View

Uttama Villain Movie Review

Sunday,May03rd,2015, 02:52 AM

చిత్రం - ఉత్తమ విలన్
సమర్పణ - ఈరోస్ ఇంటర్నేషనల్
బ్యానర్స్ - సి.కె.ఎంటర్ టైన్ మెంట్స్
నటీనటులు - కమలహాసన్, జయరామ్‌, కె.బాలచందర్‌, కె.విశ్వనాథ్, నాజర్‌, ఊర్వశి, ఆండ్రియా, పూజా కుమార్‌, పార్వతి మీనన్‌, పార్వతి నాయర్‌ తదితరులు
à°•à°¥, స్క్రీన్‌ప్లే, మాటలు - కమల్‌హాసన్‌
సంగీతం - à°Žà°‚.జిబ్రాన్‌
సినిమాటోగ్రఫీ - శ్యామ్‌దత్‌
ఎడిటింగ్‌ - విజయశంకర్‌
లైన్‌ ప్రొడ్యూసర్‌ - జి.కుమార్‌బాబు
కో- ప్రొడ్యూసర్‌ - సి.వి.రావు
నిర్మాత - సి.కళ్యాణ్‌
దర్శకత్వం - రమేష్‌ అరవింద్

దేశం గర్వించదగ్గ నటుల్లో ఒకరుగా పేరు తెచ్చుకున్న లోకనాయకుడు కమలహాసన్ కథ, స్ర్కీన్ ప్లే, మాటలు సమకూర్చి, హీరోగా నటించిన తాజా చిత్రం 'ఉత్తమ విలన్'. కమలహాసన్ గత కొన్ని సినిమాలు ఎదుర్కొంటున్న సమస్యలనే ఈ సినిమా కూడా ఎదుర్కొంది. ఎన్నో వివాదాలను దాటుకుని విడుదల విషయంలో కూడా ప్రాబ్లమ్స్ ని ఎదుర్కొని చివరికి మే 2న ఈవినింగ్ షోస్ తో సినిమా విడుదలయ్యంది. ఎన్ని వివాదాలు నెలకొన్నప్పటికీ, తెయ్యుమ్ కళాకారుడిగా కమలహాసన్ ఫస్ట్ లుక్ విడుదలైన రోజు నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఆ అంచనాలకు తగ్గట్టు ఈ సినిమా ఉందా అనే విషయం తెలుసుకుందాం.

à°•à°¥
చిత్ర పరిశ్రమలో ఎనలేని అభిమానులను సొంతం చేసుకున్న సూపర్ స్టార్ మనోరంజన్ (కమలహాసన్). ఓ సాధారణ వ్యక్తిని నటుడు మనోరంజన్ గా అతని గురువు కె.మార్గదర్శి (కె.బాలచందర్) తీర్చిదిద్దుతారు. నటుడు స్థాయి నుంచి సూపర్ స్టార్ వరకూ ఎదగడానికి మనోరంజన్ కి తోడ్పడిన వ్యక్తి నిర్మాత పూర్ణ చంద్రరావు (కె.విశ్వనాథ్). ఈ క్రమంలో తను ప్రేమించిన యామినిని కాదనుకుని తను సూపర్ స్టార్ రేంజ్ కి ఎదగడానికి కారణమైన పూర్ణ చంద్రరావు కూతురు వరలక్ష్మీ (ఊర్వశి)ని మనోరంజన్ పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. సాఫీగా లైఫ్ లీడ్ చేస్తున్న మనోరంజన్ కి తనకు బ్రెయిన్ ట్యూమర్, ఎక్కువ కాలం బ్రతకలేననే విషయం తెలుస్తుంది.
దాంతో తన గురువు మార్గిదర్శిని తన కోసం ఓ సినిమా చేసి పెట్టమని అడుగుతాడు మనోరంజన్. తెయ్యుమ్ కళ నేపథ్యంలో మృత్యుంజయుడిగా పేరు తెచ్చుకున్న ఉత్తముడి కథతో మనోరంజన్ హీరోగా మార్గదర్శి సినిమా మొదలుపెడతాడు. నిజ జీవితంలో మృత్యువుకు దగ్గరైన మనోరంజన్, సినిమాలో మృత్యుంజయుడుగా నటిస్తాడు. ఫైనల్ గా మృత్యువుకు దగ్గరవుతున్న మనోరంజన్ కి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? మనోరంజన్ జీవితం, సినిమా ఎలా ముగిసాయన్నదే 'ఉత్తమ విలన్' కథ

నటీనటుల పర్ ఫార్మన్స్
ఉత్తముడు, మనో రంజన్.. ఈ రెండు పాత్రల్లోనూ కమల్ అభినయం అద్భుతం. 'దశావతారం'లో ఏకంగా పది పాత్రలు చేసిన కమల్ కి ఈ రెండు పాత్రలు చేయడం పెద్ద కష్టమేం కాదు. నటన పట్ల కమల్ కి ఉన్న అంకితభావం, మమకారం మరోసారి నిరూపించిన చిత్రం ఇది. తెయ్యమ్ కళాకారుడిగా గెటప్ వేయడం మామూలు విషయం కాదు. పూజా కుమార్, ఆండ్రియా బాగా నటించారు. ఊర్వశి నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. దర్శక దిగ్గజాలు కె.బాలచందర్, కె. విశ్వనాథ్ లు నటించిన సన్నివేశాలు బాగున్నాయి. వారి స్థాయికి తగ్గ పాత్రలనే చేశారు. ఇంకా సినిమాలో ఉన్న ఇతర నటీనటులందరూ బాగా నటించారు.

సాంకేతిక వర్గం
ఏ దర్శకుడికైనా ఓ బలమైన కథ దొరకడం చాలా ముఖ్యం. అలాంటి బలమైన కథను రమేష్ అరవింద్ కి ఇచ్చారు కమలహాసన్. రెండు సమాంతర కథలతో తీసిన సినిమా ఇది. ఏ దర్శకునికైనా ఈ కథను తెరకెక్కించడం ఓ సవాల్ లాంటిది. ఆ సవాల్ లో రమేష్ అరవింద్ ఫర్వాలేదనిపించుకున్నారు. శ్యామ్ దత్ కెమెరా పనితనం భేష్. రెండు కథల మూడ్ ను ఆయన కెమెరా చక్కగా ఆవిష్కరించింది. జిబ్రాన్ స్వరపరచిన పాటలు బాగున్నాయి. సినిమా నిడివి ఎక్కువైందనే ఫీలింగ్ కలగ మానదు. అందుకని ఎడిటింగ్ విషయంలో కేర్ తీసుకుని ఉంటే బాగుండేది.

ఫిల్మీబజ్ విశ్లేషణ
ఈ కథ బ్రహ్మాండంగా ఉంది. కానీ, స్ర్కీన్ ప్లే అంత గొప్ప లేదు. అసలు కథను కొసరు కథకు అనుసంధానం చేసి తీయడంలో రమేశ్ అరవింద్ ఎక్కడో తడబడినట్లుగా అనిపిస్తుంది. కొసరు కథను కొంచెం పేలవంగా తెరకెక్కించడం సినిమా గ్రాఫ్ డౌన్ అయ్యేలా చేస్తుంది. పైగా ఈ కథలో ఉన్న సన్నివేశాలు అంత బలంగా ఉండవు. ఒకవేళ అది కూడా బలంగా ఉండి ఉంటే ఈ 'ఉత్తమ విలన్' చరిత్రలో నిలిచిపోయిన బ్రహ్మాండమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచి ఉండేది. కామెడీ, ట్రాజెడీ ఈ రెండు అంశాల మిళితంతో సినిమా సాగుతుంది. అ్కడక్కడా హార్ట్ టచింగ్ గా ఉంటుంది.

ఫైనల్ గా చెప్పాలంటే... ఈ సినిమా నిడివి ఓ మైనస్ అనే చెప్పాలి. అందుకని ప్రేక్షకుడు అక్కడక్కడా అసహనానికి గురయ్యే అవకాశం ఉంది. కొంచెం నిడివి తక్కువగా ఉండి, బలమైన కథను అంతే బలంగా తెరకెక్కించి ఉంటే 'ఉత్తమ విలన్' భేష్ అనిపించుకునేవాడు. అయితే ఇక్కడో విషయం చెప్పాలి. అరవైయేళ్ల వయసులో గంటలు గంటలు మేకప్ కు కేటాయించి, భారీ గెటప్స్ వేసుకోవడం అంటే మామూలుగా విషయం కాదు. ఆ పరంగా కమల్ కష్టం స్పష్టంగా కనిపించింది. కమల్ కోసం ఒక్కసారైనా ఈ సినిమా చూడాలి. ఆయన నటించే చిత్రాలంటే అంచనాలు ఆకాశమంత ఎత్తులో ఉంటాయి. అది కూడా ఓ మైనస్ అనే చెప్పలి. ఎందుకంటే, సినిమా ఓకే అనే విధంగా ఉన్నా.. 'అంతకు మించి' ఇంకా ఏదో ఉండాలని కోరుకుంటారు. 'ఉత్తమ విలన్'ని అలానే కోరుకుంటారు. ఏదేమైనా వేసవి శెలవుల టైమ్ పాస్ కోసం ఈ చిత్రాన్ని వీక్షించవచ్చు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !