View

షేర్ మూవీ రివ్య్వూ

Friday,October30th,2015, 08:47 AM

చిత్రం - షేర్
బ్యానర్ - విజయలక్ష్మీ పిక్చర్స్
సమర్పణ - సాయి నిహారిక, శరత్ చంద్
నటీనటులు - నందమూరి కళ్యాణ్ రామ్, సోనాల్ చౌహాన్, బ్రహ్మానందం, ముఖేష్ రుషి, ఆశిష్ విద్యార్ధి, రావు రమేష్, రోహిణి, అలీ, యం.యస్.నారాయణ, విక్రమ జీత్ విర్క్, నోరా ఫతేహి, తాగుబోతు రమేష్, ఫిష్ వెంకట్ తదితరులు
కథ, మాటలు - డైమండ్ రత్నంబాబు
సంగీతం - తమన్
సినిమాటోగ్రఫీ - సర్వేష్ మురారి
ఎడిటింగ్ - కోటగిరి వెంకటేశ్వరరావు
లైన్ ప్రొడ్యూసర్స్ - దేవినేని బ్రహ్మానందరావు, బండి రత్నకుమార్
నిర్మాత - కొమర వెంకటేష్
కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - మల్లిఖార్జున్


'పటాస్' విజయంతో మంచి జోష్ మీద ఉన్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. ఈ చిత్రవిజయం అతని తాజా చిత్రం 'షేర్' పై భారీ అంచనాలు నెలకొనడానికి కారణం అయ్యింది. మల్లిఖార్జున్ దర్శకత్వంలో కొమర వెంకటేశ్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. టైటిల్ 'షేర్' కాబట్టి, భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ అనుకోవద్దనీ, ఫుల్ ఎంటరట్ టైన్ మెంట్ తో సరదాగా సాగే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని కళ్యాణ్ రామ్ అన్నాడు. దర్శకుడు మల్లిఖార్జున్ లో మంచి ప్రతిభ ఉందనీ, తనకోసమే ఈ సినిమా ఆడాలని కోరుకుంటున్నానని కూడా అన్నాడు. మరి.. మల్లి కెరీర్ కి 'షేర్' మంచి బ్రేక్ అవుతుందా? 'పటాస్' విజయానికి 'షేర్' కొనసాగింపు అవుతుందా? చూద్దాం...


à°•à°¥
తల్లిదండ్రులు (రావు రమేష్, రోహిణి), తమ్ముడుతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ ఉండే కుర్రాడు గౌతమ్ (నందమూరి కళ్యాణ్ రామ్). తండ్రిది కన్ స్ట్రక్షన్ బిజినెస్. ఆ బిజినెస్ నే గౌతమ్ కూడా చూసుకుంటుంటాడు. తమ్ముడు చెస్ ప్లేయర్. తన ఫ్రెండ్ ప్రేమించిన అమ్మాయిని పెళ్లి పీటల మీద నుంచి తీసుకువచ్చి తన ఫ్రెండ్ తో రిజిస్టర్ ఆపీసులో పెళ్లి జరిపిస్తాడు గౌతమ్. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్న పప్పీ (విక్రమ్ జీత్ విర్క్) రిజిస్టార్ ఆఫీసుకు వచ్చి తన పెళ్లి చెడగొట్టిన గౌతమ్ తో గొడవపడతాడు. ''తనది లాక్కున్న వారిని అసలు క్షమించలేనని, నీది అనుకున్నదాన్ని నాదానిని చేసుకుంటానని'' గౌతమ్ తో ఛాలెంజ్ చేస్తాడు పప్పీ. ఈ ఛాలెంజ్ కి గౌతమ్ కూడా ఓకే అంటాడు. కట్ చేస్తే...


మాఫియా డాన్ దాదా (ముఖేష్ రుషి) కి రైట్ హ్యాండ్ పప్పీ. హైదరాబాద్ లో దందాలు చేస్తూ, ఇల్లీగల్ బిజినెస్ చేస్తూ, దాదా సహాయంతో పోలీసులకు చిక్కకుండా ఉంటాడు. గౌతమ్ ని ఓ సందర్భంలో కలిసిన నందు (సోనాల్ చౌహాన్) దేశంపై అతనికున్న భక్తిని మెచ్చి, అతని పట్ల ఇంప్రెస్ అవుతుంది. అతనినే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోతుంది. గౌతమ్ ప్రేమించిన నందూని తనదానిని చేసుకోవాలని నందు తండ్రి, పోలీసాఫీసర్ అయిన షయాజీ షిండేని డిజిపి చేస్తానని చెప్పి డీల్ కుదుర్చుకుని, నందుతో తన పెళ్లిని సెటిల్ చేసుకుంటాడు పప్పీ. అదే డీల్ ని తనకు కలిసొచ్చేలా వాడుకుంటాడు గౌతమ్. మాఫియా గ్యాంగ్ అయిన దాదా, పప్పీ ముఠాని పట్టించి ఇస్తానని, ఆ ఆపరేషన్ చేసింది తనేనని చెప్పి డిజిపిగా ప్రమోట్ అయిపోవచ్చని నందు తండ్రితో డీల్ కుదుర్చుకుంటాడు గౌతమ్.


అప్పట్నుంచి దాదా గ్యాంగ్ వెంటపడి అతని తమ్ముడిని చంపేస్తాడు. కొడుకును టార్గెట్ చేస్తాడు. రైట్ హ్యాండ్ పప్పీని సరౌండ్ చేసి, ఓ ప్లాన్ ప్రకారం హైదరాబాద్ రప్పించడానికి ప్రయత్నాలు మొదలుపెడతాడు గౌతమ్. అసలు దాదా గ్యాంగ్ ని గౌతమ్ వేటాడటం వెనకాల కేవలం తను ప్రేమించిన అమ్మాయి మాత్రమే ఉందా.. లేక గౌతమ్ కి వేరే ఏదైనా కారణం ఉందా.. షైనల్ గా దాదా గ్యాంగ్ ని మట్టుపెట్టి, తను ప్రేమించుకున్న అమ్మాయిని గౌతమ్ దక్కించుకున్నాడా అనేదే ఈ చిత్ర కథ.


నటీనటుల పర్ఫార్మెన్స్
కళ్యాణ్ రామ్ కి మంచి మాస్ లుక్ ఉంది. అందుకని మాస్ క్యారెక్టర్స్ కి బాగా పనికొస్తాడు. ఆ విధంగా ఉండే గౌతమ్ పాత్రను బాగా చేశాడు. తల్లిదండ్రులు, తమ్ముడంటే అపారమైన ప్రేమ ఉన్న యువకుడిగా కనిపించే సన్నివేశాల్లో కళ్యాణ్ రామ్ ఎక్స్ ప్రెషన్స్ బాగున్నాయి. ఫైట్ సీన్స్ చెప్పక్కర్లేదు. రెచ్చిపోయాడు. సొనాల్ చౌహాన్ ది నటన పరంగా విజృంభించే పాత్ర కాదు. కానీ, సెల్ఫీ తీసుకునే సన్నివేశాల్లో తన హావభావాలు క్యూట్ గా ఉన్నాయి. స్టయిలిష్ గా ఉంది. పప్పీ పాత్ర చేసిన విలన్ విక్రమ్ జీత్ స్టయిలిష్ గా ఉన్నాడు. స్టయిలిష్ విలన్ పాత్రలకు బాగా పనికొస్తాడు. ఇక, ముఖేష్ రుషి, షయాజీ షిండే, రావు రమేశ్, రోహిణి తదితరులు తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. బ్రహ్మానందం ట్రాక్ కొంత మేరకు నవ్వించింది. ఫిష్ వెంకట్, ఎమ్మెస్ నారాయణ బాగానే సందడి చేశారు.


సాంకేతిక వర్గం
యాక్షన్ నేపథ్యంలో సాగే రెగ్యులర్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇది అని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో కళ్యాణ్ రామ్ అన్నాడు. దాన్నిబట్టి పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా సినిమా చూడ్డానికి రావాలని చెప్పాడు కళ్యాణ్ రామ్. తను చెప్పినట్లుగా చిన్న ట్విస్ట్ ఉన్న సినిమా ఇది. ఎలాంటి హంగామా లేకుండా సాగిపోతుంది. తను అనుకున్న కథను మల్లిఖార్జున్ తెరకెక్కించాడు. దర్శకుడిగా మల్లికి పెద్దంత బ్రేక్ ఆశించే అవకాశం లేదు కానీ, మరింత బలమైన కథ అనుకుంటే తనలో కమర్షియల్ దర్శకుడు ఉన్నాడని నిరూపించుకునే అవకాశం ఉంది. ఓ మాస్ ఎంటర్ టైనర్ కి ఎలాంటి పాటలివ్వాలో తమన్ అలాంటివే ఇచ్చాడు. పాటలు విన్నంతసేపూ బాగున్నట్లనిపించినా, ఆ తర్వాత మాత్రం గుర్తుండవు. సర్వేష్ మురారి కెమెరా వర్క్ బాగుంది. అనవసరపు హంగామాకి పోకుండా కథ డిమాండ్ మేరకు ఖర్చు పెట్టారు.


ఫిల్మీబజ్ విశ్లేషణ
'పటాస్' వంటి సూపర్ హిట్ తర్వాత కళ్యాణ్ రామ్ నటించిన చిత్రం కావడంతో భారీ అంచనాలతో థియేటర్ కు వస్తారు. దాంతో కొంచెం నిరాశపడతారు. అదే ఎలాంటి అంచనాలు లేకుండా వస్తే, సినిమా బాగున్నట్లు కాకపోయినా ఓకే అనే ఫీలింగ్ కలుగుతుంది. కమర్షియల్ హంగులన్నీ ఉన్న సినిమా. పెద్ద సినిమాలు విడుదలవ్వలేదు. సో... బాక్సాపీస్ వద్ద పోటీలేదు. కాబట్టి, 'షేర్'కి టెన్షన్ లేదు. కాసేపు కాలక్షేపం చేయాలనుకునేవాళ్లు చూస్తారు. ఆ విధంగా వసూళ్లు దక్కించుకుంటుంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !