View

ఓం నమో వేంకటేశాయ మూవీ రివ్య్వూ

Friday,February10th,2017, 04:16 AM

చిత్రం - ఓం నమో వేంకటేశాయ
నటీనటులు - అక్కినేని నాగార్జున, సౌరవ్ జైన్, అనుష్క, ప్రగ్యా జైస్వాల్, జగపతిబాబు, విమలారామన్, రావు రమేష్, వెన్నెల కిషోర్, రఘుబాబు, తనికెళ్ల భరణి, సుధ, అస్మిత, సన, ఫృధ్వీ, సాయికుమార్, ఆదిత్య మీనన్ తదితరులు
సంగీతం - యం.యం.కీరవాణి
సినిమాటోగ్రఫీ - యస్.గోపాల్ రెడ్డి
ఎడిటింగ్ - గౌతంరాజు
స్టోరీ, డైలాగ్స్ - జె.కె.భారవి
నిర్మాత - ఎ. మహేష్ రెడ్డి
దర్శకత్వం - కె.రాఘవేంద్రరావు
విడుదల తేదీ - 10.2.2017


కింగ్ నాగార్జునలోని భక్తిరసాత్మక కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు. వెంకన్నభక్తుడు అన్నమయ్యగా, శ్రీరాముడు భక్తుడు రామదాసుగా నాగార్జున ఒదిగిపోయిన వైనం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక రొమాంటిక్ హీరో అయిన నాగ్ ని ఏకంగా శిరిడి సాయిబాబాగా నటింపజేసారు రాఘవేంద్రరావు. మరోసారి ఈ ఇద్దరి కాంబినేషన్ లో తిరుమలేశుడి భక్తుడు హాథీరామ్ బాబా జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం 'ఓం నమో వేంకటేశాయ' తిరుమలేశుని భక్తుడు హాథీరామ్ బాబాగా నాగార్జున నటించారు. మరి వీరి కాంబినేషన్ లో రూపొందిన ఈ భక్తి రసాత్మక చిత్రం ఎలా ఉంది తెలుసుకుందాం.


à°•à°¥
దేవుడుని చూడాలి అనే కోరికతో ఉత్తరభారతదేశం నుంచి తిరుమలకు వచ్చేస్తాడు రామ్ (నాగార్జున). తిరుమలలోని పద్మానంద స్వామి (సాయికుమార్) అనే గురువు ఆశీస్సులు పొంది, ఆయన సలహా మేరకు విద్యనభ్యసించి, అనంతరం తపస్సు చేయడానికి కూర్చుంటాడు. ఆ సమయంలో వేంకటేశ్వరస్వామి బాలుడు రూపంలో ప్రత్యక్షమవుతాడు. కానీ ఆ బాలుడిని వేంకటేశ్వరస్వామిగా గుర్తించలేకపోతాడు రామ్. దేవుడుని చూడలేకపోయాననే నిరాశతో ఇంటికి వెళతాడు. రామ్ తల్లిదండ్రులు ఎప్పట్నుంచో బావ కోసం ఎదురుచూస్తున్న మరదలు భవానీతో రామ్ పెళ్లి కుదుర్చుతారు, అయితే తనకు దేవుడుని చూడాలని ఉందని చెప్పడంతో భవానీ లోక కళ్యాణం కోసం కొంతమందే పుడతారు.. ఆ దేవుడిని చూడటానికి బయలుదేరి వెళ్లిపోమ్మని చెబుతుంది. అలా మళ్లీ తిరుమల చేరుకుంటాడు రామ్. కట్ చేస్తే...


కొండపైన ఉన్న కొంతమంది అక్రమార్కుల వల్ల ఆ దేవుడు చెంతకు చేరలేకపోతాడు. అదే సమయంలో తిరుమలేశుని మహా భక్తురాలైన కృష్ణమ్మ (అనుష్క) ను కలుస్తాడు. ఆమె సూచన మేరకు వేంకటేశ్వరుని నామాలను చదువుతాడు. ఆలయంలో జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కొంటాడు. రామ్ భక్తిని మెచ్చిన తిరుమలేశుడు ప్రత్యక్షమవుతాడు. రామ్ కి అత్యంత ఆప్తుడిగా మారిపోతాడు. ఏకాంత సేవ పూర్తయిన తర్వాత రామ్ తో కలిసి పాచికలు ఆడతాడు తిరుమలేశుడు. తిరుమలకు వచ్చిన భక్తులకు స్థల పురాణం చెప్పి సేవలు చేస్తూ మన్ననలు పొందుతాడు రామ్, అది భరించలేని గోవిందరాజులు (రావు రమేష్) రామ్ ని ఎలాగైనా చెడ్డవాడిగా చూపించాలని తాపత్రయపడుతుంటాడు. అందులో భాగంగా తిరుమలేశుని నగలను దొంగిలించాడనే అపవాదును రామ్ పై మోపి, అతనిని దండించాల్సిందిగా రాజుని కోరతాడు. ఆ తిరుమలేశుడే పాచికలు ఆడి ఓడిపోయి ఆ నగలను తనకు ఇచ్చాడని రామ్ చెబుతున్న మాటలను రాజు నమ్మలేకపోతాడు. అతనికో పరీక్ష పెడతాడు. రామ్ ని బంధించి నిజమైన భక్తుడు అయితే తను విధించిన శిక్ష నుంచి బయటపడాల్సిందిగా ఆదేశిస్తాడు. అప్పుడు రామ్ ని తిరమలేశుడు ఆ శిక్ష నుంచి కాపాడతాడా... ఆ ఇద్దరి మధ్య అనుబంధం ఎలాంటిది.. హాతిరామ్ బావాజి గా రామ్ పేరు ఎందుకు మార్చబడింది.. చివరి కోరికగా తిరుమలేశుని హాతీరామ్ బావాజి ఏం కోరతాడు.. బాలాజి అనే పేరుని తిరుమలేశునికి రామ్ ఎందుకు పెట్టాడు అనే విశేషాలను తెలుసుకోవాలాంటే సినిమా చూడాల్సిందే.


నటీనటుల పెర్ ఫామెన్స్
అన్నమయ్య, శ్రీ రామదాసు చిత్రాల్లో భక్తుడిగా నాగార్జున అద్భుతమైన నటన కనబర్చారు. ఈ సినిమాలో కూడా తిరమలేశుని వీర భక్తుడు హాతీరామ్ బావాజీగా అద్భుతంగా నటించాడు నాగార్జున. ఈ సినిమాకి అతి పెద్ద ప్లస్ పాయింట్ నాగ్ నటన. కళ్ళల్లో భక్తి భావం, డైలాగులు పలికే తీరులో ఆర్ధత, భక్తుడిగా క్రమశిక్షణ కలిగిన బాడీ లాంగ్వేజ్... ఇలా నాగ్ భక్తుడు పాత్రలో ఒదిగిపోయిన వైనం సూపర్బ్. స్టార్ హీరో ఇమేజ్ ని వదిలేసి భక్తుడు పాత్రలో జీవించాడు.


తిరుమలేశుని పరమ భక్తురాలిగా కృష్మమ్మ పాత్రలో అనుష్క నటన సూపర్బ్. కొంచెం లావుగా కనిపించింది. కానీ ముఖ కవళికలు ఈ మైసస్ పాయింట్ ని మర్చిపోయేలా చేస్తుంది.


ఈ సినిమాలో వేంకటేశ్వర స్వామి పాత్రను సౌరవ్ జైన్ చేసాడు. తిరుమలేశుని పాత్రకు జీవం పోసాడు. తేజస్సు ఉట్టిపడే ఆహార్యం, మాటలు పలికే తీరులో కరుణ ఆ దేవుడినే చూస్తున్నామనే భావనను కలుగజేసాడు.


విమలారామన్, జగపతిబాబు, అస్మిత, ఆదిత్యమీనన్ ఇతర నటీనటులు తమ పాత్రల పరిధిమేరకు నటించారు.


సాంకేతిక వర్గం
యస్.గోపాల్ రెడ్డి ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. ప్రతి ఫ్రేము సూపర్బ్ గా ఉంది. విజువల్ ఫీస్ట్ ఈ సినిమా. గౌతంరాజు ఎడిటింగ్ సూపర్బ్. యం.యం.కీరవాణి ఈ చిత్రానికి సంగీతమందించారు. ప్రతి పాట సూపర్బ్. భక్తి భావన ఉట్టిపాడే ట్యూన్స్, లిరిక్స్ ఈ సినిమాకి హైలైట్. రీ-రికార్డింగ్ ఆడియన్స్ ని సీన్స్ లో ఇన్ వాల్వ్ అయ్యేలా చేస్తుంది. నిర్మాణ విలువలు సూపర్బ్. ఇక దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భక్తిరసాత్మక చిత్రం చేయలంటే మాములు విషయం కాదు. అది కూడా స్టార్ ఇమేజ్ ఉన్న హీరో, హీరోయిన్లు, నటులతో భక్తి రసాత్మక చిత్రం అంటే కత్తిమీద సాములాంటిదే. అయితే ఈ విషయంలో రాఘవేంద్రరావుగారి ప్రతిభ ఈ సినిమాతో మరోసారి నిరూపితమయ్యింది. ఆర్టిస్ట్ లు కనబడకుండా, క్యారెక్టర్స్ కనబడేలా చేయడం రాఘవేంద్రరావుగారి దర్శకత్వ ప్రతిభను చాటి చెప్పింది. ప్రతి ఫ్రేమును రిచ్ గా చూపించారు. భక్తిరసాత్మక సినిమా అయినప్పటికీ, తనదైన శైలిలో నాగార్జున, ప్రగ్యా జైస్వాల్ పై ఓ రొమాంటిక్ సాంగ్, జగపతిబాబు, అనుష్కలపై మరో రొమాంటిక్ సాంగ్ చిత్రీకరించి వావ్ అనిపించారు. పరమ భక్తుడు అయిన హాతీరామ్ బావాజి జీవిత చరిత్రను చెప్పే కథతో స్ర్కిఫ్ట్ అందించారు జె.కె.భారవి. తెలీని విషయాలను చెప్పారు. అందరికీ అర్ధమయ్యేలా డైలాగ్స్ రాసారు.


ఫిల్మీబజ్ విశ్లేషణ
ఫస్టాప్ అంతా రామ్ జీవితం, అతను తిరుమల చేరుకోవడం.. సెకండాఫ్ లో ఆలయంలో జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కోవడం, దేవుడు, భక్తుడుకి మధ్య ఉన్న అనుబంధం, ఫైనల్ గా హాతీరామ్ బావాజి చివరి కోరిక సజీవ సమాధి అవ్వడంతో ఈ చిత్రం ముగుస్తుంది. తిరుమలేశుడు, హాతీరామ్ బావాజి ఆడే పాచికలాటలు సరదాగా ఉంటాయి. దేవుడికన్నా, భక్తుడే గొప్పవాడు అని చెప్పే సీన్స్ మనసును కదిలిస్తాయి. భక్తుడు సజీవ సమాధి అవ్వాలనే తన చివరి కోరిక తీర్చమని తిరుమలేశుడుని అడిగితే, ఆ కోరిక తీర్చడానికి దేవుడు పడే బాధ, ప్రియభక్తుడు సజీవ సమాధి అవ్వడం చూస్తూ దేవుడు సైతం రోధించడం ఆడియన్స్ ఓ తెలియని అనుభూతికి గురవుతారు. ఈ సీన్స్ మనసుల్లో భక్తి భావనను రేకెత్తిస్తుంది. 'అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా...', 'కోటి కోటి దండాలయ్యా...' పాటలు ఆడియన్స్ ని భక్తి భావనకు గురి చేస్తాయి.


ఫైనల్ గా చెప్పాలంటే... తిరుమలేశుని భక్తులే కాకుండా, ప్రతి ఒక్కరూ ఈ సినిమాని చూసి తరించాలి. ఇలాంటి సినిమాలు రావడం అరుదు. కాబట్టి కుటుంబమంతా కలిసి ఈ సినిమాని ఎంజాయ్ చెయ్యొచ్చు. ఓ గుడికి వెళ్లిన భావనను పొందవచ్చు.


ఫిల్మీబజ్ రేటింగ్ - 4/5



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !