View

పైసా వసూలు మూవీ రివ్య్వూ

Friday,September01st,2017, 01:43 AM

చిత్రం - పైసా వసూలు
బ్యానర్ - భవ్య క్రియేషన్స్
నటీనటులు - నందమూరి బాలకృష్ణ, శ్రియాసరన్, కియారాదత్, కబీర్ బేడీ, ఫృధ్వీరాజ్, అలీ తదితరులు
సినిమాటోగ్రఫీ - ముఖేష్.జి
ఎడిటింగ్ - జునైద్ సిద్ధికీ
సంగీతం - అనూప్ రూబెన్స్
నిర్మాత - వి.ఆనంద్ ప్రసాద్
స్ర్కీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం - పూరి జగన్నాధ్


నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై ఆనంద్ ప్రసాద్.వి నిర్మించిన చిత్రం 'పైసా వసూలు'. బాలయ్యతో పూరి చేసిన ఫస్ట్ సినిమా ఇది. బాలయ్యను అభిమానులు ఎలా చూడాలనుకుంటారో, ఆయనతో ఎలాంటి సినిమా చేస్తే 'పైసా వసూలు' చెయ్యొచ్చో, రికార్డులు కొల్లగొట్టొచ్చనే పూర్తి అవగాహనతో పూరి 'పైసా వసూలు' సినిమా చేసాడని టీజర్స్, ట్రైలర్స్ ద్వారా తెలిసిపోయింది. బి, సి సెంటర్స్ ఆడియన్స్ ని ఫుల్లుగా టార్గెట్ చేసారు. మరి బాలయ్య, పూరి మ్యాజిక్ బాక్సాఫీస్ వద్ద వర్కవుట్ అవుతుందా.. పైసా వసూలు ఖాయమా తెలుసుకుందాం...


à°•à°¥
తేడా సింగ్ (బాలకృష్ణ) ని అండర్ కవర్ ఏజెంట్ గా అపాయింట్ చేసి బాబ్ మార్లి గ్యాంగ్ ని అంతమొందించడానికి ప్లాన్ చేస్తుంది పోలీస్ డిపార్ట్ మెంట్. పోలీస్ డిపార్ట్ మెంట్ తో చేతులు కలిపిన తేడాసింగ్, మరోవైపు బాబ్ మార్లి గ్యాంగ్ తో కూడా అండర్ స్టాండింగ్ కి వస్తాడు. పోలీసులే తనను నియమించారని కూడా చెబుతాడు. ఓ వైపు హారిక (ముస్కాన్) ని కూడా ఫాలో అవుతాడు. పోర్చుగల్ వెళ్లిన అక్క సారిక (శ్రియ) ఆచూకి తెలీక ఆమెను వెతుకుతూ టెన్షన్ లో ఉంటుంది హారిక. కట్ చేస్తే...


తేడా సింగ్ తీహార్ జైలు నుంచి వచ్చిన వ్యక్తి కాదని, విదేశాలనుంచి వచ్చిన వ్యక్తి అని తెలుసుకున్న పోలీస్ డిపార్ట్ మెంట్, అసలు అతను ఏ పని మీద ఇండియా వచ్చాడు, అతను ఎవరు అనే విషయంపై దృష్టి పెడుతుంది. కట్ చేస్తే...


తేడా సింగ్ ఓ రా ఏజెంట్ అని తెలుసుకుంటుంది పోలీస్ డిపార్ట్ మెంట్. మరోవైపు తన అక్క సారికను చంపింది తేడాసింగ్ అని తెలుసుకుంటుంది హారిక. ఇంటర్వెల్ ఎపిసోడ్ లో తేడాసింగ్ ని షూట్ చేస్తుంది హారిక.


అసలు తేడా సింగ్ ఎందుకు విదేశాల నుంచి ఇండియా వచ్చాడు... హారికను ఎందుకు పరిచయం చేసుకుంటాడు... బాబ్ మార్లి గ్యాంగ్ ని ఎందుకు ఏరిపారేస్తుంటాడు... సారికకు ఏమయ్యింది... తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.


నటీనటుల పెర్ ఫామెన్స్
తేడా సింగ్ గా, రా ఏజెంట్ గా రెండు షేడ్స్ ఉన్న పాత్రను చేసారు నందమూరి బాలకృష్ణ. ఈ పాత్ర కోసం మేకోవర్ అయిన విధానం సూపర్బ్. బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ లో కొత్త బాలయ్యను చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. మాములుగానే ఫుల్ ఎనర్జిటిక్ గా పాత్రలో పరకాయ ప్రవేశం చేసే బాలయ్య, ఈ సినిమాలో రెట్టింపు ఉత్సాహంతో రెచ్చిపోయారు. డ్యాన్సులు, ఫైట్ లు ఇరగదీసారు. ఫ్యాన్స్ కి సినిమా చూస్తున్నంతసేపు పండగలా ఉంటుంది. జర్నలిస్ట్ గా శ్రియ సరన్ చక్కగా ఒదిగిపోయింది, ముస్కాన్, కియారా దత్, కబీర్ బేడీ, అలోక్ జైన్, ఫృధ్వీ తదితరులు తమ పాత్రల పరిధిమేరకు నటించారు.


సాంకేతిక వర్గం
సినిమాటోగ్రఫీ సూపర్బ్. విజువల్ గా సినిమా చాలా రిచ్ గా ఉంది. పాటలు బాగున్నాయి. లిరిక్ రైటర్స్ భాస్కరభట్ల, పులగం చిన్నారాయణ రాసిన లిరిక్స్, ట్యూన్స్ ఫ్యాన్స్ ని థియేటర్స్ లో చిందేసి, గోల చేసేలా చేస్తున్నాయి. ఎడిటింగ్ బాగుంది. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాని నిర్మించింది భవ్య క్రియేషన్స్. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. పూరి జగన్నాధ్ తనదైన శైలిలో డైలాగులు రాసుకుని, బాలయ్య అభిమానులు ఏం ఆశిస్తారో అన్ని అంశాలను పుష్కలంగా ఉండేలా చేసుకోవడంలో సక్సెస్ అయ్యాడు. బాలయ్యను స్టైలిష్ గా చూపించాడు. కొత్త బాలయ్యను చూసిన ఫీలింగ్ కలుగుతుంది.


ఫిల్మీబజ్ విశ్లేషణ
నెగటివ్ షేడ్, స్టైల్, అటిట్యూడ్, అగ్రిసివ్ గా హీరో క్యారెక్టర్ ని డిజైన్ చేయడం పూరికి అలవాటు. ఆల్ మోస్ట్ పూరి హీరో ఇలానే ఉంటాడు. ఇలాంటి క్యారెక్టరైజేషన్ తో బాలయ్యను చూపిస్తే ఎలా ఉంటుంది, అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే ఆసక్తి అందరిలో ఉంది. అయితే పూరి టోటల్ గా బాలయ్య ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని, అభిమానులకు ఏం నచ్చుతుందనే అవగాహనతో ఈ సినిమా చేసాడు. చాలా స్టైల్ గా బాలయ్యను చూపించాడు పూరి. డ్యాన్స్, ఫైట్స్, వన్ లైన్ పంచ్ డైలాగులతో బాలయ్య క్యారెక్టరైజేషన్ అదిరిపోతుంది. బాలయ్య స్టెప్పులేస్తుంటే ఫ్యాన్స్ కి పండగలా అనిపిస్తుంది. బాలయ్య ఎనర్జీ లెవెల్స్ ఆడియన్స్ ని థ్రిల్ కి గురి చేయడం ఖాయం. ఫస్టాప్ అంతా ఎంటర్ టైన్ మెంట్, కొన్ని డ్రామా సీన్స్ తో చాలా ఫాస్ట్ గా పూర్తవుతుంది. ఒక రకమైన కవ్వింపు అటిట్యూడ్ తో బాలయ్య చెలరేగిపోవడం వావ్ అనిపిస్తుంది. సెకండాఫ్ లో ఎమోషనల్ సీన్స్, శ్రియతో లవ్, విలన్ గ్యాంగ్ కి చుక్కలు చూపించడం ఫ్యాన్స్ కి ఫీస్ట్ లా అనిపిస్తుంది. 'మామ ఎక్ పెగ్ లా...' పాట బాలయ్య పాడటం అదనపు అట్రాక్షన్. క్లయిమ్యాక్స్ తర్వాత సందీప్ చౌతా చేసిన 'జై బాలయ్య' ప్రమోషనల్ సాంగ్ ఫ్యాన్స్ కి మరింత ఊపునిస్తుంది.


ఫైనల్ గా చెప్పాలంటే... బాలయ్య, పూరి మ్యాజిక్ తో కాసుల వర్షం ఖాయం. కేవలం అభిమానులకే కాదు... కమర్షియల్ సినిమాలను ఇష్టపడే సినీప్రియులకు సైతం ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. టైటిల్ కి తగ్గట్టు పక్కా 'పైసా వసూలు' సినిమా.


ఫిల్మీబజ్ డాట్ కామ్ - 3.5/5



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !