View

లవర్స్ మూవీ రివ్వ్యూ

Friday,August15th,2014, 11:46 AM

చిత్రం - లవర్స్

నటీనటులు - సుమంత్ అశ్విన్, నందిత, సప్తగిరి, సాయి, ఎమ్మెస్ నారాయణ, అనితా చౌదరి తదితరులు

సంగీతం - జె.బి

ఎడిటింగ్ - ఉద్ధవ్

కెమెరా - మల్హర్ భట్

నిర్మాతలు - సూర్యదేవర నాగవంశీ, మహేంద్రబాబు

కథ, మాటలు, స్ర్కీన్ ప్లే - మారుతి

దర్శకత్వం - హరినాథ్

 

సుమంత్ అశ్విన్, నందిత జంటగా హరినాథ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'లవర్స్'. ఈ చిత్రానికి కథ, మాటలు, స్ర్కీన్ ప్లే అందించాడు మారుతి. 'లవర్స్' టైటిల్, మారుతి పేరు ఈ చిత్రానికి యాడ్ అవ్వడంతో ఖచ్చితంగా ఇది యూత్ ని ఆకట్టుకునే సినిమా అవుతుందనే అంచనాలు నెలకొన్నాయి. మారుతి సినిమా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ దూరమయ్యే పరిస్థితి ఉంది కాబట్టి... ఈ సినిమా ఆరంభం నుంచి ఇది అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమా అని ఈ యూనిట్ చెప్పుకుంటూ వస్తోంది. మరి నిజంగానే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగానే ఈ సినిమాని తీర్చిదిద్దారా? లేక మారుతి గత చిత్రాల్లానే డబుల్ మీనింగ్ డైలాగులతో కేవలం యూత్ ని మాత్రమే టార్గెట్ చేసిన సినిమానా అనే విషయాన్ని తెలుసుకుందాం.

à°•à°¥

అబ్బాయిలు అమ్మాయిలను మోసం చేస్తారే తప్ప... నిజమైన ప్రేమ అమ్మాయిలపై అబ్బాయిలకు ఉండదనే అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటుంది చిత్ర (నందిత). ఆమె ఇద్దరి ఫ్రెండ్స్ ని సిద్ధు (సుమంత్ అశ్విన్) ఒకరి తర్వాత ఒకరిని ప్రేమిస్తాడు. కానీ ఈ ఇద్దరితోనూ సిద్ధు బ్రేకప్ అవుతాడు. దీనికి కారణం చిత్ర. తనెవరో తెలీకుండానే తన ప్రేమ విషయంలో అడ్డం పడుతున్న చిత్రపై సిద్ధు కోపం పెంచుకుంటాడు. తన ఫ్రెండ్స్ ని మోసం చేసిన సిద్ధుపై చిత్ర కూడా అసహ్యం పెంచుకుంటుంది. అలా ఒకరినొకరు చూసుకోకుండానే శ్రతువులవుతారు.

అయితే అనుకోకుండా కలిసిన చిత్రతో సిద్ధు ప్రేమలో పడిపోతాడు. తను శ్రతువుగా భావించే చిత్ర తనేనని తెలియడంతో తనను శ్రీరాంగా పరిచయం చేసుకుంటాడు సిద్ధు. ఆమెతో పరిచయం పెంచుకుని చిత్రను కూడా తనని ప్రేమించేలా చేసుకుంటాడు. కానీ ఒకానొక సందర్భంలో చిత్రకు అసలు విషయం తెలిసిపోతుంది. మరి సిద్ధు గురించిన అసలు నిజం తెలిసిన చిత్ర ఏం చేసింది? సిద్ధు, చిత్ర ఒకటయ్యారా? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటుల పెర్ ఫామెన్స్

'అంతకుముందు ఆ తర్వాత' సినిమా ద్వారా సుమంత్ అశ్విన్ ఆడియన్స్ దృష్టిని తనవైపు పడేలా చేసుకున్నాడు. ఈ సినిమాలోని అతని నటనకు మంచి మార్కులు పడ్డాయి. కానీ 'లవర్స్' సినిమా సుమంత్ అశ్విన్ కి అంత పేరు తెచ్చి పెట్టే సినిమా కాదు. ఎందుకంటే అతని పాత్రకు పెద్దగా నటించడానికి స్కోప్ లేదు. కాకపోతే తన పాత్ర పరిధిమేరకు హుషారుగా నటిస్తూ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయగలిగాడు. నందిత క్యూట్ గా ఉంది. కొంచెం బరువు కూడా పెరిగింది. నందితకు 'ప్రేమకథా చిత్రమ్' మంచి పేరు తెచ్చి పెట్టింది. ఆ సినిమాలో ఆమెకు నటించడానికి స్కోప్ దక్కింది. కానీ ఈ సినిమాలో నందితది చాలా మామూలు పాత్ర. ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పాత్ర సప్తగిరిది. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే పాత్ర చేసాడు. తన పాత్రకు పూర్తి న్యాయం చేసాడు. మగధీర పేరడీ సీన్ లో సప్తగిరి నటన ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది.

 

సాంకేతిక వర్గం

à°ˆ సినిమాకి మారుతి à°•à°¥, మాటలు, స్ర్కీన్ ప్లే ఇచ్చాడు. డైలాగులు బాగున్నాయి. కొన్ని డైలాగులు చాలా పేలాయి. కాకపోతే యం.యస్.నారాయణ పాత్రకు రాసిన డైలాగులు ఎఫెక్టివ్ à°—à°¾ లేవు. సింపుల్ స్టోరీ అయిన్పపటికీ, ఎక్కవగా కామెడీకి ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల ప్రేక్షకులు బోర్ ఫీలవ్వరు. మారుతి మార్క్ బూతు డైలాగులు లేవు. à°ˆ సినిమాకి డైరెక్టర్ హరినాథ్ అయినప్పటికీ... అతను నామ్ కే వాస్త్ అన్నట్టుగా అనిపిస్తుంది. అవుట్ అండ్ అవుట్ మారుతి మార్క్ ఫిల్మ్.   జె.బి పాటలు యావరేజ్ à°—à°¾ ఉన్నాయి. ఎడిటింగ్ బాగుంది. సినిమా కలర్ ఫుల్ à°—à°¾ ఉంది. à°ˆ క్రెడిట్ సినిమాటోగ్రాఫర్ మల్హర్ భట్ à°•à°¿ దక్కుతుంది.

 

ఫిల్మీబజ్ విశ్లేషణ

టైటిల్ 'లవర్స్' కాబట్టి... ఈ సినిమా ప్యూర్ లవ్ స్టోరీ అనుకునే అవకాశం ఉంది. కానీ ఈ సినిమాలో లవ్ సీన్స్ చాలా తక్కువ. కామెడీకి ఇచ్చిన ఇంపార్టెన్స్ లవ్, రొమాంటిక్ సీన్స్ కి ఇవ్వలేదు. ఇది యూత్ ని కాస్త నిరాశపరిచే విషయం. సప్తగిరి కామెడీ ట్రాక్ ని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. ఇది మినహా ఈ సినిమా గురించి పెద్దగా చెప్పుకోవడానికేమీ లేదు. హీరో ఫ్రెండ్ గా నటించిన సాయి ఫస్టాప్ లో ప్రేక్షకులను నవ్విస్తే, ఎంట్రీ దగ్గర్నుంచి ఎండింగ్ వరకూ సప్తగిరి కామెడీ సీన్స్ ప్రేక్షకులను ఇన్ వాల్వ్ అయ్యేలా చేస్తాయి. ముఖ్యంగా 'మగధీర' సీన్ కి ప్రేక్షకులు పగలబడి నవ్వడం ఖాయం.

 

ఫైనల్ గా చెప్పాలంటే... కేవలం కామెడీని ఎంజాయ్ చేయాలనుకునేవారు ఈ సినిమాని చూడొచ్చు. 'లవర్స్' ని లవర్ తో కలిసి చూద్దామనుకునేవారు ఈ సినిమాకి దూరంగా ఉండటం బెటర్.

 

Lovers Review



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !