View

మామ మంచు అల్లుడు కంచు మూవీ రివ్య్వూ

Friday,December25th,2015, 07:40 AM

చిత్రం - మామ మంచు అల్లుడు కంచు
బ్యానర్ - 24 ప్రేమ్స్ ఫ్యాక్టరీ
నటీనటులు - డా.మోహన్ బాబు, అల్లరి నరేష్, రమ్యకృష్ణ, మీనా, పూర్ణ, వరుణ్ సందేశ్, అలీ, కృష్ణ భగవాన్, జీవా, రాజా రవీంద్ర, సోనియా, సురేఖా వాణి, హృదయ, మౌనిక తదితరులు
మాటలు - శ్రీధర్ సీపాన
ఎడిటింగ్ - గౌతంరాజు
సినిమాటోగ్రఫీ - బాలమురుగన్
సంగీతం - అచ్చు, రఘు కుంచె
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - విజయ్ కుమార్
సమర్పణ - అరియానా, వివియానా, విద్యా నిర్వాణ
నిర్మాత - విష్ణు మంచు
స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - శ్రీనివాస రెడ్డి

 

23 ఏళ్ల క్రితం 'అల్లరి మొగుడు' చిత్రంలో రమ్యకృష్ణ, మీనాతో 'ముద్దిమ్మంది ఓ పూబంతి... మనసిమ్మంది చామంతి..' అంటూ డా. మోహన్ బాబు చేసిన సందడిని అంత సులువుగా మర్చిపోలేం. ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ మోహన్ బాబు సరసన రమ్యకృష్ణ, మీనా కథానాయికలుగా నటించిన చిత్రం 'మామ మంచు-అల్లుడు కంచు'. అల్లుడిగా 'అల్లరి' నరేశ్, అతని సరసన పూర్ణ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి శ్రీనివాసరెడ్డి దర్శకుడు. ఓ మరాఠీ చిత్రానికి ఇది రీమేక్. మరి.. మంచు మామ, కంచు అల్లుడు ఎలాంటి సందడి చేశారో చూద్దాం.

à°•à°¥
భక్తవత్సలంనాయుడు (డా.మోహన్ బాబు) రెండు ఫ్యామిలీ స్ ని మెయింటెన్ చేస్తూ, ఇద్దరు పెళ్లాలకు, పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటుంటాడు. ఆయన మొదటి భార్య సూర్య కాంతం (మీనా). వీరి కూతురు శృతి (పూర్ణ). భక్తవత్సలం రెండో భార్య ప్రియంవద (రమ్యకృష్ణ). వీరి కొడుకు గౌతం (వరుణ్ సందేశ్). ఒకేరోజు కొడుకు, కూతురు పుట్టినరోజు కావడంతో ఇద్దరికీ గిఫ్ట్స్ ప్యాక్ చేయించి తన ఫ్రెండ్ అలీ (ఇస్మాయిల్) కి రెండు ఇళ్ల అడ్రస్ లు చెప్పి గిఫ్ట్స్ పంపించమని చెబుతాడు భక్తవత్సలం నాయుడు. ఇస్మాయిల్ ఇద్దరు అడ్రస్ లు మార్చి చెప్పడంతో శృతి గిఫ్ట్ గౌతంకి, గౌతం గిఫ్ట్ శృతికి అందుతుంది. దాంతో ఇద్దరూ ఫోన్ లో మాట్లాడుకుని, గిఫ్ట్స్ మార్చుకోవాలనుకుంటారు. తమ తండ్రులు పేర్లు ఒకటే కావడం, పుట్టినరోజులు కూడా ఒకటే కావడంతో ఇద్దరూ స్వీట్ షాక్ లా ఫీలవుతారు. ఈ ఇద్దరూ గిఫ్ట్ లు మార్చుకుందామనుకుంటున్న విషయం విని, భక్తవత్సలంనాయుడు ఇద్దరూ కలుసుకుంటే తన భాగోతం బయటపడుతుందని టెన్షన్ పడిపోతాడు. తన ఫ్రెండ్ సహాయంతో గౌతంగా బాలరాజు (అల్లరి నరేష్) ని సెట్ చేసి శృతిని కలుసుకునేలా చేస్తాడు భక్తవత్సలం. కట్ చేస్తే...


తొలి చూపులోనే శృతి ప్రేమలో పడిపోతాడు బాలరాజు. దాంతో కథ మార్చి గౌతంగా తనని తాను పరిచయం చేసుకుని శృతిని ప్రేమించేలా చేస్తాడు. తను సెటప్ చేసిన బాలరాజు తన కూతురినే ప్రేమలో పడేయడంతో మరింత ఇరుక్కుల్లో పడిపోతాడు భక్తవత్సలం. తన కూతురికి గౌతం గురించి నిజం చెప్పాలనుకుంటాడు. కానీ తనకు రెండు ఫ్యామిలీలు ఉన్న విషయం బాలరాజుకు తెలిసిపోవడంతో ఆ ప్రయత్నం మానుకుంటాడు.


మరోవైపు కొడుకు గౌతం ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి తనను శత్రువుగా భావించే కృష్ణభగవాన్ కూతురు కావడం, అతనికి కాంతం, శృతి గురించి తెలియడంతో కొడుకు ప్రేమను ఎలాగైనా చెడగొట్టాలనే ప్రయత్నం చేస్తాడు భక్తవత్సలంనాయుడు. కానీ అది కుదరకపోవడంతో పెళ్లి సెటిల్ అయిపోతుంది.


ఓ వైపు తనకు ఇష్టంలేని బాలరాజును కూతురు ప్రేమించడం, తన మొదటి ఫ్యామిలీ గురించి తెలిసిన వ్యక్తి కూతురిని తన రెండో భార్య కొడుకు ప్రేమించడం, రెండో భార్యకు తానే భర్తని అని ఆ వ్యక్తికి తెలియకపోవడంతో, తన స్థానంలో భక్తవతల్సం నాయుడిగా స్నేహితుణ్ణి పెట్టడానికి భక్తవత్సలం నాయుడు పడే తంటా? కూతురు, కొడుకు పెళ్లి ఒకేరోజున ఒకే సమయంలో ఫిక్స్ కావడంతో ఎదురయ్యే పరిణామాలను భక్తవత్సలం నాయుడు ఎలా డీల్ చేశాడు? అతనికి బాలరాజు ఎలా సహాయం చేసాడు అనేదే ఈ చిత్ర కథ. ఫైనల్ గా కాంతం, ప్రియంవద ఇద్దరికీ భక్తవత్సలంనాయుడు తామిద్దరి భర్త అని తెలియడంతో ఇద్దరూ ఎలా రియాక్ట్ అయ్యారు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

 

నటీనటులు
నాయకుడిగా, ప్రతినాయకుడిగా, సహాయ నటుడిగా.. వాట్ నాట్ మోహన్ బాబు ఏ పాత్రను అయినా చేయగలరు. మంచు మామ పాత్రకు ఆయన తప్ప ఎవరూ న్యాయం చేయలేరేమో అన్న విధంగా మోహన్ బాబు ఆ పాత్రలో ఒదిగిపోయారు. ఏ పాత్ర చేస్తే అందులోకి ఒదిపోగలగడం మంచి నటుడి లక్షణం. ఒక పాటలో మోహన్ బాబు చిన్న చిన్న స్టెప్స్ వేయడం ఓ హైలైట్. ఇద్దరు భార్యల మధ్య నలిగిపోయే మంచి మొగుడుగా 'అల్లరి మొగుడు'లో అలరించిన మోహన్ బాబు మళ్లీ అదే ఈజ్ తో 'మామ మంచు-అల్లుడు కంచు'లో చేశారు. నాయుడు పాత్రలో మోహన్ బాబు బాడీ లాంగ్వేజ్ బాగుంది. ఇద్దరు భార్యలకు ప్రేమ పంచే సన్నివేశాలు, ఇద్దరు భార్యలు షాపింగ్ మాల్ లో ఎదురుపడతారేమోనని టెన్షన్ పడిన సన్నివేశాలు, ఇద్దరికీ అసలు విషయం తెలిసిపోయినప్పుడు ఆవేదనతో కూడిన కంగారు.... అన్నీ హావభావాలను అద్భుతంగా ఆవిష్కరించగలిగారు. నరేశ్ కూడా భేష్ అనిపించుకున్నాడు. మోహన్ బాబు వంటి అద్భుతమైన నటుడి కాంబినేషన్లో నటించి, మెప్పించడం ఆషామాషీ కాదు. ఆ మేరకు 'అల్లరి' నరేష్ భేష్ అనిపించుకున్నాడు. మామకు తగ్గ అల్లుడిగా ఎక్కడా తగ్గకుండా నటించడం అభినందనీయం. రమ్యకృష్ణ, మీనా కాంబినేషన్ ఈ చిత్రానికి ఓ హైలైట్. అలీ, వరుణ్ సందేశ్, పూర్ణ, జీవా, సురేఖా వాణి, సోనియా, కృష్ణభగవాన్... ఇలా అందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు.

 

సాంకేతిక వర్గం
ఓ మరాఠీ చిత్రానికి ఇది రీమేక్. కానీ, అచ్చ తెలుగు సినిమాలా మలిచారు. స్ర్కీన్ ప్లే బాగుంది. 'అల్లరి' మొగుడుకి సీక్వెల్ లా ఉంది. మామ, అల్లుళ్ల పాత్రలను, ఆ పాత్రల చుట్టూ ఇతర పాత్రలను కనెక్ట్ చేసిన విధానం బాగుంది. ఇంతకుముందు వినోద ప్రధానం సినిమాలు తీసిన శ్రీనివాస రెడ్డి ఈ చిత్రానికి కూడా అదే రీతిలో తీశారు. సినిమాలో ఉన్న మూడు పాటలు సందర్భానుసారంగా సాగుతాయి. శ్రీధర్ సీపాన రాసిన సంభాషణలు బాగున్నాయి. అరిస్తే చరుస్తా.. తరహా మోహన్ బాబు స్టైల్ డైలాగ్స్ అక్కడక్కడా వినిపించడం బాగుంటుంది. అలాగే, నాటి 'అల్లరి మొగుడు'లోని కొన్ని సీన్స్ చూపించినప్పుడు మంచి ఫీల్ కలుగుతుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.


ఫిల్మీబజ్ విశ్లేషణ
'అల్లరి మొగడు'కి సీక్వెల్ లా అనిపించే చిత్రం ఇది. మామ పాత్రకు మోహన్ బాబు, అల్లుడి పాత్రకు నరేశ్ సరిగ్గా సరిపోయారు. రమ్యకృష్ణ, మీనా కాంబినేషన్ ఓ హైలైట్. సినిమాలో ఉన్న ప్రతి పాత్రా కథకు కీలకం అనిపిస్తుంది. వినోద ప్రధానంగా సాగుతుంది కాబట్టి, బోర్ అనిపించదు. ఫస్టాఫ్ స్పీడుగా అయిపోతుంది. అదే టెంపో సెకండాఫ్ లో కూడా మెయింటెన్ అవుతుంది. మంచి ట్విస్టులతో సాగే చక్కని ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇది. కమర్షియల్ పంథాలో సాగే ఐటమ్ సాంగ్, ఆ పాట తాలూకు బ్యాచ్ తో కమర్షియల్ గా సాగే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా అందర్నీ ఆకట్టుకునే చిత్రం.


ఫైనల్ గా చెప్పాలంటే... మంచు మామ.. కంచు అల్లుడు అదిరిపోయారు. ఈ ఇద్దరి సందడి చూడాల్సిందే.

 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !