View

నేను... శైలజ మూవీ రివ్య్వూ

Friday,January01st,2016, 09:20 AM

చిత్రం - నేను... శైలజ
బ్యానర్ - శ్రీ స్రవంతి మూవీస్
నటీనటులు - రామ్, కీర్తీ సురేశ్, సత్యరాజ్, నరేశ్, ప్రిన్స్, విజయ్ కుమార్, రోహిణి, ప్రగతి, చైతన్య కృష్ణ, ప్రదీప్ రావత్, ధన్యా భాలకృష్ణ, శ్రీముఖి, హిమజ తదితరులు
సంగీతం - దేవిశ్రీ ప్రసాద్
కెమెరా - సమీర్ రెడ్డి
ఎడిటింగ్ - ఎ. శ్రీకర్ ప్రసాద్
సమర్పణ - కృష్ణచైతన్య
నిర్మాత - స్రవంతి రవికిశోర్
రచన, దర్శకత్వం - కిశోర్ తిరుమల


రామ్ చాలా ఎనర్జిటిక్ గా ఉంటాడు. అందుకే రచయితలు, దర్శకులు తన కోసం ఫుల్ ఎనర్జిటిక్ గా ఉంటే క్యారెక్టర్స్ రాస్తుంటారు. కానీ, కిశోర్ తిరుమల మాత్రం రామ్ ఫుల్ ఎనర్జీకి తగ్గ క్యారెక్టర్ రాయలేదు. కొంచెం ఎనర్జీ తగ్గించుకుని రామ్ నటించాలి. డిఫరెంట్ గా ఉందని రామ్ ఈ పాత్ర ఒప్పుకున్నాడు. కథ కూడా తనకు బాగా నచ్చింది. 'ప్యూర్ లవ్ స్టోరి'. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ మూవీస్ 'స్రవంతి' మూవీస్ నుంచి చాలానే వచ్చాయి. సో.. రామ్ తో స్రవంతి రవికిశోర్ నిర్మించిన ఈ లవ్ స్టోరీ ఎలా ఉంటుంది? నూతన దర్శకుడు కిశోర్ తిరుమల దర్శకుడిగా భేష్ అనిపించుకుంటాడా?... చూద్దాం.


à°•à°¥
హరి (రామ్), స్వేచ్ఛ కవల పిల్లలు. హరి కుటుంబం, శైలజ (కీర్తి సురేశ్) కుటుంబం ఒకే ఊరిలో ఉంటుంది. హరి, శైలజ ఒకే స్కూల్లో చదువుకుంటారు. శైలజకు ఒక అన్నయ్య ఉంటాడు. కుటుంబ పరిస్థితులు శైలజను నవ్వుకు దూరం చేస్తాయి. ఆమెను నవ్వించడానికి హరి ప్రయత్నం చేస్తుంటాడు. చిన్నప్పట్నుంచి తమ తండ్రి తమకు దూరంగా ఉంటున్నాడన్న ఫీలింగ్ శైలజను నవ్వుకు దూరం చేస్తుంది. తండ్రి మీద కోపం పెంచుకుంటుంది. చిన్నతనంలోనే శైలజను ప్రేమిస్తాడు హరి. కానీ హరి తండ్రికి వైజాగ్ ట్రాన్సఫర్ అవ్వడంతో హరి కుటుంబం అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అలా చిన్నతనంలోనే హరి, శైలజ దూరమవుతారు.


పెరిగి పెద్దవాడైన హరి ఓ పబ్ లో డిజె గా చేస్తుంటాడు. ఓ అమ్మాయికి ఐ లవ్ యు చెప్పడం, ఆ అమ్మాయి కాదంటే మరో అమ్మాయికి తన ప్రేమను వ్యక్తపరచడం చేస్తుంటాడు. ఓ సందర్భంలో తన చిన్నప్పటి ఫ్రెండ్ శైలజను కలుస్తాడు. కానీ ఆ అమ్మాయే శైలజ అని హరికి, తన చిన్నప్పటి ఫ్రెండ్ హరి అనే విషయం శైలజకు తెలియదు. రెండు, మూడు సందర్భాల్లో హరిని చూసిన శైలజ అతని పట్ల ఇంప్రెస్ అవుతుంది. హరి కూడా శైలజ అంటే ఇష్టపడతాడు. ఇద్దరూ చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవ్వడం మొదలుపెట్టిన తర్వాత శైలజకు తన ప్రేమను వ్యక్తపరుస్తాడు హరి. కానీ అతని ప్రేమను శైలజ అంగీకరించదు. అయితే అతనిని లవ్ చేస్తున్నానని మాత్రం చెబుతుంది.


అసలు హరి ప్రేమను శైలజ ఎందుకు రిజక్ట్ చేస్తుంది... ప్రేమిస్తున్న హరికి దూరంగా ఉండటానికి శైలజ ఎందుకు ప్రయత్నం చేస్తుంది... శైలజకు తన తండ్రి మీద ఉన్న కోపం పోతుందా... కూతురు తనను ఎంత మిస్ అయ్యిందన్న విషయం శైలజ తండ్రి గుర్తిస్తాడా... ఫైనల్ గా హరి ప్రేమను శైలజ అంగీకరిస్తుందా?.. అనేది మిగతా కథ.


నటీనటుల పర్ఫార్మెన్స్
హరి పాత్రను రామ్ సునాయాసంగా చేసేశాడు. ఈ మధ్యకాలంలో చేసిన పాత్రలకు భిన్నంగా ఈ పాత్ర ఉంది. రామ్ లో మంచి లవర్ బోయ్ కనిపించాడు. గత చిత్రాల్లోలా ఎక్కువ ఎనర్జీ చూపించే అవకాశం లేని పాత్ర ఇది. ఈ పాత్రకు ఎంత కావాలో అంతే చేసి, భేషి అనిపించుకున్నాడు. ఎమోషనల్ సీన్స్ లో రామ్ ఇచ్చిన చిన్న చిన్న ఎక్స్ ప్రెషన్స్ టచింగ్ గా ఉన్నాయి. వరుసగా ఓ ఎనిమిది, తొమ్మిది సినిమాల్లో మాస్ కుర్రాడిలా కనిపించాక హఠాత్తుగా లవర్ బోయ్ లా కనిపించి, మెప్పించడం అంటే చిన్న విషయం కాదు. ఆ విషయంలో రామ్ ఫుల్ గా సక్సెస్ అయ్యాడు. కీర్తీ సురేశ్ చాలా బాగుంది. నటనపరంగా కూడా భేష్. హీరోయిన్ గా తనకు మంచి భవిష్యత్తు ఉంది. స్నేహితురాలిగా ధన్యా బాలకృష్ణన్, బావగా ప్రిన్స్ కాసేపే కనిపించినా గుర్తుండిపోయే పాత్రలు. సత్యరాజ్ పాత్ర చాలా బాగుంటుంది. నరేశ్, రోహిణి, ప్రగతి, విజయ్ కుమార్ లు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. విలన్ ప్రదీప్ రావత్ చేసిన భగ్న ప్రేమికుడి పాత్ర ఆయనకు కొత్తగా ఉండటంతో పాటు ప్రేక్షకులకు కూడా కొత్తగా ఉంది.


సాంకేతిక వర్గం
మంచి కథ, పకడ్బందీ స్ర్కీన్ ప్లేతో కిశోర్ తిరుమల ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. తను రాసిన సంభాషణలు కూడా బాగున్నాయి. తండ్రీ, కూతురి మధ్య పెరిగిన దూరాన్ని కూతురు ఇచ్చే చిన్ని ఎక్స్ ప్రెషన్స్ తోనే ప్రేక్షకులకు అర్థమయ్యేలా తీయడం బాగుంది. దర్శకుడి ప్రతిభ తెలిసేది ఇలాంటి సన్నివేశాల విషయంలోనే. మంచి ఫీల్ గుడ్ మూవీని అందించాడు. దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన పాటలు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. సమీర్ రెడ్డి కెమెరా వండర్ ఫుల్. నిర్మాత స్రవంతి రవికిశోర్, సమర్పకుడు కృష్ణచైతన్య రాజీపడకుండా నిర్మించిన వైనం స్పష్టంగా కనిపిస్తుంది.


ఫిల్మీబజ్ విశ్లేషణ
ఈ మధ్య దాదాపు మాస్ క్యారెక్టర్స్ లో కనిపించిన రామ్ ని లవర్ బోయ్ లా చూపించాలనుకోవడం, కన్విన్సింగ్ గా చూపించడంలో కిశోర్ తిరుమల పూర్తిగా సక్సెస్ అయ్యాడు. ఒక లవ్ స్టోరీ ద్వారా కొత్త హీరో పరిచయమైతే ఎంత ఫ్రెష్ గా కనిపిస్తాడో రామ్ కూడా అలానే కనిపించాడు. ఫస్టాఫ్ కొంచెం ఎమోషనల్ గా, ఎక్కువ సరదాగా సాగుతుంది. సెకండాఫ్ లో కూడా ఎమోషన్ ని క్యారీ చేస్తూనే, సరదా సరదా సన్నివేశాలతో తీయడం ఆకట్టుకునే విధంగా ఉంది. యూత్ కి పిచ్చి పిచ్చిగా నచ్చే సినిమా. తండ్రి, కూతురి అనుబంధాన్ని అద్భుతంగా చూపించడంతో ఫ్యామిలీస్ కూడా కనెక్ట్ అయిపోతారు.


ఫైనల్ గా చెప్పాలంటే... కొత్త సంవత్సరం మొదటి రోజున మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీని ఇచ్చారు. నేను... శైలజ అందరి హృదయాలనూ టచ్ చేసేస్తారు. ఈ చిత్రబృందానికి కొత్త సంవత్సరం హ్యాపీగా మొదలైంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !