View

సాహసం శ్వాసగా సాగిపో మూవీ రివ్య్వూ

Friday,November11th,2016, 05:26 AM

చిత్రం - సాహసం శ్వాసగా సాగిపో
బ్యానర్ - ద్వారక క్రియేషన్స్
నటీనటులు - అక్కినేని నాగచైతన్య, మంజిమమోహన్, రాకేందు మౌళి, బాబా సెహగల్ తదితరులు
సంగీతం - ఏ.ఆర్.రహమాన్
సినిమాటోగ్రఫీ - డాన్ మార్ ఆర్థర్
ఎడిటింగ్ - ఆంటోని
రచన - కోన వెంకట్
సమర్పణ - మిర్యా సత్యనారాయణరెడ్డి
నిర్మాత - మిర్యాల రవీందర్ రెడ్డి
కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - గౌతమ్ వాసుదేవమీనన్


నాగచైతన్య, మంజిమ మోహన్ జంటగా గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో మిర్యా సత్యనారాయణ రెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన సాహసం శ్వాసగా సాగిపో చిత్రం ఈ రోజు (11.11.2016) ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యింది. ఈ సినిమా విడుదల లేట్ అయినప్పటికీ, సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా పోస్టర్స్, ట్రైలర్స్, ఆడియో యూత్ లో కూడా మరిన్ని అంచనాలు పెంచేసాయి. మరి ఆ అంచనాలను అందుకునే విధంగా ఈ సినిమా ఉందా తెలుసుకుందాం.


కథ

చిన్న (నాగచైతన్య) కాలేజ్ కి వెళ్లే కుర్రాడు. ఇద్దరు చెల్లెలు, అమ్మ, నాన్నలతో చక్కటి ఫ్యామిలీతో హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేస్తున్న చిన్నకు తన చెల్లెలు ఫ్రెండ్ లీల (మంజిమమోహన్) పరిచయం అవుతుంది. ఓ కోర్సు చదువుకోవడానికి చిన్న ఇంట్లోనే ఉంటుంది లీల. అప్పట్నుంచి లీలను ఫాలో అవుతూ ఆమెను మనసులోనే ప్రేమిస్తుంటాడు. కన్యాకుమారి రోడ్డు ట్రిప్ కి తన ఫ్రెండ్ మహేష్ తో కలిసి వెళ్లడానికి ప్లాన్ చేసుకుంటాడు చిన్న. ఈ విషయాన్ని లీలకు చెబుతాడు. ట్రిప్ కి బయలుదేరే రోజున తను కూడా ట్రిప్ కి వస్తానని చెబుతుంది లీల. ఇద్దరి ఇళ్లల్లో ఈ ఇద్దరూ కలిసి బైక్ పైన రోడ్డు ట్రిప్ వెళుతున్నారనే విషయం తెలియదు. చిన్న, లీల ట్రిప్ కి బయలుదేరతారు. కన్యాకుమారి చూసి తిరిగి వస్తున్న సమయంలో యాక్సిడెంట్ కి గురవుతారు, చనిపోతానేమోననే భయంతో లీల దగ్గర ఆమెను ప్రేమిస్తున్నాననే విషయాన్ని చెప్పేస్తాడు చిన్న. గాయాలు పాలైన చిన్నాను హాస్పటల్లో అడ్మిట్ చేసి, తన తల్లిదండ్రులు చావు బ్రతుకుల్లో ఉన్న విషయం తెలుసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది లీల.


యాక్సిడెంట్ తర్వాత చిన్న, లీల జీవితాలు ఎలాంటి మలుపు తీసుకుంటుంది... ఆ యాక్సిడెంట్ ఎవరైనా ప్లాన్ చేసిందా... లీల తల్లిదండ్రులు ఎందుకు చావుబ్రతుకుల్లో ఉంటారు... లీలను వెతుక్కుంటూ చిన్న వెళతాడా... ఫైనల్ గా చిన్న, లీల ప్రేమ ఫలించి ఒకటవుతారా తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.


నటీనటుల పెరఫామెన్స్
కాలేజ్ గోయింగ్ కుర్రాడిగా, ఓ ప్రేమికుడిగా, ఇబ్బందుల్లో ఇరుక్కున్న కుర్రాడిగా, మెచ్చుర్టీతో ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసే కుర్రాడిగా పలు షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేసాడు నాగచైతన్య. ఈ షేడ్స్ ని చక్కగా ఆవిష్కరించి శభాష్ అనిపించుకున్నాడు. హీరో క్యారెక్టర్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. డైలాగ్ డెలివరీ, వాయిస్ లో మెచ్చుర్టీ నటుడిగా నాగచైతన్య ఎదుగుతున్నవైనాన్ని తెలియజేస్తోంది.
లీల క్యారెక్టర్ లో మంజిమమోహన్ ఒదిగిపోయింది. క్యూట్ గా ఉంది. చక్కటి నటనను కనబర్చింది.
బాబా సెహగల్ విలన్ గా చక్కటి పెర్ ఫామెన్స్ ఇచ్చాడు. లుక్ పరంగా కూడా బాబా సెహగల్ బాగున్నాడు.
మిగతా నటీనటీనటులందరూ తమ పాత్రల పరిధిమేరకు నటించారు.


సాంకేతిక వర్గం
ఏ.ఆర్.రహమాన్ ఈ చిత్రానికి సంగీతమందించారు. పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్. రొమాంటిక్, థ్రిల్లర్ కి సరిపోయే ట్యూన్స్ తో పాటు సీన్స్ ని ఎలివేట్ చేసే విధంగా ఉన్న రీ-రికార్డింగ్ మరోసారి రహమాన్ టాలెంట్ ని తెలియజేసాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. స్టోరీ లైన్ చాలా న్యాచురల్ గా ఉంది. జీవితంలో ఎదురయ్యే సంఘటలను ఎదుర్కొనే కాన్ఫిడెన్స్ ప్రతి మనిషిలోనూ ఉంటుంది. కాకపోతే ఆ సంఘటలను ఎదుర్కోవడానికి మనుషులు స్పందించే విధానం డిఫరెంట్ గా ఉంటుంది. ఈ చిత్రంలో ఓ కుర్రాడికి జీవితంలో అనుకోని సంఘటనలు ఎదురవ్వడం, వాటిని ఆ కుర్రాడు ఎదుర్కొనే విధానం కళ్లకు కట్టినట్టు చూపించడంలో డైరెక్టర్ గౌతమ్ మీనన్ సఫలమయ్యారు.


ఫిల్మీబజ్ విశ్లేషణ
రొమాంటిక్, థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా ఫస్టాప్ సీన్స్ కొంత నిరాశపరిచినప్పటికీ, సెకండాఫ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో స్ర్కీన్ ప్లే అల్లిన విధానం సూపర్బ్. క్లయిమ్యాక్స్, ఆ సంఘటనలు జరగడానికి కారణమైన ఫ్ల్యాష్ బ్యాక్ సిల్లీగా అనిపించడం ఈ సినిమాకి పెద్ద మైనస్ పాయింట్. నాగచైతన్య లుక్, యాక్టింగ్ ఈ సినిమాకి ప్లస్. ఫస్టాప్ కొన్ని సీన్స్ యూత్ కి బాగా కనెక్ట్ అవుతాయి. సెకండాఫ్ ఆడియన్స్ లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. చివరి వరకూ సస్పెన్స్ మెయింటెన్ చేసిన విధానం బాగుంది. ఎదురుచూడని సిట్యువేషన్ లో సాంగ్స్ రావడం కొంచెం బోర్ కొట్టించే విషయం. హీరో, హీరోయిన్ యాక్సిడెంట్ కి గురైనప్పుడు సాంగ్ రావడం, ఆ ఎమోషన్ ని మిస్ అవ్వకుండా యాక్సిడెంట్ సీన్స్ ని ఇంటర్ కట్ చేయడం బాగుంది. కొత్తగా అనిపిస్తుంది. ఫ్రెండ్ చనిపోయిన సీన్ లో, ప్రేమికురాలిని తన ముందే షూట్ చేసే సీన్స్ లో నాగచైతన్య చక్కగా నటించాడు. బాధలోంచి వచ్చే కోపాన్ని, తనకు ఎదురైన ప్రాబ్లమ్ ని ఫేస్ చేయడానికి మొండిగా ముందుకుసాగే కుర్రాడిగా నాగచైతన్య నటన బాగుంది.


ఫైనల్ గా చెప్పాలంటే...
రెగ్యులర్ కమర్షియల్ సినిమా లవర్స్ కి ఈ సినిమా కనెక్ట్ అవ్వదు. రొమాంటిక్, థ్రిల్లర్స్ ని ఎంజాయ్ చేసే వారికి ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. ముఖ్యంగా యూత్ ఎంజాయ్ చేసే అంశాలు చాలానే ఉన్నాయి. సినిమా డీసెంట్ గా ఉంటుంది. కాబట్టి చైతూ చేసిన ఈ సాహసాన్ని ఓసారి చూసేయవచ్చు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. రీ ఎంట్రీకి ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయత్తమవుతున్నాడు. 'శ్రీమంతుడు' చిత్రం త ..

Read More !

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ్యాప్ తీసుకోకుండానే 151వ సినిమా చేయడా ..

Read More !

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కైనా సంతోషంగానే ఉంటుంది. కానీ ఆ అవకాశం ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా విడుదలై భారీ వసూళ్లను సాధించిన విష ..

Read More !

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధరమ్ తేజ్, బోయపాటి శ్రీను సినిమాలు చేస్ ..

Read More !

Gossips

మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ గతంలో శిరీష్ భరద్వాజను ప్రేమించి, ..

రాంచరణ్ కి నోటి దురుసు ఎక్కువ అని తెలుగు సినిమా పరిశ్రమలో ఓ టాక్ ఉంది. ఆ వార ..

'రక్తచరిత్ర' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన రాధికా ఆప్టే తనలో మంచి నట ..

బాలీవుడ్ లో భారీ సినిమాలను నిర్మిస్తూ, పంపిణీ చేస్తున్న ఈరోస్ ఇంటర్నేషనల ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో 10రోజుల్లో 'జనతా గ్యారేజ్' షూటింగ్ తో బిజీ అవ్వబోతున ..

మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ సినిమా అంటే భారీ అంచనాలు ఉం ..

సీన్ ఉంది కదా అని ఓవర్ గా బిల్డప్ ఇస్తే సీన్ సితార్ అవుతుంది. విలన్ గా దూసుక ..

'బాహుబలి ది కంక్లూజన్' చిత్రం విడుదలైన వెంటనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో రాజమౌ ..

ప్రిన్స్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందితే బాగుంటుందని ..

మెగాబ్రదర్స్ మధ్య విభేదాలు ఉన్నాయా లేవా అనే విషయం గురించి కొంతకాలం క్రిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ సినిమా అంటే ..

యంగ్ రెబల్ స్టార్ ఫ్రభాస్ తో 'మిర్చి' లాంటి హిట్ చిత్రం చేసిన తర్వాత కొరటాల ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ లో వచ్చే యేడాది ఓ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ సినిమా అంటే ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్, హీరోయిన్ రెజీనా ఘాటుగా ప్రేమించుకుంటున్నార ..

ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ జాబితాలో కొరటాల శివ పేర ..

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ..

రాజకీయనేత పరిటాల రవి చనిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది. కానీ ఆయన్ను అభిమ ..

'బాహుబలి 2' పూర్తయిన వెంటనే రాజమౌళి మరో భారీ బడ్జెట్ చిత్రం 'గరుడ' ను ఆరంభించ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ సినిమా అంటే ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Is Prabhas decision right to do Baahubali- what his fans says? 

Prabhas, Rana Baahubali movie trailor

Charmme Kaur starrer Jyothi Lakshmi Song Making video 

Raviteja Starrer Power (Song 4) 10Sec Promo

Nitin Nash Movie Opening Held at Annapurna Studio.

Read More !