View

I Movie Review

Wednesday,January14th,2015, 09:01 AM

చిత్రం - ఐ
బ్యానర్ - ఆస్కార్ ఫిలింసై ప్రై.లిమిటెడ్
సమర్పణ - మెగాసూపర్ గుడ్ ఫిలింస్
నటీనటులు - విక్రమ్, అమీజాక్సన్, సంతానం, సురేష్ గోపి, ఉపేన్ పటేల్, రాంకుమార్ తదితరులు
సినిమాటోగ్రఫీ - పి.సి.శ్రీరామ్
సంగీతం - ఏ.ఆర్.రహమాన్
రచన - శంకర్, శుభ
నిర్మాతలు - వి.రవిచంద్రన్, డి.రమేష్ బాబు
తెలుగు వెర్షన్ నిర్మాతలు - ఆర్.బి.చౌదరి, పరాస్ జైన్
దర్శకత్వం - శంకర్

భారతీయ చిత్రసీమ గర్వించదగ్గ దర్శకుడు శంకర్.. ఈ మాట సామాన్య జనం కాదు.. సూపర్ డూపర్ హిట్స్ తీసిన దర్శక, నిర్మాతలు, గొప్ప టెక్నీషియన్లు కూడా అంటుంటారు. జెంటిల్ మెన్, భారతీయుడు, ఒకే ఒక్కడు, అపరిచితుడు, శివాజీ, రోబో.. వంటి భారీ కమర్షియల్స్ చిత్రాల్లో అంతర్లీనంగా సందేశం జొప్పించి తెరకెక్కించిన ఘనత శంకర్ ది. అందరూ అంటున్నట్లు నో డౌట్ మంచి టెక్నీషియన్. ఇక.. పాత్ర ఏ రేంజ్ లో డిమాండ్ చేస్తే ఆ రేంజ్ కి వెనకాడకుండా ఒళ్లు హూనం చేసుకోవడానికి సిద్ధపడిపోతాడు విక్రమ్. ఓ గొప్ప టెక్నీషియన్, ఓ గొప్ప నటుడి కాంబినేషన్లో ఆస్కార్ రవిచంద్రన్ వంటి భారీ నిర్మాత సినిమా రూపొందిస్తే.. ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ కాంబినేషన్లో రూపొందిన 'ఐ' పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా.. ఈ సినిమాకి చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. ఆ ప్రచారం కారణంగా 'ఐ' అంటే ఇండియా అని, ఇండియా గర్వించదగ్గ చిత్రం అవుతుందని అంచనా వేసుకున్నారు. మరి.. ఆ అంచనా ఏ మేరకు నిజమవుతుందో చూద్దాం.

à°•à°¥
ఓ జిమ్ ఓనర్ కొడుకు విక్రమ్ (లింగేశ్వర్). బాడీ బిల్డ్ చేసి, మిస్టర్ ఆంధ్ర అవ్వాలనేది అతని టార్గెట్. ఇందుకోసం బాడీ బిల్డప్ చేస్తాడు. లింగేష్ కి మోడల్ దియా (అమీజాక్సన్) అంటే చాలా ఇష్టం. బాడీ బిల్డప్ పోటీల్లో పాల్గొని తనకు కాంపిటీటర్ అయిన మలక్ పేట్ రవిని ఓడించి మిస్టర్ ఆంధ్ర టైటిల్ ని గెల్చుకుంటాడు లింగేశ్వర్. దాంతో అతనికి లోకల్ యాడ్స్ లో నటించే అవకాశం వస్తుంది. ఓ యాడ్ లో నటించేటప్పుడు దియాని కలుస్తాడు లింగేశ్వర్. ఆటోగ్రాఫ్ తీసుకుని పరిచయం చేసుకుంటాడు. దియాని కో-మోడల్ జాన్ (ఉపేన్ పటేల్) సెక్సువల్ హెరాస్ మెంట్ చేస్తుంటాడు. అతనితో కలిసి యాడ్స్ లో నటించడానికి దియా చాలా ఇబ్బందిపడుతుంటుంది. తన కోరిక తీర్చకపోతే దియాని యాడ్స్ నుంచి తొలిగించి కెరియర్ లేకుండా చేస్తానని బెదిరిస్తాడు జాన్. అన్నట్టుగానే దియాని చాలా యాడ్స్ నుంచి తీయించేస్తాడు. ఒక్క చైనా కాంట్రాక్ట్ మాత్రం దియా దగ్గర ఉంటుంది. ఆ చైనా కాంట్రాక్ట్ కోసం లింగేశ్వర్ ని మోడల్ గా నటింపజేయడానికి తన ఫ్యామిలీ డాక్టర్ వాసు (సురేష్ గోపి) హెల్ప్ తీసుకుంటుంది దియా. డాక్టర్ వాసు చెప్పడం, తనకు ఇష్టమైన దియా అడగడంతో మిస్టర్ ఇండియా అవ్వాలనే తన కలను పక్కన పెట్టి దియా కోసం మోడల్ గా మారిపోతాడు లింగేశ్వర్.
కొన్ని యాడ్స్ లో నటించిన అనంతరం లింగేశ్వర్, దియా మధ్య ప్రేమ చిగురిస్తుంది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. దాంతో జాన్ ఈ ఇద్దరిపై పగ పెంచుకుంటాడు. ఓ వైపు మోడల్ గా ఎదుగుతున్న లింగేశ్వర్ పై మలక్ పేట్ రవి కూడా కోపం పెంచుకుంటాడు. ఐస్ సోడా యాడ్ లో నటించనని, అందులో విషపూరితమైన పదార్ధాలు కలిసి ఉన్నాయని తనకు మోడల్ గా అవకాశం ఇచ్చిన ఓనర్ (రాంకుమార్) దగ్గర చెబుతాడు లింగేశ్వర్. ప్రజలకు హాని కలిగించే కూల్ డ్రింక్ లో నటించనని లింగేశ్వర్ ఇంటర్య్వూ ఇవ్వడంతో ఆ కంపెనీ పరపతి పోతుంది. దాంతో లింగేశ్వర్ పై ఆ ఓనర్ పగ పెంచుకుంటాడు. లింగేశ్వర్ ని లుక్ పరంగా మార్చి, మోడల్ గా తయారు చేసిన స్టైలిష్ (హిజ్రా) సైతం లింగేశ్వర్ తన ప్రేమను కాదన్నందుకు పగ పెంచుకుంటుంది. ఇలా లింగేశ్వర్ కి ఈ నలుగురు శత్రువులవుతారు. ఎలాగైనా అతని జీవితం మీద దెబ్బకొట్టాలనే పగతో భయంకరమైన వైరస్ ఇంజెక్షన్ ని లింగేశ్వర్ బాడీలోకి అతనికి తెలీకుండానే ఎక్కిస్తారు.
ఈ ఇంజక్షన్ ఎఫెక్ట్ వల్ల తన అందాన్ని, బాడీని కోల్పోయి కురూపిగా మారిపోతాడు లింగేశ్వర్. కురూపిగా మారిన లింగేశ్వర్ తన రూపాన్ని దియాకి చూపించకుండా డాక్టర్ వాసు సహాయంతో తను చనిపోయినట్టు క్రియేట్ చేస్తాడు. తను అలా అవ్వడానికి కారణం ఆ నలుగురు శత్రువులు, డాక్టర్ వాసు అని కూడా తెలుసుకుని షాక్ అవుతాడు లింగేశ్వర్. దియాని పెళ్లి చేసుకోవడానికే డాక్టర్ వారితో చేతులు కలిపి, తన జీవితంతో ఆడుకున్నాడన్న సంగతి తెలుసుకున్న లింగేశ్వర్ అతనిని నుంచి తప్పించడానికి దియాని కిడ్నాప్ చేస్తాడు. కురూపి అవతారంలో ఉన్న వ్యక్తి లింగేశ్వర్ అని దియాకి తెలుస్తుంది.
కురూపి అయిన లింగేశ్వర్ తో జీవితం పంచుకోవడానికి దియా అంగీకరిస్తుందా? కేవలం తన ఎదుగుదల చూడలేక తన జీవితంతో ఆడుకున్న డాక్టర్, ఓనర్, స్టైలిష్ట్, జాన్, మలక్ పేట్ రవిని లింగేశ్వర్ ఏం చేసాడు... ఏ విధంగా రివెంజ్ తీర్చుకున్నాడు అనేదే మిగతా కథాంశం.

నటీనటుల పర్ఫార్మెన్స్
లింగేశ్వర్ అలియాస్ లీ పాత్రను విక్రమ్ అద్భుతంగా చేశాడు. కండలు తిరిగిన దేహంతో కనిపించాడు. కేవలం ఈ సినిమా కోసం విక్రమ్ బాడీ బిల్డ్ చేశాడు. తన కష్టం స్పష్టంగా కనిపించింది. ఆహార్యం సూపర్. మోడల్ గా స్టయిలిష్ గా ఉన్నాడు. అందవిహీనంగా మారిన తర్వాత ఆహార్యంపరంగా సింపథీ కొట్టేయడంతో పాటు నటనపరంగా ప్రేక్షకుల ప్రేమను కూడా పొందుతాడు. అసలు సిసలైన గూనివాడిగా ఒదిగిపోయిన వైనం సూపర్. ఇక.. కథానాయిక అమీ జాక్సన్ చాలా అందంగా ఉంది. మోడల్ పాత్రకు వంద శాతం నప్పింది. ఈ రెండు పాత్రల తర్వాత చెప్పుకోదగ్గ విధంగా ఉన్నది ఉపేన్ పటేల్, సంతాపన పాత్రలు. మోడల్ గా ఉపేన్ పటేల్ చాలా స్టైలిష్ గా అందంగా ఉన్నాడు. సంతాసం సహజమైన శైలిలో నటించాడు. ఇంకా ఇతర పాత్రల్లో సురేష్ గోపి, రామ్ కుమార్ తదితరులు ఒదిగిపోయారు.

సాంకేతిక వర్గం
ఈ చిత్రకథ చాలా చిన్నది. పగబట్టి తన జీవితాన్ని నాశనం చేసిన వారిపై హీరో పగ తీర్చుకునే కథ. ఈ కథను శంకర్ చాలా హంగామాగా తెరకెక్కించాడు. కోట్లు విలువ చేసే భారీ సెట్స్, అందమైన లొకేషన్స్ తో సినిమా మొత్తం కలర్ ఫుల్ గా ఉంది. ఈ సినిమాలో హీరోపై విలన్ పగ తీర్చుకునేటప్పుడు 'చంపను. అంతకు మించి' అని ఇతర విలన్లతో అంటాడు. అలాగే, విలన్లపై పగ తీర్చుకునేటప్పుడు హీరో కూడా 'అంతకు మించి..' అంటాడు. అలా.. ఈ చిత్రంలో సెట్స్, హీరోని కురూపిగా చూపించడానికి పెట్టిన ఖర్చు.. వీటికి మించి ఇంకా ఏదో ఉండాలి. అదే బలమైన కథ. మంచి కథకు అందమైన సెట్స్, ఇతర హంగులు హెల్ప్ అవుతాయే కానీ.. తేలికపాటి కథకు భారీ హంగులు ఎందుకు? సో.. కథ నుంచే శంకర్ తప్పటడుగు వేశాడు. 'ఇంద్రుడు-చంద్రుడు, నాయకుడు, భారతీయుడు, భామనే సత్యభామనే..' తదితర చిత్రాల్లో కమల్ హాసన్ వెరైటీ గెటప్స్ లో కనిపించారు. కానీ, అది కథకు అవసరం. ఇక్కడ, గెటప్ కోసం కథ అన్నట్లుగా ఉంది. వెరైటీ సినిమా తీయాలనే తాపత్రయతో శంకర్ ఈ గెటప్ ని అనుకుని ఉండొచ్చు. ఇక.. ఇతర టెక్నీషియన్స్ గురించి చెప్పాలంటే.. పీసీ శ్రీరామ్ కెమెరా పనితనం 'ఐ' ఫీస్ట్. ఎ.ఆర్. రహమాన్ పాటలు అతని గత చిత్రాల్లోని ట్యూన్స్ ని తలపించాయి. ముఖ్యంగా 'నీ జీతగా..' పాటలో హోరెక్కువ. విక్రమ్ ని అందవిహీనంగా చూపించడానికి వేసిన మేకప్ బాగుంది. సెట్స్ బాగున్నాయి. సినిమా నిడివి 3 గంటలు దాటింది. కొంచెం తగ్గించి ఉంటే బాగుండేదేమో అనడానికి లేదు.. ఎందుకంట్ తగ్గించినా కూడా సోసోగానే ఉండేది.

ఫిల్మీబజ్ విశ్లేషణ
జెంటిల్ మెన్, భారతీయుడు, ఒకే ఒక్కడు, అపరిచితుడు... ఇలా అంతర్లీనంగా సందేశం ఉన్న చిత్రాలు అందించిన శంకరేనా ఈ 'ఐ' తీసింది అనే ఆశ్చర్యం కలగక మానదు. ఈ చిత్రం ద్వారా సందేశాలేవీ ఇవ్వలేదు. కత్తికి కత్తి అన్నట్లు.. పగకు పగకు అనే పాయింట్ చెప్పాడు శంకర్. ఒకవేళ అదే సందేశం అనుకున్నాడేమో. అలాగే, హీరోని మధ్యతరగతి కుటుంబంలా కాదు.. దిగువ మధ్యతరగతి అన్నట్లుగా చూపించాడు. ఇంగ్లిష్ కూడా పెద్దగా రాదు. కానీ, ఓ ప్రమాదకరమైన వైరస్ తన ఒంట్లోకి జొప్పించినట్లుగా, నలుగురు విలన్లపైనా అదేదో వైరస్ లు జొప్పించి, వాళ్లని అందవిహీనంగా మార్చేస్తాడు హీరో. అంత పరిజ్ఞానం అతనికి ఎక్కణ్ణుంచి వచ్చిందా అని ప్రేక్షకులు నోరెళ్లబెడతారు. పోనీ.. ఎవరైనా హెల్ప్ చేశారేమో అనుకుందామంటే.. ఆ వెనకాల ఉన్న శక్తిని కనీసం ఓ సీన్ లో కూడా చూపించలేదు. ఇంకో విషయం ఏంటంటే.. కురూపిగా మారిపోయిన ప్రియుడితో జీవితాంతం ఉండాలని ఫిక్సయిపోతుంది హీరోయిన్. కానీ, కురూపిగా మారకముందు ఆ ఇద్దరి మధ్య సాగిన లవ్ ట్రాక్ కూడా గొప్పగా లేదు. ఇద్దరూ మోడల్స్ కాబట్టి, సినిమాలో నటించిన కొన్ని యాడ్స్ లో కెమిస్ర్టీ పండినంతగా లవ్ ట్రాక్ లో లేదు. దాంతో ఆ ఇద్దరి ప్రేమ ప్రేక్షకుల హృదయాలను తాకదు. ఇక్కడ ఇంకో విషయం ప్రస్తావించాలి. ఈ చిత్రంలో విక్రమ్ చేసిన కురూపి పాత్రను 'భైరవద్వీపం'లో బాలకృష్ణ చేసేశాడు. అప్పుడు హాలీవుడ్ మేకప్ నిపుణులు లేరు. టెక్నాలజీ కూడా ఇప్పుడున్నంతగా లేదు. అందుకని విక్రమ్ గెటప్ కి హాలీవుడ్ నిఫుణులను తీసుకొచ్చారని గొప్పగా చెప్పుకోవడానికి లేదు. అలాగే, ఈ చిత్రానికి బోల్డంత మంది హాలీవుడ్ టెక్నీషియన్స్ పని చేశారు. అది బడ్జెట్ పెరగడానికి కారణమవుతుందే తప్ప ఈ కథకు ఆ టెక్నీషియన్స్ అవసరం లేదేమో అనిపిస్తుంది. ఒకవేళ భారీ బడ్జెట్ సినిమా తీయాలన్నది శంకర్ లక్ష్యం కావచ్చు. మితిమీరిన ఖర్చు స్పష్టంగా కనిపించింది. పోనీ.. సమాజాన్ని ఉద్ధరించే సినిమాకి ఇంత ఖర్చుపెట్టారా అంటే అదీ లేదు. ఓ ప్రేమకథ కోసం కోట్లు కుమ్మరించారు. పైగా ఈ కథ కోసం విక్రమ్ ఒళ్లు హూనం చేయడం వింతగా అనిపిస్తుంది.
ఫైనల్ గా చెప్పాలంటే.. ఈ చిత్రంలో పగ తీర్చుకునేటప్పుడు విలన్, హీరో వాడిన 'అంతకు మించి' డైలాగ్ లా.. ఈ సినిమాకి 'భారీ సెట్స్, అందమైన లొకేషన్స్, విక్రమ్ కురూపి పాత్రకు చేసిన మేకప్ లకన్నా మించి' ఏదో కావాలి. ఆ ఏదో ఏంటంటే పై పై హంగులు కాకుండా మనసుని తాకే సన్నివేశాలు. సినిమా సహజత్వానికి చాలా దూరంగా ఉంది. అచ్చంగా మేకప్ వేసినట్లుగా. ఈ 'ఐ' ఐస్ కి ఫీస్ట్ గా ఉంది.. మనసుకి మాత్రం ఎలాంటి ఫీల్ నీ కలగజేయదు. శంకర్ నుంచి ఇలాంటి చిత్రాన్ని ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయరు. ఒక్క మాట.. ఇక నుంచి విక్రమ్ ఒక పాత్ర కోసం ఒళ్లు హూనం చేసుకునే ముందు.. నిజంగా ఆ పాత్రకు అంత ఉందా? లేదా? అని ఆలోచించుకుంటే బెటర్.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !