View

Pataas Movie Review

Friday,January23rd,2015, 10:39 AM

చిత్రం - పటాస్
బ్యానర్ - నందమూరి తారకరామారావు ఆర్ట్స్
నటీనటులు - కళ్యాణ్ రామ్, శృతి సోది, సాయికుమార్‌, బ్రహ్మానందం, అశుతోష్‌ రాణా, ఎమ్మెస్‌ నారాయణ, శ్రీనివాసరెడ్డి, జయప్రకాష్‌రెడ్డి, పోసాని కృష్ణమురళి తదితరులు
కెమెరా - సర్వేష్‌ మురారి
సంగీతం - సాయి కార్తీక్‌
ఎడిటింగ్‌ - తమ్మిరాజు
ఆర్ట్‌ - à°Žà°‚.కిరణ్‌కుమార్‌
ఫైట్స్‌ - వెంకట్‌
రచనా సహకారం - ఎస్‌.క్రిష్ణ
ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌ - ఎస్‌.జె.ఫణికుమార్‌
నిర్మాత - నందమూరి కళ్యాణ్‌రామ్‌
à°•à°¥-మాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం - అనిల్‌ రావిపూడి

'పటాస్'.. టైటిల్ చాలా జోష్ గా ఉంది. బొమ్మ కచ్చితంగా బ్రహ్మాండంగా ఉంటుందనే నమ్మకం కలగడం ఖాయం. పైగా పాటలు సూపర్ హిట్. 'అరె ఓ సాంబ..' రీమిక్స్ ఓ ఆకర్షణ. కల్యాణ్ రామ్ లుక్ మాస్ గా, చాలా బాగుంది. సో.. ఈ 'పటాస్' బ్రహ్యాండంగా పేలుతుందనే అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మధ్య కాలంలో కల్యాణ్ రామ్ చేసిన చిత్రాలన్నీ ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో నూతన దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ నందమూరి హీరో చేసిన 'పటాస్' అద్భుతంగా పేలుతుందా?.. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం...

à°•à°¥
కళ్యాణ్ సిన్హా (కళ్యాణ్ రామ్) ఓ అవినీతి పోలీస్ ఆఫీసర్. కావాలని తన పోస్టింగ్ ని హైదరాబాద్ లో వేయించుకుంటాడు. హైదరాబాద్ రాగానే తన అధికారాన్ని ఉపయోగించుకుని డబ్బు సంపాదించడం మొదలుపెడతాడు. అలాగే హైదరాబాద్ డిజిపి (సాయికుమార్)ని వ్యతిరేకిస్తాడు. డిజిపికి తలనొప్పిగా మారిన రాజకీయనాయకుడు (అశుతోష్ రాణా)ను సపోర్ట్ చేస్తాడు కళ్యాణ్ సిన్హా.
అసలు కళ్యాణ్ సిన్హా ఎందుకు పోస్టింగ్ హైదరాబాద్ లో వేయించుకున్నాడు. అతను హైదరాబాద్ రావడం వెనుక ఉన్న నిజాన్ని తెలుసుకుని డిజిపి ఎందుకు షాక్ అవుతాడు. కళ్యాణ్ సిన్హా అవినీతి పోలీసాఫీసర్ గా మారడం వెనుక కారణం ఏంటనేదే ఈ సినిమా.

నటీనటుల పెర్ ఫామెన్స్
పోలీసాఫీసర్ కళ్యాణ్ సిన్హాగా కళ్యాణ్ రామ్ అద్భుతంగా నటించాడు. ఇప్పటిదాకా తను నటించిన చిత్రాలతో పోల్చితే ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ ది బెస్ట్ పెర్ ఫామెన్స్ ఇచ్చాడని చెప్పాల్సిందే. చాలా ఎనర్జిటిక్ పెర్ ఫామెన్స్. ఫైట్స్, డ్యాన్స్ విషయంలో కూడా కళ్యాణ్ రామ్ తన సత్తా చాటుకున్నాడు. హీరోయిన్ శృతి సోది ఫర్వాలేదనిపించింది. పాటలు, కొన్ని సీన్స్ మినహా శృతి పాత్రకు పెద్దగా స్కోప్ లేదు. ఫస్టాప్ లో కమెడీయన్ శ్రీనివాసరెడ్డి కామెడీ ఈ సినిమాకు చాలా ప్లస్. కళ్యాణ్ రామ్ తో శ్రీనివాస్ రెడ్డి కాంబినేషన్ సీన్స్ అన్నీ బాగున్నాయి. షైనింగ్ స్టార్ సుభాష్ గా యం.యస్.నారాయణ తనదైన శైలిలో మరోసారి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. అశుతోష్ రాణా, సాయికుమార్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసారు. మిగతా నటీనటులందరూ తమ పాత్రల పరిధిమేరకు నటించారు.

సాంకేతిక వర్గం
సాయికార్తీక్ స్వరపరిచిన పాటలు వినడానికే కాదు, చూడటానికి కూడా బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సీన్స్ ని ఎలివేట్ చేసే విధంగా ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతి ఫ్రేము కలర్ ఫుల్ గా ఉంది. డైలాగ్స్ బాగున్నాయి. కొన్ని పంచ్ డైలాగ్స్ ఆడియన్స్ కి హుషారు పుట్టించే విధంగా ఉన్నాయి. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఎక్కడా ల్యాగ్ అనిపించలేదు. సినిమా చాలా ఫాస్ట్ గా ఉంటుంది. రచయిత అనిల్ రావిపూడి ఈ సినిమా కోసం మెగాఫోన్ పట్టుకున్నారు. డైరెక్టర్ గా తొలి సినిమా అయినప్పటికీ, టేకింగ్ చాలా బాగుంది. కథను ప్రెజెంట్ చేసిన విధానం బాగుంది.

ఫిల్మీబజ్ విశ్లేషణ
ఈ సినిమా కథ రొటీన్ గానే అనిపిస్తుంది. ఇలాంటి కథలను చాలానే చూసాము. కానీ కథను ప్రజెంట్ చేసిన తీరు ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. హీరో క్యారెక్టరైజేషన్స్ ని మలిచిన తీరు ఈ సినిమాకి చాలా ప్లస్. సీన్స్ ని సాగదీయకుండా, క్రిస్పీగా చేయడంతో ప్రేక్షకులు ఎక్కడా బోర్ ఫీలవ్వరు. ఫస్టాప్, సెకండాఫ్ లో కామెడీ ఉన్నప్పటికీ, కథలో టెంపోని మిస్ అవ్వకుండా ప్రజెంట్ చేయడంలో అనిల్ రావిపూడి సక్సెస్ అయ్యారు. ఓ డైరెక్టర్ కి ఉండాల్సిన లక్షణం ఇది. 'అరె ఓ సాంబ..' పాటను రీమిక్స్ చేయడం ఓ మంచి ఆలోచన. ఈ పాటను ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. హీరోయిన్ ని పాటలకు మాత్రమే పరిమితం చేయడం కాస్త నిరాశపరిచే విషయం. కొన్ని లాజిక్స్ ని మిస్ అయ్యారు. కాకపోతే ఎంటర్ టైన్ మెంట్, పవర్ ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్ ఈ లాజిక్స్ గురించి ఆలోచించనివ్వవు. పక్కా కమర్షియల్ సినిమా. నందమూరి అభిమానులకు ఫుల్ మీల్స్ లాంటి సినిమా. ఇతర ప్రేక్షకులను కూడా ఈ సినిమా నిరాశపరచదు.

ఫైనల్ గా చెప్పాలంటే... ఈ పటాస్ పక్కా పైసా వసూలు సినిమా.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !