View

సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ రివ్య్వూ

Friday,April08th,2016, 08:40 AM

చిత్రం - సర్దార్ గబ్బర్ సింగ్
బ్యానర్స్ - పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్, ఈరోస్ ఇంటర్నేషనల్
నటీనటులు - పవన్ కళ్యాణ్, కాజల్ అగర్వాల్, ముకేష్ రుషి, రాయ్ లక్ష్మీ, సంజన, శరద్ కేల్కర్, తనికెళ్ల భరణి, రావు రమేష్, బ్రహ్మానందం, ఊర్వశి, కబీర్ దూహన్ సింగ్, ప్రదీప్ రావత్, అలీ తదితరులు
సంగీతం - దేవిశ్రీ ప్రసాద్
ఎడిటింగ్ - గౌతంరాజు
డైలాగ్స్ - సాయిమాధవ్ బుర్రా
కథ, స్ర్కీన్ ప్లే - పవన్ కళ్యాణ్
నిర్మాతలు - పవన్ కళ్యాణ్, శరత్ మరార్, సునీల్ లుల్లూ
దర్శకత్వం - కె.రవీంద్ర (బాబి)
విడుదల తేదీ - 8.4.2016


పవన్ కల్యాణ్ సినిమా అంటే ఓ సెన్సేషన్. సినిమా ప్రారంభించినప్పట్నుంచీ పూర్తయ్యేవరకూ ఏ చిన్న విషయం జరిగినా అది హాట్ న్యూస్ అవుతుంది. 'సర్దార్ గబ్బర్ సింగ్'' గురించి అలాంంటి హాట్ న్యూస్ లు బోల్డన్ని వచ్చాయి. అన్నీ కూడా భారీ అంచనాలు నెలకొనడానికి కారణం అయ్యాయి. బాబీ దర్శకత్వంలో శరత్ మరార్ నిర్మించిన ఈ చిత్రం హిందీలో కూడా విడుదలైంది, 'గబ్బర్ సింగ్' బంపర్ హిట్ అయిన నేపథ్యంలో ఈ 'సర్దార్ గబ్బర్ సింగ్' ఎలా ఉంది? సూపర్ డూపర్ హిట్టవుతుందా?... తెలుసుకుందాం...


à°•à°¥
లక్ష్మణ్ పూర్ ప్రజలను భయపెట్టి ఆ ఊరిని ఖాళీ చేయించి మైనింగ్ వ్యాపారం చేస్తుంటాడు రతన్ పూర్ కి చెందిన రాజా భైరవ్ సింగ్. రతన్ పూర్ కి చెందిన రాజ వంశస్థులు కూడా భైరవ్ సింగ్ అరాచకాలకు అడ్డకట్టు వేయలేకపోతారు. కట్ చేస్తే...


ఇండో నేపాల్ బోర్డర్ లో దందాలు చేస్తున్న విలన్ గ్యాంగ్ ని రఫ్ ఆడిస్తాడు సర్దార్ గబ్బర్ సింగ్ (పవన్ కళ్యాణ్). కట్ చేస్తే...


సర్దార్ కి రతన్ పూర్ ట్రాన్స్ ఫర్ అవుతుంది. రతన్ పూర్ లో రాజవంశానికి చెందిన వారసురాలు హర్షిదేవి (కాజల్ అగర్వాల్) ని కలుస్తాడు. కానీ ఆమె యువరాణి అన్న విషయం తెలీక సర్దార్ ఆమెను ప్రేమిస్తాడు. హర్షి కూడా సర్దార్ ని ఇష్టపడుతుంది. భైరవ్ సింగ్ వల్ల రతన్ పూర్ రాజ వంశస్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలిగిస్తాడు సర్దార్. దాంతో రాజ వంశస్థులు రతన్ పూర్ ప్రజల మేలు కోసం ఎన్నో మంచి పనులు చేస్తుంటారు. ఇది తట్టుకోలేని రాజా భైరవ్ సింగ్ సర్దార్ ని ఎదుర్కోవడానికి ప్రయత్నాలు చేస్తాడు. అలాగే యువరాణి హర్షిని తన సొంతం చేసుకోవాలనుకుంటాడు. తన మొదటి భార్యతో సహా వెళ్లి హర్షిదేవిని తనకు ఇచ్చి పెళ్లి చేయాల్సిందిగా రాజవంశానికి విధేయుడిగా ఉంటున్న హరినారాయణ్ ని అడుగుతాడు భైరవ్ సింగ్. అదే సమయంలో హర్షి, సర్దార్ ప్రేమించుకున్న విషయం హరినారాయణ్ కి తెలుస్తుంది. తమ వంశానికి చెందినవాడు కాకపోవడంతో సర్దార్ తో హర్షి పెళ్లిని నిరాకరిస్తాడు హరినారాయణ్.


మరి ఫైనల్ గా సర్దార్ తన ప్రేమను గెలుచుకున్నాడా.. రాజా భైరవ్ సింగ్ అరాచకాలకు సర్దార్ అడ్డుకట్ వేసాడా తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.


నటీనటులు
సర్దార్ గబ్బర్ సింగ్ పాత్రను పవన్ కళ్యాణ్ చాలా బాగా చేసాడు. రెక్లెస్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, కామెడీ సీన్స్ ని అద్భుతంగా పండించి ఆడియన్స్ ని నవ్విస్తాడు. అభిమానులైతే పవన్ డ్యాన్సులకు ఈలలు వేసి గోల చేస్తారు. యువరాణి హర్షిదేవిగా కాజల్ బాగానే ఉంది. కాస్ట్యూమ్స్ బాగున్నాయి. తనికెళ్ల భరణి, ముకేష్ రుషి, శరద్ కేల్కర్, ప్రదీప్ రావత్ ఎవరి పాత్రల పరిధి మేరకు వారు నటించారు. లక్ష్మీరాయ్ ఐటమ్ పాటలో మెరిసింది. సంజనా పాత్రకు నటించడానికి స్కోప్ లేదు.


సాంకేతిక వర్గం
ఈ చిత్రానికి కథ, స్ర్కీన్ ప్లే పవన్ కళ్యాణ్ అందించాడు. జాని చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ ఈ చిత్రానికే కథ, స్ర్కీన్ ప్లే అందించడం జరిగింది. సింఫుల్ స్టోరీ లైన్. స్ర్కీన్ ప్లే బాగుంది. సెకండాఫ్ విషయంలో పవన్ కళ్యాణ్ ఇంకాస్త కేర్ తీసుకుని ఉండాల్సింది. ఈ చిత్రానికి బాబి దర్శకత్వం వహించారు. టేకింగ్ బాగుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతమందించాడు. పాటలు బాగున్నాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ సీన్ కి రీ-రికార్డింగ్ అదిరిపోయింది. సెకండాఫ్ విషయంలో ఎడిటింగ్ పరంగా కేర్ తీసుకుని ఉంటే కాస్త లెంగ్త్ తగ్గేది. దానివల్ల సెకండాఫ్ ల్యాగ్ అయ్యిందనే విమర్శ రాకుండా ఉండేది. గెలవడానికి వచ్చిన ప్రతివాడు రాజు కాడు.. గెలిచినోడే రాజు.. కాపు కాసినప్పుడు గుర్తుకురాని జాతి బంధం కలుపుకోవడానికి వచ్చినప్పుడు గుర్తొచ్చిందా... లాంటి డైలాగులు రాసి తన ప్రత్యేకతను చాటుకున్నారు డైలాగ్ రైటర్ సాయిమాధవ్ బుర్రా.


ఫిల్మీబజ్ విశ్లేషణ
పవన్ కళ్యాణ్ కామెడీ చేయడం, తనదైన స్టైల్లో డాన్సులు చేయడం ఫ్యాన్స్ కి మంచి ఉత్సాహాన్ని ఇస్తుంది. అయితే కామన్ ఆడియన్స్ మాత్రం పవన్ కళ్యాణ్ చేసిన కామెడీ, డ్యాన్సులను ఎంజాయ్ చేసినప్పటికీ, ఇంకా ఏదో పవన్ కళ్యాణ్ నుంచి కావాలని కోరుకుంటారు. మొత్తం సినిమాని తన భుజాల మీద వేసుకుని నడిపించాడు పవన్ కళ్యాణ్. గన్స్ వాడిన విధానం, కొన్నిమ్యానరిజమ్స్ పవన్ కళ్యాణ్ మాత్రమే చేయగలడు అన్నట్టుగా ఉన్నాయి. సెకండాఫ్ విషయంలో మాత్రం ఆడియన్స్ బోర్ ఫీలయ్యే అవకాశముంది. పవన్ కళ్యాణ్ ని అవినీతిపరుడుగా చిత్రీకరించడం, దానిలోంచి తను ఎలా బయడపడ్డాడనే విషయంలో క్లారటీ ఇవ్వకపోవడం ఓ మైనస్ పాయింట్. క్లయిమ్యాక్స్ కూడా సింఫుల్ గా తేల్చేయడం నిరాశ కలిగిస్తుంది.


ఒక్క మాటలో చెప్పాలంటే... అభిమానులను మెప్పిస్తాడు ఈ సర్దార్ గబ్బర్ సింగ్. సూపర్ హిట్ ఫిలిం అని చెప్పలేంగానీ, కమర్షియల్ గా ఈ సినిమా వర్కవుట్ అయ్యే అవకాశముంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !