View

ఖైదీ నెం.150 మూవీ రివ్య్వూ

Wednesday,January11th,2017, 03:26 AM

చిత్రం - ఖైదీ నెం.150
బ్యానర్ - కొణిదెల ఎంటర్ టైన్ మెంట్స్
సమర్పణ - కొణిదెల సురేఖ
నటీనటులు - చిరంజీవి, కాజల్ అగర్వాల్, తరుణ్ అరోరా, బ్రహ్మానందం, అలీ, పోసాని తదితరులు
సినిమాటోగ్రఫీ - రత్నవేలు
ఎడిటింగ్ - గౌతంరాజు
సంగీతం - దేవిశ్రీ ప్రసాద్
కథ - ఏ.ఆర్.మురుగదాస్
డైలాగ్స్ - పరుచూరి బ్రదర్స్, బుర్రా సాయిమాధవ్, వేమారెడ్డి
నిర్మాత - రాంచరణ్
స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - వి.వి.వినాయక్స
విడుదల తేదీ - 11 జనవరి, 2017


మెగాస్టార్ చిరంజీవి 9 యేళ్ల గ్యాప్ తర్వాత చేసిన ఫుల్ లెంగ్త్ సినిమా 'ఖైదీ నెం.150'. 'మగధీర', బ్రూస్ లీ చిత్రాల్లో గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చినప్పటికీ, తమ బాస్ ఫుల్ లెంగ్త్ సినిమా చేస్తే చూసి తరించాలని అభిమానులు వెయిటింగ్. ఎన్నో కథలు, ఎంతో కసరత్తు చేసి ఫైనల్ గా 'ఖైదీ.నెం.150' సినిమా చేసారు చిరు. ఇది తమిళ్ చిత్రం 'కత్తి' కి రీమేక్. తమిళంలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రం తెలుగులో కూడా భారీ విజయాన్ని అందుకుంటుందనే అంచనాలు నెలకొన్నాయి. ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత చిరు చేసిన సినిమా కావడంతో సినిమాకి మంచి హైప్ వచ్చింది. బిజినెస్ కూడా భారీగా అయ్యింది. రాంచరణ్ సొంతంగా ఈ సినిమా నిర్మించడం మరింతగా అంచనాలు పెరిగేలా చేసాయి. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది... మెగాభిమానులను సంతృప్లిపరిచే విధంగా ఉందా తెలుసుకుందాం.


కథ
కత్తి శ్రీను (చిరంజీవి) కలకత్తా జైలు నుంచి తప్పించుకుని వస్తున్న సమయంలో ఓ వ్యక్తిని కొంతమంది రౌడీలు షూట్ చేయడం చూస్తాడు. ఆ వ్యక్తి కొణిదెల శివశంకర్ ప్రసాద్ అలియాస్ శంకర్ (చిరంజీవి) సేమ్ కత్తి శ్రీనులా ఉంటాడు. తనలా ఉన్నశంకర్ ని చూసిన శ్రీను అతనిని హాస్పటల్లో అడ్మిట్ చేసి, తన ఐడెంటిఫికేషన్స్ అన్నీ అతని పక్కన ఉండేలా చేస్తాడు. పోలీసులు అక్కడికి వచ్చేలా చేస్తాడు. దాంతో హాస్పటల్లో ఉన్న శంకర్ ని చూసిన పోలీసులు శ్రీను అనుకుని జైలుకు తీసుకెళతారు. కట్ చేస్తే....


రోడ్డు మీద వెళుతున్న శ్రీనుని చూసిన కలెక్టర్ శంకర్ అనుకుని అతనిని ఓల్డ్ ఏజ్ హోమ్ కి తీసుకెళతాడు. అక్కడున్న పెద్దవాళ్లు శ్రీనుని శంకర్ అనుకుని చాలా ఆప్యాయంగా చూసుకుంటారు. శంకర్ కోసం ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో శంకర్ నీరూరు గ్రామానికి చెందిన రైతుల కోసం పోరాడుతున్నాడని, అతని ఆశయం చాలా గొప్పదని తెలుసుకుంటాడు శ్రీను. ఆ గ్రామ పెద్దలు శంకర్ చేస్తున్న పోరాటానికి అండగా నిలబడతారు. అందుకోసం ఆరుగురు ఆత్మహత్య కూడా చేసుకుంటారు. శంకర్ తలపడుతున్నది ఓ కార్పొరేట్ కంపెనీ అధినేత అగర్వాల్ (తరుణ్ అరోరా) తో అని తెలుసుకుంటాడు కత్తి శ్రీను. నీరూరు గ్రామానికి చెందిన రైతు పొలాలను లాక్కోవడానికి అగర్వాల్ ప్రయత్నాలు చేస్తున్నాడని, అందులో భాగంగానే రైతుల కోసం పోరాడుతున్న శంకర్ ని చంపేయడానికి ప్రయత్నాలు చేసారని తెలుసుకున్న కత్తి శ్రీను కూడా రైతుల కోసం పోరాడాలని ఫిక్స్ అవుతాడు. అగర్వాల్ తో ఢీ కొట్టడం మొదలుపెడతాడు. జైల్లో ఉన్న శంకర్ కి తన స్థానంలో శ్రీను ఉన్నాడని, రైతుల కోసం తను చేస్తున్న పోరాటాన్ని గెలిచి తీరాలని భావించిన శంకర్ జైలు నుంచి తప్పించుకుంటాడు. మరి శంకర్ స్థానంలో ఉన్న శ్రీను రైతులకు న్యాయం చేయగలిగాడా... తన స్థానంలో ఉన్న శ్రీనుని శంకర్ కలుస్తాడా... శంకర్ కాకుండా శ్రీను కూడా ఉన్నాడని తెలుసుకున్న అగర్వాల్ ఎలా ప్లాన్ చేస్తాడు.. ఫైనల్ గా నీరూరు గ్రామ రైతులకు న్యాయం జరుగుతుందా అనేదే ఈ చిత్ర కథ.


నటీనటుల పెర్ ఫామెన్స్
9 యేళ్ల గ్యాప్ తర్వాత చిరంజీవి చేసిన సినిమా ఇది. అయినా సరే చిరులో ఏ మాతరంం గ్రేస్ తగ్గలేదు. కామెడీ సీన్స్, డ్యాన్స్, ఫైట్స్ అన్నీ బాగా చేసాడు. ఓ బాధ్యత గల వ్యక్తిగా, రైతుల కోసం పోరాడే వ్యక్తిగా శంకర్ పాత్రలో ఒదిగిపోయాడు చిరంజీవి. కత్తి శ్రీను టోటల్ గా దీనికి కాంట్రాస్ట్ క్యారెక్టర్, మాస్ బాడీ లాంగ్వేజ్ తో ఈ పాత్రను అద్భుతంగా చేసాడు చిరు. కాజల్ అగర్వాల్ బాగుంది. నటించడానికి పెద్దగా స్కోప్ లేదు. పాటలకే పరిమితమయ్యింది. రత్తాలు ఐటమ్ సాంగ్ లో లక్ష్మీరాయ్ ఆకట్టుకుంది. బ్రహ్మానందం, అలీ, రఘబాబు నవ్వులు పూయించారు. విలన్ గా నటించిన తరుణ్ అరోరా పెద్దగా కనెక్ట్ అయ్యే అవకాశంలేదు. మిగతా నటీనటులందరూ తమ పాత్రల పరిధిమేరకు నటించారు.


సాంకేతిక వర్గం
ఈ సినిమా తమిళ్ చిత్రం 'కత్తి' కి రీమేక్. తమిళ్ వెర్షన్ ని మక్కీకి మక్కీ దింపేసారు. మార్పులు చేస్తే, స్టోరీని చెడగొట్టినట్టు అవుతుందని భావించి ఉంటాడు డైరెక్టర్ వి.వి.వినాయక్. అందుకే కథకు సంబంధించి అసలు మార్పులు చేయలేదు. కానీ చిరు ఇమేజ్, ఆయన అభిమానులను దృష్టిల్లో పెట్టుకుని డ్యాన్స్, ఫైట్స్, కామెడీ సీన్స్ విషయంలో డైరెక్టర్ వినాయక్ తీసుకున్న కేర్ స్ర్కీన్ పై కనిపిస్తుంది. అయితే క్లయిమ్యాక్స్ విషయంలో ఇంకా వర్కవుట్ చేస్తే బాగుండేది. పాటలు బాగున్నాయి. రీ-రికార్డింగ్ ఇంకా బెటర్ గా ఉంటే ఎమోషనల్ సీన్స్ కనెక్ట్ అయ్యేవి. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాగుంది. నిర్మాణపు విలువలు సూపర్బ్.


ఫిల్మీబజ్ విశ్లేషణ
చిరంజీవి 9 యేళ్ల తర్వాత చేసిన సినిమా కాబట్టి ఎక్కువ ఎక్స్ ఫెక్టేషన్స్ ఉంటాయి. ఆ ఎక్స్ ఫెక్టేషన్స్ రీచ్ అవ్వాలంటే సేఫ్ గేమ్ ఆడటం బెటర్ అనుకుని రీమేక్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉంటారు చిరు. నిజంగానే ఈ సినిమా స్టోరీ లైన్ చాలా బాగుంది. మంచి మెసేజ్ ఉంది. కధాబలం ఉన్న సినిమా కాబట్టి, దానికి చిరు ఇమేజ్ ని, మెగాభిమానులను దృష్టిలో పెట్టుకుని కమర్షియల్ హంగులు అద్దాడు వినాయక్. పెద్దగా రిస్క్ చేయలేదు. కమర్షియల్ హంగులు అభిమానులను తృప్తిపరుస్తాయి. అందులో నో డౌట్. అయితే మెయిన్ స్టోరీ లైన్ లో ఉన్న ఎమోషన్ ని మాత్రం సరిగ్గా క్యారీ చేయలేకపోయాడు. సినిమాకి మెయిన్ అయిన రైతుల సమస్యలను సరిగ్గా ఎలివేట్ చేయలేదు. భావితరాల కోసం రైతులు ఆత్మహత్య చేసుకోవడంలాంటి సీన్స్ ని ఇంకా ఎమోషనల్ గా తెరకెక్కించి ఉండాల్సింది. గొంతుకోసుకుని ఆరుగుగు రైతులు ఆత్మహత్య చేసుకోవడంలాంటి బలమైన సీన్స్ సరిగ్గా పండలేదు. పేలవంగా అనిపించాయి. సిటీకి వాటర్ రాకుండా చేసి, మీడియా దృష్టంతా తమవైపు తిప్పుకుని, రైతుల సమస్యను బయటికి తెలిసేలా చేసిన సీన్స్ బలమైనవి. అలాంటి కొన్ని సీన్స్ తప్ప.... క్లయిమ్యాక్స్ వీక్ గా ఉండటం ఈ సినిమాకి మైనస్. చిరంజీవి స్టెప్పులు, చిరు మేకోవర్ అయిన విధానం సూపర్బ్. కొన్ని డైలాగులు బాగున్నాయి. చాలా గ్యాప్ తర్వాత తెరపై చిరును చూడటం పండగలా ఉంటుంది.


ఫైనల్ గా చెప్పాలంటే... ఇది పక్కగా చిరంజీవి అభిమానులను మెప్పించే చిత్రం. కానీ చిరు 150 చిత్రంగా మాత్రం ఇంకా ఏదో కావాలనిపిస్తుంది. ఇంకా ఎక్స్ ఫెక్టేషన్స్ ఉంటాయి. ఆ అంచనాలను అందుకోలేకపోవడం నిరాశపరుస్తుంది.


ఫిల్మీబజ్ రేటింగ్ - 2.5/5Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. రీ ఎంట్రీకి ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయత్తమవుతున్నాడు. 'శ్రీమంతుడు' చిత్రం త ..

Read More !

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ్యాప్ తీసుకోకుండానే 151వ సినిమా చేయడా ..

Read More !

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కైనా సంతోషంగానే ఉంటుంది. కానీ ఆ అవకాశం ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా విడుదలై భారీ వసూళ్లను సాధించిన విష ..

Read More !

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధరమ్ తేజ్, బోయపాటి శ్రీను సినిమాలు చేస్ ..

Read More !

Gossips

మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ గతంలో శిరీష్ భరద్వాజను ప్రేమించి, ..

రాంచరణ్ కి నోటి దురుసు ఎక్కువ అని తెలుగు సినిమా పరిశ్రమలో ఓ టాక్ ఉంది. ఆ వార ..

'రక్తచరిత్ర' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన రాధికా ఆప్టే తనలో మంచి నట ..

బాలీవుడ్ లో భారీ సినిమాలను నిర్మిస్తూ, పంపిణీ చేస్తున్న ఈరోస్ ఇంటర్నేషనల ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో 10రోజుల్లో 'జనతా గ్యారేజ్' షూటింగ్ తో బిజీ అవ్వబోతున ..

మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ సినిమా అంటే భారీ అంచనాలు ఉం ..

సీన్ ఉంది కదా అని ఓవర్ గా బిల్డప్ ఇస్తే సీన్ సితార్ అవుతుంది. విలన్ గా దూసుక ..

'బాహుబలి ది కంక్లూజన్' చిత్రం విడుదలైన వెంటనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో రాజమౌ ..

ప్రిన్స్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందితే బాగుంటుందని ..

మెగాబ్రదర్స్ మధ్య విభేదాలు ఉన్నాయా లేవా అనే విషయం గురించి కొంతకాలం క్రిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ సినిమా అంటే ..

యంగ్ రెబల్ స్టార్ ఫ్రభాస్ తో 'మిర్చి' లాంటి హిట్ చిత్రం చేసిన తర్వాత కొరటాల ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ లో వచ్చే యేడాది ఓ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ సినిమా అంటే ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్, హీరోయిన్ రెజీనా ఘాటుగా ప్రేమించుకుంటున్నార ..

ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ జాబితాలో కొరటాల శివ పేర ..

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ..

రాజకీయనేత పరిటాల రవి చనిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది. కానీ ఆయన్ను అభిమ ..

'బాహుబలి 2' పూర్తయిన వెంటనే రాజమౌళి మరో భారీ బడ్జెట్ చిత్రం 'గరుడ' ను ఆరంభించ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ సినిమా అంటే ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Is Prabhas decision right to do Baahubali- what his fans says? 

Prabhas, Rana Baahubali movie trailor

Charmme Kaur starrer Jyothi Lakshmi Song Making video 

Raviteja Starrer Power (Song 4) 10Sec Promo

Nitin Nash Movie Opening Held at Annapurna Studio.

Read More !