View

'కిల్లింగ్ వీరప్పన్' మూవీ రివ్య్వూ

Thursday,January07th,2016, 12:46 PM

చిత్రం - కిల్లింగ్ వీరప్పన్
నటీనటులు - శివరాజ్ కుమార్, సందీప్ భరద్వాజ్, పారుల్ యాదవ్, యాజ్న శెట్టి, సంచారి విజయ్, రాక్ లైన్ వెంకటేష్ తదితరులు
సినిమాటోగ్రఫీ - రామీ
సంగీతం - శాండీ
మాటలు - శశాంక్ వెన్నెలకంటి
నిర్మాతలు - శివప్రకాష్, మంజునాధ్ సుధీంద్ర
కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - రాంగోపాల్ వర్మ


''ఒకే ఒక్క క్రిమినల్ని 1200 మంది పోలీసులు 15 సంవత్సరాలు పాటు ఎందుకు పట్టుకోలేకపోయారనేది భారత దేశపు క్రైమ్ చరిత్రలోనే ఒక మరిచిపోలేని చాప్టర్. వీరప్పన్ని పట్టుకోవటానికి ట్రై చేసి పోలీస్ డిపార్టుమెంటులోని కొన్ని వందలమంది ఎన్నో రకాలుగా తమ ప్రాణాలను కోల్పోయారు. కాని చివరికి ఒక పోలీస్ ఆఫీసరే కనీ వినీ ఎరుగని ఒక ఇంటలిజెన్స్ ఆపరేషన్లో వీరప్పన్ని చంపేశారు. ఈ స్టోరీ అందరికీ తెలిసిందే. అయితే ఇదే స్టోరీని వెండితెరపై చూడటం చాలా ఆసక్తిగా ఉంటుంది. పైగా రాంగోపాల్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. ఆ ఆసక్తి సినిమా విడుదల కోసం అందరూ ఎదురుచూసేలా చేసింది. ఈ రోజు (7.1.2016) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి అందరి అంచనాలను చేరుకునే విధంగా ఈ సినిమా ఉందా తెలుసుకుందాం.


à°•à°¥
చందనపు స్మగ్లర్ వీరప్పన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఇది. వీరప్పన్ ని తుది ముట్టించడానికి ఎన్నో ఆపరేషన్లు జరుగుతాయి. అవేవి సఫలమవ్వని నేపధ్యంలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీంతో కలిసి ఓ ప్రణాళిక రచించి రంగంలోకి దిగుతాడు కన్నన్. ఈ ఆపరేషన్ చేపట్టిన కొద్ది రోజుల్లోనే వీరప్పన్ అడవుల్లో ఉండగా చంపడం అసంభవం అనే విషయాన్ని తెలుసుకుంటాడు. దాంతో ఎలాగైనా అడవి నుంచి బయటికి రప్పించడానికి ప్రయత్నాలు చేస్తాడు. కోవర్ట్ ఆపరేషన్ ద్వారా ట్రై చేస్తాడు. అది విఫలమవ్వడంతో వీరప్పన్ భార్య ముత్తులక్ష్మీ ద్వారా వీరప్పన్ ని బయటికి రప్పించడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ కన్నన్ వేసే ప్లాన్స్ ని పసిగట్టిన వీరప్పన్ ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ ఉంటాడు. ఫైనల్ గా కన్నన్ ఈ ఆపరేషన్ సక్సెస్ ఫుల్ గా ఎలా పూర్తి చేసాడు.. వీరప్పన్ ని చంపడబానికి కన్నన్ వేసిన ప్లాన్స్ ఏంటీ అనేదే ఈ చిత్ర కథ.


నటీనటుల పెర్ ఫామెన్స్
స్మగ్లర్ వీరప్పన్ గా సందీప్ భరద్వాజ్ నటించాడు. నటించాడు అనడంకంటే వీరప్పన్ పాత్రలో ఒదిగిపోయాడు అనడం కరెక్ట్. బాడీ లాంగ్వేజ్ పరంగా, లుక్ పరంగా వీరప్పన్ నే చూస్తున్నామనే ఫీలింగ్ ఆడియన్స్ కి కలుగుతుంది. కన్నన్ పాత్రను శివరాజ్ కుమార్ పోషించారు. వీరప్పన్ ని చంపాలని తపించిపోయే పోలీసాఫీసర్ గా శివరాజ్ కుమార్ కనబర్చిన నటన అద్భుతం. క్లయిమ్యాక్స్ లో శివరాజ్ కుమార్ కనబర్చిన నటన ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేస్తుంది. వీరప్పన్ భార్య ముత్తులక్ష్మీగా యాజ్న నటన ఫర్వాలేదనిపించేలా ఉంది. పారుల్ యాదవ్ బాగా నటించింది. అయితే ఆమె పాత్ర నిడివి తగ్గించి ఉంటే బాగుండేదనే ఫీలింగ్ కలుగుతుంది. మిగతా నటీనటులు ఎవరి పాత్రల్లో వారు ఒదిగిపోయారు.


సాంకేతిక వర్గం
ప్రేక్షకులకు తెలిసిన కథను తెరకెక్కించాలంటేనే చాలా సాహసం చేస్తున్నట్టే. ఎందుకంటే ప్రేక్షకులు ఈ సినిమా ఇలా ఉంటుందనే అవగాహనకు వచ్చేస్తారు. కాబట్టి వారికి సంతృప్తిపరిచే విధంగా సినిమాని తెరకెక్కించాలి. అభూతకల్పనలకంటే, వాస్తవ కథలను తెరకెక్కించడంలో డైరెక్టర్ రాంగోపాల్ వర్మ దిట్ట. 'రక్తచరిత్ర' ను తెరకెక్కించిన విధానాన్ని ఎవరైనా మర్చిపోగలరా.. 'వీరప్పన్' జీవిత చరిత్రను కూడా అద్భుతంగా తెరకెక్కించారు వర్మ. ఈ చిత్రంలో వర్మ శైలి కనిపించింది. చాలా గ్యాప్ తర్వాత ఓ మంచి సినిమా చేసాడనే ఫీలింగ్ ప్రేక్షకులకు కలుగుతుంది. కెమెరామ్యాన్ రామీ ఫోటోగ్రఫీ ఓ హైలెట్. శాండీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆడియన్స్ ని సినిమాలో ఇన్ వాల్వ్ అయ్యేలా చేస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ముఖ్యంగా వీరప్పన్ పాత్రధారి సందీప్ భరద్వాజ్ మేకప్ గురించి చెప్పుకోవాల్సిందే. అతనికి మేకప్ చాలా బాగా కుదిరింది. మేకప్ మ్యాన్ ని అభినందించాల్సిందే.


పిల్మీబజ్ విశ్లేషణ
రాంగోపాల్ వర్మ డైరెక్షన్ ఈ సినిమాకి చాలా ప్లస్. అయితే కేవలం వీరప్పన్ ని చంపడానికి ప్లాన్ చేసిన కకూన్ ఆపరేషన్ తోనే సినిమా సాగడం ప్రేక్షకులను నిరాశపరుస్తుంది. వీరప్పన్ జీవితానికి సంబంధించి కొన్ని ఇన్సిడెన్స్ ని చూపించి ఉంటే ఆడియన్స్ పూర్తిగా శాటిస్ ఫై అయ్యేవారు. సెకండాఫ్ కొంచెం వేగంగా ఉంటే బాగుండేది. స్లో అవ్వడంతో పాటు బోర్ ఫీలయ్యేలా కొన్ని సీన్స్ ఉండటం ప్రేక్షకులను నిరాశపరుస్తుంది. అవి సినిమాకి మైనస్. కమర్షియల్ అంశాలు తక్కువగా ఉండటంతో ఓ వర్గం ప్రేక్షకులకు ఈ సినిమా కనక్ట్ అవ్వదు. రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలను ఇష్టపడేవారికి ఈ సినిమా అంత నచ్చకపోవచ్చు. కానీ డిఫరెంట్ మూవీస్ ని ఇష్టపడేవారికి, రాంగోపాల్ వర్మ శైలి నచ్చే వారికి ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. రాంగోపాల్ వర్మ గత చిత్రాలతో పోలిస్తే, ఓ మంచి సినిమా ద్వారా రామూ ప్రేక్షకుల ముందుకు వచ్చినట్టే.


ఫైనల్ గా చెప్పాలంటే... రాంగోపాల్ వర్మ బ్యాక్ విత్ కిల్లింగ్ వీరప్పన్...



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !