View

Rey Movie Review

Friday,March27th,2015, 10:44 AM

చిత్రం - రేయ్
బ్యానర్ - బొమ్మరిల్లు ఫిలింస్
నటీనటులు - సాయిధరమ్ తేజ్, సయ్యామీ ఖేర్, శ్రద్ధాదాస్, యక్తా చౌదరి, అలీ, నరేష్, తనికెళ్ల భరణి, వేణుమాధవ్, జె.పి, హేమ తదితరులు
సినిమాటోగ్రఫీ - గుణశేఖరన్
ఎడిటింగ్ - కోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతం - చక్రి
కథ - శ్రీధర్ సీపాన
అడిషనల్ స్ర్కీన్ ప్లే, డైలాగ్స్ - రాజసింహ
సమర్పణ - యలమంచిలి గీత
కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - వై.వి.యస్.చౌదరి

ఓ సినిమాకి కొబ్బరికాయ కొట్టినప్పుడు అనుకున్న సమయంలో గుమ్మడికాయ కొట్టి, త్వరగా విడుదల చేయాలని ఎవరైనా అనుకుంటారు. 'రేయ్' సినిమా ఆరంభించినప్పుడు, వైవీయస్ చౌదరి కూడా అలా అనుకునే ఉంటారు. కానీ, కాలం కలిసి రాక ఈ సినిమా చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. దాంతో విడుదలకు దాదాపు నాలుగేళ్లు పట్టింది. సరే.. విడుదలలో జాప్యం జరిగినా.. సినిమా బాగుంటే కనకవర్షం కురిపించేస్తుంది. మరి.. 'రేయ్' ఎలా ఉంది? మలి చిత్రంతో విజయం అందుకున్న సాయిధరమ్ తేజ్ ఈ తొలి చిత్రంతో విజయం అందుకుంటాడా.. చూద్దాం...

కథ
రాక్ (సాయిధరమ్ తేజ్) ఎలాంటి టార్గెట్ లేకుండా లైఫ్ ని లీడ్ చేస్తూ తన కుటుంబంతో కలిసి జమైకాలో ఉంటాడు. అమ్మాయిలకు దగ్గరవ్వడం కోసం రాక్ అతని ఫ్రెండ్స్ డ్యాన్స్ కాలేజ్ లో చేరతారు. యం.టి.వి డ్యాన్స్ కాంపిటీషన్ లో 'బెస్ట్ ఆఫ్ ది వరల్డ్' టైటిల్ ని గెల్చుకోవాలనే టార్గెట్ తో ఉంటుంది అమృత (సయ్యామీ ఖేర్). డ్యాన్స్ కాలేజ్ లో రాక్ అతని ఫ్రెండ్స్ అమృతతో ఫ్రెండ్ షిప్ చేస్తారు. వీరిని మోటివేట్ చేసి ఓ టార్గెట్ ఏర్పడేలా చేస్తుంది అమృత.
జెన్న (శ్రధ్ధాదాస్) కూడా ఈ టైటిల్ ని గెల్చుకోవాలనే టార్గెట్ తో ఉంటుంది. ఇందుకోసం తనకు అడ్డంపడేవారిని తొలిగించుకుని మరీ ముందుకుపోయే మనస్తత్వం కల అమ్మాయి జెన్న. ఈ పోటీలో గెలవడానికి అమృతకు రాక్ అతని ఫ్రెండ్స్ ఎలా సహాయం చేసారనేదే ఈ సినిమా కథ.

నటీనటుల పర్ఫార్మెన్స్
సాయి ధరమ్ తేజ్ ది డాన్స్ బేస్డ్ కారెక్టర్. ఈ పాత్రకు తను పూర్తి న్యాయం చేశాడు. మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరోలు బాగా డాన్స్ చేయాలని ప్రేక్షకులు ఎదురు చూస్తారు. వారిని పూర్తిగా సంతృప్తిపరిచాడు. ఇక.. షబానా ఆజ్మీ మేనకోడలు సయామీ ఖేర్ కి తెలుగులో ఇది తొలి సినిమా. తన మేనత్తలా మంచి నటి అనిపించుకునే లక్షణాలు సయామీలో ఏ కోశానా లేవు. అందంగా ఉంది కానీ, అభినయం పూర్. ప్రతినాయిక పాత్రలో శ్రద్ధాదాస్ భేష్ అనిపించుకుంది. తనలో మంచి నటి ఉన్నప్పటికీ రావాల్సినంత స్థాయి ఆమెకు రాలేదనే ఫీల్ కలగక మానదు. ఈ పాత్ర ఏ మాత్రం బాగా నటించకపోయినా కథ బాగా తేలిపోయి ఉండేది. లుంగీ బాబా పాత్రలో అలీ కొంత మేరకు నవ్వించగలిగాడు. ఇతర నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

సాంకేతిక వర్గం
శ్రీధర్ సీపాన అందించిన కథ రొటీన్ గా ఉంది. ఆ కథకు రాజసింహ చేసిన అడిషనల్ స్ర్కీన్ ప్లే కూడా అలానే ఉంది. రాజసింహ రాసిన సంభాషణలు కూడా మామూలుగా ఉన్నాయి. మామూలుగా కథలో దమ్ముంటే ఏ దర్శకుడైనా అద్భుతంగా తెరకెక్కించగలుగుతాడు. కానీ, రొటీన్ కథ అంటే.. ఎవరు మాత్రం ఏం చేయగలుగుతారు. వైవీయస్ చౌదరి దీన్ని తెరకెక్కించిన విధానం పెద్దంత ఇంప్రెసివ్ గా ఉండదు. ముఖ్యంగా సినిమాలో మన నేటివిటీ పెద్దగా కనిపించదు. చక్రి ఇచ్చిన పాటలు బాగున్నాయి. కానీ, పాటల సందర్భం కుదరలేదు. పాటలు లెంగ్తీగా ఉండటం కూడా మైనస్. గుణశేఖర్ ఫొటోగ్రఫీ బాగుంది. ఫైట్స్ చాలా బాగున్నాయి. మామూలుగా కొత్త హీరో అంటే ఎవరైనా ఖర్చుపెట్టడానికి వెనకాడతారు. కానీ, వైవీయస్ చౌదరికి రాజీ అనే పదం తెలియదు. భారీ నిర్మాణ వ్యయం అయిన విషయం తెరపై స్పష్టంగా కనిపిస్తుంది.

ఫిల్మీబజ్ విశ్లేషణ
సాయి ధరమ్ తేజ్ కిది తొలి చిత్రం. కానీ, రెండో చిత్రం 'పిల్లా నువ్వు లేని జీవితం' ముందు విడుదలై, విజయాన్ని సొంతం చేసుకుంది. నటుడిగా కూడా ఆ చిత్రంతో ఓకే అనిపించుకున్నాడు. ఇక.. ఈ చిత్రంలోనూ భేష్ అనిపించుకోవడంతో పాటు, మంచి మాస్ హీరోగా నిలబడగలడని నిరూపించుకున్నాడు. కానీ, మలి చిత్రం అంతటి విజయాన్ని ఈ తొలి చిత్రం దక్కించుకోవడం కాస్త కష్టమే. కథ, కథనాలు పెద్దంత ఇంప్రెసివ్ గా లేకపోవడం మైనస్. 'షవుట్ ఫర్ సక్సెస్' అని ఈ చిత్రం టైటిల్ కి క్యాప్షన్ పెట్టారు. ఒకవేళ ఆ అరుపు కథే అనుకుందాం.. ఆ కథ బలహీనంగా ఉంది. దాంతో అరుపు కూడా బలహీనంగా ఉంది. ఇక.. బాక్సాఫీస్ వసూళ్లు కూడా అంతే బలహీనంగా ఉంటాయంటే... 'రేయ్' ఆ మాట అంటే ఊరుకోం అని ఎవరైనా అరిస్తే.. అరుపు బలహీనంగా ఉంది భయ్యా... అనడం మినహా ఏమీ చేయలేం.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !