View

Ganga (Muni 3) Movie Review

Friday,May01st,2015, 03:07 AM

చిత్రం - గంగ (ముని 3)
బ్యానర్ - శ్రీ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్
నటీనటులు - రాఘవ లారెన్స్, తాప్సీ, నిత్యామీనన్, కోవై సరళ, సుహాసిని, జయప్రకాష్, రేణుక తదితరులు
సంగీతం - సి.సత్య, లియోన్ జేమ్స్, యస్.యస్.తమన్, అశ్వమిత్ర
సినిమాటోగ్రఫీ - రాజ వేల్ ఒళివీరన్
సమర్పణ - బెల్లంకొండ సురేష్
నిర్మాత - బెల్లంకొండ గణేష్ బాబు
కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - రాఘవ లారెన్స్

దెయ్యాలున్నాయా? లేదా? అనే వాదన ఎప్పుడో మొదలైంది. ఇంకా వాదన జరుగుతూనే ఉంది. ఉన్నాయా? లేదా? అనే విషయంలో ఎవరి అభిప్రాయం వారికి ఉంది. లారెన్స్ తీసిన 'ముని' చూస్తే దెయ్యాలున్నాయనే అనిపిస్తుంది. దెయ్యం నేపథ్యంలో తీసిన ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దానికి సీక్వెల్ గా తీసిన 'కాంచన' సూపర్ హిట్టయ్యింది. ఇప్పుడు మూడో భాగంగా 'కాంచన 2'ని తీశాడు. తెలుగులో ఇది 'గంగ'గా విడుదలైంది. ముందు తమిళంలో విడుదలైంది కాబట్టి, సినిమా బాగుందనే విషయం రెండు తెలుగు రాష్ర్టాల వరకూ వచ్చింది. రజనీకాంత్ సైతం సినిమాని చూసి, లారెన్స్ ని అభినందించారు. మరి.. ఈ 'గంగ' ఎలా ఉందో చూద్దాం...

à°•à°¥
రాఘవ (లారెన్స్)కు హారర్ చిత్రాలు చూడాలంటే చాలా భయం. అతనికి (నైక్టోఫోభియా) అనే వ్యాధి ఉంటుంది. ఎవరి తోడూ లేకుండా ప్రకృతి అవసరాలకు కూడా వెళ్లడు. ఎక్స్ ట్రీమ్ షాక్ ఏదైనా తగిలితే తన పక్కనే ఉన్న మహిళల తొడపై కూర్చుంటాడు రాఘవ. అమ్మను ప్రతి పనికి తీసుకెళ్లలేని రాఘవ ఓ వాచ్ మ్యాన్ ని అపాయింట్ చేసుకుంటాడు. రెస్ట్ రూమ్ కి కూడా వాచ్ మ్యాన్ తోడు లేకుండా వెళ్లడు.

ఓ టి.వి. చానెల్ లో సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తుంటాడు రాఘవ. అదే చానెల్ లో వర్క్ చేస్తున్న తాప్సీని ప్రేమిస్తాడు. తాప్సీ ఓ ఫేక్ దెయ్యంతో హాంటెడ్ హౌస్ ప్రోగ్రామ్ ని షూట్ చేసి చానెల్ టిఆర్పీ రేటింగ్ పెంచేయాలనే టార్గెట్ తో ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ చేస్తున్న సమయంలో 5 దెయ్యాలు వీరి వెంటపడతాయి. ఈ ఐదు దెయ్యాలు తమ జీవితాలను నాశనం చేసిన వారిపై పగ తీర్చుకోవడానికి రాఘవ, తాప్సీని ఆవహిస్తాయి. ఆ తర్వాత ఏం జరిగింది? అనేది మిగతా కథ.

నటీనటుల పర్ఫార్మెన్స్
ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు లారెన్స్ నటించాడు. నటుడిగా సూపర్. ముఖ్యంగా బామ్మ పాత్ర సూపర్. గెటప్ అదిరిపోయింది. నటన కూడా సూపర్. అలాగే, హిజ్రా కారెక్టర్ లో లారెన్స్ ఒదిగిపోయిన వైనం బ్రహ్మాండం. గుండు గెటప్ కూడా అదిరింది. టోటల్ గా లారెన్స్ నట విశ్వరూపాన్ని చూపించిన చిత్రం ఇది. అతనిలో దర్శకుడి గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇక ఈ చిత్రంలో నటించిన తాప్సీ గురించి చెప్పాలంటే... నటనకు అవకాశం ఉన్న పాత్రను చేసింది. ముఖ్యంగా గంగ అనే దెయ్యం ఆవహించినప్పుడు తాప్సీ అభినయం అభినందించేలా ఉంది. ఫిజికల్లీ చాలెంజ్డ్ గంగగా నిత్యామీనన్ అద్భుతంగా నటించింది. కోవై సరళ, శ్రీమాన్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు.

సాంకేతిక వర్గం
'ముని', 'కాంచన' చిత్రాలు విజయం సాధించడంతో అదే బాణీలో మళ్లీ సినిమా తీస్తే హిట్ ఖాయం అని లారెన్స్ భావించి ఉంటారు. అందుకే, తొలి, మలి భాగాల కథలు పోలిన విధంగానే మూడో భాగం కథ రాసుకున్నాడు. ఆ కథ చుట్టూ కామెడీ, సెంటిమెంట్, లవ్, ఫైట్స్.. ఇలా కావల్సిన మసాలాలన్నీ దట్టించాడు. దర్శకుడిగా భేష్ అనిపించుకున్నాడు. రాజ్ వేల్ ఒళివీరన్ ఛాయాగ్రహణం ఈ చిత్రానికి ప్రధాన బలం. ఈ చిత్రానికి మొత్తం నలుగురు సంగీతదర్శకులు స్వరాలందించారు. కానీ, ఒక్క పాట కూడా గుర్తుండదు. తమన్ సమకూర్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకి హెల్ప్ అయ్యింది. ఓవరాల్ గా టెక్నీషియన్స్ అందరూ భేష్ అనిపించుకునే పని తీరును కనబర్చారు.

ఫిల్మీబజ్ విశ్లేషణ
'కాంచన 2'కి ప్లస్ గా నిలిచిన అంశం ఫ్లాష్ బ్యాక్. ఆ ఎపిసోడ్ మొత్తం హార్ట్ టచింగ్ గా ఉంటుంది. ఈ చిత్రంలోనూ ఫ్లాష్ బ్యాక్ ఉంది. కానీ, రెండో భాగం అంత బలంగా లేదు. ఫస్టాఫ్ బాగానే ఉంది. సెకండాఫ్ అక్కడక్కడా ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో కొన్ని సీన్స్ మరీ డ్రమటిక్ గా ఉన్నాయి. పైగా.. సెకండాఫ్ లో శబ్ద హోరు ఎక్కువ. ముని, కాంచన సాగినట్లుగానే కొంచెం ధ్రిల్, కొంచెం కామెడీ, కొంచెం సెంటిమెంట్.. తో సాగుతుందీ 'గంగ'. తొలి, మలి భాగాలకు, ఈ భాగానికీ పెద్దగా వ్యత్యాసం ఉండదు. క్లయిమ్యాక్స్ కూడా ఓహో అని చెప్పుకునే విధంగా లేదు. ఓకే అనిపించుకుంది. తొలి రెండు భాగాలు ఉన్నంత బ్రహ్మండంగా మూడో భాగం ఉండదు. ఆ రెండు భాగాలు చూసినవారికి మూడో భాగం మాములుగా అనిపిస్తుంది. ఈ రెండు భాగాలు చూడనివారికి మాత్రం ఈ సినిమా కనెక్ట్ అయ్యే అవకాశముంది.

ఫైనల్ గా చెప్పాలంటే.. మధ్య మధ్యలో అక్కడక్కడా సహనాన్ని పరిక్షించేలా ఉన్నా, చివరి వరకూ చూసేలా లారెన్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. తమిళంలో ఈ చిత్రం పెద్ద హిట్. తెలుగులో ఆ స్థాయి హిట్టవుతుందా? లేక ఓ మోస్తరు విజయంతో సరిపెట్టుకుందా? చూడాలి.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !