View

Jagannatakam Movie Review

Friday,March13th,2015, 09:32 AM

చిత్రం - జగన్నాటకం
నిర్మాణం - చిత్రసౌధం
నటీనటులు - ప్రదీప్ నందన్, ఖేనిశ చంద్రన్, శ్రీధర్, అభినవ్ గోమటం, పూజ జవేరి, శివాజీరాజా, ఉషశ్రీ, కేదార్ శంకర్
సినిమాటోగ్రఫీ - సతీష్ ముత్యాల
సంగీతం - అజయ్ అరసాడ
ఎడిటింగ్ - జి.వి.చంద్రశేఖర్
ఫైట్స్ - రవి
నిర్మాత - ఐ.ఆదిశేష రెడ్డి
దర్శకత్వం - ప్రదీప్ నందన్

నూతన నటీనటులు, శివాజీ రాజా పోలీసాఫీసర్ పాత్రలో రూపొందిన చిత్రం 'జగన్నాటకం'. ఉత్కంఠభరితమైన కథతో, ఆసక్తికరమైన స్ర్కీన్ ప్లేతో ఈ సినిమా చేసామని హీరో, డైరెక్టర్ ప్రదీప్ నందన్ చెప్పుకుంటూ వచ్చారు. మరి ఈ సినిమా అలానే ఉందా? ప్రేక్షకాదరణ పొందుతుందా అనే విషయాలను తెలుసుకుందాం.

à°•à°¥
ఓ బంగ్లా. ఆ బంగ్లాలో ఉండటానికి వెళ్లిన వాళ్లను చిన్న, పెద్ద, ఆడ, మగా తేడా లేకుండా హింసించి ఓ గ్యాంగ్ చంపేస్తుంటుంది. పృథ్వీ (ప్రదీప్ నందన్)కి అమ్మ చనిపోతుంది. తండ్రి, చెల్లి మాత్రం ఉంటారు. తండ్రి, చెల్లితో హ్యాపీగా ఉంటాడు పృథ్వీ. అతనికి శ్రీనుతో పాటు కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. ఓ సందర్భంలో కలిసిన భాను (ఖేనిశ చంద్రన్)ను తొలి చూపులోనే ప్రేమిస్తాడు పృథ్వీ. తండ్రి కూడా పృథ్వీ ప్రేమను అంగీకరించడంతో భానుతో అతని ఎంగేజ్ మెంట్ జరిగిపోతుంది. ఆ సందర్భంగా తన ఫ్రెండ్స్ తో కలిసి పార్టీ చేసుకుని ఎంజాయ్ చేస్తాడు పృథ్వీ. పార్టీ జరుగుతున్నప్పుడే పృథ్వీకి తండ్రి చనిపోయినట్టు ఫోన్ కాల్ వస్తుంది. చెల్లి కనిపించకుండా పోవడం, తండ్రి చనిపోవడం పృథ్వీని కృంగదీస్తుంది. ఇక తను భానుకు మంచి జీవితాన్ని ఇవ్వలేనని భావించి ఆమెకు దూరంగా ఉంటాడు పృథ్వీ. అసలు పృథ్వీ చెల్లెలు కనిపించకుండా పోవడానికి కారణం ఏంటీ? పృథ్వీ తండ్రి ఎలా చనిపోయాడు? పృథ్వీతో ఎంగేజ్ మెంట్ అయిన భాను ఏమయ్యింది. ఆ బంగ్లాకి, పృథ్వీకి ఏమైనా సంబంధం ఉందా అనేదే ఈ చిత్ర కథ.

నటీనటుల పర్ఫార్మెన్స్
ఈ చిత్రంలో ఏ పాత్రకూ నటన పరంగా పెద్దగా విజృంచేంత స్కోప్ ఉండదు. హీరో పాత్రకే స్కోప్ ఉంది. కానీ, ఈ పాత్ర చేసిన పృథ్వీ నందన్ కి అంత నటన లేదు. డాన్సులు కొంత వరకు బాగానే చేశాడు. ఫైట్స్ అప్పుడు రీ-రికార్డింగ్ తో మేనేజ్ చేసినట్లుగా ఉంటుంది. పృథ్వీ నందన్ వాయిస్ కూడా ఓ మైనస్. లీడ్ కారెక్టర్ పేలవంగా ఉంటే.. ఇక సినిమా ఏం ఎక్కుతుంది? హీరోయిన్ పాత్రధారిణి ఖేనిసా చంద్రన్ హోమ్లీగా ఉంది. నటనకు అవకాశం లేని పాత్ర. చెల్లెలి పాత్ర బాగుంది. ఈ పాత్రను ఉషశ్రీ బాగా చేసింది. మిగతా పాత్రల్లో కీలకమైన పాత్ర బుల్లితెర నటుడు శ్రీధర్ ది. తను చూడచక్కగా ఉన్నాడు. పాత్ర పరిధి మేరకు చక్కగా చేశాడు. పోలీస్ పాత్రను శివాజీ రాజా చేశారు. అలాంటి సీనియర్ నటుణ్ణిని సరిగ్గా వాడుకోలేదనిపించడం ఖాయం. ఇతర పాత్రధారులకు నటన పరంగా ఇరగదీసే స్కోప్ లేదు.

సాంకేతిక వర్గం
ఈ కథ బాగుంది. స్ర్కీన్ ప్లే కూడా ఓకే. దర్శకుడి పనితనం ఫర్వాలేదనిపించే విధంగా ఉంది. సంభాషణలు, పాటలు ఓ మోస్తరుగా ఉన్నాయి. ఎడిటింగ్ కూడా అంతే. ముఖ్యంగా క్లయిమ్యాక్స్ ఫైట్ అయితే సాగదీసినట్లుగా ఉంది. ప్రత్యర్థులను హీరో ఎప్పుడు చంపుతాడా? ఎప్పుడు థియేటర్ నుంచి పారిపోదామా అని ప్రేక్షకులు ఎదురు చూస్తుంటారు.

ఫిల్మీబజ్ విశ్లేషణ
మంచి కథ ఎన్నుకుంటే సరిపోదు... దాన్ని జనరంజకంగా తెరకెక్కించాలి. ఈ విషయంలో దర్శకుడు పాస్ కాలేకపోయాడు. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సాగే కథ ఇది. చిత్రానికి కీలకంగా నిలిచే మూడు పాత్రలు హోటల్లో ఇరుక్కున్న తర్వాత అసలు కథ ఆరంభమవుతుంది. ద్వితీయార్థంలో ఈ కథ వస్తుంది.. అప్పటికి ప్రేక్షకుడు సహనం కోల్పోతాడు. విలన్ పాత్రలపై హీరోకి ఎంత కక్ష ఉంటుందో ప్రేక్షకుడికీ అంతే కక్ష ఉంటే అప్పుడు డ్రామా పండుతుంది. ఈ సినిమాలో విలన్లపై కోపం గానీ, అసహహ్యంగానీ.. ఇలాంటి ఫీలింగ్స్ ఏమీ ఏర్పడవు. ఎందుకంటే, సైకోలుగా అనిపించుకున్న పాత్రల చుట్టూ బలమైన సన్నివేశాలు లేవు. ఒకవేళ అవి బలంగా ఉండి ఉంటే. అప్పుడు ప్రేక్షకుడు కూడా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మెయిన్ విలన్ గా భావించే జీవా, శ్రీను క్యారెక్టర్స్ చేసిన పాత్రధారుల్లో విలనిజం కనిపించదు. లుక్ వైజ్ గా కూడా సాఫ్ట్ గా కనిపిస్తారు. అది కూడా మైనస్.

ఫైనల్ గా చెప్పాలంటే... ఈ 'జగన్నాటకం' చాలా పేలవంగా ఉంది. ఓ మంచి కథను సరిగ్గా తెరకెక్కించకపోవడంతో ఆ కథ వృథా అయ్యింది. నాటకం అని టైటిల్ పెట్టారు కాబట్టి.. వింతులూ, విశేషాలూ ఉంటాయనీ, రంజుగా సాగుతుందని ఊహించి థియేటర్ కి వస్తే.. ఆశాభంగమే..



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !