View

ఒక మనసు మూవీ రివ్య్వూ

Friday,June24th,2016, 10:47 AM

చిత్రం - ఒక మనసు
సమర్పణ - టివి 9
బ్యానర్ - మధుర ఎంటర్ టైన్ మెంట్స్
నటీనటులు - నాగశౌర్య, నిహారిక కొణిదెల (తొలి పరిచయం), రావు రమేష్, నాగినీడు, ప్రగతి, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్ తదితరులు
సంగీతం - సునీల్ కశ్యప్
సహ నిర్మాతలు - ఎ.అభినయ్, డా.కృష్ణ భట్ట
నిర్మాత - మధుర శ్రీధర్ రెడ్డి
కథ, మాటలు, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - రామరాజు


నాగశౌర్య హీరోగా టివి 9 సమర్పణలో, మధుర ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై రామరాజు దర్శకత్వంలో మధుర శ్రీధర్ రెడ్డి నిర్మించిన చిత్రం 'ఒక మనసు'. ఈ చిత్రం ద్వారా మెగా కాంపౌండ్ అమ్మాయి నిహారిక కొణిదెల హీరోయిన్ గా పరిచయం అవుతోంది. ఈ రోజు (24.6.2016) ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా ఈ చిత్రం విడుదలయ్యింది. మెగా కాంపౌండ్ నుంచి ఇప్పటివరకూ హీరోలు మాత్రమే వచ్చారు. ఇప్పుడు హీరోయిన్ కూడా వచ్చేసింది. మెగా డాటర్ ఏ మేరకు గ్లామర్ ఫీల్డ్ లో నెట్టుకు రాగులుగుతుంది... నటిగా ఆమె భవిష్యత్తు ఎలా ఉండబోతోందనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఈ చిత్రం ట్రైలర్స్, టీజర్స్ ఇది ఓ పీల్ గుడ్ లవ్ స్టోరీ అనే అంచనాలను పెంచేసాయి. 'మల్లెలతీరంలో సిరిమల్లెపువ్వు' ఫేం రామరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం, టివి 9 నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి మధుర శ్రీధర్ రెడ్డితో కలిసి ఈ సినిమాని నిర్మించడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఆ అంచనాలకు తగ్గట్టు ఈ సినిమా ఉందా తెలుసుకుందాం.


కథ
సూర్య (నాగశౌర్య) జైలు నుంచి బెయిల్ పై విడుదలవుతాడు. తండ్రి రావు రమేష్ అతనిని జైలు నుంచి రిసీవ్ చేసుకుని వైజాగ్ లో ఉండమని చెప్పి, అతనికి తోడుగా అవపరాల శ్రీనివాస్ ని ఉంచుతాడు. మూడేళ్లు జైల్లో ఉన్న సూర్య బయటికి రాగానే తన ప్రేమికురాలు సంధ్య (నిహారిక) గురించి తెలుసుకోవాలనుకుంటాడు. మరో వైపు సంధ్యకు ఓ పెళ్లి సంబంధం చూసి కూతురిని ఒప్పించడానికి తల్లి (ప్రగతి) ప్రయత్నాలు చేస్తుంటుంది. సూర్య ఓ క్రిమినల్ అని, మూడేళ్లు జైల్లో ఉన్న సూర్యను మర్చిపోవాలని కూతురికి చెబుతుంది ప్రగతి.. ఫ్య్లాష్ బ్యాక్ లోకి వెళితే...


కొడుకు రాజకీయాల్లో రాణించాలని తపనపడే తండ్రి రావురమేష్. ఆయన కొడుకు సూర్య (నాగశౌర్య) కూడా తన తండ్రి చెప్పిన బాటలో నడుస్తూ, తన మావయ్యలా ఎప్పటికైనా ఎమ్మెల్యే అవ్వాలనే టార్గెట్ తో ఉంటాడు. విజయనగరంలో సెటిల్స్ మెంట్స్ చేస్తూ డబ్బులు సంపాదిస్తాడు. హౌస్ సర్జన్ చేస్తున్న సంధ్య ఓ సందర్భంలో సూర్యను చూసి ప్రేమలో పడుతుంది. సూర్య కూడా ఆమెను ప్రేమిస్తాడు. సూర్య చేస్తున్న సెటిల్ మెంట్స్ సంధ్యకు నచ్చవు. అయినా సరే అతని మీద ప్రేమతో సర్ధుకు పోతుంది. ఒకానొక టైమ్ లో సెటిల్స్ మెంట్స్ ఆపేసి, తన గురించి ఆలోచించమని చెబుతుంది సంధ్య. ఆమె మీద ప్రేమతో సూర్య కూడా అంగీకరిస్తాడు. కానీ తండ్రి తన కోసం చేస్తున్న త్యాగాలు గమనించిన సూర్య, ఆయన కల నెరవేర్చడానికి ఓ సెటిల్ మెంట్ చేయడానికి అంగీకరిస్తాడు. ఆ సెటిల్ మెంట్ సూర్యను జైలు పాలయ్యేలా చేస్తుంది. మూడేళ్ల తర్వాత కలుసుకున్న సంధ్య, సూర్య ప్రేమలో ఏ మాత్రం తేడా ఉండదు. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం. కానీ సూర్యకు సంధ్యను దూరం చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. మరి తనెంతో ఇష్టపడే సంధ్యను సూర్య దూరం చేసుకుంటాడా... తనను ఎంతో ప్రేమించే సూర్యకు ఏర్పడిన పరిస్థితులను అర్ధం చేసుకున్న సంధ్య ఆ పరిస్థితుల నుంచి సూర్యను బయటపడేయడానికి ఏం చేస్తుంది అనేదే ఈ చిత్రం క్లయిమ్యాక్స్.


నటీనటుల పర్ ఫామెన్స్
నాగశౌర్య ఇప్పటివరకూ చేసిన సినిమాల్లో లవర్ బోయ్ గా మెరిసాడు. ఈ చిత్రంలో అంతకుమించి నటించడానికి స్కోప్ దక్కంది. దాంతో నాగశౌర్య తనలోని నటుడిని ఆవిష్కరించుకునే ప్రయత్నం చేసాడు. ఓ ప్రేమికుడిగా, తండ్రి కోసం మదనపడే కొడుకుగా చాలా చక్కగా నటించాడు నాగశౌర్య. లవ్, సెంటిమెంట్ సీన్స్ లో నాగశౌర్య ఎక్స్ ప్రెషన్స్ సూపర్, ఓవరాల్ గా ఓ మెచ్చుర్డ్ లవ్ స్టోరీలో మెచ్చుర్డ్ గా పెర్ ఫామ్ చేసి శభాష్ అనిపించుకున్నాడు. మెగా డాటర్ నిహారిక హీరోయిన్ గా పరిచయం అయిన సినిమా ఇది. డాక్టర్ సంధ్య పాత్రకు నిహారిక బాగుంది. ప్రేమికురాలిగా చక్కటి పెర్ ఫామెన్స్ చూపించింది. ప్రీ క్లయిమ్యాక్స్, క్లయిమ్యాక్స్ సన్నివేశాల్లో బాగా నటించింది. తండ్రి పాత్రల్లో జీవిస్తున్న రావు రమేష్ మరోసారి ఈ సినిమాలో కూడా తండ్రి పాత్ర చేసారు. పాజిటివ్ షేడ్ ఉన్న ఈ పాత్రలో ఆయన పూర్తిగా ఒదిగిపోయారు. మిగతా నటీనటులందరూ ఎవరి పాత్రల పరిధిమేరకు వారు నటించారు.


సాంకేతిక వర్గం
మెయిన్ స్టోరీ లైన్ బాగుంది. కానీ ఆ స్టోరీని ఎలివేట్ చేసే విధంగా సన్నివేశాలు లేవు. ప్రీ క్లయిమ్యాక్స్, క్లయిమ్యాక్స్ సీన్స్ బాగున్నాయి. స్లో నారేష్ ఈ సినిమాకి మైనస్ పాయింట్. ఆ పరంగా డైరెక్టర్ కి మైనస్ మార్కులు పడతాయి. అయితే కమర్షియల్ అంశాలు జోడించే అవకాశం ఉన్నప్పటికీ, ఓ ఫీల్ గుడ్ లవ్ ఎంటర్ టైనర్ ని చూపించాలనే దర్శకుడి తాపత్రయం ఆ వైపుగా ఆలోచించనివ్వలేదనే విషయం స్ఫష్టమవుతోంది. కొన్ని డైలాగులు బాగున్నాయి. సునీల్ కశ్యప్ అందించిన రెండు పాటలు బాగున్నాయి. రీ-రికార్డింగ్ కొన్ని సీన్స్ ని బాగా ఎలివేట్ చేస్తే.. కొన్ని సీన్స్ విషయంలో రీ-రికార్డింగ్ డామినేట్ చేసిందనిపిస్తుంది. ప్రీ క్లయిమ్యాక్స్, క్లయిమ్యాక్ప్ సన్నివేశాల్లో ఆర్.ఆర్ చాలా బాగుంది. ఎడిటింగ్ పరంగా ఇంకాస్త కేర్ తీసుకుని ఉండాల్సింది. నిర్మాణపు విలువలు బాగున్నాయి.


ఫిల్మీబజ్ విశ్లేషణ
స్టోరీ లైన్ బాగుంది. క్లయిమ్యాక్స్, ప్రీ క్లయిమ్యాక్స్ ఈ సినిమాకి ప్లస్. ఎక్కువ సీన్స్ పోయిటిక్ గా ఉండటం, స్లో నారేష్ వల్ల ఆడియన్స్ బోర్ ఫీలవుతారు. హీరో, హీరోయిన్ మధ్య సాగే లవ్ సీన్స్ రిపీట్ అవుతున్నట్టుగా ఉంటాయి. నాగశౌర్య, నిహారిక మధ్య మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరినప్పటికీ, అవే సీన్స్ రిపీట్ అవుతున్నట్టు అనిపించడం ఆడియన్స్ కి విసుగు తెప్పిస్తుంది. హీరో, హీరోయిన్ మెచ్చుర్డ్ గా ఆలోచించడం, తను ప్రేమించినవాడు బాగుండాలని ఆలోచించి హీరోయిన్ చనిపోవడం మనసులను హత్తుకుంటుంది. కమర్షియల్ సినిమాలకు అలవాటుపడిన ప్రేక్షకులకు ఈ సినిమా కనెక్ట్ అవ్వదు. అయితే రొటీన్ కి భిన్నంగా ఫీల్ గుడ్ మూవీస్ ని ఆస్వాదించే వారికి సినిమా నచ్చుతుంది, ముఖ్యంగా లవ్ స్టోరీస్ ని ఇష్టపడే యూత్ కి ఈ సినిమా కనెక్ట్ అవుతుంది,.


ఫైనల్ గా చెప్పాలంటే.. సూర్య, సంధ్య లవ్ స్టోరీలోని కొన్ని సన్నివేశాలు మనసును తాకే విధంగా ఉన్నాయి. వాటి కోసం ఓసారి సినిమాని చూసి ఎంజాయ్ చెయ్యొచ్చు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. రీ ఎంట్రీకి ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయత్తమవుతున్నాడు. 'శ్రీమంతుడు' చిత్రం త ..

Read More !

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ్యాప్ తీసుకోకుండానే 151వ సినిమా చేయడా ..

Read More !

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కైనా సంతోషంగానే ఉంటుంది. కానీ ఆ అవకాశం ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా విడుదలై భారీ వసూళ్లను సాధించిన విష ..

Read More !

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధరమ్ తేజ్, బోయపాటి శ్రీను సినిమాలు చేస్ ..

Read More !

Gossips

మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ గతంలో శిరీష్ భరద్వాజను ప్రేమించి, ..

రాంచరణ్ కి నోటి దురుసు ఎక్కువ అని తెలుగు సినిమా పరిశ్రమలో ఓ టాక్ ఉంది. ఆ వార ..

'రక్తచరిత్ర' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన రాధికా ఆప్టే తనలో మంచి నట ..

బాలీవుడ్ లో భారీ సినిమాలను నిర్మిస్తూ, పంపిణీ చేస్తున్న ఈరోస్ ఇంటర్నేషనల ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో 10రోజుల్లో 'జనతా గ్యారేజ్' షూటింగ్ తో బిజీ అవ్వబోతున ..

మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ సినిమా అంటే భారీ అంచనాలు ఉం ..

సీన్ ఉంది కదా అని ఓవర్ గా బిల్డప్ ఇస్తే సీన్ సితార్ అవుతుంది. విలన్ గా దూసుక ..

'బాహుబలి ది కంక్లూజన్' చిత్రం విడుదలైన వెంటనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో రాజమౌ ..

ప్రిన్స్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందితే బాగుంటుందని ..

మెగాబ్రదర్స్ మధ్య విభేదాలు ఉన్నాయా లేవా అనే విషయం గురించి కొంతకాలం క్రిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ సినిమా అంటే ..

యంగ్ రెబల్ స్టార్ ఫ్రభాస్ తో 'మిర్చి' లాంటి హిట్ చిత్రం చేసిన తర్వాత కొరటాల ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ లో వచ్చే యేడాది ఓ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ సినిమా అంటే ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్, హీరోయిన్ రెజీనా ఘాటుగా ప్రేమించుకుంటున్నార ..

ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ జాబితాలో కొరటాల శివ పేర ..

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ..

రాజకీయనేత పరిటాల రవి చనిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది. కానీ ఆయన్ను అభిమ ..

'బాహుబలి 2' పూర్తయిన వెంటనే రాజమౌళి మరో భారీ బడ్జెట్ చిత్రం 'గరుడ' ను ఆరంభించ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ సినిమా అంటే ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Is Prabhas decision right to do Baahubali- what his fans says? 

Prabhas, Rana Baahubali movie trailor

Charmme Kaur starrer Jyothi Lakshmi Song Making video 

Raviteja Starrer Power (Song 4) 10Sec Promo

Nitin Nash Movie Opening Held at Annapurna Studio.

Read More !