చిత్రం - మిస్టర్ అండ్ మిస్
హీరోయిన్ - జ్ఞానేశ్వరి కండ్రేగుల, శైలేష్ సన్ని
సినిమాటోగ్రఫీ - సిద్ధం మనోహర్
సంగీతం - యశ్వంత్ నాగ్
ఎడిటింగ్ - కార్తిక్ కట్స్
స్ర్కీన్ ప్లే, డైలాగ్స్ - సుధీర్ వర్మ పెరిచర్ల
నిర్మాణం - క్రౌడ్ ఫ్డెడ్
కథ, దర్శకత్వం - అశోక్ రెడ్డి
శైలేష్ సన్ని, జ్ఞానేశ్వరి కండ్రేగుల జంటగా అశోక్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'మిస్టర్ అండ్ మిస్'. ఈ సినిమా ట్రైలర్, పాటలకు మంచి స్పందన లభించింది. దాంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ రోజు (29.1.2021) ఈ సినిమా థియేటర్స్ లో విడుదలయ్యింది. మరి సినిమా ఎలా ఉంది... ఆడియన్స్ ని మెప్పించే విధంగా ఉందా తెలుసుకుందాం.
కథ
హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ జాబ్ ను వెతుక్కుంటూ అమలాపురం నుంచి వచ్చిన ఓ కుర్రాడు ఓ అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడతారు. మనసులు దగ్గరవ్వడమే కాదు... శారీరకంగా కూడా ఒకటవుతారు. అనుకోకుండా వారి మొబైల్స్ పోతాయి. తర్వాత ఏం జరిగింది... ఆ ప్రేమ జంట ఎలా కలుసుకున్నారు అనేదే ఈ చిత్ర కథాంశం.
నటీనటుల పెర్ ఫామెన్స్
అమలాపురం నుంచి వచ్చిన కుర్రాడిగా శైలేష్ సన్ని నటించాడు. అమలాపురం యాసలో మాట్లాడుతూ, నటన పరంగా కూడా ఆకట్టుకుని మార్కులు కొట్టేసాడు శైలేష్. బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ వల్ల మన పక్కంటి కుర్రాడిలా అనిపిస్తాడు. హీరోయిన్ జ్ఞానేశ్వరి యూత్ మనసులను కొల్లగొట్టేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మంచి ఫిజిక్ తో, నటనతో ప్రేక్షకుల మనసులను దోచేస్తుంది. రొమాంటిక్ సీన్స్ లో కూడా బాగా నటించింది. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన పవన్ రమేష్ ఈ సినిమాకి చాలా ప్లస్. చక్కటి నటన కనబర్చాడు. అమలాపురం యాసలో తను చెప్పిన డైలాగ్స్ ఆడియన్స్ కి బాగా రీచ్ అవుతాయి. మిగతా నటీనటులందరూ తమ పాత్రల పరిధిమేరకు నటించారు.
సాంకేతిక వర్గం
ఈ సినిమా పాటలకు మంచి స్పందన వచ్చింది. సంగీతదర్శకుడు నాగ్ ఇచ్చిన పాటలు ఈ సినిమాకి చాలా ప్లస్. అన్ని పాటలు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సీన్స్ ని ఎలివేట్ చేసే విధంగా ఉండటం ఈ సినిమాకి ప్లస్ అవుతుంది. సినిమా విజువల్స్ బాగున్నాయి. సినిమాటోగ్రాఫర్ మనోహర్ పిక్చరైజేషన్ అందంగా, ఆహ్లాదంగా ఉంది. కథకు సరిపడా ఖర్చు పెట్టి, ప్రొడ్యూసర్ అశోక్ రెడ్డి ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాని నిర్మించారు. ఇక ఈ సినిమాకి డైరెక్టర్ అశోక్ రెడ్డి ఎంచుకున్న స్టోరీ లైన్ సూపర్. కాంటెంపరరీ స్టోరీని తీసుకోవడంతో యూత్ ని మెప్పించే విధంగా సినిమా ఉంది.
విశ్లేషణ
లీడ్ పెయిర్ శైలేష్, జ్ఞానేశ్వరి ఇద్దరూ రొమాంటిక్ సీన్స్, ఎమోషనల్ సీన్స్ బాగా చేసారు. లైఫ్ లో జరిగే ప్రైవేట్ మూవ్ మెంట్స్ ని కెమెరాల్లో కాదు... మనసులో దాచుకోవాలి అనే విషయాన్ని చాలా చక్కగా వల్గార్టీ లేకుండా తెరకెక్కించారు డైరెక్టర్ అశోక్ రెడ్డి. ప్రస్తుతం సొసైటీలో జరుగుతున్న వీడియో స్కాండిల్స్ మాఫియాను తెరపై ఆవిష్కరించడం జరిగింది. ప్రైవేట్ మూమెంట్స్ ని ఇల్లీగల్ గా షూట్ చేసి ఇంటర్నెట్ లో అప్ లోడ్ చేస్తున్న విధానాన్ని ఆసక్తికరమైన స్ర్కీన్ ప్లే తో చూపించడం జరిగింది. గ్రిప్పింగ్ స్ర్కీన్ ప్లే వల్ల సినిమా ఎక్కడా బోర్ కొట్టదు.
ఫైనల్ గా చెప్పాలంటే... మంచి మెసేజ్ ని ఎంటర్ టైన్ మెంట్ వేలో చూపించడం వల్ల అన్ని వర్గాల ఆడియన్స్ కి ఈ సినిమా నచ్చుతుంది. ముఖ్యంగా యూత్ ని ఈ సినిమా బాగా ఆకట్టుకుంటుంది. సో... డోంట్ మిస్ దిస్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ 'మిస్టర్ అండ్ మిస్'.
ఫిల్మీబజ్ రేటింగ్ - 3/5