View

నరుడా డోనరుడా మూవీ రివ్య్వూ

Friday,November04th,2016, 06:37 AM

చిత్రం - నరుడా డోనరుడా
నటీనటులు - సుమంత్, పల్లవి సుభాష్, తనికెళ్ల భరణి, సుమన్ శెట్టి, భద్రమ్, జబర్ధస్త్ శేషు, చలపతిరాజు తదితరులు
సంగీతం - శ్రీచరణ్ పాకాల
ఎడిటింగ్ - కార్తీక్ శ్రీనివాస్
సినిమాటోగ్రఫీ - షానియల్ డియో
డైలాగ్స్ - కిట్టు, విస్సాప్రగడ, రాచకొండ
సమర్పణ - అన్నపూర్ణ స్టూడియోస్
బ్యానర్ - రమా రీల్స్, ఎస్.ఎస్.క్రియేషన్స్
నిర్మాతలు - వై.సుప్రియ, సుధీర్ పూదోట
దర్శకత్వం - మల్లిక్ రామ్


హిందీ చిత్రం 'విక్కీ డోనార్' ఆధారంగా తెలుగులో రీమేక్ అయిన చిత్రం 'నరుడా డోనరుడా'. ఈ స్ర్కిఫ్ట్ నచ్చి హీరో సుమంత్ ఈ సినిమా చేయడానికి అంగీకరించాడు. మంచి మెసేజ్ తో పాటు ఎంటర్ టైన్ మెంట్ కూడా ఉంది. వీర్యదానం కాన్సెఫ్ట్ తో రూపొందిన చిత్రం కాబట్టి కొత్తగా ఉంటుంది. ఈ సినిమా ట్రైలర్, ఫస్ట్ లుక్ కి ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభించింది. సుమంత్ కూడా ఈ సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నాడు. తనికెళ్ల భరణి డాక్టర్ గా కీలక పాత్ర చేసాడు. పలల్లవి సుభాష్ కథానాయిక. అన్నపూర్ణ స్టూడియో సమర్పణలో మల్లిక్ రామ్ దర్శకత్వంలో వై.సుప్రియ, సుధీర్ పూదోట ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ రోజు ఈ చిత్రం విడుదలయ్యింది. మరి ఈ సినిమా ఎలా ఉంది... సుమంత్ కెరియర్ కి మంచి మలుపు అవుతుందా తెలుసుకుందాం.


కథ
విక్రమ్ అలియాస్ విక్కి (సుమంత్) కి ఎలాంటి టార్గెట్ ఉండదు. ఉద్యోగం కూడా ఉండదు. తల్లి బ్యూటి పార్లర్ రన్ చేస్తుంటుంది. డా.ఆంజనేయులు (తనికెళ్ల భరణి) వీర్యదానం చేసే వ్యక్తి కోసం వెతుకుతుంటాడు. విక్కి వీర్యదానం చేయడానికి అంగీకరిస్తాడు. ఫైనల్ గా ఫుల్ టైమ్ స్ఫెరమ్ డోనర్ గా మారిపోతాడు విక్కి. ఇందుకుగానూ అతనికి డబ్బు దక్కుతుంది.


ఇలా లైఫ్ లీడ్ చేస్తున్న విక్కి బ్యాంక్ ఉద్యోగి అయిన ఆషిమా రామ్ (పల్లవి సుభాష్) ప్రేమలో పడతాడు. ఇద్దరూ ప్రేమించుకుంటారు, పెళ్లి చేసుకుంటారు. కానీ విక్కి వీర్యదానం చేస్తాడనే విషయం ఆషిమాకి తెలియదు. ఈ విషయం తెలిసిన తర్వాత ఇద్దరి మధ్య గొడవలు జరుగుతాయి. ఈ సిట్యువేషన్ ని విక్కి ఎలా హ్యాండిల్ చేస్తాడు అనేదే ఈ చిత్ర కథ.


నటీనటుల పెర్ ఫామెన్స్
వీర్యదానం చేసే విక్కిగా సుమంత్ చక్కటి నటన కనబర్చాడు. ఆ పాత్రకు తను సూట్ అయ్యాడు. బెస్ట్ పెర్ ఫామెన్స్ ఇవ్వడానికి శాయశక్తులా కృషి చేసాడు. కొన్ని ఎక్స్ ప్రెషన్స్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటాయి. కామెడీ సీన్స్ లో కూడా బాగా నటించాడు. నటనకు స్కోప్ ఉన్న పాత్ర చేసింది హీరోయిన్ పల్లవి సుభాష్. టాలీవుడ్ లో ఆమెకు మంచి భవిష్యత్తు ఉంటుంది. డా.ఆంజనేయులుగా మరెవరినీ ఊహించుకోలేని విధంగా తనికెళ్ల భరణి ఆ పాత్రలో ఒదిగిపోయారు. ఈ సినిమాకి ఆంజనేయులు పాత్ర ఎంత బలమో... తనికెళ్ల భరణి ఆ పాత్ర చేయడం అంత బలం. సుమంత్, తనికెళ్ల భరణి కాంబినేషన్ లో సాగే కామెడీ సీన్స్ ఆడియన్స్ పెదవులపై చిరునవ్వులు పూయిస్తాయి. నటీనటులందరూ తమ పాత్రల పరిధిమేరకు నటించారు.


సాంకేతిక వర్గం
శ్రీచరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతమందించారు. సిట్యువేషనల్ సాంగ్స్, డీసెంట్ రీ-రికార్డింగ్ తో మ్యూజిక్ పరంగా ఈ సినిమాకి ప్లస్ మార్కులు పడతాయి. డైలాగ్స్ బాగున్నాయి. ఎడిటింగ్ విషయానికొస్తే... కొన్ని సీన్స్ ట్రిమ్ చేసి ఉంటే ల్యాగ్ అనిపించకుండా, సినిమా చాలా ఫాస్ట్ గా పూర్తయిపోయిందనే ఫీలింగ్ కలిగేది. సినిమాటోగ్రఫీ సూపర్బ్. నిర్మాణపు విలువలు బాగున్నాయి. ఒరిజినల్ వెర్షన్ సీన్స్ ని అలాగే దింపేసినప్పటికీ, స్ర్కిఫ్ట్ ని చక్కగా హ్యాండిల్ చేయడంతో పాటు, ఎంటర్ టైన్ మెంట్ పార్ట్ ని ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా మలచడంతో డైరెక్టర్ మల్లిక్ రామ్ సఫలమయ్యారు.


ఫిల్మీబజ్ విశ్లేషణ
సుమంత్, తనికెళ్ల భరణి, పల్లవి సుభాష్ ఈ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్స్. పాత్రలకు సరిపడా నటీనటులను ఎంపిక చేసుకోవడంతోనే మొదటి సక్సెస్ ఆరంభమవుతుంది. ఫ్రెష్ కాన్సెఫ్ట్ కావడం కూడా ఈ సినిమాకి మేజర్ హైలైట్. వీర్యదానం కాన్సెఫ్ట్ కొత్తగా ఉంటుంది. కన్వీన్సింగ్ గా చెప్పడంతో ఆడియన్స్ కనెక్ట్ అయిపోతారు, తనికెళ్ల భరణి, సుమంత్ కాంబినేషన్, ఆ సీన్స్ కి డైలాగ్స్ రాసిన విధానం బాగుంది. డైలాగ్స్ వినోదం పంచడంతో పాటు తెలివిగా అనిపిస్తాయి. ఫస్టాప్ ని ఎంటర్ టైన్ మెంట్ వేలో తీసుకెళ్లి, సెకండాఫ్ లో చక్కటి ఎమోషన్స్ తో కూడుకున్న డ్రామా ఉండటం ఈ సినిమాకి బలం, పాజిటివ్ మెసేజ్ తో సినిమా క్లయిమ్యాక్స్ ఉండటం బాగుంది, క్లాస్ ఆడియన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సినిమా నచ్చుతుంది. మాస్ సినిమాలను ఇష్టపడేవారికి ఈ సినిమా కాస్త నిరాశపరుస్తుంది. ఓవర్ సీస్ ఆడియన్స్ కి ఈ సినిమా రీచ్ అవుతుంది. భార్య, భర్తల మధ్య సాగే ఎమోషనల్ జర్నీ ఈ సినిమాకి హైలైట్. సంతానం కలగకపోవడం వల్ల ఎన్నో కుటుంబాలు విచ్ఛన్నమవుతున్నాయి. వీర్యదానంతో సంతానం పొందవచ్చు అనే అవగాహన పెంపొందించుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి ఇలాంటి కాన్సెష్ట్ లతో సినిమాలు రావడం ఎంతైనా అవసరముంది. డీసెంట్ గా కన్వీన్సింగ్ వేలో ఇలాంటి కాన్సెఫ్ట్ లతో సినిమాలు చేస్తే ఆడియన్స్ ఆదరణ ఖచ్చితంగా లభిస్తుంది.


ఫైనల్ గా చెప్పాలంటే.. మంచి మెసేజ్ తో కూడుకున్న కొత్త కాన్సెఫ్ట్. కాబట్టి ఈ సినిమాని మిస్ అవ్వకండి. వినోదంతో పాటు వీర్యదానంపైన అవగాహన పెంచుకునే సినిమా. డోంట్ మిస్ ఇట్...

 

ఫిల్మీబజ్ డాట్ కామ్ రేటింగ్ - 3/5Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా చేసి అందరినీ స్వీట్ షాక్ కి గురి చేసా ..

Read More !

Gossips

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !