View

రెడ్ అలర్ట్ మూవీ రివ్య్వూ

Friday,November06th,2015, 01:06 AM

చిత్రం - రెడ్ అలర్ట్
బ్యానర్స్ - ఎల్ ఎల్ పి, సినీ నిలయ క్రియేషన్స్
సమర్పణ - పి. యస్.త్రిలోక్ రెడ్డి
నటీనటులు - హెచ్.హెచ్.మహదేవ్, రవి, అమర్, తేజ, అంజనామీనన్, కౌష, సుమన్, కె.భాగ్యరాజా, అలీ, పోసాని కృష్ణమురళీ, వినోద్ కుమార్, అనితా చౌదరి, కృష్ణంరాజు, జోగినాయుడు తదితరులు
కథ, మాటలు - శ్రీరామ్ చౌదరి
సంగీతం - రవివర్మ
కెమెరా - కళ్యాణ్ సమి
ఎడిటింగ్ - గౌతంరాజు
ఎగ్జిక్యూటివ్ నిర్మాత - జైపాల్ రెడ్డి
కో-ప్రొడ్యూసర్ - శ్రీమతి పిన్నింటి శ్రీరాం సత్యరెడ్డి
నిర్మాత - పి.వి.శ్రీరాంరెడ్డి
స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - చంద్రమహేశ్


ఏకకాలంలో నాలుగు భాషల్లో సినిమా తీయడం అంటే అంత సులువు కాదు. నాలుగు భాషల నేటివిటీకి తగ్గ కథ కుదరాలి. అలాంటి కథను చంద్రమహేశ్ రెడీ చేసుకున్నారు. వాస్తవానికి ఆయన నాలుగు భాషల్లో తీయాలనుకోలేదు. కథ విన్న నిర్మాత శ్రీరాంరెడ్డి మాత్రం తెలుగు, తమిళ, కన్నడ మలయాళ భాషల్లో తీద్దామన్నారు. అలా నాలుగు భాషల్లో 'రెడ్ అలర్ట్' రూపొందింది. హెచ్.హెచ్. మహదేవ్, రవి, అమర్, తేజ, అంజనా మీనన్ ముఖ్య తారలుగా రూపొందిన ఈ చిత్రం ఆల్రెడీ కన్నడ, మలయాళ భాషల్లో విడుదలై, ప్రేక్షకాదరణ పొందింది. రెండు భాషల్లో ఆల్రెడీ ప్రూవ్ అయిన సినిమా కాబట్టి, ఇక్కడ హిట్ గ్యారెంటీ అనే ఫీల్ కలగడం సహజం. ఇక, 'రెడ్ అలర్ట్' ఎలా ఉందో చూద్దాం....


à°•à°¥
టెర్రరిస్ట్ లు హైదరాబాద్ లో జరగబోయే గణేష్ నిమజ్జనం సందర్భంగా పలు ఏరియాల్లో బాంబు బ్లాస్ట్ లు జరపడానికి ప్లాన్ చేస్లుంటారు. ఓ చోట మకాం వేసి, ఎక్కడెక్కడ బాంబులు పెట్టాలో ప్లాన్ చేస్తుంటారు.


మహదేవ్, రవి, అమర్, తేజ నలుగురూ చిన్నప్పట్నుంచి ఫ్రెండ్స్. ఈ నలుగురు చిన్నప్పుడే అనాధ అయిన శ్రీరాంని చేరదీసి తనతో స్నేహంగా ఉంటారు. ఐదుగురూ పెరిగి పెద్దవారవుతారు. చిన్నప్పుడే రిపోర్టర్ అవ్వాలని కలలు కనే శ్రీరాం క్రైమ్ రిపోర్టర్ అవుతాడు. హైదరాబాద్ లో ఓ టివి చానెల్ లో రిపోర్టర్ గా వర్క్ చేస్తుంటాడు. వైజాగ్ లో ఉండే మహదేవ్, రవి, అమర్, తేజ గణేష్ నిమజ్జనం చూడటానికి ఫ్రెండ్ శ్రీరాం కోరిక మేరకు హైదరాబాద్ వస్తారు. వారిని రిసీవ్ చేసుకుంటానని చెప్పిన శ్రీరాం ఫూణే వెళుతున్నాను, మూడు రోజుల్లో తిరిగి వస్తానని ఫ్రెండ్స్ కి మెసేజ్ పెడతాడు. దాంతో మహదేవ్ అండ్ ఫ్రెండ్స్ ఓ హోటల్లో రూము తీసుకుని సిటీ తిరిగి చూడాలని ప్లాన్ చేసుకుంటారు. అలా సిటీ తిరిగి చూసేటప్పుడు వారికి ఓ డబ్బుల మూట దొరుకుతుంది. డబ్బులు మూట అని తీసుకున్న మహదేవ్ అండ్ ఫ్రెండ్స్ మూట తెరిచి చూస్తే, అందులో తలలేని శవం ఉంటుంది. శవాన్ని చూసి పోలీసులకు దొరికిపోతామేమోననే భయంతో ఎలాగైనా ఆ శవాన్ని వదిలించుకోవాలని ప్రయత్నాలు మొదలుపెడతారు.


ఓ క్యాబ్ డ్రైవర్ (అలీ)కి తన క్యాబ్ లో దొరికిన బ్యాగ్ లో మొండెంలేని తల దొరుకుతుంది. ఆ డ్రైవర్ ఆ తల ఉన్న బ్యాగ్ ని వదిలించుకునే ప్రయత్నం చేస్తాడు. మహదేవ్ అండ్ ఫ్రెండ్స్ తమ దగ్గర ఉన్న శవం మూటను క్యాబ్ లో పెట్టేస్తారు. ఆ తర్వాత ఆ శవం తమ ఫ్రెండ్ శ్రీరాందే అన్న విషయం తెలుసుకుని, తమ ఫ్రెండ్ ని చంపిన వాడిపై పగ తీర్చుకోవాలని నిర్ణయించుకుంటారు.


ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ భువనేశ్వరి (అంజనామీనన్) హైదరాబాద్ లో బాంబ్ బ్లాస్ట్ లను ప్లాన్ చేసిన టెర్రరిస్ట్ లను పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటుంది. ఆ సమయంలోనే భువనేశ్వరిని కలిసి తమ ఫ్రెండ్ శ్రీరాం గురించి చెబుతారు మహదేవ్ అండ్ ఫ్రెండ్స్. తమ ఫ్రెండ్ శ్రీరాంని చంపిన వారిని చంపేస్తామని కూడా చెబుతారు. శ్రీరాంని చంపింది తనేనని చెబుతుంది భవనేశ్వరి.


అసలు శ్రీరాంని భువనేశ్వరి ఎందుకు చంపింది. తమ ఫ్రెండ్ శ్రీరాంని చంపిన భువనేశ్వరిని మహదేవ్ అండ్ ఫ్రెండ్స్ ఏం చేస్తారు. అసలు భువనేశ్వరీనే శ్రీరాంని చంపిందా? శ్రీరాం హత్య వెనక ఉన్న కారణం ఏంటీ? హైదరాబాద్ లో జరగబోయే బాంబ్ బ్లాస్ట్ లను భువనేశ్వరీ ఆపగలిగిందా అనేదే ఈ చిత్ర కథ.


నటీనటుల పర్ఫార్మెన్స్మ

హదేవ్, రవి, అమర్, తేజ.. ఈ నలుగురి కుర్రాళ్ల చుట్టూనే కథ తిరుగుతుంది. వీళ్లల్లో మహదేవ్ పాత్ర కీలకంగా ఉంటుంది. మొదటి సినిమా అయినా తను బాగా చేశాడు. మాస్ సాంగ్ కి మహదేవ్ చాలా ఈజ్ తో డ్యాన్స్ చేశాడు. ఏజ్ చిన్నది కాబట్టి, ఫేస్ లో ఇంకా మెచ్యుర్టీ కనిపించదు. సో.. ఇంకొంచెం మెచ్యుర్టీ వస్తే, మహదేవ్ ఇంకా బాగుంటాడు. నటన పరంగా ఇప్పటికి ఓకే. రవి, అమర్, తేజ కూడా బాగా యాక్ట్ చేశారు. డీసీపీ భువనేశ్వరి పాత్రకు అంజనా మీనన్ యాప్ట్ గా ఉంది. తన బాడీ లాంగ్వేజ్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ లా ఉండటం ఓ ప్లస్. అలాగే, ఫిజిక్ కూడా బాగుంది. భువనేశ్వరి పాత్రకు అంజనా న్యాయం చేసింది. సుమన్, పోసాని, అలీ, భాగ్యరాజా, రవిప్రకాశ్, జోగి నాయుడు, కృష్ణంరాజు తదితరులు తమ పాత్రల్లో ఒదిగిపోయారు.

 

సాంకేతిక వర్గం
కథ బాగుంది. చాలా చిన్న లైన్. దాని చుట్టూ ఆసక్తికరమైన సన్నివేశాలు అల్లి, చంద్రమహేశ్ ఈ సినిమా తీశారు. స్టార్టింగ్ నుంచి క్లయిమ్యాక్స్ ముందు వరకూ మెయిన్ టైన్ చేసిన సస్పెన్స్ బాగుంది. క్లయిమ్యాక్స్ ఉత్కంఠకు గురి చేసే విధంగా ఉంది. రవివర్మ స్వరపరచిన పాటల్లో 'జై జై గణేశ..' పాట బాగుంది. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఓకే. శ్రీరాం చౌదరి రాసిన మాటలు, కల్యాణ్ సమి కెమెరా బాగున్నాయి.


ఫిల్మీబజ్ విశ్లేషణ
అనవసర ఆర్భాటాలకు పోకుండా కథ డిమాండ్ చేసిన మేరకే నిర్మాతతో ఖర్చు పెట్టించారు చంద్రమహేశ్. ఈ సినిమాకి ఆదో ప్లస్ పాయింట్. చిన్న లైన్ తో సినిమా తీయడం అంటే కత్తి మీద సాము లాంటిదే. దాని చుట్టూ సన్నివేశాలు అల్లే క్రమంలో అక్కడక్కడా కొన్ని అతకని సీన్స్ ఉండే ప్రమాదం ఉంది. ఈ చిత్రంలో అలాంటి సీన్స్ లేకపోయినప్పటికీ.. పోసాని, అలీల కామెడీ సీన్స్ లెంగ్త్ కొంచెం తగ్గితే బాగుండు అనిపించింది. అది మినహా చెప్పుకోదగ్గ మైనస్సులు లేవు. మంచి స్ర్కీన్ ప్లేతో చిత్రాన్ని ఉత్కంఠగా తెరకెక్కించగలిగారు. జస్ట్ గంటన్నర సినిమా కావడం ఓ ప్లస్.


ఫైనల్ గా చెప్పాలంటే... నిడివి తక్కువగా ఉండటం, ఫస్టాఫ్ నుంచి క్లయిమ్యాక్స్ ముందు వరకూ సస్పెన్స్ ని రివీల్ చేయకుండా ఉండటం ఈ సినిమాకి మంచి ఎస్సెట్. సింఫుల్ బడ్జెట్ తో, ఆసక్తికరమైన పాయింట్ తో తీసే చిన్న చిత్రాలను ఎంకరేజ్ చేయాలి. ఆ విధంగా చూస్తే 'రెడ్ అలర్ట్' ఎంకరేజ్ చెయ్యదగ్గ సినిమా. సో.. వాచ్ ది మూవీ అండ్ ఎంజాయ్.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !