View

'ఊహలు గుసగుసలాడే' రివ్వ్యూ

Friday,June20th,2014, 10:14 AM

చిత్రం - ఊహలు గుసగుసలాడే

బ్యానర్ - వారాహి చలనచిత్రం

నటీనటులు - నాగశౌర్య, రాశిఖాన్నా, అవసరాల శ్రీనివాస్, పోసాని కృష్ణమురళి, రావు రమేష్, ప్రగతి, సత్యకృష్ణ, సూర్య, విద్య తదితరులు

సంగీతం - కళ్యాణి కోడూరి

నిర్మాత - సాయి కొర్రపాటి

కథ, మాటలు, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - అవసరాల శ్రీనివాస్

అవసరాల శ్రీనివాస్ కామెడీ హీరోగా అందరికీ సుపరిచితుడే. తనో సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడనే వార్త వినగానే, అదెలాంటి సినిమా అవుతుందా? కామెడీ జానర్ లోనే ఉంటుందా? లేక మాస్ మసాలా మూవీ చేస్తాడా? అనే ప్రశ్నలు రేకెత్తడం సహజం. పైగా 'ఈగ'లాంటి సంచలన విజయంతో పాటు, అనిల్ సుంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంటలతో కలిసి 'లెజెండ్'లాంటి సూపర్ సెన్సేషనల్ మూవీ నిర్మించిన సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించారంటే... ఇది భారీ బడ్జెట్ మూవీయా? మంచి మాస్ మసాలా మూవీ నిర్మించి ఉంటారా? అనే ప్రశ్నలూ రేకెత్తుతాయి. కానీ, టైటిల్ 'ఊహలు గుసగులాడే' కాబట్టి, ఓ అందమైన ప్రేమకథా చిత్రాన్ని నిర్మించి ఉంటారని, ఫీల్ గుడ్ మూవీ అయ్యుంటుందని ఓ అంచనాకి వస్తారు. మరి.. ఆ అంచనాలకు తగ్గట్టు ఈ సినిమా ఉందా? లేదా అనే విషయాన్ని తెలుసుకుందాం.

à°•à°¥

ఉదయభాస్కర్ (అవసరల శ్రీనివాస్) యుబి టీవీ చానల్ అధినేత. ఆ చానల్ లో యాంకర్ గా పని చేస్తుంటాడు వెంకటేశ్వర రావు (నాగశౌర్య). టెలీషాపింగ్ షోకి యాంకరింగ్ చేసే వెంకట్ కి తన తండ్రిలా మంచి న్యూస్ రీడర్ గా పేరు తెచ్చుకోవాలనే ఆశయం ఉంటుంది. కానీ, వార్తలు చదివే అవకాశాన్ని వామనరావు (పోసాని కృష్ణమురళి) కొట్టేస్తాడు. దూరదర్శన్ లో పేరున్న న్యూస్ రీడర్ అనిపించుకున్న వెంకట్ తండ్రి పక్షవాతానికి గురవుతాడు. తన వ్యాధిని నయం చేసే క్రమంలో ప్రతి ఆదివారం ఆయన ముందు న్యూస్ రీడర్ అవతారం ఎత్తి ఇంట్లోనే డమ్మీ టీవీలో వార్తలు చదువుతుంటాడు వెంకట్. ఈ నేపథ్యంలో వేసవి శెలవులకు తన మేనమామ ఇంటికి వెళ్లిన వెంకట్ కి సాయిశిరీషా ప్రభావతి (రిషి కన్నా) పరిచయం అవుతుంది. ఢిల్లీ నుంచి తన అమ్మమ్మ ఇంటికి వస్తుంది శిరీషా. వైజాగ్ లో శిరీషాతో ఏర్పడిన పరిచయంతో ఆమెపై ప్రేమ పెంచుకుంటాడు వెంకట్. పెళ్లి చేసుకుందామంటే వెంకట్ అడిగితే... పెళ్లి, ప్రేమ గురించి ఆలోచించే వయసు కాదని చెప్పి ఢిల్లీ వెళ్లిపోతుంది ప్రభావతి. వెంకట్ కూడా హైదరాబాద్ వచ్చేసి న్యూస్ రీడర్ అవకాశం కోసం ఎదురు చూస్తూ, యాంకర్ గా కొనసాగుతుంటాడు.

ఈ నేపథ్యంలో ఉదయ్ భాస్కర్ కి పెళ్లి కుదురుతుంది. ఎన్నో సంబంధాలను కాదనుకున్న ఉదయ్ ఓ సంబంధానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. కానీ, అమ్మాయిలతో ఎలా మూవ్ అవ్వాలో, వారిని ఎలా ఇంప్రెస్ చేయాలో తెలియని ఉదయ్.. తన దగ్గర ఉద్యోగం చేస్తున్న వెంకట్ ని సహాయం కోరతాడు. సహాయం చేస్తే న్యూస్ రీడర్ చేస్తానని లేకపోతే ఉద్యోగం పీకేస్తానని అంటాడు. బాస్ కి సహాయం చేయడానికి ఒప్పుకున్న వెంకట్.. ఉదయ్ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నది తన లవర్ శిరీషాని అన్న విషయం తెలుసుకుని షాక్ అవుతాడు. మరి.. న్యూస్ రీడర్ కావడం కోసం అతను తన ప్రేమను త్యాగం చేస్తాడా? అసలు విషయం చెప్పి, శిరీషాని పెళ్లి చేసుకుంటాడా? అనేది సినిమాలో చూడాల్సిందే.

ఫిల్మీబజ్ విశ్లేషణ

నటీనటులు

తక్కవ మంది నటీనటులతో సాగే à°ˆ చిత్రంలో అవసరాల శ్రీనివాస్ చేసిన ఉదయ్ భాస్కర్ పాత్ర నటనకు అవకాశం ఉన్న పాత్ర. à°† పాత్రను అతను అద్భుతంగా చేశాడు. ఇంకా చెప్పాలంటే ఇతర పాత్రలను à°ˆ పాత్ర డామినేట్ చేసిందనే చెప్పాలి. నాగశౌర్య హ్యాండ్ సమ్ à°—à°¾ ఉన్నాడు. నటన, డైలాగ్ డెలివరీ పరంగా అతను ఇంకా కేర్ తీసుకోవాలి. కథానాయికగా à°°à°¿à°·à°¿ ఖన్నా ఫర్వాలేదనిపించుకుంది. పోసాని,  à°°à°¾à°µà± రమేష్, సత్యకష్ణ, హేమ, సూర్య తదితరులు తమ పాత్రల్లో ఒదిగిపోయారు.

సాంకేతిక నిపుణలు

దర్శకునిగా అవసరాల శ్రీనివాస్ కి ఇది మొదటి సినిమా. కానీ, బాగా చేశాడు. టేకింగ్ బాగుంది. ఇది తక్కువ బడ్జెట్ సినిమా అయినప్పటికీ, ప్రతి ఫ్రేమ్ కలర్ ఫుల్ గా ఉంటుంది. మంచి అభిరుచి ఉన్న దర్శకుడని చెప్పొచ్చు. అలాగే తను రాసిన డైలాగ్స్ కూడా బాగున్నాయి. అన్నీ స్వీట్ అండ్ షాట్ గా ఉంటాయి. కెమెరా పనితనం సూపర్బ్. కథతో పాటు సాగే పాటలకు కళ్యాణి కోడూరి మంచి స్వరాలు ఇచ్చారు. ముఖ్యంగా ఆయన చేసిన రీ-రికార్డింగ్ సినిమాని ఎలివేట్ చేసే విధంగా ఉంది. ఇతర టెక్నికల్ టీమ్ కూడా ఓకే.

ఫైనల్ గా చెప్పాలంటే..

ప్రభావతిని ఇంప్రెస్ చేయడానికి అవసరాల శ్రీనివాస్, వెంకట్ మధ్య సాగే సీన్స్ అన్నీ కామెడీ టచ్ తో ఉన్నాయి. ఆ సీన్స్ అన్నింటికి ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వడం ఖాయం. పైగా క్లీన్ కామెడీ కావడంతో, ఆడియన్స్ ఎక్కడా ఇబ్బందికి గురవ్వరు. ఇది ఖచ్చితంగా నిర్మాతను సేఫ్ చేసే సినిమా. చాలా తక్కువ బడ్జెట్ అయినప్పటికీ, ఆ ఛాయలేవీ కనిపించవు. పైగా, సినిమా చూస్తున్నంతసేపు నవ్వుకుంటూ ఉంటాం. వినోదమే ప్రధానంగా సాగే సినిమా కాబట్టి, హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. ఒక్క బూతు కానీ, అభ్యంతరకర సన్నివేశాలు కానీ లేవు. కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా ఇచ్చినందుకు దర్శక, నిర్మాతలను అభినందించాల్సిందే. ఊహలు మెల్లిగా సాగినా.. మనసుకి హాయిగా ఉంటుంది కాబట్టి ఆస్వాదించవచ్చు.

Oohalu Gusagusalade Review



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !