... మలేషియాలో కబాలి చేస్తున్న పోరాటం సఫలమవుతుందా... అసలు కబాలి ఎందుకు గ్యాంగ్ స్టర్ గామారాడు... చివరికి కబాలి కథ ఎలా ముగుస్తుంది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.


నటీనటుల పెర్ ఫామెన్స్
రజనీకాంత్ చర్మిషా ప్రధాన బలంగా తెరకెక్కిన చిత్రం ఇది. ఇందులో రజనీకాంత్ ఓ వయసైన గ్యాంగ్ స్టర్ గా, ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఆవేశపరుడైన యువకుడిగా నటించారు. ఈ రెండు పాత్రలకు పూర్తి న్యాయం చేసారు రజనీ. తనదైన స్టైల్, బాడీ లాంగ్వేజ్ తో ఈ రెండు క్యారెక్టర్స్ లోనూ రజనీ అటు అభిమానులతో పాటు ఇటు కామన్ ఆడియన్స్ ని కూడా ఇంప్రెస్ చేసారు. కాస్ట్యూమ్స్ బాగున్నాయి. గ్యాంగ్ స్టర్ గా ఆయన కాస్ట్యూమ్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. భార్య అంటే తనకెంత ఇష్టమో చెప్పే సన్నివేశాల్లో రజనీ నటన అద్భుతం.


రాధిక ఆప్టే అద్భుతంగా నటించింది. కుందనవల్లి క్యారెక్టర్ కి బాగా సూట్ అయ్యింది. మంచి చేసేటప్పుడు ఎలాంటి భయం లేకుండా చేయాలని భర్తను మోటివేట్ చేసే క్యారెక్టర్ కుందనవల్లిది. ఈ పాత్రలో హుందాగా, చక్కటి అభనయం చూపించింది. సీతారామరాజుగా నాజర్ చాలా చక్కటి పాత్ర చేసారు. విలన్ గా నటించిన విన్స్టర్ చౌ స్టైల్ గా బాగున్నాడు. కిషోర్, ధన్సిక కూడా తమ పాత్రలకు న్యాయం చేసారు.


సాంకేతిక వర్గం
డైరెక్టర్ రంజిత్ కి రియలిస్టిక్ గా సినిమాని తెరకెక్కిస్తారనే పేరు ఉంది. ఈ సినిమాని కూడా కబాలి అనే గ్యాంగ్ స్టర్ జీవిత కథను చాలా రియలిస్టిక్ గా ఆవిష్కరించడానికి ప్రయత్నించారు. కథతో పాటు రజనీకాంత్ ఇమేజ్ ని కూడా దృష్టిలో పెట్టుకుని రజనీ అభిమానులను శాటిస్ ఫై చేసే విధంగా సన్నివేశాలు అల్లుకోవడానికి ప్రయత్నం చేసారు. కాకపోతే ఓ బలమైన కథను అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా చెప్పడంలో మాత్రం విజయం సాధించలేకపోయారు. రజనీకాంత్ ని ఈ వయసులో ఓ మాస్ సినిమాలో చూపించడం అంటే అంత ఈజీ కాదు. ఆ పరంగా మాత్రం రంజిత్ సక్సెస్ సాధించారు. ఫ్ల్యాష్ బ్యాక్ లో రజనీని యువకుడిగా చూపించడం, సీన్స్ ని ఊపుగా చిత్రీకరించడం, ఆ సీన్స్ కోసం కలర్, లైట్, సౌండ్ విషయంలో పాటించిన జాగ్రత్తలు రంజిత్ చేసిన మ్యాజిక్. సంతోష్ నారాయణ్ సంగీతం అందించారు. 'నిప్పుడా....' పాట ఆడియన్స్ కి రెట్టింపు ఉత్సాహాన్ని ఇస్తుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి మేజర్ హైలైట్. ఫోటోగ్రఫీ సూపర్. యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి. కలైపులి థాను ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా చాలా రిచ్ గా సినిమాని తెరకెక్కించారు.


ఫిల్మీబజ్ విశ్లేషణ
రజనీకాంత్ సినిమాలంటేనే ప్రేక్షకులు ఆశించేది ఆయన స్టైల్, మ్యానరిజమ్స్. ఓ ఫ్లో లో ఆయన చెప్పే డైలాగులు ఆడియన్స్ కి మంచి కిక్ ఇస్తాయి. రొటీన్ కథ అయినప్పటికీ, రజనీ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని సినిమా చేస్తే, ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడం గ్యారంటీ. అయితే ఈ సినిమాలో అలాంటి అంశాలు చాలా తక్కువ. రజనీకాంత్ స్టైల్ గా నడిస్తే చూడాలని, డైలాగులు చెబితే వినాలని ఆడియన్స్ ఎదురుచూస్తారు. కానీ వయసు మీద పడటంతో రజనీ ఇవన్ని చేయలేకపోయారు. ఆ లోపం స్ఫష్టంగా కనిపించింది. తన మ్యాజిక్ తో రంజిత్ కొంతవరకూ ఈ లోటును భర్తీ చేయగలిగారు. అలాగే మలేషియా నేపధ్యం ఈ సినిమాకి ఓ మైనస్ అనే చెప్పాలి. సౌత్ లోని రజనీకాంత్ అభిమానులకు ఈ నేపధ్యం అంతగా కనెక్ట్ అవ్వదు. ఎక్కువమంది ఆర్టిస్ట్ లు మనవాళ్లు కాకపోవడం కూడా మైనస్. తన భార్యను కలుసుకోవడానికి రజనీ పడే తపన, ఆ సీన్స్ తెరకెక్కించిన విధానం ఆడియన్స్ ని సినిమాలో లీనమయ్యేలా చేస్తుంది. సెకండాఫ్ చాలా పాస్ట్ గా పూర్తయినట్టు ఉండటం సినిమాకి ప్లస్.


పైనల్ గా చెప్పాలంటే... రజనీకాంత్ అభిమానులు ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు. కామన్ ఆడియన్స్ కి మాత్రం ఈ సినిమా అంతగా కనెక్ట్ అయ్యే అవకాశంలేదు.

 Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. రీ ఎంట్రీకి ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయత్తమవుతున్నాడు. 'శ్రీమంతుడు' చిత్రం త ..

Read More !

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ్యాప్ తీసుకోకుండానే 151వ సినిమా చేయడా ..

Read More !

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కైనా సంతోషంగానే ఉంటుంది. కానీ ఆ అవకాశం ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా విడుదలై భారీ వసూళ్లను సాధించిన విష ..

Read More !

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధరమ్ తేజ్, బోయపాటి శ్రీను సినిమాలు చేస్ ..

Read More !

Gossips

మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ గతంలో శిరీష్ భరద్వాజను ప్రేమించి, ..

రాంచరణ్ కి నోటి దురుసు ఎక్కువ అని తెలుగు సినిమా పరిశ్రమలో ఓ టాక్ ఉంది. ఆ వార ..

'రక్తచరిత్ర' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన రాధికా ఆప్టే తనలో మంచి నట ..

బాలీవుడ్ లో భారీ సినిమాలను నిర్మిస్తూ, పంపిణీ చేస్తున్న ఈరోస్ ఇంటర్నేషనల ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో 10రోజుల్లో 'జనతా గ్యారేజ్' షూటింగ్ తో బిజీ అవ్వబోతున ..

మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ సినిమా అంటే భారీ అంచనాలు ఉం ..

సీన్ ఉంది కదా అని ఓవర్ గా బిల్డప్ ఇస్తే సీన్ సితార్ అవుతుంది. విలన్ గా దూసుక ..

'బాహుబలి ది కంక్లూజన్' చిత్రం విడుదలైన వెంటనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో రాజమౌ ..

ప్రిన్స్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందితే బాగుంటుందని ..

మెగాబ్రదర్స్ మధ్య విభేదాలు ఉన్నాయా లేవా అనే విషయం గురించి కొంతకాలం క్రిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ సినిమా అంటే ..

యంగ్ రెబల్ స్టార్ ఫ్రభాస్ తో 'మిర్చి' లాంటి హిట్ చిత్రం చేసిన తర్వాత కొరటాల ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ లో వచ్చే యేడాది ఓ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ సినిమా అంటే ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్, హీరోయిన్ రెజీనా ఘాటుగా ప్రేమించుకుంటున్నార ..

ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ జాబితాలో కొరటాల శివ పేర ..

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ..

రాజకీయనేత పరిటాల రవి చనిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది. కానీ ఆయన్ను అభిమ ..

'బాహుబలి 2' పూర్తయిన వెంటనే రాజమౌళి మరో భారీ బడ్జెట్ చిత్రం 'గరుడ' ను ఆరంభించ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ సినిమా అంటే ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Is Prabhas decision right to do Baahubali- what his fans says? 

Prabhas, Rana Baahubali movie trailor

Charmme Kaur starrer Jyothi Lakshmi Song Making video 

Raviteja Starrer Power (Song 4) 10Sec Promo

Nitin Nash Movie Opening Held at Annapurna Studio.

Read More !