View

Films like Rudrangi rarely come - NBK

Friday,June30th,2023, 03:29 PM

Jagapathi Babu, who started his second innings by playing villain roles and character artist roles in movies and is progressing well in his career, is now going to try his luck as a hero again. Jagapathi Babu is going to come in front of the audience soon with a movie called "Rudrangi". Directed by Ajay Samrat, the trailer of the film has received a good response from the audience. Mamata Mohandas and Vimala Raman are playing the heroines in this movie. The movie is going to be released in theaters on July 7. The makers have recently organised a grand pre-release event and Nandamuri Balakrishna came as the chief guest. While talking at the event, all the cast and crew told some interesting things about the film.


Ashish Gandhi said,. My heartful Thanks to Nandamuri Balakrishna garu for supporting this event. Thank you sir. We all love you. You are an inspiration to all of us. I call you people's star. Coming to Jagapathi Babu, this is my second film with him. While I was taking pictures with him during the shoot, he said that I am a very good actor and I am thankful to the director for giving me such a powerful role like Mallesh. The film is all about the work of the technical team. The film is releasing on 7/7. I hope you all will like the movie."


Film heroine Gahnavi said, "My thanks to the media. Thank you to God of Mass Balakrishna. This is the second time I am speaking on the Hyderabad stage at a film event. But this is my first film in Telugu. Jagapathi Babu is an amazing actor. He goes completely into his role. The audience will definitely like his character. I have learned a lot from people like Mamata Mohandas and Vimala Raman. I am thankful to Ashish for helping me. I hope you all like the film."
Divi said, "Balaiya sir, thank you very much for coming here. I will appear in a song in the film. I am thankful to Ajay for giving me this opportunity. In the trailer, Jagapathi Babu is looking very young. Mamta and Vimala Raman are very beautiful."


Charisma said, "Hello everyone. I am very happy that Balayya came here. I am also very happy to be a part of such a good film. The film will be released on July 7th. I think everyone will like it.


Mamata Mohandas said, "Jai Jai Balayya. Hi everyone. I thank you all for coming here. After many years I acted in a Telugu movie. Rudrangi movie is entirely in Ajay's imagination. I am very happy that you chose me as Jwala in it. He is not an ordinary director. He has a fire in him. The team worked very hard for the film. This film would not have been completed without my good friend Jagapathi Babu. Thanks to Balakrishna sir for coming here. I really liked Ashish's performance in the film. You definitely have a good potential to become a mass hero in South. I am very happy to see you all after a long time. It is because of your support that I came back to Telugu films. I hope your support will continue."


Director Ajay Samrat said, "My bow to my mother who gave birth to me and Mother Art who is raising me. Every director puts his life and work for his film. But I thought it would not matter if I lost my life and completed this film. Thank you Rasmayi. I love you Balayya. I love people more than I respect them. Talking about cinema, there are many royal forts and tall buildings around us. But the most beautiful house is just a bird's nest. I am thankful to all those who supported me and worked for the film. This film should be the beginning of another hundred such films. Jai Rudrangi, Jai Balayya,"


Film producer Rasmayi said, "Thank you all for coming here. I am speechless when there is a legend in front of me. I am thankful to Balayya who came here and gave his blessings when asked. Thanks to my favorite hero Jagapathi Babu, the actors and technicians of the film. I know why people of Hindupur love Balayya. Because, he is a very simple person who loves people. Without Jagapathi Babu, this film would not exist. I must say that he brought life to his character. His dialogues in Telangana dialect will be remembered by everyone. I know that the audience will love the film for sure."


Jagapathi Babu, who played the hero, said, "Balakrishna is very busy. But I went and asked him with the belief that he would not say no. He came here without asking anything. His Legend movie has given me life again. Now I am back with my third innings as a hero. I know Balayya will support me in this journey too. The story of the film is good but I kept on saying that the budget is more than enough for me, but the director and the producer are very confident. I have done many films after "Legend" but there are not even 10 worth mentioning characters in them. With this film, I feel content again. I think I will get recognition. I will do another film with Ajay again. This is a Telangana film. I am confident that everyone will like it," he said.


Nandamuri Balakrishna, who is the chief guest, said, "Hello everyone. Me and Rasmayi dont know much about politics. But we came with the inspiration of my father. Films like Rudrangi rarely come. My father has done many such films. Now I am very happy that Jagapathi Babu is doing such a film. When doing any role it is better to live than to act in it. Jagapathi Babu is one such actor. We are still working for the survival of the film industry. Mamata Mohan Das is a warrior woman. As the chairman of a cancer hospital I know how distressed people get when diagnosed with cancer but she is very brave and an inspiration to many". He also praised the film team and said that he wants the film to be a good hit."


సినిమాలలో విలన్ పాత్రలు మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టి కెరియర్ లో బాగానే ముందుకు దూసుకు వెళుతున్న జగపతిబాబు ఇప్పుడు మళ్ళీ హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. "రుద్రంగి" అనే సినిమాతో జగపతిబాబు త్వరలో ప్రేక్షకులు ముందుకి రాబోతున్నారు. అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహించిన ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ ను అందుకుంది. మమత మోహన్ దాస్ మరియు విమల రామన్ లు ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. జులై 7న సినిమా థియేటర్లలో విడుదల కాబోతోంది. తాజాగా ఈ సినిమా ఏర్పాటు చేయగా నందమూరి బాలకృష్ణ దీనికి ముఖ్య అతిథిగా విచ్చేశారు.


ఆశిష్ గాంధీ మాట్లాడుతూ, "జై బాలయ్య. అందరికీ నమస్కారం. ఈ ఈవెంట్ ని సపోర్ట్ చేస్తున్నందుకు నందమూరి బాలకృష్ణ గారికి నా కృతజ్ఞతలు. థాంక్ యు సార్. వీ ఆల్ లవ్ యు. మీరు మా అందరికీ ఒక ఇన్స్పిరేషన్. నేను మిమ్మల్ని పీపుల్స్ స్టార్ అని పిలుస్తాను. జగపతిబాబు గారి గురించి చెప్పాలంటే ఆయనతో ఇది నా రెండవ సినిమా. షూటింగ్ సమయంలో నేను ఆయనతో ఫోటో దిగుతున్నప్పుడు ఆయన నాతో ఒక మాట అన్నారు. 'నువ్వు చాలా మంచి యాక్టర్ వి' అన్నారు. మల్లేష్ లాంటి పవర్ఫుల్ పాత్ర నాకు ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి నా కృతజ్ఞతలు. సినిమా అంతా టెక్నికల్ టీమ్ పనితనమే. 7/7 న ఈ సినిమా విడుదలవుతుంది. సినిమా మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అని ఆశిస్తున్నాను" అని అన్నారు.


చిత్ర హీరోయిన్ గాహ్నవి మాట్లాడుతూ, "మీడియా వారికి నా కృతజ్ఞతలు. గాడ్ ఆఫ్ మాస్ బాలకృష్ణ గారికి కూడా థాంక్యూ. ఒక సినిమా ఈవెంట్లో హైదరాబాద్ స్టేజ్ మీద నేను మాట్లాడటం ఇది రెండవసారి. కానీ తెలుగులో ఇది నా మొదటి సినిమా. జగపతి బాబు గారు ఒక అద్భుతమైన నటుడు. ఆయన తన పాత్రలోకి పూర్తిగా వెళ్లిపోయి నటిస్తారు. ప్రేక్షకులకు ఆయన క్యారెక్టర్ కచ్చితంగా నచ్చుతుంది. మమతా మోహన్దాస్ మరియు విమల రామన్ లాంటి వారిని చూసి నేను ఎంతో నేర్చుకున్నాను. నాకు సహాయం చేసినందుకు ఆశిష్ కి నా కృతజ్ఞతలు. సినిమా మీ అందరికీ నచ్చాలని కోరుకుంటున్నాను" అని అన్నారు.


దివి మాట్లాడుతూ, "బాలయ్య సార్ ఇక్కడికి వచ్చినందుకు చాలా థాంక్యూ. సినిమాలో నేను ఒక పాటలో కనిపిస్తాను. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు అజయ్ గారికి నా కృతజ్ఞతలు. ట్రైలర్ లో జగపతిబాబు గారు చాలా యంగ్ గా కనిపిస్తున్నారు. మమత మరియు విమల రామన్ గార్లు చాలా అందంగా ఉన్నారు," అని అన్నారు.


చరిష్మా మాట్లాడుతూ, "అందరికీ నమస్కారం. బాలయ్య గారు ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా సంతోషం గా ఉంది. ఇలాంటి మంచి సినిమాలో నేను కూడా భాగం అయినందుకు చాలా హ్యాపీ గా ఉన్నాను. సినిమా జులై లో వస్తుంది. అందరికీ నచ్చుతుంది అనుకుంటూ ఉన్నాను.


మమత మోహన్ దాస్ మాట్లాడుతూ, "జై జై బాలయ్య. అందరికీ హాయ్. ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు. చాలా సంవత్సరాల తర్వాత నేను ఒక తెలుగు సినిమాలో నటించాను. రుద్రంగి సినిమా మొత్తం అజయ్ ఇమాజినేషన్ లో ఉంది. అందులో జ్వాల పాత్రలో నన్ను ఎంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు కరియర్ లో చాలా ముందుకు వెళ్తారు. అతను మామూలు డైరెక్టర్ కాదు. ఆయన లో ఒక ఫైర్ ఉంది. సినిమా కోసం చిత్ర బృందం చాలా కష్టపడింది. నా మంచి స్నేహితుడు జగపతిబాబు లేకుండా ఈ సినిమా పూర్తయ్యేదే కాదు. ఇక్కడికి వచ్చినందుకు బాలకృష్ణ సార్ కి కూడా థాంక్యూ. ఆశిష్ సినిమాలోని పర్ఫామెన్స్ నాకు చాలా బాగా నచ్చింది. సౌత్ లో మరకమాస్ హీరో అయ్యే అవకాశం నీకు కచ్చితంగా ఉంది. మిమ్మల్ని చాలా కాలం తర్వాత చూడటం నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరి సపోర్ట్ వల్లే నేను మళ్ళీ తెలుగు సినిమాల్లోకి వచ్చాను. నీ సపోర్ట్ అలాగే కొనసాగుతుందని అనుకుంటున్నాను" అని అన్నారు.


డైరెక్టర్ అజయ్ సామ్రాట్ మాట్లాడుతూ, "నన్ను కన్న నా తల్లికి నన్ను పోషిస్తున్న కళమ్మ తల్లికి నా సాష్టాంగ ప్రణామాలు. ప్రతి డైరెక్టర్ తన సినిమా కోసం ప్రాణం పెట్టి పని చేస్తారు. కానీ నేను నా ప్రాణం పోయినా పర్వాలేదు అనుకుని ఈ సినిమాని పూర్తి చేశాను. థాంక్ యూ రస్మయి గారు. బాలయ్య గారు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నాకు గౌరవం కంటే ప్రేమించడమే వచ్చి. సినిమా గురించి చెప్పాలంటే మన చుట్టూ ఎన్నో రాజుల కోటలు, ఎత్తైన భవనాలు ఉంటాయి. కానీ ఎంతో అందమైన వి కేవలం పక్షులు కట్టే గూడు. సినిమా ని దాంతో పోలిస్తే నన్ను భరిస్తూ సినిమా కోసం పని చేసిన అందరికీ నా కృతజ్ఞతలు. ఈ సినిమా ఇలాంటి మరొక వంద సినిమాలను నాంది పలకాలి అని కోరుకుంటున్నాను. జై రుద్రాంగి, జై బాలయ్య" అని అన్నారు.


చిత్ర నిర్మాత రస్మయి మాట్లాడుతూ, "ఇక్కడికి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఎదురుగా లెజెండ్ ఉండగా నాకు మాటలు రావడం లేదు. అడగగానే ఇక్కడికి వచ్చి ఆయన ఆశీర్వాదాలు ఇచ్చిన బాలయ్య గారికి, నాకు ఇష్టమైన హీరో జగపతి బాబు గారికి, సినిమా నటీనటులకు, టెక్నీషయన్ల కు నా కృతజ్ఞతలు. బాలయ్య గారిని  à°¹à°¿à°‚దూపురం వాళ్ళు ఎందుకు ప్రేమిస్తారో నాకు తెలుసు. ఆయన చాలా సామాన్యమైన వ్యక్తిగా మనుషుల్ని ప్రేమిస్తారు. జగపతిబాబు గారు లేకపోతే అసలు à°ˆ సినిమానే లేదు. ఆయన పాత్రకి ప్రాణం పోశారనే చెప్పుకోవాలి. తెలంగాణ యాస లో ఆయన డైలాగులు అందరికీ గుర్తుండిపోతాయి. సినిమా ని తప్పకుండా ప్రేక్షకులు ఆదరించాలి అని కోరుకుంటున్నాను" అని అన్నారు.


హీరో గా నటించిన జగపతి బాబు మాట్లాడుతూ "బాలకృష్ణ గారు చాలా బిజీ గా ఉంటారు. కానీ నేను వెళ్లి అడిగితే కాదనరు అన్న నమ్మకంతో వెళ్లి అడిగాను. ఏమీ అడగకుండా కేవలం ఎప్పుడు పెట్టుకుందాం అని మాత్రమే అడిగి ఇక్కడికి వచ్చారు. ఆయన లెజెండ్ సినిమానే నాకు మళ్ళీ ప్రాణం పోసింది. ఇక హీరోగా మళ్లీ నా మూడవ ఇన్నింగ్స్ కి కూడా బాలయ్య గారు నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సినిమా కథ అన్నీ బావున్నాయి కానీ బడ్జెట్ కి నేను సరిపోను అని చెబుతూ వచ్చాను కానీ డైరెక్టర్ మరియు నిర్మాత చాలా నమ్మకం తో చేశారు. నేను "లెజెండ్" తర్వాత ఎన్నో సినిమాలు చేశాను కానీ అందులో చెప్పుకోదగ్గవి 10 కూడా లేవు. ఈ సినిమా తో మళ్లీ నాకు మంచి గుర్తింపు వస్తుంది అనుకుంటున్నాను. అజయ్ తో మళ్ళీ ఇంకో సినిమా చేసి తీరుతాను. తెలంగాణ సినిమా ఇది. అందరికీ నచ్చుతుంది అని నాకు నమ్మకం ఉంది" అని అన్నారు.


ముఖ్య అతిథిగా విచ్చేసిన నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ, "అందరికీ నమస్కారం. నాకు రస్మయి గారికి రాజకీయాలు తెలియవు. కానీ మా నాన్నగారి ఇన్స్పిరేషన్ తో వచ్చాము. రుద్రంగి లాంటి సినిమా లు చాలా అరుదుగా వస్తాయి. మా నాన్నగారు అలాంటి సినిమాలు చాలా చేశారు. ఇప్పుడు జగపతి బాబు అలాంటి సినిమా చేస్తూ ఉండడం చాలా సంతోషం గా ఉంది. ఏదైనా పాత్ర చేసేటప్పుడు అందులో నటించడం కంటే జీవించడం గొప్ప. అలాంటి నటుడే జగపతి బాబు. సినిమా ఇండస్ట్రీ సర్వైవల్ కోసమే మేము ఇంకా పని చేస్తున్నాము. మమత మోహన్ దాస్ ఒక వీర వనిత. క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా నాకు తెలుసు వాళ్ళు ఎంత క్షోభ పడతారు అని కానీ ఆమె చాలా ధైర్యం గా ఉండి ఎందరికో ఇన్స్పిరేషన్ గా నిలిచారు." అని అన్నారు. చిత్ర బృందాన్ని పొగిడి సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నట్టు చెప్పారు బాలయ్య.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !