View

నిర్మలా కాన్వెంట్ మూవీ రివ్య్వూ

Friday,September16th,2016, 11:25 AM

చిత్రం - నిర్మలా కాన్వెంట్
బ్యానర్ - అన్నపూర్ణ స్టూడియోస్, మ్యాట్రిక్స్ టీమ్ వర్క్స్
నటీనటులు - రోషన్ మేక, శ్రియశర్మ, రోషన్ కనకాల, నాగార్జున అక్కినేని (గెస్ట్ అఫియరెన్స్), ఎల్.బి.శ్రీరాం, సూర్య, అనితాచౌదరి, ఆదిత్యమీనన్, సమీర్, రవికిషన్, సత్యకృష్ణన్, తాగుబోతు రమేష్ తదితరులు
సంగీతం - రోషన్ సాలూరి
సినిమాటోగ్రఫీ - యస్.వి.విశ్వేశ్వర్
నిర్మాతలు - నాగార్జున అక్కినేని, నిమ్మగడ్డ ప్రసాద్
రచన, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - జి.నాగకోటేశ్వరరావు
విడుదల తేదీ - 16th సెప్టెంబర్, 2016


న్యూ టాలెంట్ ని ఎంకరేజ్ చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు అక్కినేని నాగార్జున. హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ శ్రీకాంత్ ని హీరోగా పరిచయం చేస్తూ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై మ్యాట్రిక్స్ టీమ్ వర్క్స్ భాగస్వామ్యంతో నాగార్జున అక్కినేని, నిమ్మగడ్డ ప్రసాద్ నిర్మించిన చిత్రం 'నిర్మలా కాన్వెంట్'. ఈ చిత్రం ద్వారా శ్రియాశర్మ హీరోయిన్ గా పరిచయం అయ్యింది. జి.నాగకోటేశ్వరరావు దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఎ.ఆర్.రహమాన్ తనయుడు ఎ.ఆర్.అమీన్, నాగార్జున ఓ పాట పాడటం, సుమ, రాజీవ్ కనకాల తనయుడు రోషన్ కనకాల ఈ సినిమా ద్వారా నటుడిగా పరిచయం అవ్వడం... ఇలా ఎన్నో స్పెషాల్టీస్ తో రూపొందిన ఈ టీనేజ్ లవ్ స్టోరీపై ఆడియన్స్ లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమా ప్రోమోస్, పోస్టర్స్ మరింత ఆసక్తిని రేకెత్తించాయి. మరి వెండితెర అరంగేట్రం చేసిన వీరందరికీ ఈ సినిమా ఎలాంటి మలుపు అవ్వబోతోంది తెలుసుకుందాం.


à°•à°¥
భూపతినగరానికి చెందిన రాజుగారికి 99 ఎకరాలు పొలం ఉంటుంది. ఆ 99 ఎకరాలు నీటితో తడవాలంటే ఒక ఎకరం ఉన్న వీరయ్య (ఎల్.బి.శ్రీరాం) పొలం నుంచి నీరు రావాల్సిందే. ఇది రాజుగారికి చాలా అవమానకరంగా ఉంటుంది. ఎలాగైనా వీరయ్య దగ్గర్నుంచి ఆ ఎకరం పొలాన్ని లాగేసుకోవాలని రకరకాలుగా ట్రై చేస్తుంటాడు. తమ కులపోళ్లను గుడిలోకి అనుమతించి, చెరువు నీళ్లు త్రాగడానికి అనుమతిస్తే అప్పుడు ఆ ఎకరం పొలం ఇస్తానని చెబుతుంటాడు వీరయ్య. ఒక సందర్భంలో రాజుగారు మనుషులు వీరయ్యను చంపేస్తారు. చనిపోతూ తమ ఎకరం పొలాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రాజుకు అమ్మవద్దని చెప్పి కొడుకు సూరయ్య (సూర్య) దగ్గర మాట తీసుకుంటాడు వీరయ్య. కట్ చేస్తే...


సూరయ్య క్రిస్టియస్ మతంలోకి మారిపోయి డేవిడ్ అని పేరు మార్చుకుంటాడు. డేవిడ్, లక్మీమేరి (అనితాచౌదరి) దంపతులకు శ్యామ్యూల్ (రోషన్ శ్రీకాంత్) పుడతాడు. శ్యామ్యూల్ ని చిన్నప్పట్నుంచి చక్కగా చదివిస్తుంటారు. 13 యేళ్లుగా శ్యామ్యూల్ తోనే కలిసి చదువుతుంటుంది రాజుగారు మనవరాలైన శాంతి (శ్రియశర్మ). తల్లిలేని పిల్ల అవ్వడంతో రాజుగారు కొడుకు భూపతిరాజు (ఆదిత్యమీనన్) తన కూతురు శాంతిని ఎంతో ముద్దుగా పెంచుతుంటాడు. శ్యామ్యూల్, శాంతి నిర్మలా కాన్వెంట్ లో ఇంటర్ చదువుతుంటారు. శ్యామ్యూల్ జనరల్ నాల్డెజ్ లో టాపర్. శ్యామ్యూల్, శాంతి మధ్య పరిచయం ప్రేమగా మారుతుంది. ఇది తెలుసుకున్న భూపతిరాజు తన మనుషులతో శ్యామ్యూల్ ని కొట్టిస్తాడు. కట్ చేస్తే...


శాంతిని ప్రేమిస్తున్నానని, తనకు ఆమె కావాలని తండ్రి దగ్గర చెబుతాడు శ్యామ్యూల్. భూపతిరాజా దగ్గర సంబంధం మాట్లాడమని కూడా చెబుతాడు. సంబంధం మాట్లాడటానికి భూపతిరాజా ఇంటికి వెళ్లిని డేవిడ్ కి ఎలాంటి అవమానం ఎదురయ్యింది... ఎలాంటి ట్రిక్ ప్లే చేసి డేవిడ్ దగ్గర ఉన్న ఎకరం పొలాన్ని భూపతిరాజా లాక్కుంటాడు... శ్యామ్యూల్ తన తెలితేటలతో శాంతి ప్రేమను ఎలా గెల్చుకుంటాడు,.. నాగార్జున ఈ కుర్రాడికి ఏ విధంగా హెల్ప్ చేస్తాడు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.


నటీనటుల పెర్ ఫామెన్స్
శ్యామ్యూల్ పాత్ర చేసిన రోషన్ శ్రీకాంత్ తన పాత్రకు పూర్తి న్యాయం చేసాడు. కెమెరా ఫియర్ లేదు. తడుబాటు లేకుండా నటించాడు. దాంతో కొత్త కుర్రాడు అన్న ఫీలింగ్ కలగదు. ఖచ్చితంగా హీరోగా రోషన్ కి మంచి భవిష్యత్తు ఉంటుందని ఫిక్స్ అయిపోతారు. డ్యాన్స్, డైలాగ్ డెలివరీ విషయంలో కూడా రోషన్ కి ప్లస్ మార్కులు పడతాయి. మరో రెండు, మూడేళ్ల తర్వాత హీరోగా లాంఛ్ అవ్వడానికి రోషన్ కి దక్కిన మంచి అవకాశం ఈ సినిమా. శ్రియశర్మ క్యూట్ గా ఉంది. చక్కగా నటించింది. హీరోయిన్ గా మంచి భవిష్యత్తు ఉంటుందని ఈ సినిమా చూసిన వారు తప్పకుండా చెబుతారు. సుమ, రాజీవ్ కనకాల తనయుడు రోషన్ కూడా చాలా ఈజ్ గా నటించాడు. మిగతా నటీనటులందరూ తమ పాత్రల పరిధిమేరకు నటించారు. శ్యామ్యూల్ తెలివితేటలను గుర్తించి, చాంఫియన్ కి చాంఫియన్ ప్రోగ్రామ్ ని హోస్ట్ చేసి సపోర్ట్ చేసే విధంగా నాగార్జున క్యారెక్టర్ సాగడం చాలా బాగుంది.


సాంకేతిక వర్గం
సింపుల్ టీనేజ్ లవ్ స్టోరీకి, మీలో ఎవరు కోటీశ్వరుడు గేమ్ షో లింక్ ఇచ్చి కథ అల్లిన విధానం బాగుంది. ఈ పరంగా డైరెక్టర్ నాగకోటీశ్వరరావు ప్రశంసలు అందుకుంటారు. టేకింగ్ పరంగా మాత్రం డైరెక్టర్ కి మైనస్ మార్కులు పడతాయి. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ ఈ చిత్రానికి ప్లస్ పాయింట్స్. ప్రొడకన్స్ వ్యాల్యూస్ బాగున్నాయి.


ఫిల్మీబజ్ విశ్లేషణ
ఓ టీనేజ్ అబ్బాయి, అమ్మాయి మధ్య సాగే లవ్ స్టోరీ. ఈ లవ్ స్టోరీ కి ఓ గేమ్ షో ని మిక్స్ చేయడం పొలం అనే ట్విస్ట్ ఇవ్వడం ఆసక్తిగా ఉంటుంది. రోషన్, శ్రియశర్మ నటనతో ఫస్టాప్ ఇంప్రెసివ్ గా ఉంటుంది. సెకండాఫ్ లో నాగార్జున ఎంట్రీ ఆసక్తిగా ఉంటుంది. తన పరిధిలో జరిగిన అనుభవాలతో గేమ్ షోలోని ప్రశ్నలకు హీరో సమాధానాలివ్వడం బాగుంటుంది. అయితే కొన్నిసీన్స్ ని మరింతగా ఎలివేట్ చేసి ఉంటే, ఎమోషన్ వర్కవుట్ అయ్యేది. ముఖ్యంగా గేమ్ ఫో ఆడటానికి తన ఊరికే శ్యామ్యూల్ రావడం, ఆ గేమ్ షోలో గెలుస్తాడా లేదా అనే బిల్డప్, తండ్రి, తల్లి, కొడుకు మధ్య సెంటిమెంట్ సీన్స్ ని ఇంకా వర్కవుట్ చేస్తే బాగుండేది. తన తండ్రికి ఇచ్చిన చివరి మాటను జవదాటి తన కొడుకు మీద ప్రేమతో పొలం రాసివ్వడంలాంటి సీన్స్ విషయంలో మరింత జాగ్రత్త తీసుకుని ఉంటే ఎమోషనల్ గా సీన్స్ ఇంకా వర్కవుట్ అయ్యేవి. ఏదేమైనా ఓ కొత్త కుర్రాడి లాంఛింగ్ కి సరిపడా కథతో ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమా టీనేజర్స్ ని ఎక్కువగా ఆకట్టుకుంటుంది. ఎలాంటి వల్గార్టీ లేకుండా, సెకండాఫ్ నాల్డెజ్ బుల్ గా తెరకెక్కించడం అభినందించదగ్గ విషయం. ప్రేమించే వయసులో ఉన్నాంకానీ, పెళ్లి చేసుకునే వయసులో లేమని క్లయిమ్యాక్స్ లో చెప్పడం యువత కి దిశానిర్ధేశం చేసినట్టుగా ఉంటుంది.


ఫైనల్ గా చెప్పాలంటే... ఈ టీనేజ్ లవ్ స్టోరీ నాల్డెజ్ బుల్ గా కూడా ఉంది. కాబట్టి యూత్ మాత్రమే కాదు.. అన్ని వర్గాల వారు ఈ సినిమాని చూసి ఎంజాయ్ చెయ్యొచ్చు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !