చిత్రం - ప్రణవం
నటీనటులు - శ్రీ మంగం, శశాంక్, జెమిని సురేష్, అవంతిక, గాయత్రి అయ్యర్ తదితరులు
బ్యానర్ - చరిత అండ్ గౌతమ్ ప్రొడక్షన్స్
సంగీతం - పద్మనావ్ భరద్వాజ్
ఎడిటింగ్ - సంతోష్
ఫైట్స్ - దేవరాజ్
నిర్మాత - తను ఎస్
దర్శకత్వం - కుమార్.జి
రిలీజ్ డేట్ - 5.2.2021
శ్రీ మంగం, అవంతిక జంటగా నటించిన చిత్రం 'ప్రణవం'. ఈ చిత్రం ద్వారా కుమార్.జి దర్శకుడిగా పరిచయం అయ్యారు. తను ఎస్ నిర్మించిన ఈ సినిమాలో శశాంక్, జెమిని సురేష్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా పోస్టర్స్, పాటలకు ఆడియన్స్ నుంచి చక్కటి స్పందన లభించింది. ఈ నేపధ్యంలో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ రోజు (5.2.2021) విడుదలైన ఈ సినిమా ఆ అంచనాలను అందుకునే విధంగా ఉందా... ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా తెలుసుకుందాం.
కథ
కార్తీక్ (శ్రీ మంగం) తొలి చూపులోనే జాను (అవంతిక) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. జాను కూడా కార్తీక్ ని ఇష్టపడుతుంది. హ్యాపీగా పెళ్లి చేసుకుని సెటిల్ అయిన ఈ జంట జీవితంలోకి ఓ అమ్మాయి ఎంటరవుతుంది. ఆ తర్వాత జాను కనిపించకుండా పోతుంది. జాను మిస్ అవ్వడం వెనుక ఆమె భర్త కార్తిక్ ఉన్నాడనే అనుమానాలు నెలకొంటాయి. అసలు జాను ఎలా మిస్సయ్యింది. కార్తిక్, జాను జీవితంలోకి వచ్చిన అమ్మాయి ఎవరు... తను చుట్టూ నెలకొన్న ప్రాబ్లమ్స్ ని కార్తీక్ ఎలా సాల్వ్ చేసుకున్నాడు అనేదే 'ప్రణవం' సినిమా కథాంశం.
నటీనటులు పెర్ ఫామెన్స్
పాపులర్ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ గా, ప్లేబోయ్ గా రెండు రకాల షెడ్స్ ఉన్న క్యారెక్టర్స్ లో లీనమై నటించాడు శ్రీ మంగం. భర్తగా మెచ్చూర్డ్ పాత్ర చేసాడు. శ్రీ మంగం నటించిన గత సినిమాలతో పోలిస్తే, అతను నటన చాలా మెరుగయ్యింది. బాడీ లాంగ్వేజ్ లో ఈజ్ పెరిగింది. ఈ సినిమా తర్వాత శ్రీ మంగం కి మంచి ఆఫర్స్ వస్తాయనుకోవచ్చు. హీరోయిన్ అవంతిక చాలా చక్కగా నటించింది. డీసెంట్ పెర్ ఫామెన్స్ తో ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. ఈ ఇద్దరి తర్వాత పవర్ ఫుల్ అండ్ స్టైలిష్ ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీసర్ గా జెమిని సురేష్ నటన అందరినీ ఆకట్టుకుంటుంది. కన్నింగ్ పాత్రలో శశాంక్ నటన కూడా సూపర్బ్. జబర్ధస్త్ దొరబాబు నటించింది ఒక్క సీన్ అయినప్పటికీ... ఆడియన్స్ ని నవ్వులతో ముంచేస్తాడు. మిగతా నటీనటులందరూ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
సాంకేతిక వర్గం
ఈ సినిమాకి పద్మనావ్ భరద్వాజ్ అందించిన సంగీతం చాలా ప్లస్. మూడు పాటలు ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటాయి. మరీ ముఖ్యంగా ఆర్.పి.పట్నాయక్, ఉష కలిసి పాడిన పాట వినడానికి బాగుంది. విజువల్ గా కూడా సూపర్బ్. సినిమాటోగ్రఫీ ప్లజెంట్ గా ఉంది. చక్కటి స్టోరీ లైన్ తీసుకుని, పర్ ఫెక్ట్ స్ర్కీన్ ప్లేతో చాలా చక్కగా సినిమాని డీల్ చేసాడు డైరెక్టర్ కుమార్. ఎక్కడా తడబాటు కనిపించలేదు. కథకు సరిపడా బడ్జెట్ సమకూర్చి ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాని నిర్మించారు నిర్మాతలు.
విశ్లేషణ
లవ్ అండ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ జానర్ లో ఈ సినిమా తెరకెక్కింది. ప్రేమించి, పెళ్లిచేసుకున్న కొత్త జంట జీవితంలోకి ఓ అమ్మాయి ఎంట్రరవ్వడం, అక్కడ నుంచి కథలో చోటుచేసుకున్న మలుపులు ఇంట్రస్టింగ్ గా ఉంటాయి. హీరో క్యారెక్టర్ ప్లేబోయ్ లా అనిపిస్తుంది. కానీ ఇంటర్వెల్ వచ్చేసరికి నెగటివ్ షేడ్ రివీల్ అవ్వడం కథలో వచ్చిన ట్విస్ట్. హీరో నెగటివ్ గా మారడానికి కారణం చాలా కన్వీన్సింగ్ గా ఉంటుంది. దాంతో హీరో క్యారెక్టర్ పై పాజిటివ్ థింకింగ్ ఏర్పడుతుంది. హీరో క్యారెక్టర్ పైన గౌరవం కూడా కలుగుతుంది. కొన్ని సినిమాలు చేసిన శ్రీ మంగం చాలా గ్యాప్ తర్వాత చేసిన సినిమా 'ప్రణవం'. ఈ సినిమాకి అతనికి పర్ ఫెక్ట్ కమ్ బ్యాక్.
ఫైనల్ గా చెప్పాలంటే... లవ్ అండ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చిత్రాలు ఇష్టపడే ఆడియన్స్ కి ఈ సినిమా బాగా నచ్చుతుంది. సో... డోంట్ మిస్ ఇట్.
ఫిల్మీబజ్ రేటింగ్ - 3/5