View

Thungabadra Movie Review

Friday,March20th,2015, 09:46 AM

చిత్రం - తుంగభద్ర
బ్యానర్ - వారాహి చలన చిత్రం, ఎ సాయి కొర్రపాటి ప్రొడక్షన్
సమర్పణ - సాయి శివాని
నటీనటులు - ఆదిత్, డింఫుల్ చోపడే, కోట శ్రీనివాసరావు, సత్యరాజ్, చలపతిరావు, సప్తగిరి, కోట శంకరరావు, పవిత్రా లోకేష్, రాజేశ్వరి నాయర్, ధనరాజ్, రవివర్మ, జబర్ధస్త్ శ్రీను తదితరులు
సంగీతం - హరి గౌర
ఎడిటింగ్ - తమ్మిరాజు
సినిమాటోగ్రఫీ - రాహుల్ శ్రీ వాత్సవ్
నిర్మాత - రజని కొర్రపాటి
రచన, దర్శకత్వం - శ్రీనివాసకృష్ణ గోగినేని

గత ఏడాది లెజెండ్, ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్య చిత్రాలతో మూడు విజయాలను సొంతం చేసుకున్నారు నిర్మాత సాయి కొర్రపాటి. ఈ ఏడాది ఆయన సంస్థ నుంచి వస్తున్న తొలి చిత్రం 'తుంగభద్ర'. ఈ చిత్రం ట్రైలర్స్ చూసినవాళ్లందరూ.. కొత్తగా ఉందనీ, సినిమా బాగుంటుందనే నమ్మకం కలుగుతోందనీ పేర్కొన్నారు. సాయి కొర్రపాటి ఖాతాలో మరో విజయం ఖాయం అనే విధంగా ఈ ట్రైలర్ ఉంది. నూతన దర్శకుడు శ్రీనివాస్ గోగినేని దర్శకునిగా పరిచయం చేస్తూ, 'కథ' హీరో ఆదిత్ కథానాయకునిగా సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక.. ఈ 'తుంగభద్ర' ఎలా ఉందో చూద్దాం...

à°•à°¥
రామరాజు (సత్యరాజ్), త్రిమూర్తులు (చలపతిరావు) ఇద్దరూ ఒకే ఊరికి చెందిన రాజకీయ నాయకులు. ఈ రెండు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతటి పగ ఉంటుంది. త్రిమూర్తులు వర్గం రామరాజు వర్గం వారిని చంపుతారు. దాంతో అధికారంలో ఉన్న రామరాజు ప్రత్యర్ధి వర్గ పెద్ద త్రిమూర్తులును టార్గెట్ చేసి తమ వర్గంతో కలిసి చంపేస్తాడు .త్రిమూర్తులుకి ముగ్గురు కొడుకులు. అధికారం లేక, తండ్రి కూడా చనిపోవడంతో ఈ ముగ్గురు కొడుకులు అజ్ఞాతంలోకి వెళ్లిపోతారు. త్రిమూర్తులు వర్గానికి అండగా ఉండే రాజకీయనాయకుడు పైడితల్లి అవకాశం, అధికారం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత రామరాజు వర్గాన్ని అంతం చేసే ప్లాన్ లో ఉంటాడు.
ఇదిలా ఉంటే.. రామరాజు దగ్గర పని చేసే వ్యక్తి చనిపోవడంతో, అతని కొడుకు శ్రీను (ఆదిత్) చిన్నప్పుడే రామరాజు పంచన చేరతాడు. అక్కడే పెరిగి పెద్దవుతాడు. రామరాజు కూతురు గౌరి (డింఫుల్ చోపడే) కాలేజ్ కి వెళుతుంటుంది. తన కూతురు ఎవరినో ప్రేమిస్తుందనే అనుమానంతో శ్రీనును తన కూతురిని ఫాలో అవ్వమని చెబుతాడు రామరాజు. ఒకవేళ తన కూతురు ప్రేమలో పడితే, ప్రేమించిన కుర్రాడిని చంపేయమంటాడు. గౌరిని ఫాలో అయిన శ్రీను ఆమె ఎవ్వరినీ ప్రేమించడంలేదని, ఆమెను ఎవ్వరూ ప్రేమించడంలేదని తెలుసుకుంటాడు. కానీ శ్రీను, గౌరి ఇద్దరూ ప్రేమలో పడతారు. అయితే రామరాజు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని తాపత్రయపడే శ్రీను తన ప్రేమను తనలోనే దాచుకుని గౌరికి చెప్పకుండా తప్పించుకుని తిరుగుతాడు.
ఓ సందర్భంలో శ్రీను, గౌరి మాట్లాడుకోవడం వింటాడు రామరాజు. ఆ తర్వాత రామరాజు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు. శ్రీను, గౌరి ప్రేమను రామరాజు అంగీకరిస్తాడా? అధికారం కోసం ఎదురుచూస్తున్న పైడితల్లి అధికారంలోకి రాగానే రామరాజును ఎలా టార్గెట్ చేసాడు? అతని అండతో త్రిమూర్తులు కొడుకులు రామరాజుపై పగ తీర్చుకున్నారా?.. అనే అంశాలతో ఈ సినిమా సెకండాఫ్ సాగుతుంది.

నటీనటుల పర్ఫార్మెన్స్
ఈ చిత్రానికి రెండు పాత్రలు రెండు కళ్లులాంటివి. అవి కర్లపూడి శ్రీను, రామరాజు. ఈ రెండు పాత్రలు పోషించిన నటులు అద్భుతమైన నటన కనబర్చకపోతే కథ పండదు. శ్రీనుగా ఆదిత్, రామరాజు పాత్రను సత్యరాజ్ అద్భుతంగా చేశారు. సత్యరాజ్ అంటే అనుభవం ఉన్న నటుడు కాబట్టి, బాగా నటిస్తే పెద్దగా ఆశ్చర్యపోవడానికి లేదు. కానీ, శ్రీను పాత్రను ఆదిత్ చాలా బాగా చేశాడు. టౌన్ లో ఉండే కుర్రాడి బాడీ లాంగ్వేజ్, హావాభావాలు, లుక్ ఎలా ఉంటుందో అచ్చంగా అలా ఒదిగిపోయాడు ఆదిత్. హోమ్లీ కారెక్టర్ లో కథానాయిక డింపుల్ చోపడే భేష్ అనిపించుకుంది. కోట శ్రీనివాసరావు, శివకృష్ణ, పవిత్ర లోకేశ్, సప్తగిరి తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక వర్గం
దర్శకుడు శ్రీనివాసకృష్ణ గోగినేనికి ఇది మొదటి సినిమా. అయినా, బాగా తీశాడు. లాజిక్కులు లేని సన్నివేశాలు కనిపించవు. సినిమా ఆరంభం నుంచి చివరి వరకు పొంతన లేని సన్నివేశాలు కనిపించవు. ఆ పరంగా దర్శకుడు సక్సెస్ అయ్యాడు. విషయం ఉన్న దర్శకుడు అంటే అతిశయోక్తి కాదు. కథకు తగ్గ సంభాషణలతో చిత్రం సాగుతుంది. హరి గౌర అందించిన పాటలు సినిమా మూడ్ కి తగ్గట్టుగా ఉన్నాయి. ముఖ్యంగా 'కల ఇది కల ఇది...' పాట అందరికీ కనెక్ట్ అవుతుంది. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. రాహుల్ శ్రీవాత్సవ్ కెమెరా పనితనాన్ని ప్రశంసించాల్సిందే. నిర్మాణ విలువలు మెచ్చుకోదగ్గ విధంగా ఉన్నాయి.

ఫిల్మీబజ్ విశ్లేషణ
ఏ సినిమా అయినా స్టార్టింగ్ టు ఎండింగ్ బోర్ కొట్టకుంటా ఉంటే అది ఖచ్చితంగా విజయవంతమైన సినిమాయే. ఈ 'తుంగభద్ర' ఆ కోవకే వస్తుంది. ఫస్టాఫ్ సరదాగా సాగుతుంది. సెకండాఫ్ ఉద్వేగంగా సాగుతుంది. ఇక.. క్లయమాక్స్ అయితే సూపర్బ్. కత్తి పట్టినవాడు కత్తితోనే పోతాడు అని ఇంతకుముందు చాలా సినిమాల్లో చెప్పారు. కానీ, ఈ సినిమాలో ఈ విషయాన్ని చూపించిన వైనం చాలా కొత్తగా ఉంది. మనసుని హత్తుకునే విధంగా ఉంది. క్లయిమాక్స్ లో ఇచ్చిన సందేశం పదవి కోసం హత్యలు చేసేవాళ్లని ఆలోచనలో పడేస్తుంది. ఇది ఎ సెంటర్ మూవీయా? బి, సీయా అనేది చెప్పలేం. ఇదో కథ. ఈ కథను అందరూ చూడొచ్చు. ముఖ్యంగా అసలు సిసలు తెలుగు సినిమాలా ఉంది కాబట్టి, ఆ వర్గం ఈ వర్గం అని కాకుండా అందరూ చూసే విధంగా ఉంది. కుటుంబ ప్రేక్షకులు ఇబ్బందిపడే సన్నివేశాలు లేకపోవడం ఓ ప్లస్. కర్లపూడి శ్రీను, రామరాజు, పైడితల్లి లాంటి కారెక్టర్స్ పట్టణాల్లోనూ, పల్లెల్లోనూ ఇంకా ఉన్నాయి. సమాజంలో ఉన్న పాత్రలే 'తుంగభద్ర' లో కనిపిస్తాయి కాబట్టి, సినిమా సహజంగా ఉంది. నేల విడిచి సాము చేసే కథలతో విసుగెత్తిన ప్రేక్షకులకు ఇలాంటి సహజమైన చిత్రాలు ఓ రిలీఫ్.
ఒక్క మాటలో చెప్పాలంటే. 'తుంగభద్ర' మంచి టైమ్ పాస్ సినిమాయే కాదు.. అక్కడ్కడా మనసుని కూడా టచ్ చేస్తుంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !