View

Gaddam Gang Movie Review

Friday,February06th,2015, 07:22 AM

చిత్రం - గడ్డం గ్యాంగ్
బ్యానర్ - శివాని-శివాత్మిక మూవీస్
నటీనటులు - డా.రాజశేఖర్, షీనా, గిరిబాబు, సీనియర్ నరేష్, సీత, నాగబాబు, దీపక్, అచ్చు, సత్యం రాజేష్, ముమైత్ ఖాన్, సప్తగిరి, నోయల్ తదితరులు
సినిమాటోగ్రఫీ - డేమిల్ జేవియర్
సంగీతం - అచ్చు
ఎడిటర్ - రిచర్డ్ కెవిన్
దర్శకత్వం - పి.సంతోష్
నిర్మాత - జీవితారాజశేఖర్

యాంగ్రీ మేన్ ఇమేజ్ తెచ్చుకోవడంతో పాటు తనలో మంచి రొమాంటిక్ హీరో ఉన్న విషయాన్ని కూడా రాజశేఖర్ నిరూపించుకున్నాడు. పలు హిట్ చిత్రాల్లో నటించిన అతనికి ఈ మధ్యకాలంలో చెప్పుకోదగ్గ విజయాలు లేవు. ఈ నేపథ్యంలో చేసిన 'గడ్డం గ్యాంగ్' రాజశేఖర్ కెరీర్ ని మంచి మలుపు తిప్పుతుందని చాలామంది భావించారు. రాజశేఖర్, జీవిత కూడా మంచి విజయవంతమైన చిత్రం చేయాలనే పట్టుదలతో తమిళంలో ఘనవిజయం సాధించిన 'సూదు కవ్వమ్' రీమేక్ హక్కులు తీసుకుని, దాన్నే 'గడ్డం గ్యాంగ్'గా పునర్నిర్మించారు. మరి... ఈ 'గడ్డం గ్యాంగ్' మళ్లీ రాజశేఖర్ కెరీర్ ని సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందా? చూద్దాం...

కథ
గడ్డం దాస్ (డా. రాజశేఖర్) ఐదు సూత్రాలను పాటించి కిడ్నాప్ లు చేసి డబ్బులు సంపాదించాలనే టార్గెట్ తో ఉంటాడు. అతను వేసే ప్లాన్ లు సక్సెస్ అవ్వవు. తన ఊహల రాణి షాలు (షీనా శతాబ్ధి) తో మాట్లాడుతూ కిడ్నాపింగ్ ప్లాన్స్ ని అమలు చేయడానికి ప్రయత్నాలు చేస్తాడు గడ్డం దాస్. రమేష్, సురేష్, పండు ముగ్గురూ రూమ్ మేట్స్. ముగ్గురికి ఉద్యోగాలు ఉండవు. ఒక సిట్యువేషన్ లో గడ్డం దాస్ ని కలుస్తారు. ఎవరికీ కనబడని ఊహల రాణి షాలుతో గడ్డం దాస్ మాట్లాడటం, అతని తీరు చూసి రమేష్ అండ్ ఫ్రెండ్స్ కి విచిత్రంగా ఉంటుంది. అయితే గడ్డం దాస్ వాళ్లతో ఓ గ్యాంగ్ గా ఏర్పడి కిడ్నాప్ లు చేసి, డబ్బులు సంపాదించుకుందామని చెప్పడంతో రమేష్ అండ్ ఫ్రెండ్స్ అతనితో చేతులు కలుపుతారు. గడ్డం గ్యాంగ్ గా ఏర్పడి ఎవరినీ నొప్పించకుండా, రాజకీయనాయకులు, పెద్ద ఇంటివాళ్ల జోలికి పోకుండా, వారి స్థోమత తెలుసుకుని కిడ్నాప్ చేసి, డబ్బులు తీసుకుంటుందీ గ్యాంగ్.
ఇలాంటి గ్యాంగ్ తమ ఐదు సూత్రాల పాలసీని పక్కన పెట్టి, రాజకీయనాయకుడు ధర్మరాజు (నరేష్) కొడుకు సత్యహరిచంద్ర (నోయల్)ని కిడ్నాప్ చేస్తారు. సత్యహరిచంద్ర దొంగలకే దొంగ. ఈ గ్యాంగ్ ని అడ్డం పెట్టుకుని తన తండ్రి దగ్గర నుంచి కిడ్నాప్ గ్యాంగ్ డబ్బు డిమాండ్ చేసినట్టు డబ్బులు తెప్పించుకుని గ్యాంగ్ కి ఇవ్వకుండా తనే నొక్కేస్తాడు సత్యహరిచంద్ర. అతన్ని కిడ్నాప్ చేయడం వల్ల డబ్బులు రాకపోగా, రాజకీయ నాయకుడు కొడుకును కిడ్నాప్ చేసినందుకు గడ్డం గ్యాంగ్ ని పోలీసులు వెతుకుతుంటారు. ఈ గ్యాంగ్ ని పట్టుకోవడానికి స్పెషల్ పోలీసాఫీసర్ గబ్బర్ ని నియమిస్తారు. ఈ కేసు నుంచి గడ్డం గ్యాంగ్ ఎలా బయటపడ్డారు? తమను మోసం చేసిన సత్యహరిచంద్రని ఈ గ్యాంగ్ పట్టుకుందా అనేదే ఈ చిత్రం క్లయిమ్యాక్స్.

నటీనటులు
రాజశేఖర్ మంచి నటుడు. అందుకు ఒక ఉదాహరణ 'అంకుశం'. ఈ చిత్రంలో కూడా గడ్డం దాస్ పాత్రను బాగానే చేశాడు. అయితే ఈ పాత్రకు నటనకు పెద్దగా స్కోప్ లేకపోవడం వల్ల రాజశేఖర్ అభిమానులకు అసంతృప్తినే మిగులుస్తుంది. పవర్ ఫుల్ ఫైట్స్, శక్తిమంతమైన డైలాగ్స్... ఇలా ఓ హీరో పాత్ర నుంచి ఎదురు చూసేవి ఏవీ దాస్ పాత్రలో లేవు. పోనీ ఇరగదీసే కామెడీ టచ్ తో ఉందా? అంటే అదీ లేదు. దాంతో నటనపరంగా రాజశేఖర్ రెచ్చిపోయే ఆస్కారం లేదు. ఉన్నంతలో బాగా చేశాడు. మిగతా పాత్రల్లో అచ్చు, నోయల్, నాగబాబు, నరేశ్, సీత, గిరిబాబు ఒదిగిపోయారు. అంతకుమించి నటీనటుల గురించి చెప్పడానికి ఏమీ లేదు.

సాంకేతిక వర్గం
కథ చాలా పేలవంగా ఉంది. కీలక పాత్రలకు ఓ లక్ష్యం ఉండదు. పాటలుకు స్కోప్ లేని కథ. ఉన్న రెండు, మూడు పాటలూ సినిమాకి ప్లస్ కావు. అసలు పాటలు అవసరమా? అని కూడా అనిపిస్తుంది. సన్నివేశాలు పేలవంగా ఉంటే ఇక రీ-రికార్డింగ్ కి మాత్రం ఏం స్కోప్ ఉంటుంది. మాటలు కూడా మామూలుగా ఉన్నాయి. కెమెరా పనితనం కూడా అంతే. దర్శకుడి పనితనం గురించి నాలుగు మంచి మాటలు చెబుదామంటే మాటలే కరువవుతాయి. ఇలా కూడా సినిమా ఉంటుందా? ఇలా కూడా తీస్తారా? అనిపించక మానదు. నిర్మాణ విలువలు కథానుసారం ఉన్నాయి.

ఫిల్మీబజ్ విశ్లేషణ
తమిళ 'సూదు కవ్వమ్'ని 2 కోట్లలో తీశారు. దాదాపు 70 కోట్లు వసూలు చేసిందా సినిమా. ఆ చిత్రాన్నే యథాతథంగా తెలుగులో రీమేక్ చేశారు. మరి.. తమిళంలో ఎలా ఆడిందో తెలియడంలేదని తెలుగు వెర్షన్ చూసినవాళ్లు అంటారు. ఒకవేళ ఆ కథను కొంచెం మార్చి తెలుగు చిత్రం తీశారా? అందుకే ఇక్కడ బాగాలేదా? అనే సందేహం కూడా కలగక మానదు. ఎందుకంటే, సినిమా అంత చవకబారుగా ఉంది. చిన్నపాటి కిడ్నాప్స్ చేస్తుంటాడు హీరో. తనతో మరో ముగ్గుర్ని చేర్చుకుని ఆ పని చేస్తుంటాడు. అదే అతని ఉద్యోగం. అంటే.. చిన్న చిన్న కిడ్నాప్స్ చేసుకుని హాయిగా బతికేయొచ్చని ఈ చిత్రం ద్వారా చెప్పాలనుకున్నారా? హీరోకి ఒక లక్ష్యం ఉండదు. ఆ మాటకొస్తే.. ఒక్క నరేశ్ పాత్ర తప్ప మిగతా పాత్రలన్నీ దాదాపు నెగటివ్ యాంగిల్ లోనే ఉంటాయి. సినిమా ద్వారా నీతి పాఠాలు చెప్పకపోయినా ఫర్వాలేదు కానీ.. చేటు చేసే కథాంశాలతో తీయకూడదు. పైగా న్యాయస్థానంలో జడ్జి తో 'ఈ కేసు కూడా దొబ్బిందా?' వంటి డైలాగ్ పలికించడం మింగుడుపడదు. ఈ సినిమా కామెడీయా? యాక్షనా? హారరా? లవ్ మూవీయా? అంటే... ఏ జానరో చెప్పలేక తికమకపడతాం. సినిమా మొత్తం చూశాక థియేటర్ నుంచి బయటికొచ్చేటప్పుడు ప్రేక్షకుడు కూడా తికమకగానే వస్తాడు.

అసలు జీవితారాజశేఖర్ లకు 'సూదు కవ్వమ్'లో ఏం నచ్చి ఆ రీమేక్ హక్కులు తీసుకున్నారో అని ప్రేక్షకులు అనుకోకుండా ఉండలేరు. ఫైనల్ గా చెప్పాలంటే ఈ 'గడ్డం గ్యాంగ్'ని చూసి, జుత్తు పీక్కోవడం ఖాయం.

చివరిగా రాజశేఖర్ కి ఓ సూచన:  రాజశేఖర్ మంచి నటుడు. ఏ పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోగల నేర్పు ఉంది. మంచి కథలు ఎంచుకుంటే ఇంకొన్నేళ్ల పాటు తిరుగు లేని హీరోగా కొనసాగే అవకాశం ఉంది. కానీ, 'గడ్డం గ్యాంగ్'లాంటి తలా తోకా లేని కథలను ఎంపిక చేసుకోవడం వల్ల కెరీర్ పుంజుకునే అవకాశాలు చాలా తక్కువ. అందుకే, ఇకనుంచైనా రాజశేఖర్, జీవితలు కథల ఎంపిక విషయంలో  ఎక్కువ శ్రద్ధ పెడితే బాగుంటుంది.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !